ఆ రాత్రి నిద్ర పట్టని వ్యక్తులూ ఉన్నారు.
ఒకరు.... నేషనల్ డెమోక్రటిక్ పార్టీ రాష్ట్రా శాఖ ప్రెసిడెంట్ మాణిక్యం.
రెండవ వ్యక్తి ... సీనియర్ ఎమ్. ఎల్. ఏ. మురహరి__
మూడవ వ్యక్తి .... ఎన్.డి. పి రాష్ట్రా శాఖ సెక్రటరీ మూరప్పా_
నాల్గవ వ్యక్తి రాష్ట్రా ముఖ్యమంత్రి నందకిషోర్ అర్ధాంగి ఇందుమతి.
* * * *
తిరిగి వుదయమే మాణిక్యం ఇంట్లో మురహరి, మారప్ప దిగిపోయారు.
"సి.ఎమ్. రాస్ట్రాభివృద్దికి ఒక శతం కాలాన్నే వినియోగిస్తాడు. పాతిక శాతం సన్మానాలకు, 24 శాతం వ్యక్తిగత సుఖాలకు, పాతిక శతం పదవిని నిలబెట్టుకోవటం కోసం వినియోగిస్తాడు తనకి అనధికార సిబ్బంది కూడా ఉంది. వాళ్ళు ఎప్పుడు, ఎక్కడ ఏ గూడపుఠణి జరుగుతుందనేది. అరా తీస్తుంటారు. దాని ప్రకారం....." మాణిక్యం మాటలు పూర్తికాలేదు......
మీరు చెప్పబోయేది నాకు తెలుసు.... అయన రామదాసు మీద కన్నెయకుండా ఉంటాడా అని మీ అనుమానం వేస్తాడు__ వేసాడు కూడా __ అయితే రామదాసు ఫోన్ చెడిపోయింది. రేపటివరకు అది బాగుకాదు. అందుకు సహకరించిన వాళ్ళకి డబ్బు అల్ రెడ్డ అందింది " ఒకింత గర్వంగా అన్నాడు మురహరి.
"ఫోన్ చెడిపోయినంత మాత్రాన రామదాసుని సి.ఎమ్. పట్టుకోలేడనా నీ ధైర్యం ....?" మారప్ప సర్ క్కాస్టిగ్గా అన్నాడు.
స్వతహాగా మురహరి కోపిష్టి , ఆ పైన తొందర పాటేక్కువ __ తన మాటల కేవరన్నా అడ్డు తగిలితే అసహనాన్ని ప్రదర్శిస్తాడు.
మాణిక్యం , ముఉరప్పా అలా కాదు _ ప్రతి విషయంలోనూ ఎంతో సంయమనం ప్రదర్శిస్తారు. మారప్ప మాట్లాడిన విధానానికి మురహరి చిరాకు పడ్డాడు. కాని సమాధానం ఏం ఇవ్వలేకపోయాడు.
"మూరప్ప లాజుక్ కదానగలవా మురహరి ....? నందకిషోర్ కి అనుమానం వస్తే దాన్ని నివృత్తి చేసుకునే నెట్ వర్క్ లేదంటవా....?" మాణిక్యం అనునయంగా అన్నాడు.
"సరే... మరందుకు మారప్ప చేసిందేమిటి?" మురహరి మొఖం చిట్లించుకుని అడిగాడు.
"కోపం వద్దు..... నీకు తొందరపాటేక్కువ __ ఇక నేను చేసిందేమిటంటావా? రామదాసుని ఈ నగరంనుంచి తప్పించాను. పాతిక ఎకరాల పొలాన్ని రామదాసుకి చూపించేందుకు మా తమ్ముడు రామదాసుని తీసుకుని సిటీకి ఎనభై కిలోమీటర్ల దూరం తీసుకెళ్ళాడు సి.ఎమ్. మీద సరీగ్గా బాంబు పేలిస్తే అల్ రెడీ ఇచ్చిన రెండు లక్షలకు తోడు ఫారం హౌస్ కి పనికొచ్చే బంగారంలాంటి పాతిక ఎకరాల పొలం నీ సొంతమౌతుందని ఆశపెట్టాను. ఆశపడ్డాడు. అందుకే తోకాడి౦చుకుంటూ మ తమ్ముడు ఆరెంజ్ చేసిన కారులో వెళ్ళిపోయాడు. ఇక మిగతా ఏర్పాట్లు మా తమ్ముడే చూసుకుంటాడు. పొలం చూసి ఆనందిస్తాడు __ ఆపైన పుల్ గా తాగుతాడు __ ఇక మిగిలేదేమిటి సుషుగా తినటం __ చివరగా గుర్రుపేట్టి నిద్రపోవటం __ నిద్రనుంచి లేచేసరికి ఈ రోజు రాత్రి ఎనిమిది గంటలవుతుంది. అప్పుడు బయలుదేరి నగరానికి పదిగంటలకు చేరుకుంటాడు. సరీగ్గా అప్పటికి జర్నలిస్టులు రోజెస్ గార్డెన్ కి చేరుకుంటారు. మా తమ్ముడు చెప్పినట్లే వింటాడు తప్ప రామదాసు చెప్పినట్లు కాదు కారు దిగేప్పుడు మా తమ్ముడు ఆరెంజ్ చేసిన డ్రైవర్ మనం సేకంరిమ్చిన సాక్ష్యాల్ని రామదాసు చేతికి అందిస్తాడు. ఆ వెంటనే రామదాసు జర్నలిస్టు కి తన దగ్గరున్న డాక్యుమెంట్స్ అందజేసి న రాష్ట్రం ఏమైపోతుందంటూ వాపోతాడు.... టోటల్ గ యిదీ నేను చేసింది __ చేయగల్గింది " అన్నాడు మారప్ప.
