Home » Pasupuleti mallikharjuna rao » Samanthara Rekhalu


    అదే మన తుది కలయిక. అటు తరవాత నువ్వు మిస్ సునీతాదేవివి. నేను మిస్టర్ వేణుగోపాల్ ను.
                                                                                                        నీ వేణు."
    గురువారం, తను ఈ రాత్రే వెళ్ళిపోవాలనుకున్నది. ఎలా? ఎలా తనీ సాయంత్రం వేణును కలుసుకొని డబ్బు కొంత అడగాలనుకున్నది. డాక్టర్ తన జన్మ రహస్యం ఈ రాత్రికి చెప్పివేస్తుంది. తను గురువారం దాకా ఆగటం మంచిదేనా?
    విశ్వం దగ్గిర తనా రోజున ఇచ్చిన కవరు తీసుకుంది. సునీత తనలో జరిగిన ఈ వితర్కానికి జవాబు వెతుక్కుంటుండగా రాజు వచ్చాడు.
    "ఏమిటి, రాజూ?"
    "మరే.....డాక్టరుగారి తమ్ముడట.....ఈ చీటీ పంపారు."
    "ఎవరు వచ్చారు?"
    "ఎవరో ఛప్రాసిలాగున్నాడు."
    సునీత కాగితాన్ని తీసుకుంది.
    "ఎందుకు అప్పుడే వెళ్ళావు? ఉండ బుద్దికాలేదు కదూ? నా ఉత్తరం చదువుకున్నావా? నాలుగు గంటలకు అందరం బంజారా హిల్సుకు వెళుతున్నాం. రాత్రి భోజనానికి అక్కడికే రావాలి! లేకపోతే నామీద ఒట్టు! రాజును కూడా తీసుకురా!
    గిరి మామయ్యను నాన్న ఒక పట్టాన వదలటం లేదు. ఆయన ఈరాత్రి ఇక్కడే ఉంటాడు. రేపుకూడా నీకు చెప్పిపంపమన్నాడు.
    నీతా, గృహస్థునయ్యాను. మొదటిసారి నాతోనూ, రాధతోనూ పంక్తిలో కూర్చుని భోజనంచేసి నన్ను ధన్యుణ్ణి చెయ్యి.             -వేణు."
    
                              *    *    *

    మూడు గంటలైంది.
    వేణు రాలేదు. పెళ్ళి మూలంగా నిన్నటివరకూ ఆఫీసు మూసే ఉన్నది. ఆవేళే తెరిచారు. ఉదయం పూట గోవిందరావు వచ్చి వెళ్ళాడు. తను లేనప్పుడు జరిగిన మార్పులు సునీతవల్ల విని సంతోషించాడు. ఆయనకింకా సునీత నిజంగా తన మేనగోడలేనని తెలియదు. ఆరాత్రి భోజనానికి వెళ్ళినప్పుడు మళ్ళీ ఆర్తితో శుక్రవారం రాత్రికల్లా అంతా తేటతెల్లం చెయ్యగలనంది.
    "ఈ ఒక్కసారికి మాత్రం చూస్తాను. ఇక నువ్వేం చెప్పినా నేను నమ్మను, పాపా!" అంది ఆర్తి.
    కిందినుండి ఎప్పుడు కబురు వస్తుందా అని కనిపెట్టుకు కూర్చుంది సునీత.
    మూడూ ఇరవై నిమిషాలకు వేణు తనే పైకి వచ్చాడు. సునీత కిందికి ఆఫీసు రూముకు వెళదామంది.
    "ఇక్కడంత బావుండదా?"
    "అక్కడ అవసరమైనవి కొన్ని అందుబాటులో ఉంటాయి."
    "ఏమిటో అవి?"
    "చెబుతాగా! రండి, ప్లీజ్." కిందికి దిగారు.
    "మొన్న రాత్రి నేనెవరో మీకు తెలిసిపోవలసింది. కాని వీలులేక పోయింది. కాని రేపు అంతా తెలుస్తుంది."
    "నీకు తెలుసా? ఇప్పుడెందుకు చెప్పకూడదు?"
    "చెప్పవచ్చు. కాని మీరు నన్ను బంధించేస్తారు."
    "బంధాలు ఎప్పుడో పడ్డాయి. నాకు బంధించే శక్తి లేదు. తెంపే శక్తీ లేదు."
