Previous Page Next Page 
ఖాండవదహనం పేజి 12

    ఇప్పుడామె దేశపు 'తొలి మహిళ' గా కాక నిస్సహాయయురాలైన  ఒక స్రీలా మాట్లాడుతుంది. "పదవిలోకి వచ్చాక చాలా సంస్కరణలతో  ఆర్ధికంగా దెబ్బతిని వున్న ఈ దేశాన్ని పునరిద్ధించే ప్రయత్నం చేస్తూ ఒడిపోతున్నాను చైతన్య బహుశా దీనికి కారణం ఈ దేశంనుంచి పారిపోయిన మార్కోస్ మాత్రమెకాక అతడికిక్కడ  ఇంకా మిగిలిన సానుభూతి పరులు ఓ చిన్న అవకాశం దిరికితేచాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్ని కూడగట్టుకుని  ఆస్థిరత్వానికి కారణమవుతున్నారు. లానే.... నవ్వేసింది బడలికిగా."మీరు హతమార్చిన కింగ్ కోబ్రా కధనీ తన అనుకూలంగా మరచుకొబోయారు..... అక్వినో పరిపాలనలో  ప్రజలు శాంతిభద్రతలు వుండమన్నారు. దేశంలో ఇలాంటి సర్పం చెలరేగాడానికి నేనే కారణమన్నారు  కేస్ యూ ఇమేజిన్ ...అపుఉడే పాతికశాతంప్రజలు పైన రివోల్ట్ కావడం మొదలుపెట్టారు."

   
    ఇలాలోచించాగల ప్రజలు అన్ని దేశాల్లోను వుంటారన్నసత్యబోధపడిన చైతన్య నెమ్మదిగా అన్నాడు. "ఈ విధంగా నేను మీ సహకరించగలిగింవుంటే అదృష్టవంతుడ్నీ.ఒక లక్ష్యంకోసం స్రీలు సైతం ఉద్యమం రూపంలో ఏ స్థాయికి ఎదగగలరూ  అన్న సత్యానికి ప్రతిరూపమైన మీ పరిచయమే నాకు మీరివ్వగలలిగిన బహుమతి ఇట్స్ ఎనఫ్ ఫార్మిమేడమ్. ఇంత స్వల్పకాలంలో మీరు మనస్సువిప్పిమాట్లాడగల్గిన ఆత్మీయస్థానంలో నేనూ ఒకడి నైనందుకు ఆనందిస్తూ, మీ లక్ష్యసాధనలో మీరు గమ్యాన్ని చేరుకోవాలని నా దేశం తరపున శుభాకాంక్ష లందిస్తూ ఈరోజుశలవు తీసుకుని వెళ్ళాలనుకుంటున్నాను.
   
    అప్యాయంగా చైతన్యం తల నిమిరింది. "గ్లాడ్ బ్లెస్ యూ మైనస్ ఇంగ్లీషు స్పేనిష్ భాషలకి చెందిన పత్రికా విల్లెఖర్లు చుట్టూముట్టి ప్రశ్న వర్షం కురిపించారు.
   
    అన్నిటికీ ఓపీగ్గా సమాధనమిస్తూ, ఉదయం పదిగంటలకల్ల మనీలా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ని చేరుకున్నాడు.

    ఘనమైనా వీడ్కోలు ఇవ్వబడింది.

                       *    *    *    *   
   
    ఆ స్థితిలోనూ చైతన్య  కళ్ళు ఏ వ్యక్తికోసమో గాలించడం మరచిపోలేదు.
   
    "థాంక్యూ..." లూజాన్ కంఠం వినిపించింది చాలా చేరువగా.
   
    చైతన్య పేదవులపై విడీవిడని చిరునవ్వు "దేనీకి!"
   
    "నా కోసం వెదుకుతున్నందుకు ."
   
    "నీ కోసమే అని ఎలా అనుకున్నావు?"
   
    ఒక సన్నని నీలినీడ ఆమెకళ్ళల్లో కదిలి అదృశ్యమైనపోయింది. "ఒక చేదు అనుభవంగానైనా మీ స్మృతిలోమిగిలే అదృష్టవంతురాలని చైతన్యా.... ఆ విషయం నాకూ తెలుసు" 
   
    తోడుగా వచ్చిన ప్రభుత్వాధికారులకి దూరంగా ఓ మూల ఇద్దరి మధ్య చర్చ జరుగుతూంది .
   
    "చాలా పెంకిపిల్లవి"
   
    "ఇండియా రానా"
   
    "దేనికీ"
   
    "పెంకితనం చూపించడానికి "
   
    "లేదు లూజాన్ .... నేనే మీ దేశానికి మళ్ళీ వస్తాను."
   
    "ఎప్పుడూ"

    "నీ పెళ్ళికి శుభలేఖ  పంపినప్పుడు."
   
    నిర్వేదకంగా నవ్వింది. "ఇక ఆ అవకాశంలేదు"
   
    "అదేం...."
   
    "నేను కోరిన తొలిమిమగాడుమీరే __ఓడిపోయాగా"
   
    "ఇది ఓటమికాదు లూజాన్ ... నీ దేశంలో నన్ను మించిన అర్హులు చాలామంది వున్నారు."
   
    "నన్ను కోరుకునే అర్హతకాదు నేను కోరింది."
   
    అనౌన్స్ మెంట్ వినిపించింది.
   
    "వెళ్ళిరానా"  చైతన్య గొంతు వణికింది.      
   
    "మీరు వచ్చినా రాకపోయినా నేను దేశంలో అడుగు పెడతానని పిస్తూంది చైతన్యా.... ఇష్టమైనావాళ్ళకోసం ఆలోచిస్తూ   చచ్చిపోతే దెయ్యమై ఆ వ్యక్తి చుట్టూ చిరుగుతుంటారంటారుగా మీ దేశంలో "
   
    చైతన్య జవాబు చెప్పలేదు.
   
    "నేను బ్రతికుండగా సాధించలేని చచ్చిపోయ్క్యక సులవనిపిస్తూంది."
   
    "ఇట్స్ రబ్భిష్ " ఆమె చేతిని అందుకుని మృదువుగా పెదవులను సృశించాడు "గుడ్ లక్"
   
    "ఇట్ కాంట్ బి గుడ్ లక్ టుమీ. నన్నుగాయపరచి వెళ్ళిపోతున్న మిస్టర్ చైతన్యా మిమ్మల్ని చూశాక మీ దేశంమీద నాకు ప్రేమ ఏర్పడిపోయింది. బహుశా నా చివరిరోజులూ అక్కడే గడుపుతనేమో..... సోలాంగ్ ...."
   
    వెళుతున్న చైతన్య రూపం సుడులు తిరుగుతున్నా అశ్రువుల మధ్య   అస్పష్టంగా కనిపిస్తూంటే అలాగే నిలబడిపోయింది లూజాన్.
   
                    *    *    *    *   
   
    భారతదేశంలో అర్దరాత్రి పన్నెండు గంటలవేళ.....
   
    "నో..... నేను వెళ్ళను..... విజయ ఆచూకీ తెలిసేదాకా నే నీ అడవిని విడిచిపెట్టాను" సురేంద్ర అన్నాడు ఉద్విగ్నంగా .
   
    గూడెంలో సద్దు మణిగింది.
   
    చుట్టూ అరణ్యంలో కీచుర్రాళ్ళు రోద అస్పష్టంగా వినిపిస్తుంటే సురేంద్ర తెచ్చిన సేవిస్తూ నవ్వుకుంటున్నాడు మృత్యురాజు.
   
    "నచ్చలేదు దొరా  __ అబ్బే, నీ యవ్వారం అసలు గిట్టిలేదు.  మీవాళ్ళంతా బోయి  వారం  రోజులాయే..... ఇంకా పోయిన కన్నెపండు కళ్ళనీళ్ళుట్టుకుండాఇలాగే అడవిన పడడం అస్సలు బాగోలేదు" నిషాలో అదోరకమైన యాసతో చెప్పాడు.
   
    సురేంద్ర మనసు మండిపోతూంది. మితంగా తాగే అలవాటు మాత్రమే వున్న సురేంద్ర వారం రోజులుగా చాలా ఎక్కువ తాగు తున్నాడు విజమని తను ప్రేమిస్తున్నట్టు తెలిసినా ఆమె అదృశ్యమయ్యాకనే ఎంత గాఢంగా కోరుకున్నదీ అర్దమైంది.                

 Previous Page Next Page