"కాదని ఎవరన్నారు? కానీ పోటీ నర్సన్నకూ _ రమాకాంతానికీ కాదు. నర్సన్నకూ, చలమయ్యకూ అని గుర్తించుకోండి.రమాకాంతం ప్రజా ప్రతినిథికాదు. చలమయ్య ప్రతినిధి ......"
ఆనందమూర్తి ఉలిక్కిపడి __ "అయితే అతడికంటే నర్సన్నే నయం. కనీసం వీరన్నగారయినా అదుపు చేస్తారు __" అన్నాడు.
"మీరు చాలా అమయాకుళ్ళాగున్నారు. నర్సన్నతండ్రి మాటవినే రకం కాదు. ఉత్త పొగరుబోతు నాకు తెలియకడుగుతాను మూర్తిగారూ _ ఈ ఊళ్ళో వీళ్ళిద్దరూ కాక, మరి అర్హతలుగల మనుషులే లేరంటారా!"
ఆనందమూర్తి అనుమానంగా సుబ్బారావు ముఖంలోకి చూసి _ మీ అబ్బాయే మో బాగా కుర్రాడు . మీరు గానీ ఎన్నికల్లో నిలబడాలనుకోవడం లేదుగదా!" అన్నాడు.
సుబ్బారావు కంగారుగా _ "మా కెందుకండీ బాబూ _ ఆ పదవులు ? మాకు వీళ్ళూ , వాళ్ళూ ఒకటే అందరితో మంచిగా పోవడమే మాలాంటి వాళ్ళకు మంచిది....." అన్నాడు.
"కానీ మీ మాటలు విన్నప్పటినుంచీ నాకదో రకంగా వుంది. ఊరికి బాగు మాటటు౦చి _ ఇలాంటి వాళ్ళని ప్రెసిడెంటు గా చెప్పుకుంటూ మనం తలెత్తుకుని ఎలా తిరగ్గలం మనందరికీ ఇది అవమానం. దీనికి ఏదో చేయాలి!" అన్నాడతడు కాస్త ఆవేశంగా.
"మనకెందుకండీ ఈ గొడవలు _ వీరన్నగారి సంగతే తీసుకొండి. అయన ప్రెసిడెంటుగిరీలో ఊరికి జరిగిన ప్రత్యెక సదుపాయా లేమున్నాయి చేప్పండి? అయన నోటి మంచితనం మీద ఏమీ చేయకుండానే నెగ్గుకుపోయాడు. వీళ్ళకు అది కూడా లేదు. లేకపోతె మాత్రం మనకేం __ ఊరుకున్నంత ఉత్తమం లేదు, బోడిగుండంత సుఖంలేదు. .... అన్నట్లు విషయాల్లో జోక్యం చేసుకున్నట్లవుతుంది...." అంటూ నాన్చేశాడు సుబ్బారావు.
కానీ ఆనందమూర్తిలో ఆవేశం చల్లారలేదు. అతడదే వేడిలో అక్కణ్నుంచి బయటకు వచ్చి, తన స్నేహితులోకరిద్దరిలో మాట్లాడేడు. వాళ్ళూ అతడి భావాలు పంచుకున్నాక ఆ సాయంత్రంమే ఊళ్ళో ఒక సభ ఏర్పాటుయింది.
"అసలు మన గ్రామానికి పంచాయితీ బొర్డెందుకు, దానికో ప్రెసిడెంటు౦ దుకంటూ మీరేవరయినా ఆలోచించేరా? గ్రామాల్లో స్వయంపాలనా అనే ఉద్దేశ్యంతో యీ పద్దతి పెట్టారు. కానీ స్వయంపాలన మన గ్రామాని కేవిధంగా ఉపయోగపడింది? మీరంతా ఈ విషయం తీవ్రంగా ఆలోచించాలి . ఇక ఈ పద్దతి కొనసాగరాదు. మనం గ్రామం పలుకుబడి వాడ వాడలా అభివృధ్ధి చేసేవాడావాలి. వీరన్న గారు యోగ్యుడే అయినా _ అయన ఊరికి చేసిన ఉపకార మేదీ లేదు. ఆయన్నే అలాగున్నప్పుడు _ వారి అబ్బాయి గురించి వేరే చెప్పాల్సిందేమీ లేదు. ఇక రమాకాంతం సంగతి తీసుకుంటే _ అతడు చలమయ్య చేతిలో కీలుబొమ్మ. చలమయ్య గురించి మీకు నేను వేరే చెప్పానవసరంలేదు. ఈ యిద్దరలో ఎవరు ప్రెసిడెంటయినా ఒక్కటే మనకి! కానీ అటువంటి వాళ్ళను ప్రెసిడెంటుగా ఎన్నుకుని, చుట్టుపక్కల మనం తలెత్తుకు రిరగ్గాలమా! మన ప్రెసిడెంటు సచ్చీలతకూ, త్యగానికీ మారుపేరుగా ఉండాలి. స్వార్ధానికి దూరంగా ఉండాలి. అటువంటి మరొక వ్యక్తిని మీరందరూ కలసి ఏకగ్రీవంగా ఎన్నిక చేయాలి. అందుకే ఈ సభ ఏర్పాటు చేశాం _" అంటూ ఆనందమూర్తి ఆవేశంగా ఉపన్యసించాడు.
అనందమూర్తికి ప్రజల్లో మంచి పలుకుబడి ఉంది. ఆ సభలో అందరూ ఏకగ్రీవంగా అతడి వేరే అమోదించారు. అనందమూర్తీ అందుకు సిద్దపడే ఉన్నాడు. అతడు నామమాత్రంగా తన అభ్యంతరాన్ని తెలియబరచి _ తర్వాతత సంతోషంగా ఆ బాధ్యతను స్వాకరించాడు
ఎన్నికల సంరంభంలో మూడో అభ్యర్ధి ప్రవేశం కొందరిలో కుతూహలాన్ని రేకెత్తిస్తే, అందరిలోనూ సంచలనాన్ని కలిగించింది. దిగినవాడు సామాన్యుడు కాదు, అనండమూర్తి! గ్రామంలో చాలామంది చేత మనస్పూర్తిగా ప్రేమించబడే ఆనందమూర్తి!
ఈ విశేషానికి రమాకాంతం ఆశ్చర్యపోయాడు. అతడికి ఆనందమూర్తిపై సదభిప్రాయమే ఉంటుందని అతడేన్నడూ ఊహించలేదు. .
చలమయ్య హుంకరించాడు _ "నాగురించి అవాకులూ చవాకులూ పెల్తాట్ట. ఇలాంటవకాశం కోసమే ఇన్నాళ్ళుగా ఎదురుచూస్తున్నాను. వీడికి మంచి గుణపాఠం చెప్పాలి __" అనుకున్నాడతడు మనసులో. అయితే ఆనందమూర్తి పలుకుబడి కతడూ భయపడుతున్నాడు.
నర్సన్నకీ విషయం సంతోషాన్నే కలిగించింది. జిలాయిగా తిరిగే అతడిలో ఈమధ్య కొద్దిగా మార్పు వచ్చింది. తన ప్రవర్తనను _ ఒక ఊరి ప్రెసిడెంటుకు తగ్గ విధంగా మలచుకుంటున్నాడతడు. అయితే ఊళ్ళో చెప్పుకునేదాన్ని బట్టి, రమాకాంతంనికే నెగ్గే అవకాశలెక్కువని అతడికే అనిపించింది.
తను ప్రెసిడెంటు కావాలన్న బాధ నర్సన్నకు లేదు. తండ్రి పట్టుదల కొద్దీ ఎన్నికల్లో నిలబడడామనుకున్నాడు.
ఎప్పుడయితే రమాకాంతం తనకు ప్రత్యర్ధి అయ్యాడో _ అప్పుడే రమాకాంతా న్నోడించాలన్న కోరిక కలిగి౦ది. క్రమంగా ఆ కోరిక పంతంగా మారింది. కానీ రోజులు గడిచే కొద్దీ _ అదృష్టం రమాకాంతాన్నే వరించే అవకాశలేక్కువౌతున్నాయి. అలాంటి పరిస్థితులల్లో ఆనందమూర్తి రంగప్రవేశం నర్సన్నకు చాలా సంతోషం కలిగించింది. అతడు తండ్రితో _ "మనమేలాగో అలా అనందమూర్తిని వశపరచుకుంటే బాగుంటుంది _ " అన్నాడు.
వ్యవహారాల్లో కొడుకీమాత్రపు ప్రజ్ఞ చూపిస్తాడని వీరన్న అనుకోలేదు. అయన ఎంతో సంతోషించి, వెంటనే అనందమూర్తికి కబురంపించి _ "మావాడు నీ ఆశయాల కనుగుణంగా నడుచుకుంటాడు. నువ్వెలా చెబితే అలా వింటాడు. మనమంతా కలసి వాడినే ప్రెసిడెంటు చేస్తే బాగుంటుంది_" అన్నాడు.
ఆనందమూర్తి వెంటనే దేనికీ ఒప్పుకోలేదు. చాలా సేపు మాటలయ్యాక, అతడో మధ్యమార్గం సూచించాడు.
"నాకు ప్రెసిడెంటు కావాలన్న మోజులేదు. అయినా మనం చేతులు కలపాలంటే, ముందు నేనే ప్రెసిడెంటు కాక తప్పదు. మీ అబ్బాయిని వైస్ ప్రెసిడెంటు చేద్దాం మీవాడి పద్దతి నాకెప్పుడు తృప్తిగా ఉంటే అప్పుడు నేను తప్పుకుని అతడికే ప్రెసిడెంటు పదవిస్తాను....."
ఇలా అనడానికి ఆనందమూర్తి మనసును బాగా చిక్క బట్టుకోవలసి వచ్చింది . నిజానికతడి కది ఇష్టంలేదు. కానీ చలమయ్యవంటి వాణ్ని ఊళ్ళో తలెత్తకుండా చెయ్యడానికి తనకూ వీరన్న సాయం కావాలి. రమాకాంతం ప్రెసిడెంటువడం కంటె, నర్సన్న పంచాయితీ బోర్డు మెంబరవడం కొంతనయం.
ఆనందమూర్తి కంటె మరికాస్త దూరమాలోంచించే వీరన్న ఈ అంగీకారానికి వచ్చాడు. నర్సన్న కంటె రమాకాంతానికి ఊళ్ళో బలం కనిపిస్తోంది. ముందు రమాకాంతాన్ని పడగొడితే _ ఆ తర్వాత ఆనందమూర్తి వంటి అసలు సిసలు ప్రజానాయుకున్ని పడగొట్ట మేమ౦త పెద్ద కష్టం కాదు.