Previous Page Next Page 
మా ఊళ్ళోమహానుభావుడు పేజి 26

 

    అలా నారాయుడ్ని మందలించడంలో చలమయ్యను గాయపరచాలన్న ఉద్దేశ్యం అనందమూర్తికి సుతరామూ లేదు. నారాయుడికి సాయపడాలన్నదే అతడి భావం. అయితే అతడి మాటల్లో చలమయ్యపట్ల వ్యంగ్యం లేదని ఎవ్వరూ అనలేరు. ఉద్దేస్యపూర్వకంగా అన్నా, అనకపోయినా ఆనందమూర్తి మాటలకు _ చలమయ్య గాయపడ్డాడు.

    అను గాయపడ్డవిషయం చలమయ్యకు వెంటనే తెలియలేదు. ఎందుకంటే ఆనందమూర్తి మాటలు వినీ వినగానే అతడు నిశ్చేష్టుడై పోయాడు.

    నారాయుడి ముందు తన గొప్పతనాన్ని ప్రదర్శించి .అతడిని భయపెట్టాలని చలమయ్య అనుకున్నాడు. ఆ ప్రాయత్నం బెడిసికొత్తగా, తనను తానె కించపరచుకోవడం జరిగింది. అనందమూర్తికి మరికాస్త ఎదిగాడు.

    జీవితంలో మొదటిసారిగా చలమయ్య అభిమానపడ్డాడు. బహుశా తడిలోని మానవత్వం అనుకున్నాడు. ఆ ప్రయత్నం బెడిసికొట్టినట్టుగా, తన్ను తానె కించపరచుకోవడం జరిగింది. ఆనందమూర్తి మరికాస్త ఎదిగాడు.

    జీవితంలో మొదటిసారిగా చలమయ్య అభిమాన పడ్డాడు. బహుశా అతడిలోని మానవత్వం కూడా ఓసారి ఒళ్ళు విరుచుకోవడం అప్పుడే జరుగుటుంది. తను బాకీ కోసం నొక్కిస్తూ౦టే అవతలి వ్యక్తి తర్వాత నాకివ్వొచ్చు _ ముందు చలమయ్య బాకీ తీర్చు _ అంటున్నాడు. ఆనందమూర్తి అన్నట్లు _ నిజంగా తన నారాయునుడు బాకీ తీరిస్తేతప్ప గతిలేని పరిస్థితిలో ఉన్నాడా?

    " నీ వరస నాకు నచ్చక అడిగాను కానీ __ నాకేం ఇప్పుడంత గతిలేక కాదు. నెమ్మది మీద తర్వాత తీరుద్దువులే గానీ __ ఇంకెప్పుడూ ఇలా ప్రవర్తించకు ....." అనేసి, అక్కణ్నుంచి చకచకా వెళ్ళిపోయాడు చలమయ్య.

    సాధారణంగా చేతికొచ్చే డబ్బును వదులుకోలేడుచలమయ్య . కానీ ఇప్పటి పరిస్థితి వేరు. ఇప్పుడా డబ్బు తీసుకుంటే తను అన్మ్దమూర్తి కంటే గతిలేని వాడినని ఒప్పుకున్నట్లవుతుంది. అదీకాక ఆనందమూర్తినలుగురి దృష్టిలో మరింత గొప్పవాడయిపోతాడు. తను మరీ చులకనయిపోతాడు.

    ఇలాంటి సంఘటనలే మరికొన్ని జరగడంతో, చలమయ్యకు ఆనందమూర్తి మీద ద్వేషం కలగాసాగింది.

    వేచి ఉండాలి కానీ, అవకాశమన్నది ప్రతి ఒక్కడికీ వస్తుంది. అలాగే చలంయ్యకూ అవకాశం వచ్చింది __ పంచాయితీ ఎన్నికల రూపంలో!

    ఆ ఊళ్ళో పంచాయితీ  బోర్డు ఎన్నికలకు అంతవరకూ పోటీ అన్నదే లేదు. వీరన్న అనేక దఫాలుగా ప్రెసిడెంటుగా ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డాడు. అందుకాయన కున్న అంగబలం, అర్ధబలం కారణమని చాలామంది అనుకున్నా అప్పటి వరకూ పదవీ వ్యామోహం ఊరి పెద్దల్లోవ్యాపించక పోవడం ముఖ్య కారణం చాలామందికి తెలియదు. పదవిలోని ప్రయోజనం ప్రజాసేవకు మించినదని జనాలకింకా తెలియని రోజులవి.

    అప్పుడు వీరన్న అరవయ్యో పడిలో పడుతున్నాడు. మళ్ళీ ఎన్నికలోస్తున్నాయనే సరికి వీరన్నకు తన వయసు గుర్తొచ్చింది. తను బ్రతికున్నంతకాలం _ ఈ పదవి తనదే. కానీ తన అనంతరం .....

    ఇలా ఆలోచించిన వీరన్నకు ప్రెసిడెంటుగిరీ తన వంశానికే పరిమితమయుంటే చాలా బాగుంటు౦డనిపించింది.దఫా దఫాలుగా తానీ పదవి కేన్నుకోబడ్డాడు. తన ఇంటిని ప్రెసిడెంటుగా రోల్లంటున్నారు. పొలాల్ని ప్రెసిడెంటుగారి పోలాలంటున్నారు. తన కొడుకుని ప్రెసిడెంటు గారబ్బాయంటున్నారు __   ఇలా ప్రెసిడెంటు పదంతో తన జీవితమంతా ముడిపడింది. తన తర్వాత మరొకడేవరో ప్రెసిడెంటుటయితే _ తనిల్లు పాతప్రెసిడెంటుగారిల్లయి పోతుంది. అలాగే అన్నీను. క్రమంగా తనూ, తన వంశమూ పాతబడి పోతాయి.  ప్రెసిడెంటు పదం నుంచి తన వంశం విడిపోతుంది. అ విరహం భరించలేనిది!

    అందుకని బాగా ఆలోచించి, ఓసారి నలుగురి పెద్దల్నీ పిలిచి లోపాయి కారీగా అన్నట్టు _ " నేను వృద్ధుడినయిపోతూన్నాను. మా అబ్బాయి నర్సన్నని ప్రెసిడెంటు చేస్తే, వెనక నుంచి కధ నడిపించగలను తప్పితే నావల్ల ఇక లాభంలేదని పిస్తోంది __ " అన్నాడు.    

    ఈ మాటలు వీరన్ననుకున్న ఫలితం సాధించలేదు" ఊళ్ళో ఇదో పెద్ద సంచలనం కలిగించింది.

    వీరన్న చెప్పుకోతగ్గ పెద్దమనిషి. ఆయనకు మంచి, మర్యాద తెలుసు. మంచి వ్యవహార జ్ఞానముంది ఊళ్ళో అందరినీ ఏరా అని పిలవగలవాడు. వేలెత్తిచూపించే దురాలవాట్లేవీ ఆయనలో లేవు ప్రెసిడెంటంటే ఆయనే అని అందరి అభిప్రాయం  ఆయనుండగా మరో ప్రెసిడెంటు గురించిన ఆలోచనే లేదా గ్రామ ప్రజలకు.

    అయితే నర్సన్న గుణాలు ఇంచుమించు పూర్తిగా తండ్రికి వ్యతిరేకం. అతడు పొగరుబోతుగా ఊళ్ళో పేరు పొందాడు. అతడంటే ఊరివారందరికీ అసహ్యమని చెప్పలేంగానీ __ ప్రెసిడెంటు పదవికి అతడు తగడని గ్రామమంతా అంగీకరిస్తుంది. అందువల్లనే _ "పేరుకి వాడు ప్రెసిడెంటు గానీ, వ్యవహారాలన్నీ నేనే చూస్తా" నని వీరన్న హామీ యిచ్చినా, ఎవరికీ మనసంగీకరించలేదు.

    అదే సమయంలో చలమయ్య రంగంలోకి దిగాడు. అతడికి పదవీ వ్యామోహ౦లేదు కానీ, పదవిలో ఉన్నవాళ్ళ అండ కావాలి. అందుకని అతడు బాగా ఆలోచించి , రమా కాంతాన్ని ఎన్నికలలో దిగమని గట్టి పట్టు బట్టాడు.

    రామకాంతం దగ్గర లక్షలూ, కోట్లా మూల్లకపోయినా, ఉన్నవాడక్రిందే జమ. అస్తిలాగే అన్ని విషయాల్లోనూ సమపాళ్ళుగా ఉంటాడు. అతడికి ముందుచూపుతో పాటు వెనుకచూపూ , ఆవేశంతోపాటు ఆలోచనా ఉన్నాయి. నిజని కవన్నీ అసలు సిసలు రాజకీయ నాయుకుడి లక్షణాలు.

    తనలో నాయక లక్షణాలున్నాయని రమాకాంతం గుర్తించాడు కానీ, తొందర పడలేదు. నాయుకడంటే ప్రజాసేవకుడే అయినప్పటికీ, ప్రజాసేవ చేసే అవకాశం అందరికీ రాదు. దానికి కొంత సొమ్ము ఖర్చుపెట్టాలి. కొన్ని కోట్లాటలు జరగాలి. అనంతరం అదృష్టం కూడా ఉంటే ప్రజాసేవ చేసే అవకాశం కలుగుతుంది. సొమ్ము ఖర్చుపెట్టడం, కోట్లాటలు జరగడం వంటి వ్యవహారాల్లో తోడు లేకుండా దిగకూడదు. అలాంటి వ్యక్తికోసం అతడు చూస్తుండగా వేటకబోయిన తీగలా చలమయ్య కాళ్ళకు తగిలాడు.

    నర్సన్నకూ, రమాకాంతానికీ పోటీ జరగబోతుందన్న విషయం ఇంకా నామినేషన్లు దాఖలు చేయవలసిన తేదీ రాకుండానే నిర్ణయమయిపోయింది ఈసారి ఎన్నికలు ఊళ్ళో మంచి కుతూహలాన్ని కలిగించాయి.

    "ప్రెసిడెంటు పదవికి ఎన్నికలు ఆరంభమయిపోయాయంటే _ మన గ్రామం కూడా అభివృద్ధి చెందుతోందన్న మాట. ఇంకెవరూ ఈ అభివృద్ధిని ఆపలేరు __" అన్నాడు ఆనందమూర్తి ఓ రోజున గ్రామ కరణం సుబ్బారావుతో మాట్లాడుతూ.

    సుబ్బారావదోలా నవ్వి _ "కనిపించిన లేడిని ఎవరు తినాలా అని రెండు పెద్దపులులు జరుపుతున్న పోరాటమిది. ఈ పోరాటంలో ఎవరు నెగ్గినా లేడికి చావు తప్పదు __" అన్నాడు.

    ఆనందమూర్తి సాలోచనగా _ "రమాకాంత౦ పెద్ద మనిషే కదండీ _" అన్నాడు.

 Previous Page Next Page