" మీ పొగరు ప్రమాదకరంగా ఉంది. ఇక మీరు రోజులు లెక్కపెట్టుకోవచ్చు . కౌంటుడౌన్ ప్రారంభమయింది మీ శ్రేయోభిలాషి"
* * * *
రాత్రి ఎనిమిదన్నర కావస్తోంది.
చీకటీలో ఒడంబడక చేసుకుని సముద్రం భయంకర రహస్యాల అస్పష్టపు ఆక్రందనలతో ఒడ్డును తాకి వేగంగా వెనక్కీ జారుకుంటూ౦ది. అందాన్ని హత్య చేయాలనే వికృత అంతర్మథనంలో బొడ్డును కాక పొట్టని కోసిన అవివేకపు మంత్రసానిలా హొరు తీరాన్ని దాటి అఫీషియల్ కాలనీని చేరుకుంటూ౦ది.
"ఇదీ దారుణం డాడీ?" సురేష్ అసహనంగా అక్కడ ఎదురుగా మందు సేవిస్తున్న ప్రభంజనరావుకే గుర్తులేదు.
"మీరు 'ఊ' అనండి. దాన్ని ఎడ్రస్ లేకుండా చేసేస్తాను. మీతో సంప్రదించకుండా తను నిర్ణయం తీసుకుంటుందా ....? ఎన్ని గుండెలు దానికి?"
ఆ మాట అనేటప్పుడు హనిత ఎత్తయిన గుండెలు సురేష్ కి గుర్తుకు రాలేదు. అరక్షణంపాటు ఆ కొండలపై జండాని పాతే టెన్ సింగ్ తో తనను తాను పోల్చుకుని కొద్దిగా సంతృప్తి పడ్డాడు. కూడా.
"నువ్వో పూల్ విరా!"
అప్పటికే అవసరానికి మించినంతగా తాగేసిన ప్రభంజనరావు మరో పెగ్ డైల్యూట్ చేయకుండా గొంతులో పోసుకున్నాడు.
"అందం, చదువు, ఆస్తి అంతకు మించి తెలివిగల అమ్మాయిరా! నెమ్మదిగా త్రాఫ్ చేయమని నీకు చెప్పి ఏడాది గడిచింది. ఒక్క అడుగయినా ముందు కేయగలిగావా _ ? అదే ఈ పాటికి నువ్వు సాధించి వుంటే యిలా బోర్డు మీటింగులకి రాకుండా నీ బెడ్ రూమ్ లో పడుండేది."
"అప్పటికి అప్పుడప్పుడు ట్రై చేస్తూనే ఉన్నాను డాడీ!" కించిత్తు బదః ధ్వనించింది సురేష్ గొంతులో. అడుగు వేయబోతున్న ప్రతిసారీ ఎలా హానిత కరిచేసేలా చూసేది యిన్నాళ్ళు అంతదాకా ఒక్కసారీ తండ్రికి చెప్పలేదతను.
"వాళ్ళ డేడీని చూసి ఇన్నాళ్ళు ఆగేను. చెప్పండి డాడీ! మీరు 'ఊ' అంటే దాని అడ్రసు ...."
"ఛస్ ..... నోర్ముయ్!" విసుకున్నాడు ప్రభంజనరావు . "నేనడిగింది దాని అడ్రసు లేకుండా చేయడం కాదు. నీ కేరాఫ్ ఎడ్రస్ గా మార్చుకోవడం. చూడడానికి ఐదడుగుల పదంగుళాల పొడవు వున్నావు. ఆరంగుళం ముందుకు కూడా యింతవరకూ దూసుకుపోలేకపోయావు."
"మీరు చెప్పేది చిత్రంగా ఉందండీ!"
ఇంతసేపూ నిశ్సబ్దంగా వింటూ కూర్చున్న ప్రభంజనరావు భార్య రమాదేవి జైక్యం చేసుకుంది. "వాడుకో అంటే చాలు అమ్మాయిలు క్యూలు కట్టేసేంత హేండ్సమ్ గా వుంటాడని నా స్నేహితురాళ్ళు అంటుంటారు. అంతెందుకు? మన థియేటర్ కి వచ్చే కాలేజీ అమ్మాయిలు సినిమా కాక వీణ్సే ఎక్కువ చూసిపోవాలనుకుంటారని అందరూ చెప్పుకొంటుంటారు. వీడి వలలో పడకపోవడం దాని కర్మగాని తప్పు వీడిదేలా అవుతుంది?"
