అంతా మరోసారి ముఖముఖాలు చూసుకున్నారు.
రాజారావు మళ్ళీ అన్నాడు " నా దగ్గర్లో ప్రాజక్టరుంది. స్లయిడ్స్ ద్వారా _ మనిషి చదువుతో ఏం సాదించాడో చూసిస్తాను. ఈరోజుకవి చూసి __ మీలో ఎంతమందికి చదువంటే ఆశక్తి కలుగుతుందో _ అందరూ రేపు రండి. చదువు ప్రారంభిస్తాను ....."
గదిలో దీపం అర్పి _ ప్రోజక్టరు ద్వారా కొన్ని రంగుల స్లయిడ్సు వేశాడు. భూమి చుట్టూ తిరుగుతున్నా ఉపగ్రహం, అంతరీక్ష౦లోకి దూసుకునుపోతున్న రాకెట్, చంద్రమండలంపై కాలుమోపుతున్న నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ వగైరా బొమ్మలున్నాయి. వాటిలో ఒక్కొక్క బొమ్మ గురించే సులభశైలిలో వర్ణించి చెప్పాడు. రాజారావు. అంతా కుతూహలంగా విన్నారు. ఆ శక్తితో బొమ్మలు చూశారు.
స్లయిడ్స్ చూపించడమయ్యాక గదిలో దీపం వేశాడతడు. గదిలో ఉన్న పదిమందీ ఓసారి కళ్ళు నులుముకున్నారు.
"రోజూ ఇలా బొమ్మలు చూపిస్తారా అన్నాడొకడు.
"అవసరాన్ని బట్టి చూపిస్తాను కానీ మీకు నేను చేపే చదువు _ ఈ బొమ్మలకంటె ఉత్సాహకరంగా ఉంటుంది. ఎటొచ్చీ అక్షరాలూ నేర్చుకోవడానికి కాస్త శ్రమపడాలి _"
"మాకక్షరాలు తొందరగా వస్తాయంటారా?"
"మీకు నిజమైన శ్రద్ద కుతూహలం ఉంటే చాలా తొందరగా వచ్చేస్తాయి. ఒకసారి అక్షరజ్ఞానం కలిగేక కుతూహలం మీరాపుకోవలన్నా ఆగదు ....."
"మాకు చదువు చెబితే మీకంటే లాభం?"
"అదిప్పుడు మీకు చెప్పినా అర్ధం కాదు. చదువు మొదలెట్టేక నేను చెప్పకుండానే అర్ధమవుతుంది అయిన చదువుకునేటప్పుడు మీరు మీకు గానీ నాకు గానీ లాభమెంతు౦ది అని అలోచించవద్దు. నష్టముందో లేదో మాత్రం చూసుకోండి __"
మరింకేమీ ప్రశ్నలు వేయలేదు ఎవరూ
"మళ్ళీ రేపు కలుద్దాం అన్నాడు రాజారావు.
అందరూ వెళ్ళిపోయారు . వెళ్ళిపోతున్న వాళ్ళవైపే చూపులునిలిపి తీవ్రంగా అలోచింస్తూండిపోయాడు రాజారావు వచ్చినవాళ్ళంతా యువకులే. వీరితోపాటు కొందరు వృద్దిలి కూడా ఆకర్షించాలి . అప్పుడే తన పథకం పారుతుంది. అయితే ఎక్కడా ఎవరికీ అనుమానం రాకుండా కథ నడిపించాలి. ఆడవాళ్ళకి వసంత, మగవాళ్ళకి తను కార్యదీక్షతో విద్య గరగాలి. నాలుగైదేళ్ళలో అనుకున్నది సాధించాలి.
రాజారావు వీధి తలుపులు వేశాడు. అతడికి కళ్ళుమూతలుపడుతున్నాయి. నిద్రపోదామంటే లోపల ఇంకా వసంత ఆడవాళ్ళతో చెబుతున్న కబుర్లు వినబడుతున్నాయి. వాళ్ళింకా ఎంత సేపువుంటారో?
అతడికి చిరాకనిపించింది ఎలాగైనా అడవాళ్ళతో వ్యవహారం మగాళ్ళతో అంత సులభం కాదు. ఇంతకీ ఈరోజు వసంత వాళ్ళకు చదువెంత ముఖ్యమో వివరించి చెప్పిందోలేక ఊళ్ళోవాళ్ళ నగా నట్రా గురించిన వివరాలు వాళ్ళే ఆమెకు విపులీకరించారో !
ఆలోచిస్తుండగానే రాజారావు కన్ను మూతబడిందిఅతడలా కునుకు తీశాడో లేదో తలుపు తట్టారు. రాజారావు నిద్రాభంగమై కళ్ళు నులుముకున్నాడు ఇంకా లోపల్నుంచీ ఆడవాళ్ళ మాటలు వినిపిస్తూనే ఉన్నాయి.