    "ఇంకా కొన్ని వివరాలు కావాలి." అబద్ధం చెప్పింది.
    "సరే! ఎప్పుడన్నా చెప్పు. 'అవసరమైనవి కొన్ని అందుబాటులో ...' అన్నావు. ఏమిటవి, సునీతా?"
    "చిట్టచివరి సహాయం. పెళ్ళికి ముందు రాశాను. అడగాలనుకుంటున్నా!"
    "నీ పెళ్ళికి డబ్బు కావాలా?"
    "కావాలి. కాని పెళ్ళికి కాదు."
    "దేనికి?"
    "దేనికైనా సరే, కొంత డబ్బు మీరు నాకు ఉచితంగా ఇవ్వాలి!"
    "ప్రోనోటు రాసి ఇస్తావా?"
    సునీత మాట్లాడలేదు. వేణు ముందుకు వచ్చి ఒక కాలు నేలకు పోటీచేసి, మరొక కాలు ఊపుతూ సునీతముందు డెస్కు మీద కూర్చున్నాడు. సునీత వంచిన తలమీద, నల్లని కేశసంపదను రెండు భాగాలు చేస్తున్నట్లు పాపట గీత కనబడుతూంది. వేణు ఆ గీటే మధ్యవేలితో గీస్తూ, "ఈ మాటలూ, గంభీరతా ఏమిటో నా కర్ధంకావటంలేదు. అన్నమాట ఏదీ నిలబెట్టుకోవటం లేదని అక్కయ్య అంటూంది. విశ్వం గూడా అదే అంటున్నాడు. మంగళవారం వాళ్ళ ఇంటికి వెళతానన్నావట. నువ్వేమనుకుంటున్నావు? నువ్వేదో చెయ్యదలుచుకున్నావు. నాతో చెప్పటానికేం? నీ ఇష్టాని కెన్నడైనా అడ్డుపడ్డానా, నీతా?" అన్నాడు.
    "లేదు. కానీ ఇప్పుడు అడ్డువస్తారు!"
    "నేను అడ్డువచ్చే పనేమిటి? నువ్వు ఆత్మహత్యకు తలపడటం లేదుగా?"
    "అంత ధైర్యం నాకు లేదు. వేణూ, రేపు రాత్రివరకూ ఓపిక పట్టండి. అన్నీ తెలుస్తాయి."
    ఇంకేం అడిగినా లాభం లేదనుకుని, "డబ్బు కావాలన్నావు. ఎంత కావాలి, సునీతా? కానీ ఒక షరతు" అన్నాడు.
    "చెప్పండి, ప్రోనోటు తప్ప...."
    "కాదు." జేబులోనుంచి తాళంచెవుల గుత్తి తీశాడు. దానికి ఉన్న చిన్న చాకును విప్పుతూ, "ఈ చాకుతో నా మణికట్టుమీద గాయంచేసి ఆ రక్తంతో నా ఈ డైరీలో నీ పూర్తి పేరు వ్రాయాలి, నీతా!" అన్నాడు.
    "వేణూ!" అతని మణికట్టుమీద చెయ్యి వేసింది.
    "నేను మిగుల్చుకోగలిగిన అత్యంత విలవైన వస్తువు ఇదే! చాకు తీసుకో, నీతా! బతికి ఉన్నన్నాళ్ళూ ఆ గాయం మానినా మాసిపోని మచ్చనూ, నీ సంతకాన్నీ చూసుకుని గతాన్ని నెమరువేసుకుంటూ ఉంటాను."
    "నేను చెయ్యలేను, వేణూ!"
    "ఎందుకు చెయ్యలేవు? నాకోసం తల పగల గొట్టుకున్నావు. దానికన్నా ఇదేమంత ఎక్కువకాదు. నువ్వు చెయ్యక తప్పదు. నేను......నేను......ఆజ్ఞాపిస్తున్నాను."
    సునీత చాకు తీసుకున్నది, వేణు షర్టు పైకి జరుపుకొని కుడిచెయ్యి ముందుకు చాపాడు. వణికేచెయ్యితో మణికట్టుమీద కొద్దిగా ఒత్తివట్టి గీరింది. రక్తం గీతలా పైకి వచ్చింది. వేణు గబుక్కున ఆమె చెయ్యి అలాగే పట్టుకుని మరింత ఒత్తి మూడు నాలుగు అంగుళాలు పొడవు లాగాడు. ఎర్రని రక్తం బయటికి వచ్చింది.    
