Previous Page Next Page 
మా ఊళ్ళోమహానుభావుడు పేజి 20

   

    అప్పుడు నరహరి లేచి _ "రాజారావుగారు రుదార    హృదయములు అయన గ్రామ బాగుకోసం పలుబడ్డ మాట వాస్తవం . అందులో తన స్వార్ధము౦దనడం వారి సంస్కారంతప్పితే నిజం కాదు. అయితే ఈ ఊళ్ళో మనందరి గురించీ పాటుబడుతున్న మరో అజ్ఞాత వ్యక్తి ఉన్నట్లాయన  చెప్పారు. ఆ వ్యక్తి ఎవరూ అని నొక్కించడం మనకు భావ్యంకాదు. మన అభినందనలూ వ్యక్తి అందుకోవాలని కోరుకుంటున్నాను. ఇక ఈ సభ ఇంతటితో ముగిసినట్లే _" అన్నాడు.

    క్రమంగా జనం వెళ్ళిపోసాగారు. కానీ రాజారావుచుట్టూ ఓ పదిమంది దాకా పోగాయయారు. కుతూహలం పట్లలేని కొందరు __ అజ్ఞాత వ్యక్తి గురించి రకరకాల ప్రశ్నలు వేశారు. అందరికీ రాజారావు చిరునవ్వు మాత్రం బదులుగా ఇచ్చాడు.

    ఆఖరికి రమాకాంతం కూడా ఉండబట్టలేక _ "అంతటి ప్రజా సేవకుడేవరయ్యా __ మనూళ్ళో _ అంత రహస్యమా _ అది ?" అనడిగాడు.

    ఆయనక్కుడా రాజారావు చిరునవ్వే అడులుగా ఇచ్చాడు.

    ఇంతమందిలో కుతూహలం రేపి, అతడలా నిమ్మకునీరెత్తినట్లుండడం _ రమాకాంతానికి చిర్రెత్తించిన ఏమీ అనలేక ఊరుకున్నాడు.

    అప్పుడే ఒక విశేషం జరిగింది.

                                                                       15

    ఆ ఊరి ముఖ్యుల్లో అతి ముఖ్యుడైన వ్యక్తి ఒక డున్నాడు. అతడి నరసన్న. అతడు రమాకాంతానికి ప్రతిపక్షి. ఇద్దరకూ పంచాయితీ ఎన్నికల్లో పోటీ జరుగుతూంటుంది. నర్సన్నకు అంగబలం, అర్ధబలం సచ్చీలతపై గ్రామంలో చాలామందికి మ్మకంలేదు. అందువల్లనే అతడింతవరకూ రమాకాంతాన్ని ఓడించలేకపోయాడు. అయినా రమాకాంతానికి నర్సన్నకు నేగ్లుకు వచ్చేసరికి తలప్రాణం తోకకు వస్తూంటుది.

    నర్సన్న ఖద్దరు బట్టలు కడతారు. అతడి వయసూ, రమాకాంతం  వయసూఇంచుమించు ఒకటే. ఆజానుబాహుడు. ముఖంలో సంస్కారం కనబడుతుంది. కానీ కళ్ళవెనుక అస్పష్టంగా క్రూరత్వం కనబడుతుంది . అందుక్కారణం మేలితిప్పిన అతడి మీసాలు కూడా కావచ్చు.

    అటువంటప్పుడూ నర్సన్న హఠాత్తుగా ముందుకు వచ్చి __ రాజారావుగారూ! ఏమిటో నేను అర్జంటుగా మాట్లాడాలి. ఒక్కసారి మా యింటికోస్తారా?" అనడిగాడు.

    ముందు రమాకాంతం, ప్రశ్న లుభ్ధవించాయి. తనకూ, నర్సన్నకూ పరిచయం అంతంత మాత్రం అతడి కిప్పుడున్నట్లుండి తనతో మాట్లాడాల్సిన అవసరమే మొచ్చింది? అజ్ఞాత వ్యక్తిగురించి తెలుసుకోవాలనుకుమ్తున్నాడా? లేక ఈ రోజు తన మాటల్లో ఇంకేమయినా అతడి నాకర్షించిందా?

    "ఏమండీ _ మాట్లాడరు?" అన్నాడు నర్సన్న.

    రాజారావు నసుగుతూ _ "విషయమేమిటో చెబితే ......" అన్నాడు.

    నర్సన్న నవ్వి __ "ఇక్కడ చెప్పేదయితే ఇక్కడే చేబుదును కదండీ __" అన్నాడు.

    "ఇప్పుడే రావాలా?"

    "అవునండీ చాలా అర్జంటు ....."
   
    "సరే _ వెడదాం పదండి __"

    రాజారావు నర్సన్నతోపాటు నడుస్తూంటే, అదోకలా చూశాడు రమాకాంతం . మనసులో __ "ఈ రాజారావు గ్రామంలో చాలా ఎత్తుకి ఎదిగిపోయాడు __" అనుకున్నాడు బాధగా.

    నర్సన్నదో పెద్దేత్తే వేశాడని రమాకాంతం మాత్రమె కాక అక్కడున్న చాలామంది అనుకున్నారు.

    ఎవరేమనుకున్నా రాజారావు నర్సన్నతో నిర్వికారంగా నడుస్తున్నాడు. తినబోతూ కూర రుచి అడగడమెందుకన్నది. అతడి సిద్ధాతం.

    నర్సన్న ఇళ్ళు చేరుకున్నాక అతడింటి మండువాలో రాజరావూ, నర్సన్నా చెరో కుర్చీలోనూ కూర్చున్నారు.

    "మజ్జేగ దాహం పుచ్చుకుంటారా?" అన్నాడు నర్సన్న.

    "ఏమీ వద్దు. విషయం చెప్పండి _" అన్నాడు రాజారావు.

    నర్సన్న క్షణంపాటు మౌనం వహించాడు. తర్వాత నెమ్మదిగా గొంతు సవరించుకుని __ " నేను మీకు చెప్పాబోయేది. మనిద్దరి మధ్యా అతిరహస్యంగా వుంచగలననిమాటివ్వాలి......" అన్నాడు

    "మీరు చెప్పింది విన్నాకకానీ మాటివ్వలేను. నేను __ " అన్నాడు రాజారావు నిర్మోహమాటంగా.

    "ఇది పూర్తిగా మనిద్దరికీ సంబంధించిన విషయం దీన్ని రహస్యంగా ఉంచడంవల్ల ఊరికి గానీ, మీకుగానీ నష్ట ముండదు......"

    "అది నిర్ణయించుకోవలల్సింది నేను కదా!"

    "పోనీ మీకూ అలాగానిపిస్తే రహస్యంగా ఉంచుతారా.....?"

    "తప్పకుండా!"

    నర్సన్న ఓసారి చుట్టూ చూశాడు. అక్కడేవరూ లేనప్పటికీ అతడు స్వరం కాస్త తగ్గించాడు._ "అనేక సంవత్సరాలుగా ఈ ఊళ్ళోనాకూ రమాకాంతానికీ పోటీ నడుస్తోంది. అతగాడిలో ఏమాకర్షణుందో  నాకు తెలియదు. . ఎంత డబ్బు ఖర్చుపెట్టినా ఇంతవరకూ ఒక్కసారి కూడా ఓడించలేకపోయాను.  ఆటగాణ్ణి పోటీలో ఒక్కసారయినా ఓడించాలన్నది నా జీవితాశయ౦ _ ......"

    "ఈ విషయం ఇదివరకే విన్నాను......."

    నర్సన్న స్వరం కొద్దిగా పెంచి __ "మీరీ ఊరికి వచ్చిన మహానుభావుడు . వయసులో చిన్నయినా చాకచక్యంలో, తెలివితేటల్లో మీరు చాలా పెద్దవారు, ఎన్నో ఏళ్ళుగా నిద్రపోతున్న మీ గ్రామాన్ని మీరు మేల్కోలిపారు. గ్రామంలో పౌరుల ఆదరాభిమానాలు సంపాదించి _ చెప్పుకోతగ్గ అభివృద్ధికి కూడా దోహదం చేశారు. ఇవన్నీ పెద్ద విశేషాలుకాదు. ఈ మాత్రానికి ఎవడూ మహానుభావుడ్ని చేస్తోంది ....." అన్నాడు.

    నీవు పోరుగువాడి నుంచి ఏమాశింస్తున్నావో అదే పొరుగువాడికి చెయ్యి __ అన్నారు పెద్దలు. నర్సన్న యిప్పుడదే చేశాడు. అతడు తన్ను పొగడగానే రాజారావుకి ఉన్నట్లుండి నర్సన్నఫై గౌరవ భావం పుట్టుకొచ్చింది. అతడి ముఖంలో   అంతవరకూ వున్న భావం తొలగి, అందులో విషయం అస్రమించుకుంది. రాజారావు కనులలో తన గురించి మరికొన్ని ప్రశంసా వాక్యాలు వినాలన్న కాంక్ష కూడా తొంగిచూసింది. అయితే అన్ని భావాల అంచుల్లోనూ  సిగ్గుపాడడం మోహమాటస్థుడి లక్షణం.

 Previous Page Next Page