వరలక్ష్మి భర్త నవ్వి __ "అంటే మతాస్వయంవరం అన్నమాట" అన్నాడు.
గంగాధరంగారు గుంభనంగా __"కుర్రాడికేమ్జ్ తెలుస్తుందీ __ మీరే ఓ అమ్మాయిని తీసుకొచ్చి __ వఈ అమ్మాయి నీ తల్లి అని చెప్పాలి...." అని ఇంకా ఏదో అనబోతుండగా అక్కడికి చటుక్కున బాబు వచ్చాడు.
నేనింతా వింటున్నాను. నాకేమీతెలియకపోవడమేమిటి? అన్న్హీ తెలుసు నాకు...." అన్నాడు బాబు.
"ఏం తెలుసురా నీకు?" అన్నాడు ప్రసాదు చిరునవ్వుతో .
"మా అమ్మను నేను వెతుకున్నాను మరి నువ్వు పెళ్ళి చేసుకుంటావా?" అన్నాడు బాబు సూటిగా.
"ఓ తప్పకుండా" అన్నాడు ప్రసాదు.
ఉదయ, వసంతలక్ష్మి ఊపిరిబిగబట్టారు, కొద్దిరోజులుగా బాబు వాళ్ళిద్దరికీ కూడా బాగా చేరికయ్యాడు. వాళ్ళిద్దరూ మంచివాళ్ళని ఒప్పుకున్నాడు.
ఆ అమ్మయిలిద్దరికి బాబును చేరికచేయడంలో సాయబడిన వరలక్ష్మి కూతుహాలంగా చూస్తున్నది ఈ పోటీలో ఎవరు నేగ్గుతారో?
బాబు నెమ్మదిగా వరలక్ష్మి నీ సమీపించి __"నాన్నా __ఇదిగో నాఅమ్మ. నువ్వు పెళ్ళిచేసుకుంటవా?" అంటూ వరలక్ష్మికి చూపించాడు.
వరలక్ష్మి మ్రాన్పపడిపోయింది. వరలక్ష్మి భర్త ముఖం ఎర్రబడింది. అక్కడున్న పెద్దాల్మ్దరూ ఒక్కసారి నిశ్సబ్దంగా అయిపోయారు.
ప్రసాదు ముందు తెల్లబోయిన చటుక్కున ఈ లోకంలోకి వచ్చి తీవ్రంగా బాబును సమీపించి వాడిని సాచి లెంపకాయకొట్టి __"వెధవా __ నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తోందా?" అన్నాడు.
తండ్రిచేత అలాదెబ్బలుతిని ఎరుగనిబాబు తను చేసిన తప్పేమిటో అర్ధంగాక వేమ్తఃనే ఏడుపు లంకించుకున్నాడు.
ప్రసాదు వరలక్ష్మి భార్తవంక తిరిగి "మీ శ్రీమతి నాకు చేల్లిలితో సమానం. వాడి మాటలకూ నేను మిమ్మల్ని క్ష్జమార్పణ కోరుకుంటున్నాను"__ అన్నాడు.
ఆ మాటలతో వరలక్ష్మి భర్తశాంతించి "ఇట్సాల్రైట్ !" అన్నాడు.
వరలక్ష్మి తనలో తానుగోణుక్కుంటున్నట్లుగా "వాడునన్ను అమ్మా అని పిలుస్తానంటే వాదిబుర్రలో ఇంత ఊహ ఉన్నదనుకోలేదు. శైలజను చెల్లీ అనడానికి నన్ను అమ్మా అనడానికి వాడు నా అనుమతి తీసుకున్నాడు. తప్పంటానాదే!" అనవసరంగా వాడు దెబ్బలు తిన్నాడు" అన్నది.
"తాప్పునాది వాణ్ణివెళ్ళి అమ్మను వెతుక్కురా అనడమేమిటంటే __ ఛీ.... ఛీ..... ఎంత అసభ్యంగా ఉన్నది?" అన్నాడు ప్రసాదు. జరిగిన సంఘటనకు అతడింకా తట్టుకోలేక్లపోతున్నాడు.
బాబు అక్కడే చతికిలబడి వెక్కివెక్కి ఏడుస్తున్నాడు. వాడిని శైలజ "అన్నయ్యా" ఎదవకురా "అని ఓదార్చుతున్నది.
వసంతలక్ష్మి ఆ దృశ్యాన్నే చూస్తున్నది.
శైలజనొక ఆడపిల్లగా భావించి బాబును ఆకర్షించాలని తను అనుకుంది బాబుదాన్ని చెల్లీ అని పిలిచాడు.
అన్నెంపున్నెం ఎరుగని, అభంశుభం తెలియని అమాయకపుపసిమనసు అది. ఆ పసివాడిచెంప ఎర్రగాకందిపోయిఉంది. వాడు అమ్మ కనిపించింది. తన ఎన్నిక అయిపోయిందని వాడనుకున్నాడు.
సంప్రదాయాలు, తపోప్పులు, వావివరసలు __ వీటన్నీటికి అతీతుడు వాడు. వాడ ప్రపంచంలో భయపడుతున్నది సవతల్లికి మాత్రమే! సవతితల్లి అంత ప్రమాదకరమైనడా? ఇటువంటి అమాయకపు బాలుడిని కూడా ఆమె వేధించాగలదా?
పుట్టిన రోజూ వేడుక మౌనంగంభీరంగా ముగిసింది. అందరూ వెళ్ళిపోయాక అక్కడ బాబు, శీనయ్య, ప్రాసాడు మిగిలారు.
ప్రసాదు అప్పుడు కొడుకును ఎత్తుకుని తనూ ఏడ్చాడు. తండ్రి ఏడు స్తూంటే బాబు ఆశ్చర్యపది __"నానా __ ఏడుస్తున్నావేం?" అన్నాడు.
"నేను నిన్ను కొట్టానుగా" అన్నాడు ప్రసాదు.
"కొడితే నోప్పి నాకేగదా"
"నీకు నొప్పిపెడితేనాకు ఏడుపోస్తుంది"
"అయితే మరెందుకు కొట్టావు?"
"శైలజ తల్లికి పేళ్ళయిపోయింది. ఆమెకు మళ్ళీ పెళ్ళిచేసుకోమనడం తప్పుకదూ" అన్నాడు ప్రసాదు.
"అవన్నీ నాకూ తెలుసు. అందుకే ముందే అడిగాను. శైలజను చెల్లీ అని పిలవనా అని! అప్పుడేమో ఒప్పుకుంది. ఇంక తప్పేముంది?" అన్నాడు బాబు.
"మరి శైలజ నాన్నేపోతాడు?"
"అయన మంచివాడు కాదు. శైలజకు వాళ్ళ నాన్నంటే భయం రాత్రిళ్ళు తాగిస్తాట్ట" అన్నాడు బాబు.
"అయితే?" అన్నాడు ప్రసాదు.
ఆయనకే వసంతలక్ష్మినో, ఉదయనో ఇచ్చి పెళ్ళిచేసుకోవచ్చు. మన నలుగురం కలసి సరదాగా ఉండొచ్చు" అన్నాడు బాబు.
"బాబూ" అన్నాడు ప్రసాదు తీవ్రంగా. "ఇప్పుడు నీకు అర్ధంకాదు. నువ్వు మాట్లాడేదంతా తప్పు. అయినా నువ్వస్తమానూ శైలజ అమ్మగురించే అలోచిస్తావేం __ ఈ ప్రపంచంలో ఆడవాళ్ళేలేరా?"
"ఎందుకంటే...! బాబు వివరింసాగాడు.
వాడి వివరణ వింటూంటే ప్రసాదు కలిగిన ఆశ్చర్యమింతాఅంతా కాదు... ఇంత స్పష్టంగా వాడి చిన్ని బుర్రకు స్పురించిన విశేషాలు తనకేందుకు స్పురించలేదు? లోపం తనలోఉందా__ లేక మన సంప్రదాయాల్లో ఉందా?
బాబుకు తోడుకావాలి. శైలజ వాడికినచ్చింది. శైలజతో సమంగా తన్నాధరించగలిగిన వరలక్ష్మి వాడికి నచ్చింది. అటుపైన ......
పెళ్ళయ్యాక సవతితల్లి బిడ్డపుడితే ఆమెలో మార్పువస్తుందని అంటారు. సవతి బిడ్డకూ అమెబిద్దకూ పడదనిఅంటారు. ఇప్పుడలాంటి సమస్య లేమీలేవు.
శైలజ బాబుకి నచ్చింది. బాబు శైలజకి నచ్చాడు. శైలజతల్లి బాబును కూడా తల్లిలా ఆదరించింది......
బాబు చెప్పికుని పోతూంటే ప్రసాదుమనసులో సెట మెదలుతున్నది.
సీత అతడికి స్వయాన మరదలు. ఇద్దరికీ చిన్నప్పట్నుంచీ ఒకరంటే ఒకరికి బగాకష్టం. పెద్దలు వాళ్ళిద్దరికీ పెళ్ళి చెయాలనుకున్నారు. రక్తసం బందీకుల మధ్య వివాహం జరిగితే వారిరాలుండవచ్చునని విజ్ఞాన శాస్రం అంటుంది. ప్రసాదు భయపడి ఈపెళ్ళికి ఒప్పుకోలేదు. సీతకు వేరేపెళ్ళి జరిగింది.
రెండేళ్ళక్రితం సీత భర్తపోయాడు.
సీతకోకూతురు . దానిపేరు రాధ. దానికిప్పుడు నాలుగేళ్ళఉంటాయి.
బాబుకు కావాల్సిన చెల్లెలు రాధకాగలదు.
రాధ సీతకూతురు. బాబు తనకొడుకు.
ఒకరికి తండ్రిలేడు. ఒకరికి తల్లిలేదు.
తనకూతురికి రక్షణకావాలని సీత బాబును ఆదరించిగలదు. తన కొడుక్కి ఆదరణ లభించాలని తను రాధను అభిమాననించగలడు.
సీతకు పురుషస్పర్శ కొత్తకాదు. తనకు స్త్రీస్పర్శ కొత్తకాదు.
బాబుకు చెల్లికావాలి రాధకు అన్నకావాలి.
అన్నివిధాల సీతకూ, తనకూ ఈడూజోడూ కుదుర్తుంది.
ఈ విషయం మొదట్నుంచీ తను ఎందుకు అలోమ్చలేడు?
ఈడూజోడూ అనగానే తను బిడ్డతల్లిఅయిన విధవను చేసుకోవాల్సిన ఉంటుందని ఇంతకాలమూ ఎందుకు స్పురించలేదు.?
సీతకు వివాహం చేయాలనీ ఆమె తలిదండ్రులను కోవడంలేదు. తన నేవైరైనా పల్లిచేసుకుంటారని సీత అనుకోవడంలేదు. ఆమెనొక పెళ్ళికూతురిగా ఈ సమాజమే గుర్తించడంలేదు.
తనకు భార్యపోగానే వసంతలక్ష్ములు, ఉదయలు తనకోసంపోటీపడుతున్నారు. సీతకు భర్తపోగానే ఆమె పెళ్ళిగురించి ఎవ్వరూఅలోచించడంలేదు.
ప్రాణానికి ప్రాణంగా భావించిన సుభద్ర పోయిన కొద్దివరాల్లోనో ఎందరో పడుచు విధవల గతి ఏమిటి? తనవంటి విదురులైనా వారిని పెళ్ళికూతుళ్ళగా గుర్తించనప్పుడు వారి సమస్యకు పరిష్కారముంటుందా?
ప్రసాదు బాబును దగ్గరగా తీసుకుని __"బాబూ! నువ్వు శైలజ విషయం మరచిపో, నీ వల్లనే నాకళ్ళు తెరుచుకున్నాయి. మనింటికివచ్చి మనతోపాటే ఉండిపోయే చెల్లినీ, తల్లినీ నీకోసం తీసుకుని వస్తాను...." అన్నాడు.
"నిజంగా?" అన్నాడు బాబు వాడి కళ్ళలో కోతూహలంలో కూడిన మెరుపు ఉన్నది.
తన వివాహ సమస్య మరోవ్యక్తికీ సంబంధించిన బృహత్సమస్యను పరిష్కరిస్తున్నందుకు ప్రసాదుకు చాల సంతోషంగా ఉన్నది. అయితే ఆ సంతోషంసమయంలో కూడా అతడి మనసులో ఒకసారి ఉదయ, వసంతలక్ష్ములు మెదిలారు.
"వారిగురించి నేనేం చేయగలను? నాలాగే వారుకూడా ఈడూజోడూకు గలప్రాముఖ్యతను గుర్తించపొతే _- ఆడపిల్లల వివాహాలీదేశంలో పెనుసమస్య గానే ఉండిపోతాయి...." అనుకున్నాడు ప్రసాదు.
__౦ అయిపోయింది ౦____