Home » Vasundhara » Vasundhara Kadhalu - 2


    "ఆ పని నేను చేస్తాను...." అన్నాడు ఇస్స్ పెక్టర్.
    "వద్దు ఇలాంటి హెచ్చరికలు మామూలు మనుషుల ద్వారా అందడం శ్రేయస్కరం. ఇంతవరకూ హంతకుడికి తన ఆచూకీ మనకు తెలిసిందన్న విషయం తెలియదు. మనం అతడిని చాలా జాగ్రత్తగా టాకిల్ చేయాలి-" అన్నాడు వెంకన్న.
    తర్వాత వెంకన్న తనకు తెలిసిన ఓ మనిషి ద్వారా ఆ యింటికి కబురంపించాడు. కబురందిన గంటకు చంద్రం వెంకన్న ఆఫీసుకు వచ్చాడు.
    ముందు తానెవరో చెప్పి-"మీ మనిషి కబురునాకందించాడండి. అది నేను రహస్యంగా అమ్మకు చెప్పేను. ఎందుకంటే పోలీస్ ఇన్స్ పెక్టర్ అలా వెళ్ళగానే ఇలా మా ఇంటికో మనిషి వొచ్చాడండి. వాడి ముఖం సినిమాల్లో రౌడీలదిలాగుందండి. మా ఇంట్లో పనికావాలనండు వెంటనే ఒప్పేసుకుందమ్మ. అయితే రేపే వచ్చి పనిలో జేరతానన్నాడు. అందాకా యిల్లు సద్ది వెడతానన్నాడు. ఈలోగా మీకబురొచ్చింది. భయం వేసి అమ్మకు రహస్యంగా ఈ కబురంహిదించాను. వాణ్ణి ఇంట్లోనే ఎలాగో అలా మరి కాసేపుంచమని అమ్మకు చెప్పి మీ దగ్గరకు బయల్దేరి వచ్చాను-" అన్నాడు చంద్రం.
    వెంకన్న లేచాడు. వాళ్ళిద్దరు కార్లో రాఘవరావు యింట్లోకి చేరుకునేందుకు ఎంతోసేపు పట్టలేదు.
    వాళ్ళను చూస్తూ సుందరమ్మ-"ఆయన వెళ్ళిపోయాడండి-" అంది.
    "ఆయనెవరు?" అన్నాడు వెంకన్న.
    "అదే-మా ఇంట్లో పనికనివచ్చినాయన...." అంది సుందరమ్మ.
    "మరి నేను....కాసేపు...." ఐ చంద్రం ఏదో అనబోయాడు.
    "నువ్వింకేమీ అనొద్దు...." అన్నాడు వెంకన్న. అతడు సుందరమ్మకు జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోయాడు.
    