    "ఎంత పని చేశారు, వేణూ!" సునీత కళ్ళు మూసుకొంది. ఒక రక్తపుబొట్టు జారి ఆమె చేతిమీద పడింది.
    "సునీతా, ఇదిగో డైరీ. వ్రాయి. రక్తం కారిపోతూంది, గడ్డకడితే మళ్ళీ ఇంకొక గాయం చెయ్యవలసివస్తుంది."
    సునీత కళ్ళు తెరిచింది. రక్తంలో చూపుడువేలు అద్ది, "సునీత" అని వ్రాసింది.
    "వట్టి పేరు కాదు. పైన ఏమన్నా వ్రాయాలి."
    సునీత "నా ఆరాధ్యదైవం ..... నా ప్రభువు.....నా స్వామి ... అన్నీ మీరే, వేణూ" అని వ్రాసింది. అది చూసుకుని "కొన్నాళ్ళకిది స్మ్రుతులమాదిరిగానే మాసిపోతుంది. అప్పుడు ఈ అరుణారుణ కాంతి నల్లగా అవుతుంది, నీతా" అన్నాడు.
    "ఈ రక్తాన్ని నువ్వే తుడిచేయ్!"
    సునీత దస్తీతో తుడవబోయింది.
    "ఉహుఁ, సినిమాలో నాయికలా పమిటకొంగు సర్రున చించెయ్యాలి!"
    "నేను సినిమాలో నాయికను గాదు." కొంగుతో తుడిచింది.
    "నవలలో నాయికవా?"
    "ఏదీ కాను. మీ ప్రియురాలినిమాత్రమే!"
    "గుడ్! రక్తం మళ్ళీ వస్తూంది. కర్చీఫ్ తడిపి చుట్టు సునీతా!"
    కూజాలో నీటితో దస్తీ తడిపి చుట్టింది. వేణు షర్టు రెండవ చేతినిగూడా పైకి మడుచుకొంటూ, "ప్రస్తుతం ఇక్కడ బీరువాలో పన్నెండువెలు ఉన్నాయి. అవి చాలా?" అన్నాడు.    
    "అంతకూడా అవసరం లేదు. ఒక వెయ్యి రూపాయలు చాలు!"
    "ఓస్! ఏమూలకని?"
    "చాలు, వేణూ! ఆశకు పరిమితి ఉండాలి. ఇంకొక కోరిక ఏమంటే రాజుకు ఎక్కడన్నా చిన్న పని దొరికే ఏర్పాటు చేసిపెట్టండి."
    "వంట చెయ్యడట?"
    "నేనే మాన్పించాను. ఎన్నాళ్ళు ఆ ఎదుగూ బొదుగూ లేని జీవితం?"
    "సరే! పైన నీకో ఛప్రాసి అవసరంగదా? నువ్వు..."
    "వద్దు. మరెక్కడన్నా ఉంచాలనుకుంటున్నాను."
    "అక్కడైతే ఏం?"
    "వద్ధన్నాగా! ఇంకెక్కడన్నా చూడండి."
    "పోనీ, మా ఇంట్లో ఉండమను. అక్కయ్య ఇంట్లో ఉన్నన్నినాళ్ళు పనివాళ్ళ బెడద లేదాయె! రాధకుతోడు .... తోడేమిటి .... కుకింగ్ సెక్షనంతా నిర్వహించమను."
    "ఊఁ, దిక్కులేనివాడు. మంచితనంతో ఏది చెప్పినా చేస్తాడు, ఎంత పనైనా చేయించుకోండి."
    "ఆహా, తప్పకుండా!"
    "కృతజ్ఞురాల్ని. డబ్బు పైకి పంపించండి, వేణూ!"
    "అలాగే! గోల్కొండ ..... మరిచిపోవద్దు."

                                *    *    *

    సూర్యభగవానుడు అస్తమించి చాలా సేపయింది. వెన్నెల వెండిపూతలా ఉంది.
    తన ఒడిలో తలపెట్టుకున్న వేణు గిరిజాల జుత్తు లోనికి వేళ్ళు చొనిపి, నిమురుతూ, "వెళదామా, వేణూ! డాక్టరుగారు చూస్తూంటారేమో?" అన్నది సునీత.
