అయిదయేటప్పటికి పిల్లలంతా వచ్చేశారు ఒక అనుపమ తప్ప.
" ఎప్పుడూ దాగుడుమూతలేమిటి చెడుగుడు ఆడదాం." అన్నాడు వెంకట్. అంతా చెడుగుడు ఆడదాం అనటంతో అటూ ఇటూ రెండుజట్లు చీలాయి.
" అందరూ వచ్చారు అనూ రాలేదు.అసలు యీ రోజు ఆదివారం అని గుర్తుందో లేదో? సాయంత్రం చుక్కకి పాఠాలు చెప్పటంతో ఆదివారం తప్ప రోజు ఆటలకి రావటంలేదు. "నీ వేం ప్రవేటు మాస్టరు వటోయే రాజా! ఆదివారం చుక్కతల్లికి ప్రవేటు చెప్పనన్నావట?" మామయ్య ఎగతాళిగా అంటే, సమయానికి అత్తయ్య పక్కనుండబట్టి "ఏం?మీ అమ్మాయికి ప్రేవేటుచెప్పే మాష్టరుకి ఆదివారం కూడా శలవివ్వరేమిటి?" అని మామయ్యతో నవ్వుతూ అని "ఆదివారం మటుకు మా చుక్కతల్లికి ప్రవేటుకి రాకండిబుల్లి మాష్టరుగారూ!" అమ్మా, బావ ఓ పార్టీ అయారు. ఆదివారం శెలవిచ్చేద్దాము ఏమ్మా?" అన్నాడు మామయ్య. వుంటుందో అని హడిలిపోయాడు.ఒకోసారి ఆ మొద్దు కూడా మంచేచేస్తుంది. "రోజూ చదువుకోవటమేమిటి?ఆదివారం ఆడుకోవద్దూ-? బావకి శెలవిచేద్దాం నాన్నా!" ముద్దు ముద్దుగా అందిచుక్క. "బ్రతుకు జీవుడా"అనుకున్నాడు.
ఎవరూ లేకుండా చూచి చుక్కతో " చుక్కా! నువ్వు మంచిదనివి" అన్నాడు. చుక్క గాలి బుడగలా ఉబ్బిపోయింది. "నువ్వూ మంచివాడివే బావా! అస్తమానం నన్నేకిరిస్తావు గాని" అంది. తనెందుకన్నాడో చుక్కకి తెలిస్తే కదా
"రాజు చిక్కాడొచ్చి!"
" రాజు అవుటయ్యడోయ్!"
"రాజు ఓడిపొయ్యాడోయ్!"
ఆడపిల్లలంతా చప్పట్లు కడుతూ పెద్దగా అరిచారు. అప్పటికిగాని రాజు జరిగింది. గ్రహించలేదు. శేఖరం చేతుల్లో వుండిపోయి " గుడు గుడుగుడ్ గుడు డుగ్గు డుగ్గు" గుక్క ఆపేశాడు.
రాజు సిగ్గపడ్డాడు. అంతలోనే పౌరుషం వచ్చింది. మొహం జేవురించింది. నుదిటి మీద పడ్డ జుట్టును విసురుగా పైకి తీసుకున్నాడు తలెగరేసి.
చెడుగడు ఆటలో రాజు ఓడిపోవటం ఎప్పుడూ జరగదు. పరధ్యాన్నంగా ఆడబట్టి శేఖరం దొరికిపోయాడు. ప్రత్యర్థికి అందుబాటు లోకి వచ్చిమూతి పగలకొట్టి మరీ గిరిదాటి ఇవతలికి వస్తాడు. రాజు కాలిదెబ్బ, చేతి రుచి చూచిన ఎవరూ రాజుని పట్టుకోటానికి ధైర్యం చేయరు. ఒకసారయినా రాజుని పడగొట్టాలని వున్నా సమయం రాలేదు. ఎవరూ సాహసం చెయ్యలేదు.అందుకే రాజు వుండగా ఎవరూ చెడుగుడు ఆడదాం. అనరు. ఈ రోజు అనుకోకుండా ఆడటం. రాజు అవుట్ కావటంతో మొగపిల్లల మొహాలలో వెలుగు మతాబా వెలుగుని తలతన్నింది.
అనుపమ రాలేదు. ఆటలో ఓడిపోవటం రాజులో హుషారు చచ్చింది. సరీగా అప్పుడే అనుపమ రావటం చూచాడు రాజు. ఆడపిల్లలు గేలిచేసి చప్పట్లు చరవటం. మొగపిల్లలు నవ్వులు కేరింతలు . పౌరుషం పరుగెత్తుకుంటూ వచ్చింది. రాజుకి. తన బలం గుర్తుచేస్తే ఆంజనేయుడికి బలం వచ్చినట్లు అనుపమ రాజుకి హుషారుకలుగజేసింది.
"ఒరేయ్!నేనేమిటి ఓడిపోవటం ఏమిటిరా?ఎప్పుడన్నా మీ ముఖాలు నాతో ఆడి గెలిచాయా? కావాలని చికాను. మీ మెహాలెలా వుంటాయో చూద్దామని.... అంతే రండిరా యితఫా రండి. ఓడిపోతే చెవి కోయించుకంటాను. ఇదివరకు ఆడినవన్నీ ఓడిపోయినట్లు ఒప్పుకుటాని సరా?" అనుపమ వినాలని తనొచ్చినట్లు గుర్తించాలని రాజు గట్టిగా అన్నాడు.
రాజు గొంతు గుర్తించింది అనుపమ .సంతోషంతో కళ్లు టపటపలాడిస్తూ వచ్చి ఎప్పుడూ తను కూర్చునే బండమీద కూర్చింది.
"చూడండి.యీతఫా బాగా చూడండి. ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారా?" ఆటకు సిద్దమవుతూ అన్నాడు రాజు.
"నిజంగానే ఓడిపొయ్యావు. కావాలని అబద్ధమాడుతూ.... శేఖరం గొణుగుతూ అన్నాడు.
ఆడపిల్లలంతా గుసగుస లాడుతూ "రాజు ఓడిపోడు. అయినా మాట మనం అనవద్దు. వాళ్ళ కులేని ఇది మనకెందుకు?" అనుకున్నారు.
అనుపమకు ఆటలో రాజూ ఓడిపోయ్యాడన్నది అర్థమయింది.
"నోరు మూసుకొని ఆడతారా, ఆడరా,చెప్పండి." మొహం గంటుపెట్టుకు నుంచున్న మొగపిల్లలతో అన్నాడు రాజు.
కళ్ళు మాట్లాడుకున్నాయి. చూపులు కలిశాయి. అందరూ ఒక్క మాటకు వచ్చారు.
"మేమంతా ఒక్కజట్టుగా వుంటాము. నువ్వొక్కడివీ వుండి మా అందరినీ ఓడించు" రాజు కోపంగా వుంటే గెలవలేమని తెలిపి అంతా రాజుని పట్టాడంటే వాళ్ళల్లో వాళ్ళకే అనుమానంగా వుంది. అసలు శేఖరంకే ఆ అనుమానం వచ్చింది.