మురహరి మారప్ప వేసిన పతకాన్ని ఆశ్చర్యపోయాడు. ఆపైన ఒకింత సిగ్గుపడి తల వంచుకున్నాడు.
* * * *
తిమ్మిది గంటలకు గ్రీన్ ఫీల్డ్స్ మెయిన్ గెట్ ముందుకీ పైలట్ కారు, సి.యం. ఉపయోగించే మేర్పిడస్ బెంజ్, సెక్యూరిటీ కారు వచ్చి ఆగాయి.
ఆ వెనకే ముఖ్యమంత్రిని భజన చేయడమే ప్రధానంగా పెట్టుకుని పదవుల్ని దక్కించుకో గల్గుతున్న కొందరు మంత్రులు, కార్పొరేషన్స్ చైర్ మన్స్ తమ తమ కార్లలో వచ్చి వేచి వున్నారు.
బంగ్లా బయట గుసగుసలు.....
బంగ్లా లోపలా గుసగుసలు......
వీటన్నింటికీ అతీతంగా లోపల సి.ఎం. కి, గోపీనాతనికి మధ్య సంబాషణ జరుగుతోంది.
తనను కలిపేందుకు వచ్చేవార్ని వెయిటింగ్ లో పేట్టి తన వేల్యూ పెంచుకోవటం అన్న అనాచారం తెల్లదొరల దగ్గర్నుంచి వచ్చినా, ఇప్పుడు వారికన్నా మనమే అనాచారాన్ని బాగా పెంచి పోషిస్తున్నాం .
"ఫోన్ చెడిపోతే వదియలేటమేనా? నీకు ఎమ్ జి ఆర్ స్ట్రాటజీ తెలుసా? ఏదయినా పని చేయించుకోనెందుకు తన దగ్గరకు డబ్బు మూటలతో వచ్చే వ్యపారవేత్తల్ని ముందు ప్రతిపక్ష నాయుకుడి దగ్గరకు వెళ్ళి అయన శాతం ఎంతో కనుక్కొని __ అదిచ్చేసి __ అసెంబ్లీలో అరవననే మాట తీసుకొని తన దగ్గరకు రమ్మనేవాడట. ఆ తరువాత తన వాట తీసుకుని రూల్స్ నీ., రెగ్యులేషన్స్ నీ గంగలో కలపి సంతకాలెట్టేవాడట. ఏం నేర్చుకుంటా౦రా మనం....? మంచేలాగూ నేర్చుకోలెం __ మానవత్వాన్ని అలవర్చుకోలెం __ ఇక మిగిలింది గతంలో ఏ రాజకీయ నాయకుడు ఏ ఎత్తువేసి పదవిలోకి వచ్చాడు? ఎవర్ని చిత్తుచేసి తన పదవిలో ఎక్కువకాలం కోనసాగాడు? ఎంత సంపాదించాడు? ఎక్కడ భద్రంగా దాచుకోగలిగాడనేదేగా? ఇవేగా రాజకీయ నాయకుడు నేర్చుకోవలసింది....?"
"సరి ... సర్లే ఇంతకీ తేల్చావ్....?" నందకిషోర్ తనలో రేగిన అసహాన్నాన్ని కప్పిపుచ్చుకుంటూ అడిగాడు.
"ఇంటికి మనిషిని పంపించాను. రామదాసు బయట ఊరి పనిమీద వెళ్ళిపోయాడట. తిరిగి ఏ అర్దరాత్రికోగాని రాడట. ఎక్కడికెళ్ళింది. ఇంట్లో వాళ్ళకు తెలీదట. సో..... మనం కంగారు పడక్కర్లేదు. నీకు వచ్చిన ఇన్ ఫర్ మేషన్ ప్రకారం రేపేదాకా బాంబు పేలుతుందని తెలిసింది ?"
"అవునూ...?"
"భవిష్యత్తులో పెలుతుందా? లేదాన్న విషయం గురించి సీరియస్ గా తీసుకుంటాను రేపు మాత్రం పేలదని నా అంతరాత్మ చెబుతోంది. ఊరికే కంగారుపడక సెక్రటరియేట్ కి బయలుదేరు. సంతకాలు పేట్టి సంచుల్ని ప్రోగుసుకోవాల్సిన కార్యక్రమాలు చాల వున్నాయి " అన్నాడు గోపెనాథ౦ ఆ విషయాన్నీ తేలిగ్గా తీసుకుంటూ.
సి.ఎమ్. ఇంకా సండేహిస్తూ౦డటంతో గోపీనాధం "పద పద " అంటూ తొందరచేసాడు.
మరో ఐదు నిముషాలకు కార్లు బార్లుతీరి సెక్రటేరియేట్ కేసి దూసుకుపోయాయి.
సి.ఎమ్. కార్లు సెక్రటేరియేట్ లోకి ఎంటరౌతుండగా ఒక దృశ్యం కంటపడింది.
గేట్ దగ్గరున్న గార్డ్స్ ఒక వ్యక్తి దగ్గిర కొంత డబ్బు తీసుకుని పాస్ లేకుండానే లోపలకు వదిలేసారు.
ఆ దృశ్యాన్ని గోపీనాధం కూడా చూసాడు.
"చూసావా... పబ్లిగ్గా ... సెక్రటేరియేట్ ముందు లంచం తీసుకుని జనాల్ని వదిలేస్తున్నారు.... దీన్ని క్షమించకూడదు. వెంటనే ఏక్షన్ తీసుకోవాలి" అన్నాడు సి.ఎమ్ నందకిషోర్ కోపంగా.
గోపినాథం నవ్వాడు.
"యథారాజా ... తథాప్రజ..... నువ్వు కోట్లు తింటుంటే నీ మంత్రులు లక్షలు తింటున్నారు. అధికారులు వేలు తీసుకుంటుంటే బంట్రోలు వందలు తీసుకుంటున్నారు పాపం.... అధికార యంత్రాగంలోణి అందరూ లంచాలకళని పెంచి పోషిస్తున్నారు.... పిచ్చి ప్రజలు ఏదో కొంపలు మునిగిపోతున్నట్లు..... తాము ఓట్లేయకపొతే దేశం తల్లక్రిందులయిపోతుందన్నట్లు క్యూలో బారులు తీరి మరీ ఓట్లేసినందుకు బాగానే అందరూ కలసి బుద్ధి చెబుతున్నారు.... అంధ్రప్రదేశ్ గవర్నర్ రాజకీయ నాయుకుల గురించి చాలా బాగా సెలవిచ్చారు __ బ్రోకర్లని ఎన్నుకొని చట్ట సభలకు పంపిస్తున్నారు. ప్రజలు అని అన్నారంటే ఎంత విసిగిపోయి ఉంటారు ....?" ఒకింత చిరాగ్గా అన్నాడు గోపీనాధం.
కార్లు సి.యం. ఆఫీసు బిల్డింగ్ ముందగాయి. కొందరు చేతులు కట్టుకుని నిలబడగా , మరి కొందరు నీ బ్రాంచేను కాల మోక్తా ధోరణిలో వెన్నుపూసల్ని వంచగా, ఇంకొందరు తెచ్చిపెట్టుకున్న చిరునవ్వును చిలకరిస్తుండగా నందకిషోర్ గోపీనాథంతో కలసి తన చాంబర్ కేసి సాగిపోయాడు.
ఎవరి సీట్లలో వారు సెటిల్ అయ్యాక అన్నాడు నందకిషోర్ "ఎందుకూర అలా పెలిపోతున్నావ్.......? ఈ రోజేమయింది నీకు....?"
"ఏం కాలేదు __ భవిష్యత్తులో కూడా ఏం కాకుండా వుంటుందన్న ధీమా కూడా లేదు. బడుగు రైతుల రక్తాన్ని పిండుకుని కోట్లు ఆర్జించిన రిజిస్టార్ చిదంబరాన్ని తిరిగి ఎందుకు తీసుకున్నావ్.....? వాడి మీదున్న విచారణకు ఎందుకు నిలుపుదల చేసావ్....? ఎందుకు వాడ్ని సస్పెన్షన్ నుంచి తప్పించి రీ ఇన్ స్టేట్ చేసావ్....? నువ్వు తినేది కాకా తినే మిగతావాళ్ళను కూడా ఎందుకు ఆడుకుంటున్నావ్....? కాస్త చూసి అడుగువేయ్ కాలు బురదలో పడితే కడుక్కోవచ్చు __ కాని అవినీతిలో పడితే ఎప్పుడూ ఒకప్పుడు ఆ కాలు కట్ అయిపోతుంది. కడుక్కునెందుకు మరి అవకాశం వుండడు" తల ఎటో తిప్పుకుని అన్నాడు గోపీనాధం.
నందకిషోర్ ఏదో అనేలోపే చీఫ్ సెక్రటరీ లోపలకు వచ్చారు
అక్కడితో ఆ సంబాషణ కట్ అయిపోయింది.
* * * *