    "అప్పుడేనా, నీతా?"
    "ఎంతఃసేపు ఉన్నా అలాగే అనిపిస్తుంది. ఇప్పటికే మనం ఒక విషయాన్ని ఉల్లంఘించాం. అది ఎంతో తప్పు, వేణూ!"
    "అనుకుంటే అన్నీ తప్పులే!"
    "ఏమైనా ఒక స్త్రీని అగ్నిహోత్రుని సాక్షిగా చేపట్టి, మరొక స్త్రీతో మసలడం ఎవరూ హర్షించరు. వేణూ, తెలిసిన మనమే ఇలా చెయ్యడం భావ్యం కాదు."
    "కాదు ..... ఎన్నటికీ కాదు." వేణు కూర్చున్నాడు. దగ్గిరగా జరిగి ముందుకు వంగుతూ, "ఈ సౌందర్యం మత్తు గొలిపే సారాయి అయితే తాగేద్దును. నీ కళ్ళలో అందం నల్లమందు అయితే తినివేసేవాడిని. నీ చెక్కిళ్ళు గులాబిరేకులయితే ఆ సౌరభాన్ని ఆస్వాదిస్తూ గడిపే వాడిని. నీ పెదవులు కెంపులయితే నా ఉంగరానికి అమర్చుకొని రోజూ ముద్దుపెట్టుకొనేవాడిని. కాని .... కాని నువ్వేదీ కాదు. ఉద్రేకాలకు అతీతమైన ఒక మానవాతీత శక్తివి" అంటూ ఆమెను దగ్గిరికి లాక్కున్నాడు.
    సునీత అతని ఎదురు రొమ్ముమీద తల ఆన్చింది. అతని బాహువులు ఆమె విశాలమైన వీపు చుట్టి వేశాయి. అతని హృదయస్పందన ఆమె శరీరంలో కలిసి పోతున్నది.
    "నీతా, నీ పరిష్వంగంలో సుఖంకన్నా, సందేశాలు ఉత్తమమైనవిగా ఉంటాయి. నీ మాటల్లో ఆజ్ఞలు ఉన్నా, అనురాగం అంతర్గతమై ఉంటుంది. నువ్వు భౌతికంగా మనిషివైనా మానసికంగా దేవతవు."
    "వేణూ!" ఆమె తల పైకెత్తి వేణు కళ్ళలోకి చూసింది.
    "నీతా!" రెండు చేతులతో ఆమె తలను పొదివి పట్టుకుని పెదవులను, కళ్ళను చుంబించాడు. వీణతంత్రులను మీటుతున్నట్లు, "ప్రభూ..... ప్రభూ" అంది సునీత.
    పిట్ట ఒకటి కూస్తూ పైన ఎగురుతూ వెళ్ళింది.
    ఆర్తి ఇంటికి వచ్చేసరికి సారథీ, ఆమే ఏదో తర్కించుకుంటున్నారు. వీళ్ళద్ధరినీ చూస్తూ చిరునవ్వుతో "దేవుడేమన్నాడు, పాపా?" అంది.
    "సమాంతర రేఖలు ఎప్పుడూ కలుసుకోవు. కలపాలని వంకరచేసి, తప్పులు చెయ్యవద్దు అన్నాడు, డాక్టర్!"
    "రేపు .... అంతా రెడీయేకదూ?"
    "ఆరు నూరైనా, నూరు ఆరైనా అది మారదు."
    "గుడ్! అలా ఉండాలి."
    కొంతసేపు మాటలే లేవు.
    "అక్కా, మీ రిద్దరూ ఒక్కసారి నిల్చోవాలి!"
    "ఎందుకోయ్, బావా!" సారథి అన్నాడు.
    "చూస్తారుగా? ప్లీజ్, ఒక్క నిమిషం."
    "మీ అక్కయ్య పక్కన నిల్చునేదా? ఆమె సిగ్గు పడుతుందోయ్!"
    "పడేది తమరు! నామీద ఆ నేరమెందుకు?"
    ఆర్తి సారథి పక్కకు వచ్చింది. వేణు, సునీత జంటగా వచ్చి వాళ్ళకు పాదాభివందనం చేశారు. సారథి వాళ్ళిద్దరి తలలమీద చెయ్యి వేసి, "మీ ప్రేమ వర్ధిల్లు గాక!" అన్నాడు.
