Home » Yamini saraswathi novels » నింగిలోని సిరిమల్లి

    "పద రాజూ! బోంచేద్దాం!" లేచారు రాఘవయ్యగారు. బోజనాల వేళకి నాగరాజే కాదు మరేవరున్నా వాళ్ళని తనతోపాటే భోజనానికి లేమ్మన్నే తత్త్వం ఆయనది. చాలా మందికి లగే యింట్లో ఆడవాళ్ళ యిబ్బందుల్నీ బొత్తిగా గమనించరు అయన. కూరలు అవీ వున్నాయో లేదా, అన్నం చాలుతుందా, మళ్ళీ ఆ అతిధిదేవుడికోసం అత్తెసరు వెయ్యాలా __ యీవేవీ గమనించకోరు. అయన. ఆ తర్వాత ఎప్పుడైనా తన ఆరోగ్యం గురించి అడిగితె అప్పుడు కవిలేకట్ట విప్పుతుంది జానికమ్మగారు. దానికి అయన నవ్వేస్తారు." పోనీ లేవోయ్! ఇలాగా యీ గడవక్కర్లేదు. అయినా అన్నీటికి ఆ రామచంద్రుని భయవుండాలి అంటారు.
    భోజనాలు పూర్తయ్యాయి. కాలక్షేపంతో కబుర్లతో కమ్మని ఆవకాయతో . కబుర్లతో భోంచేశారు అందరూ.
    రాఘవయ్యగారు బయట కూర్చుని చల్లగా వీస్తోన్న గాలికి భుక్తాయాసం తీర్చుకుంటున్నారు.
    జానికమ్మగారు భోజనానికి కూర్చుంది. ప్రక్కనే పీట వేసుకుని కూర్చున్నాడు రాజు. అతనికి ఆమెతో అలా కూర్చుని కబుర్లు చెప్పందే తృప్తి వుండదు.
    ఒరేయ్ రాజూ ! నువ్వొచ్చినప్పుడల్లా నాకు బాబాయిని చూసినట్టే వుంటుంది రా!"అంది. అమె కంఠంలో తొణికిన లాడిన అప్యాయతకీ అనురాగానీకి అతని మనస్సు అర్దమైంది. అతని కళ్ళు చెమ్మగిల్లాయ్.
    "పిన్నిని ఓ సారి తీసుకురారా!"
    "అమ్మరాదు అక్కయ్యా!"
    "అవున్రా! ఆమెకి మొదటి నుంచీ మాపై కోపమే!"
    "పోన్లే అక్కయ్యా! నేనో విషయం అడగాలని వచ్చాను. నీ వెలా వున్నావు?" అన్నాడు సీరియస్ గా .
    ఏనాడూ  అతన్నలా చూడని జానికమ్మగారికి అతని ధోరణి విచిత్రం అనిపించింది. "ఏమిట్రా?" అంది అందోళనగా.
    "నేను సుజాతని పెళ్ళి చేసుకుంటే ఎలా వుంటుంది?" ఆమెనే గంభీరంగా చూస్తూ హఠాత్తుగా అడిగాడు.
    కొన్ని క్షణాల పాటు నివ్వెరపోయి చూస్తున్నట్టుగా వుండిపోయింది జానికమ్మగారు. కొద్ది పుట్టిందిరా? చాలా మంచి మాట అన్నావు. తప్పకుండా చేసుకో, ఇంత కమ్మని విషయం చెప్పినందుకు నీ నోరు తీపి చెయ్యాలి రా!" అంది. నవ్వుతో.
    "ఆవిడ ఏమంటుందో?" సందేహం వెలిబుచ్చాడు.
    "ఏమటుంది? ఎగరి గంతేసినట్టుగా ఒప్పుకుంటుంది! అని మెల్లిగా రహస్యం చెబుతున్నట్టుగా అంది " "ఒరే రాజూ! నువ్వునా సొంత తమ్ముడి లాంటి వాడివే! నీకో విషయం చెప్పాలి. ఆ సుజాత యింతకు ముందే బిడ్డ తల్లి అయింది. అదిగో అక్కడ పడుకున్న మల్లి ఆవిడ కూతురే!"
    నాగరాజు మాటాళ్ళేదు.
    "ఒరే రాజూ! ఈ విషయం చెప్పి నీ మనస్సు విరగోట్టాలని కాదు __మీ మగాళ్ళకు ఎప్పుడు అనుమానాలే! ఆ తర్వాత యీ విషయం తెలిస్తే నువ్వు ఆ అమ్మాయిని ఏం కష్టపెడతావోనని యిప్పుడే చెబుతున్నాను" అంది. ఆమె ముఖంలో సుజాతపై ప్రేమ కనిపిస్తోంది.
