Home » Vasundhara » ఈడూ జోడూ

    "అంటే ఇన్నితెలిసీ మీరు నన్ను పెళ్ళిచేసుకునేందుకు అంగీకారిస్తున్నా రన్నమాట" అన్నాడు ప్రసాదు.
    "ఇన్నితెలసీ అనడానికి మీలో లోపాలేమున్నాయి.? తొందరపాటు మగవారికి సహజగుణమని చదివాను. కానీ తొందరపాటుకు మన్నించమని అడిగే సహృదయం మాత్రం అరుదు" అంది ఉదయ.
    "నాలో సహృదయంలేదు. కానీ మీరు నన్ను ప్రేమిస్తున్నారనిగ్రహించను. ఎందుకంటే ప్రేమ మాత్రమే తప్పుల్ని క్షమించగలదు!"
    ఉదయ సిగ్గుపడింది. తానతడిని ప్రేమిస్తున్నాదా? ఆ ప్రేమకుకారణం గానే అతడిని క్షమించగలిగిందా?
    అసలు ప్రేమంటే ఏమిటి?
    అతడే తనకు జీవితం అనిపించాలి. అతడులేనిదే తను బ్రతకలేననిపించాలి. కానీ తన ఆలోచనలనలో   అతడులేదు. అతడి హొదా ఉన్నది. తాను సుఖజీవితాన్ని కోరుతూ అతడి ఆసరా కావాలనుకుంటున్నది.
    అదే ప్రేమ అవుతుందా?
    "మిస్ ఉదయా!" అన్నాడు ప్రసాదు__"మన పరిచయం చాలా దూరం వెళ్ళినా న పరిస్థితి మాత్రం ఎక్కడవేశావే గొంగళీ అన్నట్లేఉన్నది. నా బాబు నా వివాహానికి సుముఖంగాలేడు. ఎవరో వాడి మనసు విషపూరితం చేశారు. సవతితల్లి అన్న పేరు వింటే చాలు __ వాడు వణికిపోతున్నాడు.
    ప్రసాదు ఆమెకు తనగోడు చెప్పుకోవడంలో ముఖ్యాశయమున్నది. బాబు మనసు విషపూరితం చేసినది ఉదయ, వసంతలక్ష్మిలలో ఒక్కరని అతడు నమ్ముతున్నాడు. తన అనుమానం. వాలిద్దరిలో బాబు మనసు విరిచింది ఎవరైనా __ సరిచేయగల విరుగుడు కూడా వాళ్ళకే తెలియాలి.
    ఉదయ ఆశ్చర్యంగా __"అయిదేళ్ళు పసివాడు. వాడికి మీరు మరీ ఇంత ప్రాముఖ్యతఇవ్వకూడదు. కాలక్రమేణా నిజానిజాలువాడికేతెలుస్తాయి" అంది.
    "వాడందరిలాంటివాడూకాదు. పరమమొండి. ఈలేతవయసులో ఎవరు వాడిమనసున విషం పోశారో విరుగుడువేయాలి. లేకపోతె వాడిమనసున విషం పోశారో విరుగుడువేయాలి. లేకపోతె వాడికీనాకూకూడా భవిష్యత్తు శిఇన్యమైపోతుంది. వాడికేంలోటు జరిగినా నా సుభద్రనన్ను క్షమించదు" అన్నాడు ప్రసాదు ఆవేశంగా.
    నా సుభద్ర అన్న పదం అతడి నోట వెలువడగానే అదోలా అనిపించింది ఉదయకు. కానున్న భార్యతో మరో స్త్రీకి అంత ప్రాముఖ్యతనిచ్చి మాట్లాడకూడదని  తెలియని ప్రసాదు సరసతపై ఆమెకు ఏవగింపు నా సుభద్ర అన్నపదం ఆమెకు జుగుప్పాకరంగా  ఉన్నది. అటువంటిది తాను అతడితో నూరేళ్ళజీవితం పంచు కొనగలదా? అతడి బాబును తన బిడ్డగా భావించాగలదా.
    ఉదయ తన ఆలోచనలు  ఆశ్చర్యాన్ని కలిగించాయి అతడికీ తనకు దూరమున్నంతకాలం అతడు తనవాడు కాబోతున్నడనగానే అతడు పూర్తిగా తనవాడేకావాలన్న స్వార్దం రేగుతోంది. తనకు తెలిసిన అతడి గతానికి సంభంధించిన నిజన్నామే స్ఫురించుకుందుకు కూడా సిద్దపడిలేదు. అటువంటిప్పుడు అతడిగత జీవితానికి ప్రత్యక్షసాక్షి అయిన బాబును తను భరించాగలడా? బాబుభయాలు అర్ధరహితంకావా?     
    "మిస్ ఉదయా! బాబు మనసులో ఎవరువిషం ప్రవేశపెట్టారోతెలుసుకుని విరుగుడు వేయించి  వాణ్ణి మీవాణ్ణి చేసుకోండి. అదే నేను మిమ్మల్ని కోరేది!" అన్నాడు ప్రసాదు.
    "ప్రయత్నిస్తున్నాను!" అంది ఉదయ నెమ్మదిగా.
                                       13
    శీనయ్య, బాబు పక్కగదిలో ఆడుకుంటున్నారు.
    వసంతలక్ష్మి, ప్రసాదు డ్రాయింగ్ రూంలో ఒకరినొకరు ఎదురుగా కూర్చుని ఉన్నారు.
    ప్రసాదు ఆశ్చర్యంగా వసంతలక్ష్మి వంక చూస్తున్నాడు. ఉదయను చూసినప్పుడతడికా ఇద్దరమ్మాయిల్లో ఉదయే అందమైనదనిపిస్తుంది. ఇప్పుడు చూస్తుంటే వసంతలక్ష్మి ఎక్కువ అందంగా ఉన్నదనిపిస్తోంది.
    ఇద్దరిలో ఒకరిని ఎన్నుకోవడం అతడికి కష్టమైనపనే!
    ఇద్దరూ అతడికి ఈడుజోడూగా ఉంటారు.
    పరిచయం తక్కువినా ఉదయ అతడిలో చనువుగా మాట్లాడుతుంది. వసంతలక్ష్మి చనువుగామాట్లాడలేదు. మనిషి బెరుకుగాఉంటుంది. కానీ అమెనిలా చూస్తుంటే ఆమె తనకు బాగా పరిచయస్థురాలనీ, ఆత్మీయురాలనీ అతడికి అనిపిస్తుంది.
    "నా మాట మన్నించి మళ్ళీ వచ్చినందుకు థాంక్స్! నేను నిన్ను క్షమార్పణ అడగాలని పిలిపించాను " అన్నాడు ప్రసాదు.
    వసంతలక్ష్మి తలపంచుకోలేదుకానీ అమెకసలు నేలనుచూస్తున్నాయి. ఆమె కుడిచేతిలో పైటకొంగు నలుగుతున్నది. ఎడమచేయి అసహనంగా అటూయిటూ కదులుతున్నది __ "మీకంటే చిన్నదాన్ని నన్ను మీరు క్షమించమని అడక్కకూడదు" అన్నదామె.
    "పెద్దరికం వయసులో కాదు __ ప్రవర్తనలో వస్తుంది" అన్నాడు ప్రసాదు "ఆవిధంగా చూస్తె నేను నీకంటే ఎంతో చిన్నవాణ్ణి నాప్రవర్తనాను నువ్వు క్షమించాలి"
    వసంతలక్ష్మి కనులు పైకెత్తి అతడివంక చూసి చిన్నగా నవ్వి తిరిగి కనులు వాల్చేసింది.