    ఆర్తి పైకి ఏమనలేదు. లోలోపల ఏమని ఆశీర్వదించిందో?
    "మనిషి గాఢంగా వాంఛించేదానినే పోగొట్టు కుంటాడు, వేణూ! ప్రేమికుల హృదయాలు ఎప్పుడూ వేదనాభరితాలే! నిజమైన ప్రేమ సమాధి చెయ్యబడుతుందని మనం ఎన్నో కథలు విన్నాం; చదివాం; మీ అక్కయ్య చెప్పింది. నేను సునీత అందరివంటి అమ్మాయేనని అంతకుముందు అనుకున్నాను.  అభిప్రాయాలు ఎప్పుడూ ఒకవిధంగా ఉంచ వీలు ఉండదు."
    "మమ్మల్ని అర్ధంచేసుకున్నావు, బావా!"
    "అర్ధం కానిదంటూ ఏమీలేదు. ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క రకమైన అనుబంధాన్ని ఇష్టపడతాడు. అనుబంధాలు అనర్ధమా? ఈ పాఠం నేను మీ అక్కయ్యనుండి నేర్చుకున్నాను. నేను కళ్యాణిని చూసి అదో మాదిరిగా అయినప్పుడూ, మా గతాన్ని తెలుసుకున్నప్పుడూ ఆమె ఏవగించుకోలేదు వేణూ! నీ సునీత, నా ఆర్తి ..... వీళ్ళు దేవతలు.....దేవతలోయ్!"
    ఆర్తి, సునీత తలలు దించుకున్నారు.
    సారథి ఆర్తి భుజంమీద చెయ్యివేసి, "ఈ కిరన్మయి నా జీవనసౌధంలో రాగమయి అయింది జ్యోతిర్మయి అయింది" అన్నాడు.
    సునీత ఎటో చూస్తూంది. ఎవరి మాటలు వింటున్నట్లు లేదు.
    సునీతను ఇంటిదగ్గిర దిగవిడిచి తను ఇంటికి వెళ్ళాడు వేణు.
    వాళ్ళ ప్రయాణానికి ఏర్పాట్లు అన్నీ పూర్తి అయ్యాయి. సునీత సాయంత్రం వెళ్ళి ఆర్తిని మళ్ళీ కలుసుకుంది. రాత్రి పదకొండు గంటలప్పుడు రాధతో సహా అందరినీ సమావేశపరచమని చెప్పింది. తను విశ్వాన్నికూడా పంపిస్తానన్నది.
    యాదగిరి కొడుకులకు ఉత్తరాలు వ్రాశాడు, తను వైరాగ్యంతో రమణాశ్రమంలాంటి ప్రదేశాలను వెతుక్కుంటూ వెళుతున్నానని, తనకు శాంతి లభించిన చోట స్థిరపడబోతున్నానని.
    ఆరోజు గోవిందరావు తో ఎంతో ప్రియంగా మాట్లాడింది సునీత. ఆర్తి ఇంటినుండి బంజారా హిల్సుకు వెళ్ళింది. ఇంట్లో వేణు, రాధ ఇద్దరే ఉన్నారు. సునీతను చూసి "బహుకాలం తరవాత ఆగమనం. ఏమిటీ కథ?" అన్నాడు వేణు.
    "ఉంది. రాజు రేపటినుండి పనిలోకి వస్తాడు."
    "అంతేగద!"
    రాధ ఆ మాటలన్నీ వింటూనే ఉంది. ఆమెకు పుట్టిన అనుమానం సాలెగూడులా అల్లుకుపోయి మస్తిష్కాన్నిగూడా బంధించేసింది. విడదియ్యలేని చిక్కులు విడదీసినకొద్దీ పడుతూ ఉంటాయి.
    "రాధతో ఓ అయిదు నిమిషాలు మాట్లాడేందుకు అనుమతి ఇస్తారా?"
    "ఎందుకు? ఎందుకట? అంత రహస్యమా?"
    "అని కాదు. అయిదు నిమిషాలు చాలు. దయచేసి పైకి వెళ్ళండి."
    "ఆల్ రైట్! మీ గొడవలు మాకు అక్కర్లేదు." మేడమీదికి వెళ్ళాడు.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra