Previous Page Next Page 
మా ఊళ్ళోమహానుభావుడు పేజి 23

 

      మీ నలుగురేనా ఈ ట్రూవు _ ఇంకా ఉన్నారా?" అన్నాడు రాజారావు.

    "మేం నలుగురం పెర్మనెంటు ఆర్టిస్టులం. డిమాండుని బట్టీ, అవసరాన్నిబట్టీ తాత్కాలికంగా కొంతమందిని హైర్ చేస్తూంటాం......" అన్నాడు లీలాసుందరి సోదరుడు.

    "ఇంతవరకూ ఏయే గ్రామాల్లో ప్రదర్శన లిచ్చేరు?"

    "గుంటూరు జిల్లాలోనూ, కృష్ణాజిల్లాలోనూ కొన్ని ప్రదర్శలిచ్చెం. అనుకొని లాభాలే వచహయి. ఇటువైపు మీ ఊరే మొదలు  .,"

    "ఎక్కడు౦దామనుకుంటున్నారు?" అన్నాడు రాజారావు.

    వాళ్ళు సమాధానమిచ్చేలోగా __ "ఇక్కడ మా యిల్లు పెద్దదే _ అవసరమయితే మీ గురించి ఓ గది ఖాళీచేయగలం __" అంది వసంత.

    లీలాసుందరి మనోహరంగా నవ్వింది __ "మాకు తెలిసిన ఒకతడు ఈ ఊళ్ళోనే ఉన్నాడులెండి. అతడాప్పుడే మా బసకన్ని ఏర్పాట్లూ చేసేశాడు ...."

    "ఎవరండీ అతడు ?"

    "అతడిపేరు శంకర్. మేమంతా శంకూ అంటూంటా౦. అతగాడు ప్రెసిడెంటుగారికి దూరపు బందువట. వారింట్లోనే అతడు నాకు ఏర్పాటు చేసేశాడు. భోజనాకిబ్బంది. లేదు. మా కారొక ముబైల్ కిచెన్ అనుకోండి గ్యాసూ, కొన్ని అవసరమయిన పాత్ర సామగ్రి ఉన్నాయి వాటితో మానేజ్ చేసేస్తాం......" అంది లీలాసుందరి.

    నడివయస్కరాలయిన స్త్రీతన చేతిలోని బ్యాగుజిఫ్ తీసి, అందులోంచి ఓ కాగితం తీసి రాజారావు కందించింది. ఆ కాగితం మీద గ్రామస్తుల పేర్లున్నాయి. ఆ పేర్ల పక్కన వాళ్ళు వాగ్ధానం చేసిన డబ్బు మొత్తం అంకెలువేసి ఉన్నాయి.


    రాజారావు ఆ కాగితంలో  తన పేరూ రాసి, నూట పదహార్లు వేశాడు. కాగితం వసంతకు చూపించి , తిరిగివచ్చేశాడు నడివయస్కురాలు ఆమె కళ్ళు సంతృప్తితో మెరిశాయి.

    "ఉంటామండి. మళ్ళీ కలుద్దాం....." అంది లీలా సుందరి.

    "ఇంతకీ మీ కార్యక్రమం ఎప్పుడు మొదలవుతుంది.?" లీలాసుందరి పలువరస తళుక్కుమని మెరిసేలా నవ్వి __ " మా కార్యక్రమం ఈరోజే మొదలయింది. ప్రదర్శన మొదలుపెట్టడానికికింకా కొద్ది రోజులుంటుంది __" అంది.

    లీలాసుందరి బృదం వెళ్ళిపోయింది.

    "వసూ __ వీళ్ళు నాట్య ప్రదర్శనకీ గ్రామాన్నే ఎందుకెన్నుకున్నారు? ఇది చిత్రంగా అనిపించడం లేదూ?' అన్నాడు రాజారావు భార్యతో.

    "స్థిరపడటానికి మనమీ గ్రామనేన్నుకోవడం చాలా మందికి చిత్రంగా ఉంది.__" అంది వసంత నవ్వుతూ.

    "నేనీ గ్రామాన్నేన్నుకోవడానికి ప్రత్యేకమయిన కారణాలున్నాయి. అమెక్కూడా అలాంటి కారణాలే ఉన్నా యంటవా?"

    "అబ్బే __ నా ఉద్దేశ్యం అదికాదు _...." వసంత నసిగింది.

    "నాకీ అనుమాన మెందుకొచ్చిందంటే _ ఈ చుట్టుపక్కల ఇంతకంటే పెద్ద గ్రామాలే ఉన్నాయి. అక్కడ ఈమె ప్రదర్శనల కిక్కడకంటే ఎక్కువ లాభాలోచ్చి ఉండేవి అటువంటప్పుడుమే ఈ చిన్న గ్రామాన్నేన్నుకుందంటే ....."

    "నన్ను చెప్పమంటారా?' అంది వసంత నవ్వుతూ .

    "చెప్పు!" అన్నాడు రాజారావు కుతూహలంగా.

    'ఊళ్ళో చదువుకున్న వాళ్ళూ, పడుచువాళ్ళూ, రాసి కులూ చాలామంది ఉన్నారు. అమ్మాయి కేమీ అందం, వయసూ ఉన్నాయి. ఇంటికొచ్చి నాలుగు కబుర్లు చెబితే _ నూటపదహార్లు రావడాని కింతకంటే మంచి గ్రామముండదు __" ముసిముసిగా నవ్వుతూ అంది వసంత.

    "అడదాని వనిపించావు. సాటి ఆడదానిమీద నిందవేయడానికి సిగ్గు వేయలేడూ నీకు?" అన్నాడు రాజారావు.

    "మీరు మగవాణ్ణి నిపిమ్చుకున్నప్పుడల్లా నేనూ ఆడదాన్ననిపించుకుంటూ౦డాలిగా! నేను సాటి ఆడదానిమీద నిందవేశానా? మీ మగతనం నేనన్న మాటల్లో నిందను చూసిందేమో మరి ....." చిరుకోపంగా అంది వసంత.

    "సంతోషించా౦లే గానీ __ నేను చెప్పేది కాస్త విను రమాకాంతం బంధువు తనకు తెలుసునందామె ఎప్పుడు తెలుసు, ఎలా తెలుసు? ఆ శంఖర్ ఎవడూ అన్నది నాకు తట్టడంలేదు....." అన్నాడు రాజారావు.

    "బాగుంది __ రమాకాంతంగారి బంధువులందరూ మీకు తెలిసిన వాళ్ళే నేమిటి?' అంది వసంత.

    "కాదనుకో __ కానీ, అయన జాతకాన్ని మార్చబోతున్నప్పు డాయన కయిన వాళ్ళుందరి గురించీ తెలుసుకోవడం మంచిది కదా!" అన్నాడు రాజారావు.

                                                                     17

    "ఏమండీ __ రెండు నెల్లు గడిచినా, మీకింకా రాజరావుగారి గురించిన ఆధారాలు దొరకలేదా?" అన్నాడు రామాకంతం విసుగ్గా.

    "రాజారావు అసాధ్యుడు. ఆధారాలు సంపాదించడం నాకే కష్టంగా ఉంది. ముందే కొన్ని ఆధారాలుండి అయన్ననుసరిస్తూ వచహాడు కాబట్టి కానీ, అయన నక్సలైట్టేనా? అన్న అనుమానం నాకే కలుగుతోంది. _-" అన్నాడు రవి.

    అతగాడు విషయంలో మీది పొరపాటు అభిప్రాయమని నేనకుంటున్నాను. ఎందుకంటే, అతడు జీవితంలో అన్నివిధాలా తృప్తిపొందిన వాడిలా కనబడుతూన్నాడు. నక్సలైటు ట్లంటే ఉద్యోగాల్దోరకని కుర్రాళ్ళూ జీవితం మీద ఏదో కారణంగా అసంతృప్తి కలిగినవాళ్ళూనని విన్నాను. ఈ రాజారావుచూస్తె సుఖంగా సంసారం చేసుకుంటున్నాడు __"

    "అదే మీరు చేస్తున్నా పొరపాటు నక్సలైటు పతకాలు తమాషాగా ఉంటాయి. వేసిన పథకం వేయకుండా వేయడం వల్లనే వాళ్ళని మేం పట్టుకోలేకపోతున్నాం . ఆ రాజారావుగా రిక్కడికి నక్సలైటుగా వచ్చాడు. మంచిపనులు చేసి, ఊళ్ళో మంచివాడనిపించుకున్నాడు. ఊళ్ళోని సులువులూ, బరువులూ తెలుసుకుని తన ముఠాకి తెలియబరుస్తాడు. ఫలితంగా ఊళ్ళోని కొంతమంది పెద్దమనుషుల సొమ్ము కొల్లగొట్టబడుతుంది. ఆ పెద్దమనుషులు పారిపోలేకుమ్డా రాజారావు దిగ్భంధం ఛీస్తాడు. అంతా అయ్యాక రాజారావు ప్రజలతోపాటు మొసలి కన్నీళ్ళు కారుస్తాడు. అయన మొసలి కన్నీళ్ళకూరంతా మోసపోతుంది . ఆ తర్వాత ఆయనీ ఊర్నించి చేక్కేస్తాడు."

    రమాకాంతం ఒప్పిగ్గా ఈ వివరాలు విని __"మీ మాటలు నేను నమంలేను . కానీ మీ తంటాలేవో మీరు పడండి. ఎటొచ్చీ మీరు చెప్పిందంతా నిజమయితే, నాకో విషయం అనుమానంగా వుంది. రాజారావుమీద ఆధారాలే సంపాదించలేని మీరు __ అతడి బారినుంచి ఊరిని రక్షిమ్ప్చగలరా అని!" అన్నాడు.

    "అన్నీ మీరే చూస్తారుగా . కానీ ఈ నక్సలైటు విషయమేక్కడా పొక్కనీయకండి. రాజారావుకి తెలిస్తే పారిపోగలడు......"

    "అలాగే __" అన్నాడు రమాకాంతం . అప్పుడే ఎవరో తలుపు తట్టారు. రవి వెళ్ళి తలుపు తీశాడు.

    లీలాసుందరి లోపలకు వచ్చింది. ఆమె రమాకాంతం వంక చూసి __" మీతో ఓ అయిదు నిమిషాలు మాట్లాడాలి __" అంది.     

    అంతా కూర్చున్నారు.

    "ఇప్పుడే ఊరంతా చుట్టివస్తున్నాం. మీరిచ్చిన గది బాగుంది. మా వాళ్ళిప్పుదే వంటప్రత్నాయలు మొదలులేట్టారు. ఈ ఊళ్ళో రెస్పాన్సు బాగుంది. ఈ కాగితం చూడండి __" అంటూ ఆమె రమాకాంతానికో కాగితం అందించింది.

    రామాకంతం అందుకుని చూసి __" చాలా బాగుంది. ఇలాగయితే కలెక్షన్ వెయ్యికి దాటిపోఎలాగుంది....." అన్నాడు.

    "అంతకంటే ఎక్కువే వస్తుందని నా ఉద్దేశ్యం . ఇది కొందరు వాగ్ధానం చేసిన మొత్తం. ఆ తరవాత ప్రదర్శన జరిగేటప్పుడు కానుకలుంటాయని కొందరు యువకులున్నారు" అంది లీలాసుందరి.

 Previous Page Next Page