ఆ విషయం చెప్పాలేదామే......
"అసలు ఆ రోజు నువ్వు పిలవగానే ఎందుకు వచ్చానో తెలుసాఅడిగాడు.
చెప్పమన్నట్టుగా చూసింది.
"ఆ రోజు కలవకపొతే ఇంకెప్పుడూ కలుసుకాకూడదని నిర్ణయించుకోడానికి ఒకవేళ కలిస్తే......"
"కలిస్తే...."
"నీఅల్లరికి ఒళ్ళుమండిన్నేనుఎడాపెడా రెండు వాయించడానికి "
"వా..... యించ లేదేం....." పెదవుల్ని ఆకతాయిగా విరుస్తూ అడిగింది.
"ఎందుకో ... సాధ్యం కాలేదు" భుజాల్నిషగ్ చేసాడు.
"అదికాదు కారణం...." అందామె నాలుకని అల్లరిగా పైపెదవిలో తాకిస్తూ __"ఇక్కడ అలంటి అవకాశం తీసుకుంటే మరావుమంచి అవకాశం చేజారి పోతుందని"
అతడి గుండెల్లోని రక్తం ఉద్వేగంతో పైకేగేసింది ఆమె వుద్దేశ్యం అర్డంకాగానే ఆ మాత్రం చాలు వైధేయలాంటి మగాడికి.
ఓంటిలోని ఉత్సాహమంతా అతడిపాదాల్లోకి జారుతున్నట్టనిపించింది నెమ్మదిగా కాలివ్రేళ్ళతో ఆమె పాదాలను తాకించి ఆమె నుంచి ఎటువంటి ప్రతిఘటనా లేకపోయేసరికి చీరకొనల్నిఎత్తుతూ కాస్త పైకి జరిపాడు.
"కోరికలు గుర్రాలవుతున్నాయే...." కాళ్ళను వెనక్కీ జరిపింది.
"మామూలు గుర్రంకాడు.... రేసుగుర్రం" కాంక్షతో అతని కళ్ళుఎర్రబడుతున్నాయి .
"అంత పిరికివాడికి యింతధైర్యం ఎలా వచ్చిందబ్బా"
"ధైర్యంకాదు ___ ఆడపిల్ల సన్నిధిలో కలిసి ఉత్సాహం...."
"మొత్తానికి అంగీకారించావు...."
"ఏమని __"
"ధైర్యవంతుడ్ని కాదని..."
ఖంగుతిన్నట్లుగా చూసాడు...... అందమైనదే కాదు..... అందంగా మాటాడగలదికూడా అనుకున్నాడు.
స్టీవర్డ్ ఎప్పుడు ఆర్డర్ తీసుకున్నాడో వారికీ గుర్తులేదు. కాని బేరార్ 'కసాటా' తెచ్చి టేబుల్ పై వుంచగానే "రుచి చూడండి" అంది.
"చూస్తున్నా"
"నన్ను కాదు __ఐస్క్రీంని "
"మరి చల్లగా వుంది" స్పూను టో నోట్లో వేసుకుంటూ అన్నాడు.
"అవసరమే __వేడేక్కే పోతున్నారుగా"
అతని చూపు అమె పెదవులపై నుంచి జారి చుబుకాన్ని తాకిశంఖంలాంటి ఆమె మెడమీదుగా 'నయాగారాలా' ఎదలోతల్లోకివచ్చిఆగింది __
"అయిపోయిందా " సూటిగా చూస్తూ అడిగింది __
ఉలికిపడిన వైధేయ "డామిట్" అన్నాడు భుజాలు తడుముకుంటూ__
"అదే ....చూడ్డం...."
మొహమాటంగా నవ్వేడు.....
"నీ నవలలు కధలు చదివి ముందు నిన్నిలా వూహించుకోలేదు."
అర్ధం కానట్టుగా చూసాడు.
"నువ్వు సృష్టించే హీరోల్లా ఆరడుగుల అందగాడి నయ్యుంటావని విశితంగా పరిశీలించే కళ్ళతో ఆడపిల్లలు గువ్వలా ఒదిగే అరెకరం చాతితో ఎలాంటి అడదానైన్నా పిచ్చెక్కించేట్టు వుంటావనుకున్నాను."
"అరడుగులకి రేండంగుళాలు తక్కువైనా అరెకరం ఛాతీ లేకపోయినా నేనేం ఆడంగివాడిలా వుండను."
ఉడుకుమొత్తనంగా చూసాడు..... ఎంత రచయితాయినా అతడు మగాడు. ఒకనక్క కవ్విస్తున్నా మరోపక్క తన మగతనాన్ని కించపరచడం అతడూ సహించలేకపోయాడు ___
"నీకు తెలుసా వైధేయా __ ఆడది కొంతవరకూ మగాడి అనాకారి తనాన్నైనా అంగీకరిస్తుంది. క్షమిస్తుంది కాని పిరికితనాన్నిభరించలేదు ___"
ఈ మాటలన్నీ ఆమె ఏ ఉద్దేశ్యంతో అనిపించాడు, అందుకే నన్ను ఆకట్టుకున్నాడు ఒకనాడు" హఠాత్తుగా కిరణ్ పేరు ఎత్తేసరికి పైగా ఆమెను వంచించిన మగాడ్ని సిసలైన మగాడిగా రిఫర్ చేసేసరికి రోషం లాంటిది కలిగింది.
అది నిజానికి రోషం కాదు ___ అసూయ __ తనకు దగ్గరవుతున్న ఓ ఆడపిల్ల మరోమగాడి ఔన్నత్యం గురించి మాటాడుతుంటే ప్రతి మగాడి కళ్ళల్లోనూ ద్యోతకయ్యేజలసీ __
నవ్వింది నెమ్మదిగా చప్పుడు చేయకుండా......
జాలేసిందేమో __ అతడి చేతిని స్పృశించి మెత్తగా నొక్కింది.
"ప్రతిమనిషికి మెదడు నరాల తిష్యూలతో నిర్మితమై వుంటుంది. సర్వ సెల్ కి సంభందించిన అతి ముఖ్యమైన సెల్ బాడీ మెదడులో వుంటుంది. సెల్ బాడీ రంగు గ్రేకలర్ లో వుంటుంది."
ఆమె మాటాడుతున్నదేమిటో వైధేయకి ముందు అర్ధం కాలేదు.
"సర్వ సేల్స్ పుట్టుకతో ఎన్ని వుంటాయో వాటికీ మించి సంఖ్య పెరగవు __ దాన్ని బట్టి గ్రే పదార్దం హెచ్చు తగ్గులు ఆధారపడి వుంటుంది. అయితే మనిషి తన కృషి ద్వారా అనుభవాల నుంచి నేర్చుకునే పాఠాలద్వారా మెదడును పెంచుకోవచ్చ. మెదడును సరిగ్గా పనిచేయడం ద్వారా ఒక సర్వ సెల్ కి మరో సర్వ సెల్ కి కనేక్టివ్ టిష్యూ ద్వారా లింకులు ఏర్పరుచుకోవడం మూలంగా మెదడు సామార్దాన్ని పెంచుకోవచ్చు. అలా మందబుద్ధులు కూడా తెలివైన వాళ్ళుగా ధైర్యవంతులుగా మారొచ్చు.