Previous Page Next Page 
ది రైటర్ పేజి 11

    "ఎక్కడమ్మా? ఎక్కడ? నిశిరాత్రి వెన్నెట్లో నందివర్ధనపు నీడలో....."
   
    "అంటే ___"
   
    "ఆ సిమెంటు బెంచీమీద...."
   
    "యూ మీన...."
   
    "మీ దాన్నని గుర్తించలేనివైదేయా ఆ మూగాదాన్ని నేనే"
   
    వైధేయ చేతిలోనుంచిరిసీవరు జారిపడింది.    
   
                                   3
   
    రోషిణి నవ్వుతుంది ఆగి ఆగి సాగే పిల్లకెరటంలా ..... నవ్వుని బలవంతంగా అపుకునే ప్రయత్నంలో విల్లులా వెనక్కీ వంగిన రోషిణి గుండెలు ఎగిసేపడే కడలి తరంగంల్లా వైధేయనిమత్తులోకి దింపుతున్నాయి.
   
    ఆమె ఆగలేదు. ఇంకా నవ్వుతూనే వుంది. కళ్ళు చేదిరేలా ఆమె కళ్ళలో నీళ్ళు చిమ్మేలా.
   
    "ఎందుకానవ్వు" ఉక్రోషంగా అడిగాడు వైధేయ ఇంకా అలా నవ్వితే చూడాలని చూస్తూ తరించాలన్న కోర్కె మనసును మండిస్తున్నా......
   
    క్షణమాగింది "ఉడుకుబోతు అబ్బాయి.... ఆ రోజు ణీ అవస్థను చూసి నవ్వక ఏడవాలా"...... అప్పుడే ఎకవచాననంతో డిగిపొయిందేమిటి.....
   
     ఆమె చేతిలోని పోర్క్ చికెన్ సిక్ర్తిఫైవ్ పై నర్తిస్తుంటే అలాగే చూస్తూ వుండిపోయాడు.
   
    ఎంతటి లావణ్యం... ఆమె గొంతులో ఎంతటి సాధికారం......
   
    కలసిందిప్పుడే అయినా ఎప్పటి నుంచో పరిచయస్తులా అనిపించేఈ విచిత్రమైనా లాలాసత్వానికి కారణమేమిటి?
   
    "ఏంటి రచయితగారు నోరూరుతూందా" ఆమె చేతిలోని పార్కును అతడి పెదవు;ళ దగ్గరుంచింది మర్మంగా నవూతూనే......
   
    అధినాత్మకమైనా రెస్టారెంటది.
   
    సబ్ డ్యూడ్ లైటింగ్ మ౦ద్రంగా వేదజల్లుతున్న కాంతిలో స్నిగ్డమోహనంగా కనిపిస్తున్న రోషిణి రూపం వైధేయ విగ్రహాన్ని సడలిస్తూంటే "రోషిణి...... మనం పూర్వం ఎక్కడా కలియలేదు కదూ" ఆడిగాడు ఆమెను నిశితంగా పరిశీలిస్తూనే......
   
    "చెడిందా"అంది ఎగతాళిగా అతడి తలని చూపిస్తూ "లేకపోతె మరేంటి ఇంతకు పూర్వమే కలిసుంటే ఇంతటి అందాన్ని నిన్ను వదులుకొని వచ్చేదాన్నా మిస్టర్ వైధేయా."
   
    పొగరుగా నవ్విందామె అందానికే అసూయ కలిగేలా సముద్రిక్త నిలయాల ఇసుక తుఫానులా.
   
    చూస్తూన్నాడామేను  అలాగే..... రెప్పలార్పకుండా.
   
    మొత్తగా వినిపిస్తున్న పాప్ సంగీతం విని మత్తుపానీయాలు సేవిస్తున్న ముదితల నోళ్ళనుంచిగమ్మత్తుగా జారుతున్న ఇంగ్లీషు గుసగుసలు గాని చుట్టూ వున్న స్లీవ్ లేస్ బ్లౌజుల ఒంటినయగారం గాని గమనించకుండా ఆమెనే, రోషిణి దిశ చూస్తూ వుండిపోయాడు.
   
    "ఏమిటాచూపు" తింటున్నదల్లాక్షణం పాటు ఆగి అతని కేసిచూసింది.
   
    "చూపు కాదిది ఉద్బిజ్జోద్భాసితమైన ఊపు పరవశంగా అన్నాడు.
   
    "ఓహ్ క్రైం సాహిత్యం రాసే రచయితకి కవిత్వంకూడా వచ్చే......"
   
    "ఇంకా చాలావచ్చు...." వంటి బిగువున ఆర్తిగా చూస్తుఅన్నాడు.
   
    "పాపం.... అందమయిన ఆడపిల్ల ఎదురుగా వున్నా తన పెదవుల్ని తానేకొరుక్కోవాల్సిం వచ్చే మగాడి దురదృష్టానికి ఏమని జాలిపడాలి"
   
    వైధేయ రెచ్చిపోతున్నాడు...... కాదు ఆమె రకరకాలుగా అతడ్ని రెచ్చగోడుతూంది.
   
    "ఈసారి అటపట్టించకుండా  చెప్పిన టైముకి టంచనుగా రెస్టారెంటకి వచ్చేసానేం"
   
    "ఈ మొద్దాబ్బాయినిక ఏడిపించే ఇష్టం లేక...."
   
    "ఆహా!"
   
    "ఊ"
   
    "అసలు ఆ రోజు......." ఏదో గుర్తుకొచ్చినట్లుగా అడిగాడు "ఫోన్ లో నేనే వైధేయనన్నట్టు చాలా కాన్ఫిడేన్సుతో చేప్పావు...... ఎలా..... అంతకుముందు నన్ను చూసావా..... కనీసం నాకంఠం విన్నావా."
   
    నెమ్మదిగా తలపైకెత్తింది.
   
    "విన్నాను.... అదేరోజు"
   
    "మరి నేనే అని ఎలా గుర్తుపట్టావు...."
   
    "ఇష్టపడిన వాడికోసం స్పందించే మనసు లక్షలమంది మధ్య నిలబడ్డా ఆ వ్యక్తిని గుర్తింస్తుంది...... గొంతు మార్చి మాట్లాడినా ప్రీక్వెన్సీ ని నట్టేస్తుంది."
   
    ఒక ఇసుక ఎడారిలో దప్పితో తపించి పోయే బాటసారికి ఊపిరి నందించాలని దివినుండి జారిపడుతున్న అమృతపు జల్లులా ఆమెమాటలు అతడ్ని ఎంతగా కదిలించాయి అంటే అంతవరకు పరిసరాల్నేమరచిన వైధేయ ఆక్షణంలో తననుతానే మరచిపోయాడు.
   
    నిజానికి ఆ రోజు ఆమె ఫోన్ చేసింది వారపత్రిక ఆఫీసుకు సమీపంలో వున్న బసేరా హొటల్లోనిగది నుంచి.....
 మూడో అంతస్తులో వున్న అమెకు పత్రికాఫీసులోని వైధేయ చాలా స్పష్టంగా కనిపిస్తున్నాడు ...... అద్దాల్లో నుంచి ప్రతి కదలికా గమనించింది.    

 Previous Page Next Page