Previous Page Next Page 
అసిధార పేజి 16

    "గిలగిలలాడే నెప్పి తగ్గిందిరా! చెయ్యి విరిగిందేమో అని భయపడి చచ్చాను ఇప్పుడు చెయ్యి కదిలిస్తే నెప్పివుంది అంతే"

    "వాడి వుషారుకి కారణం నే చెప్పనా, పుడ్ లాగించి విశ్రాంతిగా పడుకోబోతున్నానుకదా అని ..... అంతేకదురా సుబ్బాయ్!"

    "అంతేనో గింతేనో తర్వాత సంగతి, ముందా సుబ్బాయ్ అబ్బాయ్, సుబ్బడూ , గిబ్బడూలాంటి పిలుపులు మానేయండి"

    "ఓరినీ నీకూ రోషం వుందిరా!"

    సరదాగా మాట్లాడుకుంటూ డ్రస్ లు మార్చి సామాన్లు విప్పారు. తర్వాత రొట్టె బిస్కెట్స్ తిన్నారు. ఒకే వట్టితో వెలిగే అరచేతి వెడల్పు స్టవ్ తీసి అంటించింది నిశ్చల సిల్వర్ గిన్నెతో నీళ్ళు మరిగించి బ్లాక్ కాఫీ చేసుకుతాగారు.

    స్టవ్ అనంగానే కిరోసిన్ కావాలి. వాళ్ళు పెద్ద మోత బరువులు తీసుకెళ్ళదల్చుకోలేదు. ఒకరిదగ్గర స్టవ్ వుంది.   దాని ఎత్తు భూమికి జానేడు మరొకరి సామానుల్లో బ్యాటరీలు వున్నాయి.ఆధునికంగా బ్యాటరీతో తయారయిన అ బ్యాటరీలు వెలుగునిచ్చేవికావు స్టవ్ లోవుంచి వెలిగిస్తే బ్యాటరీలో ఆయిల్ మంటని కలుగజేస్తుంది. ఎంతో అవసరం అయినప్పుడు మాత్రమె వాటిని వుపయోగిద్దామని తెచ్చుకున్నాడు.

    మరొకరి సామానుల్లో గిన్నెలో గిన్నెడిగి రెండు సిల్వర్ గిన్నెలు రెండు గ్లాసులు వున్నాయి. పుల్లలు దొరికితే రాళ్ళుపొయ్యిలా పేర్చి వేడిగా ఏదైనా గిన్నెల్లో చేసుకోవచ్చని తెచ్చుకున్నారు ఓ పక్క నీటిలో పడటం మరోపక్క శరీరం వేడిపానీయం తాగాలని కోరటంతో తెచ్చినవాటిల్లో ఒక భ్యాతరీ ని వేస్ట్ చేయక తప్పలేదు.

    ముగ్గురు మగవాళ్ళకి సిగరెట్లు అలవాటులేదు . కమల్ నాథ్ మాత్రం ఎప్పుడైనా ప్రెండ్స్ బలవంతంచేస్తే ఒకటీ అరా కాల్చేవాడు అంతే. సిగరెట ప్యాకెట్లు తెచ్చుకునే పని తప్పిపోయింది. సిగరెట లైతర్స్ ప్రతివాళ్ళ దగ్గర రెండేసి పెట్టుకున్నారు. ఎందుకైనా మంచిదని.

    వాళ్ళెవరికీ తాగుడు అలవాటు లేదు. అయినా ముందు చూపుగా ఫారిన్ విస్కీ సీసాలు రెండు తెచ్చుకున్నారు వెంట.

    "ఒళ్ళు చల్లబడిపోతున్నది. కాస్త వాడినోట్లో తులసితీరడం పోయండిరా!" పూర్వం అనేవారు అక్కడక్కడాయిప్పుడు కూడ.

    "ఒళ్ళు చల్లబడిపోతున్నది. వాడు చచ్చెట్లు వున్నాడు ఓ పెగ్గు గొంతులో పోయండిరా . శరీరం వేడెక్కి వాడే లేచి కూర్చుంటాడు" అంటున్నారు ఈకాలం కొందరు.

    "ఈ వెలుతురు ఎక్కడినుంచి వస్తుందిరా విజయ్!" హటాత్తుగా అడిగాడు సుబ్బారావు.

    "ఆయనే వుంటే మంగళాడేందుకు నాయనా! అందిట ఓ బామ్మగారు . అలాగే అది తెలిస్తే, చెప్పేవాళ్ళం పరిశోదించాలి" కమల్ అన్నాడు.

    "ఓసారి మా మాష్టారు మా స్కూలు పిల్లలందరినీ ఎక్సకర్షన్ కి కొండపల్లి తీసుకువెళ్ళారు అప్పుడు నాకు పన్నెండేళ్ళు ఉంటాయోమో మహా అయితే. కొండచివరిదాకా నానక్ష్టపడి ఎక్కాము అక్కడ ఓ పక్కన సన్నని మార్గంవుంది ఆ మార్గం కూడా చెట్టు చేమలతో నిండి వుంది మా మాష్టారు చెప్పారు. "ఈ మార్గంగుండా వెళితే కారడవి లోకి కిందికి వెళతాము . పూర్వం రాజులు శత్రువులు వచ్చి మీదపడితే పారిపోవటానికి మార్గంచేసి వుంచుకున్నారు. పగటివేళ మార్గంలో వెలుతురూ పడతుందని రాత్రి మాత్రం చీకటి గుయ్యరమని చెప్పారు. అలాగే ఈ చోట కాస్తోకూస్తో వెలుతురు వునదంటే  ఎటునుంచో సూర్యుని వెలుగు చొచ్చుకుని వస్తున్నదన్నమాట" నిశ్చల్ అంది.

    నీ అయిడియా బాగానే వుంది . కాని నా అనుమానం .....!" ఎలా బైటపెట్టాలో తెలియక కృతి ఆగిపోయింది.

    "మీ తెలివి తెల్లారినట్లే వుందిర్రా మనం ముందు కొండఎక్కాం. తర్వాత గుహలోంచి సొరంగా మార్గంలో౦చి కాస్త కిందికి దిగాం. అక్కడనుంచి ధభేల్ మని పాతాళంలోకి జారిపద్దాం. ఇక్కడికి  రవి ఎలావస్తాడు కవి ఎలా వస్తాడు?" మళ్ళీ మరో అనుమానం వెళ్ళగక్కాడు సుబ్బారావు.

    "పొట్ట విడిందంటేచాలు నీ కన్నీ అనుమానాలే వస్తేయ్ రా సుబ్భిగా! ఆలోచిస్తే ప్రతిదానికీ సమాధానం  దొరుకుతుంది. జరగవలసింది ముందు ఆలోచించి జరిగింది తర్వాత అలోచ్చిద్దాంబజ్జోరా బాబూ!" అన్నాడు.

    "చెయ్యికూడా నెప్పిచేసింది . నాకు రెస్ట్ చాలా అవసరం" అంటూ సుబ్బారావు నేప్పిలేని చేయి తలకింద పెట్టుకుని పడుకున్నాడు.

    "ఇప్పేడెం చేద్దాం?" కృతి అడిగింది.

    "కొద్దిసేపు విశ్రాంతిగా పడుకొండి. నేనూ కమల డైరీ రాసి పదినిముషాలు విశ్రాంతి తీసుకుని అప్పుడు అందరం కల్సిముందు కార్యక్రమం ఆలోచిద్దాం."

    "ఓ.కే" అంది నిశ్చల.

    డైరీ తీశాడు విజయ్.

    ఆరోజు తారీకు వేసివున్నచోట మొదలు పెట్టాడు . బయల్దేరిన విధానం సమయం. గుహలో ముందు కాలు పెట్టిన టైము, నడవడానికి ఎంతసమయం పట్టింది. వంగొని నడవటానికి  ఎంతసమయం తీసుకుంది. మార్గంలో ఎంతసేపు ముందుకీ జరిగారు. అంతా వివరంగా రాశాడు విజయ్.

    "మనం ఘమారుగా పదినిముషాలు స్పృహలో లేకుండా వుండి వుంటాము తర్వాత అనగా యిప్పుడు గంటా పద్దెనిమిది నిముషాలు గడిపాము ఇంతవరకూ రాయి" కమల అన్నాడు.

    అదీ రాశాడు విజయ్.

    ఓ పక్కవు పడుకుని కృతి నిశ్చల తగ్గు స్వరంతో మాట్లాడు కుంటున్నారు. అదేదో వాళ్ళిద్దరికే వినిపిస్తున్నది

    "పక్కకిగాని ఇంకా లోపలిగాని అవసరం అయితే పైకి పోయే మార్గంగాని ముందుగా మనం అన్వేషించాలి ప్రమాదాలు చెప్పిరావు. ఏదైనా ప్రమాదం ఎదుర్కోవాల్సి వస్తే ......

    విచిత్రమైన శబ్దం రావటంతో కమల ఆగిపోయాడు . చెవులు రిక్కించి చప్పున నిలబడ్డాడు విజయ్.

    గుండుపిల్లులు పోట్లాడుకుంటున్న ద్వని అది.

    "అదేమిటో ముందుగా గ్రహించిన విజయ్" అటు చిదరా కమల!" అంటూ నవ్వాడు.

    అది చూసిన కమల నవ్వాపుకోలేక పోయాడు.

    సుబ్బారావు హయిగా నిద్రపోతున్నాడు.

    ఆ విచిత్రమైన ద్వని సుబ్బారావు పెట్టె గురక.

                                      11

    అదేమిటో ఒళ్ళేరక్కుండా అందరికీ నిద్రపట్టింది. బహుశా శరీరం అలసిపోవటం వల్లకావచ్చు నిద్రపోయి లేచింతరువాత తేలిగ్గా హాయిగా వుంది.

    వీళ్ళున్న గుహలో వెలుతురూ ఇంకొంచెం ఎక్కువయింది.

    "ఇక్కడేదో విచిత్రశక్తి లేదుకదా?" సుబ్బారావు అన్నాడు.

    "ఏంరా సుబ్బూ ఏ  ఆదిశక్తి అయినా నీకు దర్శనం ఇచ్చిందా?" కమల అడిగాడు.

    "వాడు ఆ అర్ధంతో అనలేడురా!మనం పడ్డది కిందికి కదా ఈ వెలుతురూ ఎక్కడనుంచి వస్తున్నది పైగా ఇంతకు మునుపుకన్నా ఇప్పుడు ఎలా ఎక్కువయింది అని ఆశ్చర్యంతో తలమునకలవుతూ విచిత్రశక్తి అంటూ దానికో పేరు పెట్టాడు" విజయ్ అన్నాడు.

    "భలేకనిపెట్టావురా విజయ్!"

    "నీ ముఖం చూసి నీ భావాలు చదవావుచ్చురా సుబ్బూ ఇప్పుడు టైమంత అయిందో చూసి చెప్పమ్మా!"

    "ఒంటిగంటా ఇరవై నిముషాలు" తన వాచీలో చూసుకుని చెప్పాడు సుబ్బారావు.

    "సమయం "

    "సమయమా! సమయం ....... సమయం ....." కాస్త ఆలోచించి

    "మధ్యాహ్నం వంటి గంటా ఇరవై అయిదు నిముషాలు " అంటూ చెప్పాడు సుబ్బారావు.

    "పరవాలేదురా సుబ్బూ! తిండి తగిన విశ్రాంతి వుంటే నీ బుర్ర బాగానే పనిచేస్తుంది. కరెక్ట్ గా చెప్పావ్! బైట సూర్యబాగావానుడు నిప్పులు గక్కుతున్నాడు. దాని తాలుకా వెలుతురేయిది" విజయ్ చెప్పాడు.

    "ఇందాక చెప్పినమాటే మళ్ళీ చెపుతున్నావ్! పాటల లోకంలో కూడా సూర్యుడువున్నాడంటావా? నన్ను మరీ పిచ్చాడినిచేసి మాట్లాడకండిరా!"

    ఇది పటాల లోకమని ఇక్కడ పాతాలభైరవి వుందని ఎవరుచెప్పారురా! మనం భూమి అట్టడగు పొరల్లోకి చొచ్చుకు పోలేదు. కొండ కింద మరింత విశాలంగా మరో కొండ వుండి వుండొచ్చు. కాదు వుంది. అదే ఈ చోటు మనం ఇక్కడకొచ్చి పడ్డాము కొండ గుహలు కొన్ని చీకటి గుయ్యారాల్లాగుంటే మరికొన్ని గుహల్లో వెలుగు వుంటుంది. అదెలాగంటే కంచో కళహస్తిలో నో నాకు బాగా గుర్తులేదు ఏనాడో చూశాను. ఓ గుడిలో ఓ పక్క పైభాగానా నలుచదరంగా ఖాళీవదిలారు. ఆనాడు గుడి కట్టినవాళ్ళు, సరీగా మధ్యాహానం వేళ ఎండ ఏటవాలుగా పడుతుంది. కాని సరీగా ఆ కింద నేలమీద మాత్రంకాదు చాలా దూరాన అన్నమాట ఆ విధంగా ఏ కంతలోంచో సూర్య కిరణాలుపడి ఇక్కడ వెలుగుమాత్రం యిస్తున్నాయని నా భిప్రాయం "
అన్నాడు విజయ్.

    "మానవమాత్రులే ఇలాంటి వింతలెన్నో నిర్మి౦చారు. ప్రకృతి వింతలు ప్రదర్శించటంలో విడ్డూరమేముంది! రామేశ్వరం గుడిలో నలభైనాలుగు బావులున్నాయని విన్నాను. కాని క్రితంఏడు మావాళ్ళతో రామేశ్వరం వెళ్ళినప్పుడు ఇరవై రెండు బావులు చూశాను. ఒక్కో బావిలో నీరు ఒక్కోరకం రుచి. బావిదగ్గరే స్నానం చేయవచ్చు. ఆ నీళ్ళు డ్రైనేజీ నష్టం ప్రకారం అక్కడ నుంచి లోపలి వెళతాయో. ఎటు వేళతాయో తెలియదు పూజారి తీసుకెళ్ళి చూపిస్తే తప్ప అన్ని బావులున్నట్లు ఆ గుడి చుట్టూతా గుడిలోపల వున్నట్లు తెలియదు. . అలాగే మధురమీనాక్షి గుడి లోపలికెళితే ఏ వైపు వెళ్ళినా ఒకేరకంగా వుండి ఇది ఇప్పుడేగా చూసింది మళ్ళీ ఇటే వచ్చామేమిటి అంటూ మరో వేపు దారితీస్తాము అక్కడా ఇలాగే వుంటుంది కొత్తవాళ్ళకి అ గుడి అసలు ద్వారం తెలియక అక్కడే తిరిగుతూ గుడి గుడి గుంజంఅట ఆడుతారు. గుడి గుడి గుంజం అనే ఆటపేరుకూడా ఈ గుళ్ళవల్ల వచ్చివుంటుంది" నిశ్చల అంది.

 Previous Page Next Page