Previous Page Next Page 
మా ఊళ్ళోమహానుభావుడు పేజి 15

  

    కొత్తరకాల ఆలోచనలు గరవయ్యను కలవరపేడుతున్నాయి.

    ఆలోచనల దారేలాగున్నా, గరవయ్య కాళ్ళు అలవాటయిన దారే పట్టాయి? అతడు తిన్నగా సుదర్శనం ఇల్లు చేరుకున్నాడు.

    సుదర్శనం దారేలగున్నా, గరవయ్య కాళ్ళు అలవాటయిన దారే పట్టాయి? అతడు తిన్నగా సుదర్శనం ఇల్లు చేరుకున్నాడు.

    సుదర్శనం ఆ ఊళ్ళో జల్సారాయుడిగా పేరుపడ్డాడు. అతడి వయసు ముప్ఫైకి పైనే ఉంటుంది. తల్లీ, తండ్రీ లేరు. పెళ్ళయింది కానీ, పెళ్ళాం ఏడాదికి పదినేల్లు పుట్టింట్లోనే ఉంటుంది. రాధమ్మ అనే ఓ పాతికేళ్ళ పడుచు అతడికి వంటచేసి పెడుతూ౦టుంది. అతడికీ , ఆ పడ్చుకూ సంబంధముందని ఊరంతా అనుకుంటూ౦టారు కానీ, సుదర్శనం వీటన్నింటికీ అతీతుడు . అతడేవరినీ లెక్కచేయడు. అతడికి బాగా ఆస్తి ఉండడంవల్లా, తన విషయంలో అతడి చేతికేముకలేకపోవడం వల్లా _ రాధమ్మ కూడా ఊళ్ళోవాళ్ళ గురించి పట్టించుకొదు. ఆమెకు అందం , వయసు సమంగా ఉన్నాయి. ఆ రెండూ సక్రమంగా ఉన్నంతకాలం _ అక్రమ మార్గాల్లోనయినా సరే, డబ్బు కూడబెట్టులన్నది ఆమె సిద్దాంతం , అందం వయసు సమంగా ఉన్నాయి. ఆ రెండూ సక్రమంగా ఉన్నంతకాలం _ అక్రమ మార్గాల్లోనయినా సరే, డబ్బు కూడబెట్టాలన్నది ఆమె సిద్దాంతం , అందం, వయసుఅంతరించేక _ డబ్బు సాయంతో పాతదోషాలకు కప్పేట్టేయగలనని ఆమె నమ్మకం.   

    ఆ ఊళ్ళో సుదర్శనం వ్యక్తీకాదు__ సంస్థ! అతడు చాలామందిని తనకులా తయారుచేయాలనీ తాపత్రయ పడుతూంటాడు. అతడి పద్దతులు చాలా ఆకర్షణీయంగా ఉండడంవల్ల _ ఊళ్ళో అతడికి శిష్యులున్నారు.

    సుదర్శనం చెడ్డవాడు కాదు. ఊళ్ళో యువకలకు చేదగొట్టాలనే దుర్డుద్దేశ్య మతడికి లేదు. అయితే దుర్వ్యసనలకు తోడుండలంటారు. పేకాట, మాధ్యమ, అప్పుడప్పుడు పడుచు _ .... ఈ వ్యవస్థల్లో అతడు కావాలనుకోవాలే కానీ, తోడు దోరకడంలో కష్టమేముంటుంది?

    అందుకే సుదర్శనం అడ్డమయిన వాళ్ళనీ తన స్నేహబృందంలో చేర్చుకోడు. అందుకు కొన్ని అర్హతలున్నాయి. అన్నింటిలోకి ముఖ్యమయిన అర్హత డబ్బు. ఎందుకంటే, సుదర్శనం డబ్బు జాగ్రత్తగల మనిషి. అతడికి జల్సాలకు తోడు కావాలి. కానీ, ఆ జల్సాలకయే ఖర్చు ఏవరికివారు స్వంతంగా డబ్బు తెచ్చుకుని భరించాల్సిందే!

    సుదర్శనం స్నేహబృందంలో చేరడాని కవసరమయిన అర్హతులన్నీ గరవయ్య కున్నాయి. అందుకు గరవయ్య గర్వపడేవాడు. కానీ ఈరోజు మాత్రం అతడి మనసులో ఏదో వెలితి ఏర్పడింది. తనలో ఏర్పడిన సందేహాలనతడు సుదర్శనా న్నడిగి తీర్చుకోవాలనుకున్నాడు.

    "సుదర్శనంగారూ!" తలుపు తట్టాడు. గరవయ్య.

    వెంటనే తలుపు తెరుచుకుంది. తలుపు తీసిన సుదర్శనం _ "వచ్చేనా __ ణీ కోసమే చూస్తున్నాను. కొత్త సరుకొచ్చింది కంపెనీ కోసం వెయిట్ చేస్తున్నాను. సీసా నలభై నాలుగు రూపాయలక్కోన్నాను. చెరిసగం వేసుకుంటే తలో ఇరవై రెండ్రూపాయలూ అవుతుంది __" అన్నాడు.

     గరవయ్య లోపలకు వెడుతూ _ "నాకో పెద్ద సందేహం వచ్చింది. మనం తాగడమెందుకు?" అన్నాడు.

    "ఏం చచ్చుప్రశ్న వేశావయ్యా! ఎవరయినా స్వర్గాని కెందుకూ వెళ్ళడమనడుగుటారా ?" అన్నాడు సుదర్శనం. అయితే గరవయ్య ప్రశ్నకతడులిక్కిపడ్డాడు.

    "మీరు చెప్పింది నిజమే! తాగడం ద్వారా మనం స్వర్గానికి చెరువవుతున్నాం._" అన్నాడు గరవయ్య,

    సుదర్శనం గరవయ్యకు కనుకొట్టి, ఈల వేశాడు. హుషారుగా ఉన్నప్పుడతలా చేస్తూంటాడు. __"ఏంటి కథ? ఎక్కడయినా దేశనాయుకుడి ఉపన్యాసం విన్నావా?"

    "వేళాకోళం కాదు, నిజంగా అడుగుతున్నాను. అసలు మనమెందుకు తాగుతున్నాం? సారాకు రుచి లేదు. కావాలని అలవాటు చేసుకుని తాగుతున్నాం. అప్పుడు దానికి రుచివస్తోంది. కానీ, ఆ రుచి మన ఆరోగ్యాన్ని హరిస్తోంది. సమాజంలో గౌరవం లేకుండా చేస్తోంది."

    సుదర్శనం మాట్లాడలేదు.

    "కథల్లోనూ, సినిమాల్లోనూ చెప్పిందాన్ని బట్టి __ బాధలు మర్చిపోవడానికి తాగుతున్నానూ అంటే, మనకసలు బాధలూ, సమస్యలూ ఏమున్నాయి? ఈ భయంకరమయిన అలవాటు మనమెందుకు ?"

    "బ్రాందీ గొప్పతనాన్నీ షాకించావంటే, నువ్వింకావట్టి కుర్రాడివనుకోవాలి. సమాజం నన్ను గౌరవించదు. అయినా నేను దీన్ని వదలలేను. నాతో జీవితాతం కాపురం చేయడానికికొచ్చిన భార్య ఏడాదికి పదినేల్లు పుట్టింట్లోనేఉన్నానేనుండగలను. ఇది లేకపోతె ఒక్క రోజు కూడా గడవదు నాకు. అంటే అర్ధమేమిటి? ఇవే ప్రపంచంలో ఎవరూ ఇవ్వలేని సంతోషాన్ని దిస్తుందన్న మాట...... బ్రాందీ నీకు తోడై లోకాలకు తీసుకువెడుతుంది. ఆ అనందం వర్ణనాతీతం......."

    "అయితే తాగుడు లేకుండా మనం సంతోషంగా ఉండలేమా? తాగకుండా ఉన్నవాళ్ళ సంతోషం, సంతోషం కాదా?"

    "అలా అడుగు, చెప్తాను. రెండు సంతోషాలకీ, ఏనుక్కీ ఉన్నంత తేడా వుంది. ఎందుకంటే , అలవాటు లేని వాడు తాగితే __ మళ్ళీ దాన్ని వదులుకోలేడు. అంటే అర్ధమేమిటి _ అతడింతకాలం తెలియని కొత్త సంతోషం కలిగిందానిగా? అది పూర్వపు సంతోషాన్ని మించిందానిగా!"

    గరవయ్య సాలోచనగా సుదర్శనం వంక చూస్తూ "మీరు చెబుతూంటే మీ మాటలు నిజమేనానిపిస్తున్నాయి. కానీ, తాగుడు మానేసి ఆనందంగా ఉండగలనేమోనని ప్రయత్నిద్దామానుకుంటున్నాను......" అన్నాడు.

    ఇంపాసిబుల్ గరవయ్యా! టేనే రుచి చూసిన జిహ్వాసాలను కోరదు" అన్నాడు సుదర్శనం.

    "అంతేనంటారా?" అన్నాడు గర్వయ్య నిస్పృహగా ఆ రోజతడు చాలా తెలివిగా మాట్లాడేనని అనుకున్నాడు. కానీ, సుదర్శనం అతడి పాయింట్లన్నీ ఖండించేశాడు. తాగుడు అలవాటుయ్యేక మానగాలడంకష్టమని చాలామంది చెప్పారు. అయితే పట్టుదలతో తనేమీ సాధించలేడా?

 Previous Page Next Page