    ప్రసాదు ముగ్దుడై పోయాడు. ఆ నవ్వులో ఉదయబానుడి అరుణభానుడి అరుణతేజం ఉన్నది వెన్నెలలోని చల్లదనమున్నది గులాబుల సోయాగామున్నది. అన్నింటికీ మించిన అలౌకిక భావన వున్నది.
    "ఈమె క్షమించేపద్దతి ఈవిధంగా వుంటే రోజూ తప్పుచేయాలనిపిస్తుంది__ కేవలం  ఆచిరునగవుకోసం" అని మనసులో మాత్రం అనుకున్నాడు ప్రసాదు పైకి __"నువ్వు  నన్ను క్షమించావుకదూ!" అన్నాడు.
    "ఊం" అన్నదామె.
    "నేను నిన్ను పెళ్ళిచేసుకోవాలంటే నీకిష్టమేనా?"
    "నీకు తెలియదు అంతా మ నాన్న ఇష్టం"
    "పోనీ __ మన పెళ్ళి విషయం నేను మీ నాన్నాగారితో   మాట్లాడాను. అది నీకిష్టమేనా?" అన్నాడు ప్రసాదు.
    "అది మీ యిష్టం" అన్నది వసంతలక్ష్మి.
    "నాకు నీ యిష్టం సంగతి తెలియాలి"
    వసంతలక్ష్మి ఓపట్టాన తన యిష్టం సంగతి చెప్పలేదు. ప్రసాదు పంతంమీద  ఆమెను చివరికి ఊ అనిపించగలిగాడు. అప్పుడాతడామెతో బాబు కారణంగా  తనకువచ్చిన ఇబ్బందిచెప్పుకుని ఆమె సాయంకోరాడు. ఉదయ వలెనే వసంతలక్ష్మి కూడా అలోచిస్తాననీ, మాటిచ్చి వెళ్ళిపోయింది.
    ఆమె వెళ్ళిపోయాక ప్రసాదు అలోచాన్లోపడ్డాడు.
    తనిప్పుడెం చేస్తున్నాడు? అటు ఉదయలోనూ, ఇటు వసంతలక్ష్మిలోనూ ఆశలు రేపుతున్నాడు. ఇద్దరిలో ఒక్కరిని మాత్రమే తాను పెళ్ళిచేసుకునే అవకాశముంది. అంటే వారిలో ఒకరిని నిరుత్సాహపరుచవలసి వుంది అది ఎంతవరకూ సమంజసం?  ఇద్దరిలోనూ తాను సమానంగా ఆశలురేపుతున్నాడు. ఒకరి విషయం ఒకరికి చెప్పడంలేదు. ఇది ఎటువంటి పరిణామాలనుదారితీస్తుంది.?
    ప్రసాదు బాగా ఆలోచించాక _ ఇద్దరిలో  ఏ అమ్మాయిని తాను వివాహ చేసుకోనడో ఆమె వివాహా భాద్యతను తనే స్వీకరించాలని అనుకున్నాడు అందుకు అతడివద్ద సులభమార్గం  ఉందనేవున్నది. అతడు పనిచేస్తున్న కంపెనీలో ఇటీవలే ఒక ఉద్యోగం __ తన ఎన్నిక ముగియగా మిగిలిన అమ్మాయికితగినవరుడికోసం ప్రత్యేకించాలని అనుకున్నాడతడు.
                                       14
    వసంతలక్ష్మి, ఉదయకూడా బాబును ఆకట్టుకోవాలని ప్రయత్నాలు ప్రారంభించారు. కానీ బాబుమాత్రం వాళ్ళను తప్పించుకునే తిరుగుతున్నాడు వాళ్ళను చూస్తె బెదిరిపోతున్నాడు. వాడు వాళ్ళనుమించి నిరంజనరావంటే ఎక్కువ ఆసక్తి చూపుతున్నాడు.
