Previous Page Next Page 
ఖాండవదహనం పేజి 13

 

    ఇలా అడవుల వెంటపడి తిరగడంలో తన కెరీర్ నాశనమైపోతాందని తెలుసు...... అయినా అరణ్యాన్ని వదలి వెళ్ళలేకపోతున్నాడు.
   
    "మృత్యురాజూ" ఇప్పుడు సురేంద్ర కళ్ళ నుంచి నీళ్ళు రాలుతున్నాయి. "విజయ బ్రతికే వుంటుంది కదూ"
   
    ఇంకెక్కడి బతుకయ్యా.... ఆ రోజే ప్రాణాలు పొయుంటాయి. అందమైన ఆయమ్మ ఆ రోజునే మేకం ఆకలికి బలైవుంటది"
   
    "లేదు" అలాంటి అలోచనే తాళలేనట్టు అసహనంగా అన్నాడు. "విజయ చావలేదు... చచ్చిపోదు....... అదే నిజమైతే ఆ శవం దొరికి వుండేది."
   
    "పిచ్చిదోరా .... ఈ గూడేల నుంచి పోయిన ఆడోళ్ళవరైనా ప్రాణంతో తిరిగోస్తిరా.... ఇంకా అశే౦దయ్యా....
   
    "మ్రుత్యురాజూ" చేతులు పట్టుకున్నాడు సురేంద్ర. "నీకు..... నీకెంత డబ్బు కవాలన్నాఇస్తాను..... లక్ష ... రెండు లక్షలు.... విజయ నాకు కావాలి...."
   
    మృత్యురాజూ కళ్ళు క్రమంగా ఎరుపుని పుంజుకుటున్నాయి.
   
    పొద్దుగూకిన తర్వాత వచ్చిన సురేంద్ర రెస్ట్ హాస్ కి వెళ్ళకుండా అక్కడ తిష్టవేసి కూర్చోవటం అస్సలు నచ్చడంలేదేమో "వెళ్తారా దొరాలేక ఇక్కడే వుంటావా...."
   
    "నాకు జవాబు కావాలి"
   
    "లేని జవాబుకి నేనేట్టూ చెప్పేది దొరా" మృతిరాజు కంఠం ఖంగుమంది. "మంచిగుండదు ...... యేల్లిపో. లేకపోతే అడవి తల్లికి కోపమొత్తది. నీ మెడ కత్తి దూస్తది.
   
    చిత్రమైన నిస్సహాయత చాలా మందిని శాసించగల సురేంద్ర ఇప్పుడు మ్రుత్యురాజు ఆవేశానికి జవాబు చెప్పలేక తల వంచుకున్నాడు.

    అది నిశీధి అన్న విషయం సైతం మరచి అర్దరాత్రియినాగాని రెస్ట్ వుస్ కి వెళ్ళిపోయాడు.
   
    అదిగో..... సరిగ్గా అప్పుడు ఓ యువతి మృత్యురాజు గుడిసెలోకి దూసుకెళ్ళింది.
   
    వస్తూనే మ్రుత్యురాజు పాదాల్ని చుట్టి "నన్ను కాపాడు దొరా..... మొగులిగుట్టకు వెళ్ళలేదు. మంగాకి అన్నాయం చెయ్యలేను. మూడు రోజులలో ముంగాని మనవాడబోతున్న పిల్లనయ్యా. అయ్యకి చెబితే అవదంటాడు. కళ్ళ నీళ్ళేట్టుకున్నా తప్పదంటాడు" వెక్కిపడుతోంది. దీనంగా కాళ్ళు  పట్టుకుని కుమిలిపోతుంది.
   
    పదహారేళ్ళ మించిన ఒక గిరిజనకన్య అపరాత్రివేళ అంతగా అర్దిస్తున్నది దేనికోసమోఅర్ధంకాని సురేంద్ర అవక్కాయి చూస్తున్నాడు.
   
    "తప్పదు సుగ్లీ తండ్రి మ్రుత్యురాజు ముందుకొచ్చినిలబడ్డాడు.
   
    "కోడి మాంసం చేస్తివా"
   
    "చేస్తి దొరా...."
   
    "యిప్పసారా కడితివా"
   
    "కట్టాను దొరా...."
   
    "ఒళ్లనంటుదని వదలి పెడతావా.... మొగలి గుత్తకుపంపు.... జము పోద్దాయేరా జాగు సేయ్యక పంపు."
   
    సుగ్లీ ఏడుస్తూంది విదిలించుకుంటూనే వుంది. అయినా లాక్కుపోయాడు బొంగ్రా.
   
    "చూస్తిరా దొరా ఇది మ్ అడవి అసారం.
   
    సురేంద్ర విభ్రమంగా చూస్తున్నాడు.
   
    "మూడు కోసుల దూరంలో మొగులిగుట్ట." గినుకుతున్నట్టుచెప్పుకుపోతున్నాడు. "గుట్టపై ఓ మగరక్కసి.... ఆ రక్కసి వారానికో సారి నిద్రలేస్తది. గూడెంలో కన్నెపిల్ల కావాలని కోరుతుందది. కోడి మాసం చెయాల. యిప్పసారాకట్టాల.
   
    ఆటితో పిల్లని పంపాల."
   
    "ఎందుకు!" వెడుతున్న సుగ్గీరోదన అస్పష్టంగా వినిపిస్తూంది.
   
    రాత్రిఅంతా గడపడానికి ఆ రక్కసీ ఆడపిల్లతో ఆదుకుంటుంది. తెల్లవార్లూ పిల్లతో పడుకుని వేగుచుక్క పొడవకముందే విడిచిపెడతది."
   
    బుకాసురడి కధలాంటి ఓ కొత్తవిషయాన్నివిన్న సురేంద్ర ఉద్వేగంగా అడిగాడు. "పంపకపోతే"
   
    "ఆ రక్కసి పెజ్వరిల్లు పోతదయ్యా. పురుగు, పుత్రా గూడేలపై బడి సంపుకుతింటై...."
   
    "అని రక్కసి చెప్పిందా "
   
    "ఇది చెప్పిందికాదు. ఈ చుట్టుపక్కల అన్ని గూడేలకు తెలిసిన సత్యం. అందుకే ఏ గుడిసేలోని  పిల్లని ఆ రాత్రికే పంపుతాం."
   
    ఎక్కడో ఏదో అర్ధంకాని ఓ ముడి వున్నట్టు బోధపడిపోయింది.
   
    ఈసమస్యకి మూలం ఎక్కడో అంతుతేల్చు కోవాలనిపించింది.
   
    అది తాగిన మైకంలో అతడు తీసుకున్న నిర్ణయమో, అదే కాని నాడు ఇందాక చూసిన అమ్మాయిపై క్షణికంగా ఏర్పడిన సానుభూతితో లేచాడు. "వెళ్తాను మ్రుత్యురాజు ... రెస్టు హవుస్ కి వెళ్ళిపోతున్నాను?"
   
    అర నిముషం వ్యవధిలో గూడెం గోర్జల్నీ దాటి అడవిలోకి ప్రవేశించాడు.
   
    మంద్రంగా వీస్తున్న గాలికి తలలూపే పాము పొడల్లా చెట్లకొమ్మల పైనుంచి నేలకి జారుతున్న వెన్నెల మరకల్ని అతడు చూడడంలేదు.
   
    తన బయటకి సమాంతరంగా వెడుతున్న సుగ్లీని ఓ కంట కనిపెడుతూ నడుస్తున్నాడు.
   
    అయిదు నిమిషాలైంది.
   
    అడవి నిశ్సబ్దంగా వుంది.
   
    అప్పటికే గూడెంనుంచి చాలా దూరం నడచిన సురేంద్ర మూర్తీ భవించిన దైన్యంలా వెడుతున్న గిరిజన కన్య మార్గంలో మళ్ళబోతూ ఠక్కున  ఆగిపోయాడు.

 Previous Page Next Page