    "రాజూ సుజాత అని కాదు కానీ __ ఆ పిల్ల బంగారబ్బోమ్మరా! అంతేనా ఆ ఆమ్మాయి చాలా గుణవంతురాలు. వాడెవరో త్రాష్టుడురా ! నమ్మించి మోసం చేసి వుంటాడు. కడుపయ్యాక చెప్పకుండా పారిపోయి వుంటాడు. పురాణాల కాలం నుంచీ మా అడవాళ్ళ గతి యింతేరా బాబూ! మేం మాతృత్వానికి యిచ్చిన విలువ మగవాళ్ళకి యివ్వం __ ఏం జీవితాలు రాయిని! ఎన్నేళ్ళు బ్రతకితేనేం! ఏళ్ళు ముఖ్యం కాదురా! బ్రతుకు ముఖ్యం!"
    "అవునక్కయ్యా!" ముక్తసరిగా అన్నాడు రాజు.
    "ఇప్పుడు నువ్వే చెప్పు, ఆ అమ్మాయి ఏంచేయాలి? వాడు వెధవై వెళ్ళిపొతే, బుద్ధిలేని దానిలాగా కడుపు తీయించుకుని బుద్ధిమ౦తురాలి ఫోజు వెయ్యాలా? లేకపోతె బిడ్డ పుట్టేక గొంతు నులిమేయ్యాలా? లేకపోతే ఆ పసిగుడ్డుని రోడ్డుపలు చేయాలా? లేదా అనాధ ఆశ్రమంలో విడవాలా? చెప్పరా?"
    నాగరాజు మౌనంగా వింటున్నాడు. అతని మనస్సులో ఆలోచనలు సుళ్ళు తిరుగుతున్నాయి. జానికమ్మగారు తన మనస్సుని బయట పెడుతోందో, లోకరీతిని దుయ్యబడుతొందో అతనికి తెలియటంలేదు.
    "ఇపుఉడు ఆ పిల్లకి పెళ్ళి కావాలి? ఆ పసిగుడ్డుకి తండ్రి కావాలి! ఎవరు చేసుకుంటార్రా ముందుకొచ్చి? ఎవరు ఆ తండ్రి స్థానాన్ని స్వీకరిస్తార్రా? గత చరిత్ర తెలిస్తే వరుడనేవాడు యీ ఛాయల్లో నిలబదతాడా? మీ మగాళ్ళంతా వేదిక లెక్కి ఉపన్యాసాలు యిస్తారే తప్ప ఆచరణలో శూన్యంరా! రాజూ! ఆ మంచి రోజులు యిప్పుడే రావేమో! ఇంకా కొన్నేళ్ళు పోవాలి రా! అంతటి మహానుభావుడు పుట్టి రావటానికి ఇప్పుడు నువ్వు ఆ పిల్లని పెళ్ళి చేసుకుంతానంటే నా కెంతో గర్వంగా, ఆనందంగా వుందో తెలుసా?
    తమ్ముడి కేసి గర్వంగా చూస్తో అంది.
    "నేనూ నీలాగే అలోచించా నక్కయ్యా! సుజాత నిర్దోషి . అందుకే ఆ నిర్ణయానికి వచ్చాను!" ఆమె వైపు ఆరాధనగా చూస్తూ అన్నాడు.
    "అందుకే నువ్వంటే నాకంత యిష్టం రాజూ!"
    "అక్కయ్యా! సుజాతతో ఆ విషయం నువ్వే కదల్చాలి! ఈ భారం నీ మీదే పెట్టెస్తున్నాను!"
    "అలాగే రాజూ! ఇంకొన్నాళ్ళు అగు. ఆ అమ్మాయి యీ మధ్య ఉత్సాహంగా లేదెందుకో __ నేనే సమయం చూసి చెబుతాను. నీ కెందుకు నేను ఓ,కే, చేస్తాను"
    "నీ యిష్టమన్నానా! అంతా నీదే భారం!"
    ఆ మాటలకి ఆమె ముఖం విప్పారింది. "ఒరే రాజూ! ఈ సమయంలో నీకో మాట చెప్పాలని వుందిరా!" కవితని నేను కళ్యాణ్ కిచ్చి చేయాలనుకున్నాను. వాడు దేశాలు పట్టి పోయాడు. కవిత గతి అలా అయిపోయింది" కవిత విషయం మనస్సులోకి రాగానే ఆమె మనస్సు అదోలా అయిపోయింది. గొంతు భారమైంది. " అందుకే సవితనయినా నీకిచ్చి చేయాలనీ వుండేది. కానీ సమయం రాక అడగలేదు. ఇప్పుడు నీ సంబంధం తప్పిపోయిందని దిగుల్లెదురా రాజూ! ఎందుకంటే నువ్వు మంచి నిర్ణయం తీసుకున్నావు. నాకు సుజాత సవితకంటె ఎక్కువురా బాబూ!" అంది అర్ధంగా.
    ఆ మాటలకి రాజు నవ్వేశాడు.
    "ఇక వేళతానక్కయ్యా! అంతా నీ యిష్టం!" అంటూ వెళ్ళిపోయాడు.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra