Previous Page Next Page 
మా ఊళ్ళోమహానుభావుడు పేజి 25

  

    ఆనందమూర్తి ఆ పేరువరు పెట్టారో, గానీ, నిజంగానే అనందం మూర్తీభావించినట్లుంటాడు. పెద్దలు సంపాదించిన ఆస్తి అందమయిన భార్య _ అందుకు కారణమని అంతా అనుకుంటారు.

    ఆనందమూర్తికి పుట్టుకతోనే కవిత్వం అబ్బింది. అందులో ఆశ్చర్యమేమీలేదు. తరతరాలుగా అతస్ది పూర్వీకులు కవిత్వం చెప్పేవారే అసలు _ ఆనందమూర్తి తాతగారి కవిత్వాన్ని మెచ్చుకుని ఓ రాజుగారిచ్చిన కానుకలతోనే _ గ్రామంలో భూములు కొన్నారని చాలామంది చెప్పుకుంటూ౦టారు.

    ఆనందమూర్తిని  కని, తల్లి కళ్ళు మూసింది. చనిపోయిన భార్యను తలచుకుంటూ, బ్రతుకున్న కొడుకుని చూసుకుంటూ _ మరో పెళ్ళి చేసుకోకుండా జీవితకాలాన్ని గడిపివేశా డతడి తండ్రి. కొడుక్కి వివాహామయ్యే రెండు సంవత్సరాలు మాత్రం బ్రతికాడాయన.

    అనందమూర్తికి చెప్పుకోదగ్గ కోరికల్లేవు. అతడు భార్యను మనసారా ప్రేమిస్తున్నాడు. ఆమె అతడి నా రాదిస్తోంది. తిండికి లోటు లేదు. ఇంక పిల్లలు కలగకపోయినా _ అతడి౦కా పాతికేళ్ళ వయసు ....

    తన జీవితం తను గడుపుతూ, ఒకళ్ళ జోలికి పోకుండా జీవితం గడుపుతూండి వుంటే చలమయ్య ఆనందమూర్తి గురించి పట్టించుకుని ఉండేవాడు కాదు. అయితే, కావాలని అనందమూర్తీ చలమయ్య వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేదు.

    మనుషుల మంచితనం మీదా, మానవత్వం మీదా నమ్మకమున్న వాళ్ళలో నమదమూర్తి ఒకడు. తనకు చేతనయినంతవరకూ ఎదుటి వాళ్ళకు సాయపడడంలోనే అతడి కానందముంది. అది వ్యాపారదృష్టి లేనిది!

    బొగ్గు పక్కన బూడిదే తెల్లగా ఉంటుంది. మరి పాల సంగతి వేరే చెప్పాలా? మ్రాను లేనిచోట మఱ్ఱిచెట్టు వెలిస్తే .....

    అదే ఆనందమూర్తి చలమయ్యకు చేసిన అపచారం......

    ఓపినంత వరకూ చాలామందికి ఊళ్ళో అప్పులిస్తూండే వాడానందమూర్తి. తిరిగివ్వడం విషయంలో నొక్కించేవాడు కాదు. వడ్డీ తీసుకునేవాడు కాదు.  ఊళ్ళో మంచిపని చేయాలని ఎవరు ముందుకొచ్చినా, మాట సాయంతోపాటు, ధనసాయం కూడా చేస్తూండే వాడతడు. ఊళ్ళో రెండు బావుల త్రవ్వకానికీ , పంచాయితీ బోర్డు గ్రంధాలయం ప్రారంభంకావడానికీ అతడు చెప్పుకోదగ్గవిరాళాలే ఇచ్చాడు ఇవన్నీ అతడికి మంచివాడన్న పేరు తెచ్చిపేట్టి ఊరుకుంటే సరిపోయేది. ఒల్లో చాలామంది _- " ఆనందమూర్తి బాబు మంచివాడు. చలయ్యలా కాదు ....." అనుకుంటూడేవారు.

    చలమయ్యకిది చాలా బాధగా ఉండేది. తను చెడ్డవాడి నని అతడేన్నడూ అనుకోలేదు. గట్టివాడినని అనుకునేవాడు. ఊళ్ళో జనం తన గురించి  చెడ్డగా చెప్పుకుంటున్నారంటే అది తన తప్పని అతడనుకోలేదు పైగా ఆ తప్పు ఆనందమూర్తిదని అతడాభిప్రాయపడ్డాడు. అవును మరి _ రాజును చూసిన ముఖంతో మొగుణ్ని చూస్తె మొట్టబుద్దేస్తుందని, మొగుడు రాజు కాలేదుగదా! అటువంటప్పుడు రాజదర్శనానికి ఆటంకం కలిగించాలి.

    చలమయ్య చాలాసార్లు ఆనందమూర్తితో __ "మీకు తెలియదు మూర్తిగారూ _ ఈ రోజుల్లో మనుషుల్ని నమ్మకూడదు . మీ మంచితనం మిమ్మల్ని ముంచేస్తుంది._" అంటూండేవాడు.

    పుట్టుకతోనే చలమయ్య చెడ్డవాడు . ఆనందమూర్తి మంచివాడు మంచిపనులు చేయాలని నడుం కట్టుకాకపోయినా తనకు చేతనయినంతలో మంచికి సాయబడుతున్నాడతడు. అందువల్ల అతడు చలమయ్య మాటల్ని పట్టించుకునే వాడు కాదు. పైగా __ మనుషుల్ని నమ్ముద్దంటున్నారు. మిమ్ము ల్నేలా నమ్మేది?' అని చలమయ్య కు పళ్ళునుడేలా చమత్మరించేవాడు.

    అలా౦టప్పుడోసారి చలమయ్య ఎలాగో తమాయించుకుని __ "ఎవరిని నామంకూడదో మీకు తెలియదు గనుకనే జాగ్రత్తగా ఉండమంటున్నాను. ఆ సుబ్బుయ్యకి రెండు వందలప్పిచ్చేరు గదా __ మళ్ళీ వస్తాయని ఆశ వుందా _ ఇలా పదిమంది గతిలేని వాళ్ళకప్పులిస్తే _ రేపొద్దున్న మీ గతిమేటి ?" అన్నాడు.

    " నా గతి చూసుకునే ఇస్తున్నానండీబాబూ _ ఆ రేండో౦ దలే కాదు _ అలాగే మరో పదిమంది కప్పిలిచ్చినా నాకేమీ లోటులేదు. పుచ్చుకున్నవాళ్ళుతిరిగిచ్చినప్పుడే ఆ డబ్బు ఇంకోకళ్ళ కప్పుగా ఇస్తాను. అయినా నాకు అర్ధం కాదు __ మీ కెందుకండీ ఈ బాధ ?' అన్నాడు ఆనందమూర్తి.

    చలమయ్య బదః అర్ధంచేసుకోగలిగితే అటు అనండమూర్తికీ , ఇటు చంయ్యకా బాధ తప్పేది. ఆ బాధ చలమయ్యచెప్పుకోలేనిది. ఆనందమూర్తి కర్ధంకానిది.

     ఆ తర్వాత కూడా ఆనందమూర్తి అప్పులిస్తూనూ ఉన్నాడు, చలమయ్య బదఃపడుతూనూ ఉన్నాడు.

    పట్టుదలని విక్రమార్కుడిలా ఆనందమూర్తి అతడి ప్రశ్నకు బదిలువ్వడమే తప్ప, హెచ్చరికను లక్ష్యపెట్టె వాడు కాదు. ఆ విధంగా చలమయ్య తరచూ ఆనందమూర్తి ఇంటికెళ్ళే సరికి _ నారాయుడనే రైతు అనందమూర్తికి ఏడువందల రూపాయలు బాకీ తీరుస్తూ కనబడ్డాడు చలమయ్యకు .

    చలమయ్యను చూస్తూనే నారాయుడు కంగారుపడ్డాడు.

    "ఏమవయ్యా నారాయుడూ _ మొన్నమటుక్కు మొన్న బాకీ గురించడిగితే _ డబ్బు కిబ్బందిగాఉంది __ తర్వాతిస్తాసన్నావు _ ఇప్పుడెక్కడిదయ్యా ఈ డబ్బు ?" అన్నాడు చలమయ్య.

    నారాయుడు చటుక్కున _ నేనాలాస్యం చేస్తే మీకే లాభం వడ్డీ పెరుగుతుంది. అందువల్ల నేను మీకేమీ అన్యాయం చేయడంలేదు. ఈ బాబు డబ్బు ముందిచ్చేస్తే _ మళ్ళీ నాలాంటిటోడి కేవరికయినా అవసరమయితే వడ్డీ లేకుండా యిస్తాడు......." అన్నాడు.

    చలమయ్య మ్రాన్పడిపోయాడు. తనదగ్గర అప్పుచేసిన నారాయుడు ధైర్యంగా తనకు సమాధానం చెప్పడమా? ఈ ధైర్యం  వీడికెక్కడిది? ఆనందమూర్తి అండ చూసుకునే కదా! తెల్చేయాలి . వీడి సంగతేదో ఇప్పుడే తెల్చేయాలి. తను తల్చుకుంటే.....

    "వడ్డీ పెరుగుతోంది కదా అని ఎన్నాళ్ళూరుకుంటూ మేమిటండీ  __ మీరే చెప్పండి మూర్తిగారూ! రేపొద్దున్నకి నాకివ్వాల్సిన వెయ్యి రూపాయలూవడ్డితోసహా కక్కుతాడో లేదో అడగండి. లేకపోతె  నా సంగతి తెలుసుగా! ఇంతకాలం నిజంగా డబ్బులేక ఇవ్వడం లేదనుకుంది . నిజం ఈవేళ తెలిసింది. ఇతగాడికి నా బాకీ తీర్చే ఉద్దేశ్యం లేదు...." అవేశంతో హు౦కరించాడు చలమయ్య.

    "రేపటిదాకా ఎందుకండీ __ మీకంతివ్వాలో ఇప్పుడే చెప్పండి. అణా పైసలతో సహా తీర్చేస్తాడు....." అని _ "ఏవయ్యా నారాయుడూ _ అవతల వడ్డీప్పుతెచ్చి _ ముందు న అబాకీ తీరుస్తానంటావు ఏం తెలివయ్యా నీది! నాకు తొందరమొచ్చింది? నీకు వీలున్నప్పుడే యిద్దువుగాని. నేనేం అంత నీ బాకీ తీరుస్తేగానీ గతిలేకుండా వున్నాననుకున్నావా?'" అన్నాడు ఆనందమూర్తి నారాయుడిని మందలిస్తూ.

 Previous Page Next Page