Previous Page Next Page 
ఈడూ జోడూ పేజి 15

    నిరంజనరావు తన అదృష్టం తేవడంలేదు. తన అదృష్టాన్ని దురదృష్టాన్ని మార్చబోతున్నాడు.
    అసలిదంతా వసంతలక్ష్మి పన్నగమైఉంటుంది.
    తనకుధ్యోగం రాగానే తన నిజాయితినీ నిరూపించుకోవాలని అతడు తాపత్రయపడుతూ ఆమె ఇంటికి వెళ్ళగానే  ఆవిషయం పసిగట్టి ఆమె తెలివిగా అతడి దృష్టిని తనపై మరల్చివుంటుంది లేకపోతే ఎవరైనా ఆడపిల్లలకిలాంటి విషయాలు చేప్పదల్చుకున్నప్పుడు _ ఏకాంతంగా చెప్పడానికి ప్రయత్నిస్తారు. వసంతలక్ష్మి ప్రోత్సాహంపైనే నిరంజనరావు తనకు కబురు పెట్టివుంటాడు.
    "అమ్మా __ వసంతలక్ష్మి __ నేవెంత జానవే... నన్ను పోటీనుంచి తప్పించడంకోసం __ చాలా పెద్ద ఎత్తేఎత్తావు. కానీ నీ ఎత్తులు సాగనివ్వదు. నీవు తీసుకున్న గోతిలో నీవే పడేలా నీవే పడేలా చేస్తాను...... " అనుకున్నది ఉదయ.
    ఆమె మనసులో అప్పుడే పథంకూడా రూపొందింతున్నది.
    తను వెళ్ళి ప్రసాదు కలుసుకోవాలి. వసంతలక్ష్మి  నిరంజనరావంటే మోజుపడుతున్నడానీ వారిరువురి వివాహానికీ అతడే పెళ్ళి పెద్దకావాలని కోరాలి. తనకుతానై వసంతలక్ష్మి ఈ విషయం  నిరంజనరావునో యింటివాన్ని చేసే బాధ్యతకూడా ప్రసాదుదేనని చెప్పాలి. ఆ విధంగా ఒకే దెబ్బకు రెండు పిట్టలు!
    అటు వంసంతలక్ష్మి పోటీనుండి వైదొలగుతుంది. ప్రసాదుకు తనపై సదభిప్రాయం కలిగి తమ వివాహమూ సుకురామవుతుంది.
    అయితే అదే సమయంలో వసంతలక్ష్మి కూడా అదే పద్దతిలో ఆలోచించి నిరంజనరావును ఉదయ ప్రేమిస్తున్నట్లు ప్రసాదుకు చెప్పాలనుకుంటున్న విషయం మాత్రం ఉదయ ఊహించలేకపోయింది.
                                                                  19
    ప్రసాదు కు తల తిరిగినట్లయింది.
    సాయంత్రం బీచివడ్డ వసంతలక్ష్మి నిరంజనరావును ప్రేమించినట్లు ఉదయద్వారా విని అతడు రవంత బాధపడినా మనసును సరిపెట్టుకున్నాడు ఇంటికి వచ్చేక పుస్తకాల నెపంతో వసంతలక్ష్మి వచ్చి ఉదయ నిరంజన రావును ప్రేమిస్తున్నట్లు చెప్పింది.
    ఇద్దరిలో ఎవరు నిజంచెబుతున్నారు? ఎవరు ఎవరిని ప్రేమిస్తూన్నారు?
    చాలాసేపు ప్రసాదుకు వ్యవహారమంతా అయోమయంగా తోచింది.
    ఆ ఇద్దరమ్మయిల్లో ఒకరిని తాను చేసుకుని రేండోఆమెకు అన్యాయం జరక్కుండా సంబందించూసి  సిద్దంగాఉంచాలని  అభిప్రాపడినిరంజనరావు కుద్యోగమివ్వాలనుకున్నాడు తాను. కానీ వాటంచూస్తే ఆ అమ్మాయి లిద్దరి దృష్టీ తనమీడనే ఉన్నట్లుంది ఇద్దరూ తనను దృష్టిలో వుంచుకుని నిరంజనరావును తెలివిగా తప్పించుకోవాలనుకుంటున్నారు తనకార్శించాలని ఎలా ప్రయత్నిస్తున్నరో, అతన్ని వాడుల్చుకావాలనీ అలాగే ప్రయత్నిస్తున్నారు.
    తన వివాహితుడు ఒకబిడ్డతండ్రి. అయినా ఆ ఆడపిల్లలు తనపట్లనే మోజు చూపిస్తున్నారు. నిజానికి నిరంజనరావే వారికి ఈడూ జోడూ గా వుంటాడు. ఆడపిల్లలకూ ఈడూజోడును మించి ఆకర్చింపజేసే ప్రత్యేకతతనలోఏముంది?
    తన హొదా అందుకు కారమని ప్రసాదు కు తెలియకపోలేదు. కానీ తన అందచందాలు, వ్యక్తిత్వం అందుకు కారణమయుంటాయని తనను తాను నమ్మిమ్మించుకుని కాసేపు సంతోషించాడు ప్రసాదు.
    అయితే అతడి సమస్యమాత్రం అలాగే వుండిపోయింది.
    ఉదయ, వసంతలక్ష్మి మధ్య ఈపోటీ ఎంతకాలం కొనసాగుతుంది. బాబుఇద్దరిలో ఎవ్వరినీ తల్లిగా అంగీకరించేలాలేడు. వారిద్దరిలోనే ఏంకర్మ అసలువాడె యువతినీ తల్లిగా అంగీకరించేలాలేడు,
    అలాంటప్పుడు తనేంచేయాలి?
    పాపం __ నిరంజనరావు ఉద్యోగంకోసం ఎదురుచూస్తూంటాడు. ఈ అమ్మాయిలిద్దర్లో ఏఒక్కరూ అతడినంగీకరీంచకపోతే అదతడితప్పువుతుందా?
    ముందు నిరంజనరావు సమస్యను పరిష్కరించాలి. ఇలాగనుకుని అతడు నిరంజనరావుకు కబురుపేట్టి __"ఎందుకైనా మంచిదని నేనే ఆ అమ్మాయిలతో మాట్లాడాను. వసంతలక్ష్మి నిన్ను ప్రేమిస్తున్నదని ఉదయ అన్నది ఉదయ నిన్ను ప్రేమిస్తున్నది వసంతలక్ష్మి అన్నది. మీ వివాహం తన స్నేహితురాలితో జరిపించడానికి సాయపడమని వాళ్ళిద్దరూ నన్నుకోరారు. వాళ్ళతో మీకున్న పరిచయాన్ని బట్టి మీ కేమనిపిస్తోంది?" అనడిగాడు.
    నిరంజనరావు ముఖం కండగడ్డలాగయింది. ఆ అమ్మాయిలూ తనను తిరస్కరించారని అతడికర్దమయింది. అతిరస్కారం -ప్రసాదుకూ అర్ధమయందని అతడికి బాధకలిగింది. తిరస్కరానికి కారణమేమిటోకూడా చూచాయగా అతడూ హి౦చగలిగాడు.
    మగవాడు కట్నమడిగాడనీ, లాఛనాలడి గాడనీ ఆడవాళ్ళు ఆడిపోసుకుంటారు. డబ్బుకోసం కోటిమెడల్లోనైనా తాళికట్టడానికి సిద్దమని వేళాకోళం చేస్తారు. ఉదయలాంటి తెగింపుగలపిల్లనైతే __మగవేధవలు  __ అని తిడతారు. మరి ఆడపిల్లలకు ధనవ్యామోహం లేదా? నిజంగా ఈడూజోడైనా వాడినొకడిని ఎన్నుకుంటే కట్నమెందుకు? భర్తకు మంచిహొదాఉండాలి. తను సరదాలన్నీ తీర్చగల స్తోమతుండాలి అలాంటివాడికోసం కట్నాలిచ్చిఎగడ్డ౦వల్లనే ఈవారకట్న సమస్యమరింత పెరిగిపోతోంది. అసలుధ్యోగం లేనంతకాలం వీళ్ళెవ్వరూ తనను పెళ్ళికొడుకుగానే చూడలేదు. ఉద్యోగంవచ్చేక సహృదయంతో తన అదర్శాలను వారిముందు చెప్పుకుంటే __ అతడికంటె ఉన్నత స్థానంలో ఉన్న ప్రసాదుపై మోజుతో అతడిని కాలదన్నారు. వాళ్ళనేమనాలి? అడముండలు......
    ఇవన్నీ కసిగా మనసుతో మాత్రమే అనుకున్నాడు నిరంజనరావు. అడముండల్లో ఒకటే ప్రసాదు కు భార్య కాగల అవకాశమున్నది. అందుకే అతడు నోరుజారదల్చుకోలేదు.
    "మీరు మాట్లాడ్డ౦లేదు!" అన్నాడు ప్రసాదు.
    "చెప్పడానికేముంది? వాళ్ళిద్దరికీకూడా నేను నచ్చినట్లులేదు....." అన్నాడు నిరంజనరావు చిన్నతనంగా.
    "మీరు సరిగానే ఊహించారు. నాకూ అలాగే అనిపించింది. అయితే ఇందులో మీరు బాధపడివలసినదేమీలేదు. సాధారణంగా ఇలాంటి సందర్భంఎక్కువగా ఆడపిల్లలకే ఏర్పడూతూంటుంది. మగాళ్ళకు ఇలాంటి సందర్భం ఎక్కువగా ఆడపిల్లలకే ఏర్పడూతూంటుంది. మగాళ్ళకు అరుదు. ఈవిషయం గుర్తిమ్చుకుని మీరు మున్ముందు పెళ్ళిచూపులసందర్భంలో ఆడపిల్లలమనసులు కష్టపెట్టకుండా ఉండకగలిగితే అదో తృప్తి నాకు ఒకవిధంగా  ఆ అమ్మాయి లిద్దరూ మీకుపకారమే చేశారు. ఇప్పుడు మీ ఉద్యోగానికీ, పెళ్ళికీ ముడిలేదు. రేపేవచ్చి ఉద్యోగంలో  చేరవచ్చును" అన్నాడు ప్రసాదు.
    ఆ క్షణంలో నిరంజనరావుకు ప్రసాదు ను మించిన పురుషోత్త ముడు౦డడనిపించింది, జరుగుతున్నది కలో నిజమో తెలియనివాడిలా కాసేపుమౌనంగా వుండిపోయాడు. తర్వాత ప్రసాదుకు ధన్యవాదాలు చెప్పుకుని వెళ్ళిపోయాడు
    ప్రసాదు తాన సమస్యకూడా త్వరగా పరిష్కరించుకోవాలనే అనుకున్నాడు అందుకు బాబు పెద్ద ఆటకం.
    అతడారోజునే బాబును పిలిచి చాలాసేపు  మాట్లాడేడు.
    "బాబూ __ నీకు కొత్త అమ్మ వద్దా?"
    "వద్దు" అన్నాడు బాబు.
    "ఇంట్లో నీకు శీనయ్య వంటే బాగుందా?" అన్నాడు ప్రసాదు.
    "బాగుంది"
    "కానీ నాకు బాగోలేదు. నేను కొత్తమ్మను తీసుకునిరావాలనుకుంటున్నాను" అన్నాడు ప్రసాదు.
    "అప్పుడు నేను పారిపోతాను"
    "ఎక్కడికి?" అన్నాడు ప్రసాదు.
    "ఎక్కడికో అక్కడికి __ కొత్తమ్మ లేనిచోటకి...."
    "నువ్వు పారిపోతే కోతమ్మా నేనూ నువ్వున్నచోటుకి వెతుక్కుంటూ వస్తాం" అన్నాడు ప్రసాదు.
    "ఏమీకాదు నేనాకనబడినా కొత్తమ్మమీద ఎన్ని అనుమానాలు? ఇది వాడి కొకరు చెబితేతప్ప బుర్రలో కెక్కేవిషయంకాదు. ఇంతలా వాడిలోకి విషమెవరు ఎక్కించారో?
    "ప్రసాదు నిట్టూర్చి __"నీకిలాగే జీవితం బాగుందా? తోడుగా  ఏ చెల్లెలో తమ్ముడో అక్కర్లేదా?' అన్నాడు.
    "నాకు తెలుసులే . కొత్తమ్మవస్తే చెల్లెలో తమ్ముడోవస్తారు . అప్పుడు కొత్తమ్మ నాచేత వాళ్ళకు అన్నిపనులూ చేయిస్తుంది"
    ప్రసాదు తెల్లబోయి _"అలాగని ఎవరు  చెప్పార్రా నీకు?" అన్నాడు అతడి గొంతులో అసహాయత ఉన్నది.
    "ఎవరూ చెప్పలేదు. అన్నీ నాకే తెలుసు...."
    బాబుతో తనకింత కుదరదు. వాడే అమ్మాయినీ తల్లిగాఅంగీకరించడు ప్రసాదు పునర్వివాహంచేసుకుంటే మానసికంగా బాబుకు దూరంకాకతప్పదు. ప్రపంచంలో ఎందరో తల్లిదండ్రులు బిడ్డలా కోసం ఎన్నో త్యాగాలు చేశారు. తను నిజంగా బాబును ప్రేమించే మాటైతే వాడికోసమైనా మళ్ళీ పెళ్ళి చేసుకోకూడదు.
    ఈ ఆలోచన వచ్చేక ప్రసాదు కు స్ఫురించింది.
    సుభద్రకు బాబంటే ప్రాణం. ప్రాణాలుపోతున్న సమయంలో కూడా ఆమె "బాబు జాగ్రత్త!" అని తనను హెచ్చరించింది. ఇప్పుడు సుభద్రలేదు. ఆమెను తన ప్రాణానికి ప్రాణంగా భావించాడు. ఇప్పుడు మరో స్త్రీని తన జీవితంలోకి తెచ్చుకోవాలని తహతహాలాడుతున్నాడు.
    సుభాద్రమీద తన ప్రేమ అశాశ్వత మైనప్పుడు బాబుమీద మాత్రం శాశ్వత ప్రేమ వుంటుందని ఎందుకనుకోవాలి? అవచ్చిన సవతితల్లి ప్రభావంలో పడి తను బాబును అలక్ష్యం చేయవచ్చు క్రమంగా ఈసడించనూవచ్చు బాబు భయాల్ని పూర్తిగా కొట్టిపారవేయడానికి వీల్లేదు.
    వసంతలక్ష్మి, ఉదయ __ వీరిలో తనేవారిని వివాహం చేసుకున్నా కొంత కాలంమాత్రమే వారు బాబును అభిమానించగలరు. అటుపైన తనకేబిఢ్ఢో కలిగితే క్రమంగా బాబు ఆమెకు శత్రువౌతాడు. అప్పుడు బాబునామే మీ బిడ్డ అంటుంది. మనబిడ్డఅంటూ తన బిడ్డ గురించి చెబుతుంది!
    ఇంట్లో సుఖశాంతులకోసమో లేక కాలమహిమో __ క్రమంగా బాబుపట్ల తన వైఖరి మారవచ్చును.
    ఇది జగమెరిగిన సత్యం .
    చనిపోయేముందు సుభద్రకీ విషయం స్ఫురించి వుంటుంది. ఆమె బాబుని ఆవహించి ఇలామాట్లాడిస్తున్నదేమో! లేకుంటే వాడికన్న విశేషాలు తెలియడానికి వీల్లేదు.
    ప్రసాదు బాబువంక పరీక్షగాచూశాడు. వాడిలో అతడికి సుభద్ర కనిపించింది. అతడు బాబును చటుక్కున దగ్గరగా తీసుకుని __"నిజంగానే నేకు అన్నీ తెలుసురా __ నువ్వు చెప్పినట్లే వింటాను నీమనసుకు కష్టం కలిగించేపనేది చేయను"  అన్నాడు.

 Previous Page Next Page