ఆ సిటీలో రెండు మహిళా సంఘాలకి అధ్యక్షురాలిగా , ఒక సినిమా థియేటర్ యజమానురాలిగా తన అరుదయిన సంస్కారాన్ని ఆ విధంగా బహితర్గం చేస్తుంటే తల్లికి తన మీదున్న అపారమయిన నమ్మకానికి చాలా సంతృప్తి పడిపోయాడు సురేష్.
"లేదు మమ్మీ! డాడీ ఇంత మాటన్నాక నేను ఊరుకోవడం నాకు సిగ్గుగానే వుంది. వారం రోజుల్లో హనితని ట్రాఫ్ చేస్తాను .... నేను నీ కొడుకునని నిరూపిస్తాను" చాలెంజ్ గా అన్నాడు.
రమాదేవి లాలనగా కొడుకు తల నిమిరింది. "అదీ ... పంతం అంటే అలా వుండాలి చూడు సురేష్ ...! ఆ పనేదో సాధ్యమయినంత త్వరగా చేసేయకపొతే అక్కడ మీ డాడీ పొజిషన్ కే ఎవరు పెట్టెట్టుంది హానిత. ఈ రోజు నుంచి ఈ కార్యక్రమంలో నువ్వు బిజీ పెట్టేట్టుంది హానిత. ఈ రోజు నుంచి ఈ కార్యక్రమంలో నువ్వు బిజీ అయిపోవాలి."
అదిగో సరిగ్గా అప్పుడు ఫోన్ రింగయింది.
"హాల్లో" ఫోన్ రిసేవార్ ని అందుకున్న సురేసు "సురేష్ హియర్" అన్నాడు.
"హాయ్ ..... నేనూ హనితని అవతలివేపు అమ్మాయి కంఠం వినిపించేసరికి కట్రాడలాఅయిపోయాడు.
"హవ్వార్యూ?"
"ఓ .... బ్ర .... హ్మండంగా ఉన్నాను ...." ఎన్నడూ లేంది హనిత ఫోన్ లో యిలా పలకరించడం అతనూహించలేకపోతున్నాడు.
"ఎ .... ఎవరు కావాలి?"
"ముందు" ఫకలున నవ్వు వినిపించింది, "అదే నీ తెరమాటు వ్యవహారం."
థియేటర్ కొచ్చిన అమ్మాయిని గాని, తన ట్రాఫ్ లో చిక్కుకున్న మరే ఆడపిల్లనైనా గాని థియేటర్ తెరవెనుక ఎంజాయ్ చేయడం సురేష్ హాభ్లీలో అతి ముఖ్యమైనది అందుకే హనిత కీ విషయం ఎలా తెలుసా అని ముందు ఖంగు తిన్నాడు.
"ఏం _ చెప్పడానికి సిగ్గుగా ఉందా?"
"అబ్బే ... ఆశ్చర్యంగా వుంది,"
"దేనికి ?"
"నీకెలా తెలిసిందా అని?"
"ఇష్టమయిన వ్యక్తి ఎక్కడ ఎప్పుడు ఏమేం చేస్తున్నాడో తెలుసు కోవడం నా హభ్లీలో ఒకటి ....."
సురేష్ కిప్పుడు మేఘాల్లో తేలిపోతున్నట్టుంది "ఏం చేయను? నీ పరంగా సరైన రెస్పాన్స్ ...." నీళ్ళు నమిలేశాడు అర్ధోక్తిగా.
"నా పరంగా ..... అంటే?"
"అదే ....."
"రెస్పాన్స్ రాకపోయేసరికి ఇలా చిల్లర వ్యవహారాలతో సంతృప్తి పడిపోతున్నానంటావు."
"మ ..... మరేం!"
"అడిగే యేచ్చుగా?'
"ఏమిటి ?"
"అదే ....?"
సురేష్ నుదుట చెమట పట్టేసింది. "ధైర్యం చాలడం లేదు."
"నువ్వేం మగాడివి?"