తలుపు తట్టిన చప్పుడు మళ్ళీ వినిపించింది. రాజారావు లేచి వెళ్ళి తలుపుతీశాడు.
గుమ్మానికవతల ఇరవై ఏళ్ళ యువకుడు " రాజారావుగారంటే మీరేనాండీ?" అనడిగాడు.
"అవును _ నేనే ఏం కావాలి?" అన్నాడు రాజారావుశ్చర్యంగా.
ఈ రాత్రికి మీ ఇంట్లో ఆశ్రయం......."
రాజారావు ఆశ్చర్యం రెట్టింపయింది __ " ముందు లోపలకురండి మాట్లాడుకోవచ్చు. " అన్నాడు. ఆ యువకుడు లోపలకు వచ్చి కూర్చున్నాక "ఇప్పుడు వివరంగా చెప్పండి __ అసలు మీరెవరు? ఈ రాత్రికి మా ఇంట్లో ఆశ్రయం మీకెందుక్కావలసోచ్చింది? ఈ ఊరికి నేను కొత్త కదా __ అశ్రయానికి నేను తగినవాడ్నని మీ కెవరు చెప్పారు?" అనడిగాడు రాజారావు.
ఈ యువకుడు తమాషాగా నవ్వి _ "నిజానికీ మీరీ ప్రశ్నలడగడం ఆనవసరం. నేనడిగింది ఒక్కరాత్రి ఆశ్రయం . ఆ తర్వాత మీరెవరో నేనెవరో. అందువల్ల నేను మా ప్రశ్నలకుసరైన జవాబులిస్తానన్న గ్యారంటీ ఏమిటి? ఏమైతే నేం మీరడిగారు కాబట్టి చెబుతున్నాను . నా పేరు జగ్గారావనుకోండి. నేను బియ్యే పాసయ్యననుకోండి. నిరుద్యోగినను కోండి. ఈ ఊరి ప్రెసిడెంటు రమాకాంతం గారి సాయంతో ఓ ఉద్యోగం సంపాదింద్దామని ఇక్కడికొచ్చాననుకోండి_" అన్నాడు.
"జగ్గారావుగారూ __ నేను అశ్రయమిచ్చాననుకుని బయట పడుకోలేక పోయారా? అసలుధ్యోగేమ్ వచ్చేసిందనుకుని ఇంటికెళ్ళిపోకపోయారా?"
జగ్గారావు నవ్వి __ "నేనేదలా మాట్లాడినందుకు మీక్కోపం వచ్చింట్లుంది నేనందరితోనూ యిలా మాట్లాడను. మీరు సుభాష్ స్నేహితులని తెలిసి ....." అని అర్ధైక్తిలో ఆగిపోయాడు.
"మిమ్మల్నిక్కడికి సుభాష్ పంపాడా?" అన్నాడు రాజారావుశ్చర్యంగా.
"అయన పంపలేదండి. నేనే వచ్చాను. అయన నాకు గురుతుల్యుడు . నాకీ ఊళ్ళో పనుందని చెబితే అయన వెంట మీ పేరు చెప్పి మిమ్మల్ని కలవమన్నారు."
రాజరావిప్పటికి నిజమైన నవ్వు నవ్వాడు. సుభాష్ బెంగాలీ . అతడూ రాజారావు కలసి ఒకే ప్రొపెసర్ దగ్గరీసేర్చి చేశారు. ఆ తర్వాత పడిపోయినా ఈ నాటివరకు కూడా ఇద్దరిమధ్యా ఉత్తరా ప్రత్యుత్తరాలు నడుస్తూ వున్నాయి. సుబాష్ చురుకైనవాడు చమత్కారి . జగ్గరావుకి హాస్య ప్రియత్వం వచ్చి ఉండాలని రాజారావనుకున్నాడు.
"వెరీ గ్లాడ్ టూ మీట్ యూ _ అంటూ చేయిచాపాడు రాజారావు. ఇద్దరూ కరచాలనం చేశాక _ " ఎలా వున్నాడు సుభాష్? మనిషెమైనా లావేక్కాడా? అన్నాడు.
"లేదండీ _ అయన ఆరేళ్ళనుంచి మారడమానేశారు ఎటొచ్చీ ఏడాదిక్రితంనుంచీ అభిప్రాయాల్లో మార్పువచ్చింది అప్పుడే నేనాయన శిష్యపరిమాణవుల్లో ఒకడయ్యాను._"
కావాలని తెచ్చిపెట్టుకున్న జగ్గారావు హాస్యం రాజారావుకి జుగుప్సరంగా ఉన్నప్పటికీ మర్యాదకు సహించి "మీరు నిరభ్యంతరంగా మాయింట్లో ఉండవచ్చు. ఈ ఒక్క రాత్రే కాదు. ఎన్ని రోజులైనా ఉండవచ్చు. మీకు సుభాష్ తో పరిచయమేలాగై౦ది? మీరిప్పుడు కలకత్తాలో ఉంటున్నారా?" అనడిగాడు.