                                       7

    రాజమ్మ, సీతమ్మ చాలాసేపట్నించి ఆ ఫోటోతో కుస్తీపడుతున్నారు. దాన్ని చూసి ఇద్దరూ రకరకాల బొమ్మలు గీస్తున్నారు.
    వెంకన్న వంటింటిలోంచి వచ్చి-"ఏం చేశారు?" అన్నాడు.
    "బాస్! ఇది చాలా విచిత్రంగా వుంది-" అంది సీతమ్మ.
    "ఏమిటి?"
    "ఈ ఫోటోకు రకరకాల వేషాలు వేయాలని ప్రయత్నిస్తూంటే ఇందులో రాఘవరావు పోలికలు కనబడుతున్నాయ్-" అంది సీతమ్మ.
    "వ్వాట్!" ఉలిక్కిపడ్డాడు వెంకన్న. ఒక్కసారి అతడి బుర్రలో ఏదో మెరుపు మెరిసినట్లయింది.
    "కానీ - ఈ ఫోటోని మీరు పిచ్చాసుపత్రినుంచి పారిపోయి వచ్చిన హంతకుడిదని చెప్పినట్లు గుర్తు-" అంది రాజమ్మ.
    అందులో అబద్దమేమీలేదు. పిచ్చాసుపత్రినుంచి పారిపోయిన ఆ వ్యక్తి ఫోటో వెంకన్న సంపాదించాడు. అతడే హంతకుడని వెంకన్న నమ్ముతున్నాడు. అందుకని ఆ ఫోటో సీతమ్మకూ, రాజమ్మకూ ఇచ్చాడు. హంతకుడు రకరకాల మారువేషాలతో ఊళ్ళో తిరుగుతూండవచ్చు. ఆ వేషాల నంచనా వేయడానికి రకరకాల బొమ్మలు గీయమని అసిస్టెంట్సుకు చెప్పాడు.
    అంటే పిచ్చాసుపత్రినుంచి పారిపోయిన వ్యక్తే రాఘవరావా?
    రాఘవరావు మూడు గంటలకు చనిపోయాడు. శశికాంత్ రాఘవరవుని ఆరుగంటలకు చూశాడు. రెండూ నిజమేనా?
    అంటే రాఘవరావు లిద్దరున్నారా?
    వెంకన్న పోలీసు స్టేషనుకు వెళ్ళాడు. అతడిచేతిలో ఓ చిన్న రేడియో వుంది. అతడది ఇన్స్ పెక్టర్ కు అందించాడు.
    "ఏమిటిది?" అన్నాడు ఇన్స్ పెక్టరు.
    "నేను రోడ్డుమీదికి వెళ్ళి మాట్లాడతాను. నా మాటలు మీరు రేడియోలో వింటారు. కొద్దిరోజులపాటు మీరీ రేడియోను అలా ఆన్ లోనే ఉంచండి. చాలా విశేషాలు తెలుస్తాయి-" అన్నాడు వెంకన్న.
    "చట్టరీత్యా ఇది నేరం. మీ మాటలు మరో రేడియో స్టేషనులో కార్యక్రమాలని దెబ్బతీయవచ్చు-" అన్నాడు ఇన్స్ పెక్టర్ కంగారుగా.
    "అలా కంగారు పడకండి ఇన్స్ పెక్టర్. నేను మీకు యిచ్చినది మీడియం వేవ్ రేడియో కాదు. ఎఫ్.ఎమ్. రేడియో. మన రాష్ట్రంలో ఎఫ్.ఎమ్. కార్యక్రమాలేలేవు. అందువల్ల ఏ ఫ్రీక్వెన్సీ వాడుకున్నా పర్వాలేదు. హంతకుణ్ణి రెడ్ హాండెడ్ గా పట్టుకుందుకు ఇది చాలా అవసరం...." అన్నాడు వెంకన్న.
    "మీరిప్పుడేం చేస్తారు?" అన్నాడు ఇన్స్ పెక్టర్.
    "రేడియోలో విని తెలుసుకోండి-" అంటూ బయటకు నడిచాడు వెంకన్న. కారు స్టార్టయిన కొద్ది క్షణాల్లోనే రేడియోలో మాటలు వినబడసాగాయి - "మైడియర్ ఇన్స్ పెక్టర్! నేనిప్పుడు రాఘవరావు యింటికి వెడుతున్నాను. అక్కడ మైక్రోఫోను ఫిక్స్ చేసి వస్తాను. హంతకుడు మళ్ళీ అక్కడకు వస్తాదు. అందుకని మీరు రేడియోవద్ద అను నిత్యం ఎవర్నో కాపలా ఉంచండి. అతడు వచ్చిన సూచనకాగానే క్షణాలమీద వెళ్ళి బంధించండి....."
    ఇన్స్ పెక్టర్ ఆశ్చర్యంగా అంతా వింటున్నాడు.
    కొద్దిక్షణాల్లో వెంకన్నకూ, సుందరమ్మకూ మధ్య సంభాషణ వినబడింది. ఇన్స్ పెక్టరు శ్రద్దగా వింటున్నాడు....
    "మిమ్మల్ని చాలా పర్యాయాలు యిబ్బందిపెట్టవలసి వస్తోంది-"
    "అయ్యో-యిబ్బంది ఏముందండీ-మా క్షేమం కోరేవారు మీరు...."
    "మీవారి కుటుంబం గురించి అత్యవసరమైన సమాచారం కావాలి....మీకు తెలిసివుంటుందని నా నమ్మకం. మీవారికి ఓ అన్న ఉన్నాడు కదూ?"
    "అన్న కాదు-తమ్ముడు!" అంది సుందరమ్మ.
    "కవలపిల్లల్లో అన్నెవరో, తమ్ముడెవరో చూసి తెలుసుకోవడం చాలా కష్టంగదా-అందుకని అన్న అనుకున్నాను...." వెంకన్న ఆగాడు.
    "మీరు మా మరిదిని చూశారా, ఎప్పుడు?" సుందరమ్మ కంఠంలో ధ్వనించిన ఆత్రుత ఇంతా అంతా అని చెప్పడం కష్టం.
    "చూడ్డం సంగతలా ఉంచండి. అతడికి అన్నగారి మీద అంతులేని పగ వుంది. కారణం?" అన్నాడు వెంకన్న.
    సుందరమ్మ నిట్టూర్చింది-"పగ ఉన్నమాట నిజమే! అన్న సంపాదిస్తూంటే తమ్ముడు తగలేస్తూండేవాడు. అదేమనడానికి లేదు. గట్టిగా ఏమైనా అంటే నాన్న యిచ్చింది చెరిసగం చేసేయ్-నా దారిన నేను పోతాను. అనేవాడు. తమ్ముడంటే ఆయనకు పిచ్చి అభిమానం. నిజానికి తండ్రినుంచి ఆయనకు సంక్రమించినదేమీలేదు. కానీ కొంత డబ్బిచ్చి తమ్ముణ్ణి వదిలించుకుంటే అతడు పూర్తిగా చెడిపోతాడని ఆయన భయపడి అతడి ఆగడాలను భరిస్తూ తన అదుపులోనే ఉంచుకున్నాడు.
    అయితే రానురాను అతడి ఆగడాలు మితిమీరాయి. యింట్లోంచి డబ్బు తగలేయటం సంగతటుంచి పరువు తక్కువ పనులు చాలా చేసేవాడు. ముఖ్యంగా ఆడవాళ్ళ పట్ల అసభ్యంగా ప్రవర్తించడం. ఓసారి కాలేజీ అమ్మాయిల వెంట బడ్డాడని పోలీసులరెస్టుచేసి తీసుకునివెడితే ఆయన వారి కాళ్ళావేళ్ళాపడి ఎలాగో విడిపించి తీసుకుని వచ్చారు.
    ఇంట్లో కూడా అతడి ప్రవర్తన బాగుండేది కాదు. వదినగారినన్న గౌరవం లేకుండా నా వంక అదోలా చూసేవాడు. కొన్నాళ్ళు సహించినా చివరకు ఆయనకు చెప్పేశాను. అప్పటికీ ఆయన కోపగించుకోలేదు. తనకు తెలిసిన సైకాలజిస్టుని సంప్రదించారు.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra