Previous Page Next Page 
మా ఊళ్ళోమహానుభావుడు పేజి 22

  

    రాజారావు తెల్లబోయాడు. నిన్నకాక మొన్న తానీ ఊళ్ళో అడుగుపెట్టాడు. అప్పుడే ఊరికి ప్రెసిడెంటా? అంటే తను సాధించాల్సింది సాధించడానికి ఏదో అజ్ఞాత శక్తి దోహదం చేస్తోందనడంలోసందేహంలేదు. ఆ అజ్ఞత శక్తి ఏమిటో అతడూహించగలడు. ఈ ఊళ్ళో అడుగుపెట్టడానికి ఏ అజ్ఞాతశక్తి దిహడం చేసిందో, అన్ని సదుపాయాలూ సమకూర్చిందో _ అదే శక్తి అన్నివేళలా తన్ను వెన్నంటి వుండి వెన్నుతడుతోంది.

    "చెప్పండి రాజరావుగారూ! మీరు ఊం అంటే , నేను మీ తరుపున కార్యరంగంలోకి దూకుతాను ....." అన్నాడు నర్సన్న.


    "మీరు చాలా దూరం వెడుతున్నారు. నా అర్హతలను నేను అంచనా వేసుకోగలను. మీరన్నదానికి నేను తగను."

    నర్సన్న తెచ్చిపెట్టుకున్న కోపంతో _ "ఏమన్నారూ __ మీరు తగరనా? ఈ మాట మీరు కాక ఇంకెవరన్నా, ఏంచేసి ఉండేవాడినో తెలియదు. ఈ ఊళ్ళో మీకంతెన్ చదువు, సంస్కారం ఉన్న ప్రజా శ్రేయోభిలాషి ఎవరండీ _- రాజరావుగారూ _ మీకిష్టం లేకపోతె యిష్టంలేదని చెప్పండి గానీ, మిమ్మల్ని మీరు కించ పరచుకుని నాకు కోపం తెప్పించావద్దు ....." అన్నాడు.

    "సరే _ మీక్కోపం తెప్పించను. నాకిష్టం లేదని ఒప్పుకుంటున్నాను సరా?' అన్నాడు రాజారావు.

    నరసన ముఖంలో నిస్పృహ కనబడింది. ఏమిటీ మనిషి? తన్ను పంచాయితీబోర్డు ప్రెసిడెంటుని చేస్తానంటూంటే  వద్దనే వాడ్ని _ ఎలా లొంగదీయడం ? ఊరు బాగుచేస్తానంటే లొంగలేదు, ప్రెసిడెంటుని చేస్తానంటే లొంగలేదు, డబ్బుకి లొంగుతాడా అంటే ఆ ఆశ మొదలే లేదు! మనిషి బాగా ఉన్న వాడిలా కనబడుతూన్నాడు. తను వెలితిబడ్డ౦ తప్ప, మరో ప్రయోజనముండదు. అయినా ప్రెసిడెంటు పదవి వద్దన్నవాడు డబ్బుకి లొంగుతాడా?

    మరిప్పుడు తనెం చేయాలి?

    ఈ మనిషిని లొంగదీయలేకపొతే _ రమాకాంతాన్నోడించడం సాధ్యపడదు. పోనీ ఇతడు చెప్పినట్లే స్వంత డబ్బుతో ఊళ్ళో ఏ పైపులయినా వేయించి చూద్దామన్నా అందువల్ల ప్రయోజనముంటుం డనిపించదు. రమాకాంతం దగ్గర ఏదో ఆకర్షణుంది. తన దగ్గర డబ్బు తిన్నవాళ్ళు కూడా అతడేదో మంత్రంవేసి లొంగదీసినట్లున్నాడు, లేకపోతే ఇంతగాడింత గట్టి పట్టు పట్టదు. కానయితే సామదాన భేద దండోపాయాలున్నాయి. రాజరావుకీ, రమాకాంతానికీ చేరాలి లేద తను రాజర్తావుని బెదిరించాలి. ఎటొచ్చీ ఆ విషయంలో తొందరపడకూడదు.

    నర్సన్న తెచ్చిపెట్టుకున్న నవ్వుతో _" రాజారావు గారూ __ తొందరపడి ఏ నిర్ణయానికి రాకండి మీరు. ముందు ముందు మనం  మనం చూసుకోవాల్సిన వ్యవహారాలన్నో ఉంటాయి. ఈ ఊరి రాజకీయాలు మీకు బాగా కొత్త. ఎందుకయినా మంచిది నా గురించి నలుగుర్ని వాకబు చేసి తెలుసుకోండి . రాబోయే ఎన్నికల్లో మీరు నాకు సహకరించడానికి ఆ సమాచారం మీకు సహకరిస్తుంది _" అన్నాడు.

    రాజారావు లేచాడు. వెళ్ళబోయే ముందతడు __"సెలవు నర్సన్నగారూ __ నాతో చనువుగానూ, అభిమానంగానూ మాట్లడారు క్రుతజ్ఞాడ్ని. ఎన్నికలకు సంబంధించి నేనెవరికీ చెందను. ఈ ఊరి రాజకీయాలకు నేను కొత్త కావచ్చు. కానీ రానున్న ఎన్నికల్లో రమాకాంతంగారే నెగ్గడాని కవకాషాలున్నాయన్న నా ఊహా తప్పదని నా నమ్మకం ....." అన్నాడు.

    చెప్పదలచుకున్నదేదో రాజారావు స్పష్టంగానే చెప్పాడని నర్సన్న కర్ధమయింది.

    లీలాసుందరి చూడ్డానికి పదహారేళ్ళ పడుచులా గుంటు౦ది. అసలు వయస్సు కూడా ఇరవై దాటదు. పచ్చని ఛాయ, కళ్ళు చెదిరే అందం __ ఆమెది!

    ఆమె ఆ గ్రామంలో అడుగడుగునా రోజున చాలామంది కళ్ళప్పగించి చూశారు. ఆమెను కళ్లారా చూసిన అదృష్టం కలిగిందని చాలామంది యువకులు సంతోషించారు.

    లీలాసుందరి నర్తకి అని తెలిసినప్పుడా వూరి యువకుల సంతోషం రెట్టింపయింది. ఆమె నాట్య ప్రదర్శలు లాభసాటిగా ఉండడం వల్ల, ఆమె యిటీవల ఎక్కువగా గ్రామాలలోనే ప్రదర్శనలిస్తోందిట. గ్రామంలో లభించే ఆదరణను బట్టి ఎంతకాలముండేది ఆమె నిర్ణయించుకుంటుంది.

    ఆమె రావడం కార్లో వచ్చింది. కూడా ఒక నడివయస్కరాలు, ఇద్దరు యువకులు ఉన్నారు. యువకుల్లో ఒక డామేసోదరుడు. రెండవవాడు గాయకుడు నడివయస్కరాలామె గురువు.

    ఊళ్ళో అడుగుపెట్ట్క్యగానే ఆమె రమాకాంతాన్ని కలుసుకుంది. అయన ప్రోత్సాహకరంగానే మాట్లాడాడు. తర్వాత ఊరి ప్రముఖుల్ని మరికొందర్ని కలిసింది. అంతా ఆమెను ప్రోత్సహించారు. అదే సందర్భంలో ఆమె రాజా రావుని కూడా కలుసుకుంది.

    తొలి పరిచయంలోనే రాజారావు వ్యక్త్రత్వం లీలా సుందరి నాకర్షించింది. ఆ పల్లెటూళ్ళోఅలాంటి మనిషినామె ఊహించలేదు.

    "స్థిరపడ్డానికి మీరిలాంటి మనిషినామె ఊహించలేదు.

    "స్థిరపడ్డానికి మీరిలా౦టి గ్రామాన్నేన్నుకోవడం ఆశ్చర్యంగా ఉంది నాకు ...." అంది లీలాసుందరి.

    "ఈ ఊళ్ళో అన్ని సదుపాయాలూ ఉన్నాయి. వంటకు గ్యాసు , నీళ్ళకు కుళాయి, వెలుగుకు కరెంటు ఈ మధ్యనే ఊళ్ళో మంచి రోడ్లు కూడా పడ్డాయి. స్వంతకారుంటే తరచూ పట్నం పోయోస్తూ డొచ్చు. ఇవన్నీ కాక పట్నంలో ఉండే ఆ హడావుడి , కలుషిత వాతావరణం ఇక్కడు౦డదు....." అంది వసంత.

    "మీ మాటలు వింటూంటే, గ్రామం రావాలన్న పట్టుదల 'మీ దేననిపిస్తోంది __" అంది లీలావతి వసంతనుద్దేశించి.

    రాజారావు కలగజేసుకుని __"మా యిద్దరినీ వేర్వేరు అభిప్రాయాలు కాదు. ఇద్దరం అనుకునే యిక్కడికొచ్చాం మ సంగతలా ఉంచండి. మీరు నాట్య ప్రదర్శనకీ గ్రామాన్నేన్నుకోవడం నా కాశ్చర్యంగా ఉంది __" అన్నాడు.

    "ఆశ్చర్యమేముంది. నా కళ ఒక వ్యాపారం ఎక్కడ లాభసాటిగా ఉంటే అక్కడే ప్రదర్శనలు ....."

    "ఇంతకీ ఇక్కడేన్నాళ్ళు౦టారు?"

    "ఇంకా నిర్ణయించుకోలేదు. వచ్చే డబ్బూ, యిచ్చే ప్రోత్సాహం మీద నా నిర్ణయం ఆధారపడి ఉంటుంది....." అంది లీలాసుందరి.

 Previous Page Next Page