    ఉదయ, వసంతలక్ష్మి ఒకే వీధిలో వుంటున్నారు. అందువల్ల ఇద్దరూ బాబుకోసం ప్రయత్నిస్తున్నట్లు ఇద్దరికీ తెలిసిపోయింది. అంటే తమలోతమకు ఓటీ తీవ్రకర మవుతున్నదని ఇద్దరూ గ్రహించారు. ఆ కారణంగా ఇద్దరూ ఇదివరకటిలా ఒకరినిచూస్తె ఒకరు ఫ్రీగా మాట్లాడుకోలేకపోతున్నారు. అయితే పూర్తిగా మాటలు మానివెయనూలేదు. ఎత్తుకు పైఎత్తులు వేయడానికి ఒకరి మనసు ఒకరికి తెలియకుండా ఎంతో అవసరం. ఈ బాబుగురిమ్చి వాళ్ళోకరి కొకరు దూరమవుతున్నారో ఆ బాబు గురించే వాళ్ళిద్దరూ ప్రసాదు ఒకరినొకరు దగ్గరగా కూడా ఉంటున్నారు.
    గంగాధరం, సుబ్రహ్మణ్యం గార్ల కుటుంబాల మధ్య కూడా రాకపోకలు తగ్గాయి. ఆఖరికి శివరావు రవి కూడా నిరంజనరావు ప్రయివేట్లో తప్ప కలుసుకుని మాట్లాడుకోవడం లేదు.
    రెండు కుటుంబాలవారూ ప్రసాదు తో సంబంధ బాంధవ్యాలు పెంచుకోసాగారు. అతడిని తరుచుగా భోజనానికి పిలుస్తూండడమూ, క్షేమసమాచారాలు విచారిస్తూండడమూ చేస్తూండడేవారు.
    గంగాధరంగారింట్లో  ప్రసాదు బొంచేశాడనీ తెలియగానే సుబ్రహ్మణ్యంగారికి గంగవేర్రులైత్తిపోయేది. అటు ప్రసాదునీ, ఇటు గంగాధరంగారినీ కూడా  ఒకసారిపలకరించివస్తే తప్ప అయాంకు మనఃస్థిమితముండేడికాదు. అటు గంగాధరంపరిస్థితీ అలాగే ఉండేది.
    ప్రసాదు ఇంకా తమచేయిదాటి పోలేదని రూడికావడానికి ప్రసాదుతోనూ, తమ ప్రత్యర్ధి విజయం సాదించానన్న భావనలో  ఇంకాలేడన్న విషయం రూడీపరచుకుందుకు ప్రత్యర్ధితోనూ వాళ్ళు లాంఛన ప్రాయంగా మాట్లాడుతూండేవారు.
    విశేయమేమిటంటే బాబు మాత్రం ఈ రెండు కుటుంబాలకూ చాలా దూరంగా ఉంటున్నాడు. వాళ్ళను తప్పించుకుని  తిరుగుతున్నాడు. ఇదివసంతలక్ష్మికీ, ఉదయకూ చాలా బాధగా ఉండేది.
    ఉదయకు పిల్లల్ని చేరదీయడం చేతకాదు. కానీ వసంతలక్ష్మి అలా కాదు. వాడిని ఆకర్షించడానికామే రకరకాల ప్రయత్నాలు చేస్తూండేది. ఆమె దగ్గరున్నంత సేపూ ముళ్ళమీదున్నట్లే ఉండి వెళ్ళిపోయేవాడు బాబు.
    ఒకరోజామే వాణ్ణి పట్టుకుని __"నాకు నువ్వంటే ఎంతో ఇష్టం నువ్వు నాతో మాట్లాడవేం?" అని నిలదీసింది.
    "నాకు నువ్వంటే ఇష్టంలేదు" అన్నాడు బాబు నిర్మోహమాటంగా
    "ఎందుకని? నీకిష్టమని  నీతో గుఱ్ఱమాటకూడా అడాన్నేను. మర్చిపోయావా? అంది వసంతలక్ష్మి.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra