"మీరు చెప్పేది బాగానే ఉంది కానీ మనమిలా ఆలోచిస్తామని ఊహించి అతగాడు ధైర్యంచేసి ఉంటే?"
కనకరాజు వేదాంతిలా నవ్వి _ "అంత ప్రమాదకరమయిన ఊహ ఎవడూ చేయడు. పుట్టలో పాము బయటకు విహారానికెళ్ళి వుంటుందని ఊహించి, ఎవడయినా పుట్టలో చేయి పెడతాడా? ఒకవేళ అలా చేయగలిగితే _ ఆ చొరవ , ధైర్యం అతడిని సర్వనాశనమయినా చేస్తాయి. అతడికి తిరుగులేని విజయాన్నయినా యిస్తాయి........" అన్నాడు.
రమాకాంతం ఆశ్చర్యంగా ఆ యువకుడికి వంక చూసి _ "కొత్తగా ఎవరయినా వచ్చారా అంటే ఏం చెబుతామండీ _ నెల్లాళ్ళ క్రితమే మా స్కూలుకు కొత్త హెడ్మాష్టరుగా రోచ్చారు __....."
"అలాకాదు. ఈ ఊరిలో చెప్పుకోతగ్గ సంబంధం లేకుండా , ఏ ఉద్యోగరీత్యా, బంధుత్వరీత్యా కాకుండా...."
"ఆగండాగండి. రాజరావుని ఒకాయన ఆ విధంగా ఇక్కడ సుమారు మూడునెల్ల నుంచి ఉంటున్నాడు ......" అన్నాడు కనకరాజు.
"అతడికి భార్య, ఓ కూతురు ఉన్నారా?"
"ఇవన్నీ మీకెలా తెలుసు?" అన్నాడు రమాకాంతం.
"అయితే ఉన్నారన్నమాట. అచ్చా _ ఆ రాజారావు కోసమే నేనిక్కడి కొచ్చాను. అతడు సామాన్యుడు కాదు. బాగా చదువుకున్నవాడు, తెలివయినవాడు. కానీ ....." ఆ యువకుడు ఆగాడు.
ప్రేసిటెంటు, కరణాల ఇద్దరి ముఖాల్లోనూ ఆత్రుత తొంగిచూస్తోంది.
"కానీ __?" అనడిగా రిద్దరూ ఏకకంఠంతో.
"అతడు నక్సలైట్ల నాయుకుడు ....."
ప్రేసిడెంట్, కరణం కూడా పక్కలో బాంబు పేలినట్లులిక్కిపడ్డాడు. ఉలికిపాటుతగ్గగానే యిద్దరి సుఖాల్లోనూ భయం స్పష్టంగా తొంగిచూసింది.
ఆ యువకుడు నవ్వి _ "నక్సలైటు అనగానే మీరు భయపడుతున్నట్లున్నారు. వాళ్ళ పద్దతులు నిజంగా
భయం గొలిపించేవే అయినప్పటికీ _ అందుకు కారణం లేకపోలేదు. నస్కలైట్లచే దారుణంగా హత్య చేయబడ్డ ప్రతి ఒక్కడూ __ దానవుడే కానీ మానవుడు కాదు. అంచేత దానవులే నక్సలైట్లకు భయపడాలి. ఏమయినా మన దేశంలో శిక్షించే అధికారం న్యాయస్థానికి మాత్రమె ఉంది కాబట్టి, సామాన్య మానవుడా అధికారాన్ని వినియోగిస్తే అదీ నేరమే అవుతుంది. అందుకే మేము వాళ్ళను రూపుమాపడానికి ప్రయత్నిస్తున్నాం __" అన్నాడు.
"మీరు నక్సలైట్లు బాగా సమర్ధిస్తున్నారు. అయితే వాళ్ళు మాతృదేశాన్ని కాదని, పరాయి దేశాన్నారాదించడం మంచిదేనా?" అన్నాడు రమాకాంతం తమాయించుకుని.