సురేష్ గొంతు తడారిపోయింది. ఇదేమిటి? వెదకబోయిన తీగ కలికి తాగాలినటు హనిత ఇలా ఇన్ వైటింగ్ లో మాట్లాడంతో సురేష్ కి నిజంగానే మతిపోయింది. "అది కాదు హనీ ....."
"జుర్రుకోవాలనుకుంటున్నావా?"
'"ఏమిటి ?"
"హనీ" టక్కున జవాబు వినిపించింది. "మరేం లేదు. నువ్వంత మగాడివేనా అని ."
"నిరూపించుకోగలను."
"నాకు నమ్మకం లేదు. ఎస్ డియర్. ఏదన్నా లోతుగా వెళితే తప్ప సంతృప్తి చెందని ఆడదాన్ని నేను. అంటే న్కిప్పటికీ అనుభవం ఉందని పొరపాటు పడకు. నా సైకాలజీ చెబుతున్నాను......"
"ఐ లవ్యూ హనీ...... నువ్వు అవకాశమిస్తే మరోసారి ఇంకోసారి అంటూ నా వెనుక పడేట్టు చేస్తాను."
"నిజంగా ?"
"నీ మీ దొట్టు?"
"నమ్మమంటావు."
"ఎస్ . చెప్పు ఎప్పుడు? ఎక్కడ? ఇప్పుడు రానా?"
"డాడీ బాంబే నుంచి వచ్చేశారు."
"మరెలా?" ఉద్రేకంలో ఊగిపోతున్నాడు. "చెప్పు హనీ."
"అంత తొందరగా ఉందా?"
"మరేం!"
"ఇంతలా ఆవేశపడుతున్న నువ్వు అక్కడికొచ్చి ఏదో చేస్తావంటే నాకు నమ్మకం కుదరడంలేదు."
"ఆ విషయం నా కోదిలేయ్. చెప్పానుగా "
"వెల్ .... మరో రెండు గంటల్లో ...."
"ఎక్కడ?" దూకుడిగా అడిగాడు.
"చెబుతాను .... ముందుగా ఓ కండిషన్ !"
"ఏమటిది?"
"ఇది చాలా గోప్యంగా జరిగిపోవాలి."
"అలాగే!"
"ఎంతైనా పెద్దింటి అమ్మాయియినిగా పెళ్ళి కాకుండా ఇలాంటివి నలుగురికీ తెలిస్తే అంత బాగుండదు. ఇకపోతే నువ్వు నన్ను సంతృప్తి పరిస్తే నేనే నిన్ను మరోసారి రమ్మ౦టాను ... ఒకవేళ ఫెయిలయ్యావె అనుకో ....."
"చెప్పానుగా, నేను అలాంటి వాటిలో ఓటమి ఎరుగని మగాణ్ణి."
"అది నిరూపించుకోవాల్సింది మాటలతో కాదు."
"హానీ" సురేష్ కంఠం వేడి సెగలతో మండిపోతూంది అప్పటికే. "నా సర్వశక్తి నీ ధారా పోస్తాను. నెలల తరబడి నీకోసం అల్లాడిపోతున్నా నేను ఈ దండయాత్రలో నీ సర్వ సామ్రాజ్యాన్ని కొల్లగొట్టి ఈ స్వయంవరంలో నిన్ను "బాపెరే' అనిపించి అప్పుడు నిన్ను పెళ్ళి చేసుకుంటాను."
"గూడ్!" మత్తుగా పలికింది రా సురేష్! ఈ పరీక్ష నాళికలో నీ మగసిరి ఎండిన ఏసిడ్ కాకూడదు. నా యౌవనాన్ని కాన్వాసులా నీ ముందు పరచి నువ్వు ఉన్మాదంగా చిత్రించే ఏడు రంగుల ఇంద్రధనస్సు లా మారాలని, నీకు సహకరించే అస్త్రాలుగా చేసుకుని ఎదురు చూస్తుంటాను. గెలిచావా, గగన పాతాళాలా మధ్య ఏటవాలుగా జారే జలపాతానై అనుక్షణం నీ తాపాన్ని చల్లార్చే నీ దాసినౌతాను. ఓడవా, నీ కోర్కెల వర్తమాన శిరస్సుని నీకు నవ్వుగా వధించకోడానికి నేనే కారణమౌతను."