ఆ యువకుడు వెటకారంగా నవ్వాడు __"ఈ రోజుల్లో మాత్రుదేశాన్నేంతమంది అరాదిస్తున్నారో చెప్పండి? నాయకులు ప్రజాసేవ పేరుతో ప్రజలను దోచేస్తున్నారు. ప్రాంతీయాభిమానం పేరుతో దేశాన్నే చీలికలుచేసి, కొట్టుకుని చస్తూన్నారు. ఒకే దేశంలో ఉన్నామన్న భావం ఏ రాష్ట్రం లోనూ కనబడదు. స్వార్ధమూ, స్వాభిమానమూ, కమ్మేసిన మన పొరల్లో దేశాభిమానానికి తావేక్కడు౦ది ? తోటిపౌరుణ్ణి భారతీయుడిగా ప్రేమించడానికి బదులు, మరో ప్రాంతీయడిగాద్వేషిస్తున్నాం. అది దేశద్రోహం కాదంటారా? ఇలా పరస్పర విద్వేషాలతో మాసాలుతున్న మనం చైనా సభిమానించే నక్సలైటుని దేశాద్రోహిగా నిమ్దిమ్చడానికి తగదు. అలాంటి ఆరోపణ చేసే అర్హత మహాత్మాగాంధీ వంటి నిజమయిన పౌరులకు మాత్రమే ఉంది. అదీగాక నక్సలైట౦టే ఎవరు? చేద్దామంటే పనిలేక, సంపాదించే డబ్బులేక, తినడానికి తిండిలేక విసిగిపోయిన మన తోటి పౌరుడు , సాటి మానవుడు. దేశం తనకేమిచ్చిందని అతడు దేశాన్ని ప్రేమిస్తాడు? తనకేదో యిచ్చిన, యిస్తున్న దేశాన్నతడు ప్రేమించకేం చేస్తాడు? ఇదంతా విని, నేనిలా మాట్లాడుతున్నానని ఆశ్చర్యపోకండి . నక్సలైట్లని పట్టుకోవడం కోసం నేనూ వాళ్ళతో బాగా కలసి మసలడంలో వాళ్ళ ఉద్దేశ్యాల్నీ , ఉద్రేకాలనూ అర్ధంచేసుకున్నాను. ప్రజలలో కల్లోలం కలుగజేసేవాళ్ళు కాబట్టి, వాళ్ళను పట్టి ప్రభుత్వాని కివ్వడం నా బాధ్యత. కానీ, సాటి మానవుడిగా వారిమీద నా కేన్నడూ సానుభూతి ఉంది. ఎటొచ్చీ ణ్ సానుభూతి బాధ్యతా నిర్వహణలో అడ్డురాకుండా చూసుకుంటాను __"
"చాలా బాగా చెప్పారు. మీరు చెప్పినట్లు నక్సలైట్లు మరీ అంత దుర్మార్గులు కాకపోవచ్చు. కానీ వాళ్ళ పద్దతులు చాలా కూరమయినవి. పేపర్లలో చదివినివి గుర్తుకు తెచ్చుకుంటూ౦టే ఇప్పటికీ వళ్ళు జలదరిస్తూనే ఉంది __" అన్నాడు రమాకాంతం.
"నక్సలైట్లింకా మా తూర్పుగోదావరి జిల్లాలో అడుగుపెట్టలేదనుకుంటున్నాం. అయితే రాజారావు నక్సలైలంటారు......" అన్నాడు కనకరాజు.
"ఇంకా ధృవపర్చుకోలే దనుకోండి . కానీ అతడే అయుండాలి . ఏ విషయమూ పరిశోధించి తేల్చుకోవాలి. పరిశోధన చాలా రహస్యంగా జరగాలి. అందుకే మీ సహాయం కావాలనుకున్నాను. "నేను మీ యింట్లో మకాం వేస్తాను. మీ దూరపు బంధువుగా నన్నందరికీ పరిచయం చేయండి. ఏ సందర్భంలోనూ నిజం బయటకు రాకూడదు. మీ సహకారం పూర్తిగా లభిస్తే, వీళ్ళను అరెస్టు చేయడానికి నేల్లాళ్ళుమించదు__"