Home » Vasundhara » మా ఊళ్ళో మహానుభావుడు

  

    రమాకాంతం ముఖంలో చిరాకు స్పష్టంగా కనబడింది. "చదువుకున్న వాళ్ళకు లోకజ్ఞాన మెంత తక్కువో మీ మాటలే ఋజువు చేస్తున్నాయి. ఈ ఊరితో ఏమీ సంబంధం లేనివాడొక దీ వూరోచ్చి ప్రజాసేవ చేస్తున్నాడంటే _ కేవలం ధర్మబుద్దేననా మీ అభిప్రాయం? అతగాడి బుర్రలో ఎన్ని ప్లానులున్నాయో ఎవరికీ తెలుసు? మీరు కనిపెట్టారో లేదో గానీ, ఆ రాజావావీఊళ్ళో పలుకబడి సంపాదించాలని మహాతాపత్రయ పడుతున్నాడు. అందుకేమో ఏదయినా విపత్తు ముంచుకురావచ్చును. అయినా మన గ్రామంలో మీవంటి కుర్రాళ్ళు౦డగా _ మరెక్కడివాడో మనకు సాయం చేయాల్సినఅవసరమేమిటి? అంత చేతకాని వాళ్ళనూ మనం? నేను చెప్పినట్టు వినండి. చూపిద్దాం మన తడఖా. దెబ్బకు రాజారావు విద్యాదానోద్యమం మూలపడాలి __"

    నరహరి ప్రశ్నార్ధకంగా రమాకాంతం వంక చూశాడు' అయన వెంటనే __"కావాల్సిన సాయం మీకు నేను చేస్తాను. రాజారావు కంటె ఎక్కువ హుమ్గులతో విద్యాదాన కార్యక్రమం మొదలుపెట్టండి. శతవిధాల జనాల నాకర్షించడానికి ప్రయత్నించండి _-" అన్నాడు.

    "కానీ __ ఈలోగా మాకుఉధ్యోగం దొరికితే ....."

    "అది నాకూ తెలుసులేవయ్యా _ ఉద్యోగం దొరికేదాకానే ఈ కార్యక్రమమూనూ! ఆ రాజారావు కార్యక్రమం మూలపడడమే నాక్కావాల్సి౦ది. మనూరి బాగోగులు మనం చూసుకువాలి గానీ _- ఎక్కడివాడో చూడ్డమేమిటీ?"

    "బొత్తిగా నాలుగయిదు నెలల్లోనే మన కార్యక్రమం మూలపడిపోతే అంతా ఏమనుకుంటారు?" మొహమాట పడుతూ అడిగాడు నరహరి.

    రమాకాంతం మీసాల్ని చిన్నగా దువ్వి వదిలాడు __ "మీరు నా గురిగున్నవాళ్ళు కాబట్టి ఓ రహస్యం చెబుతున్నాను _ వినండి ఈ రోజుల్లో సుఖజీవనానికి పలికుబడి చాలా అవసరం. మనం చేసేపని మంచిదా, చెడ్డదా అనే ప్రశ్నతో మనకు నిమిత్తంలేదు . ఆ పని మనకు పలుకుబడి తెస్తుందా, లేదా అన్నదే ప్రశ్న! ఒక పనిచేసి మనం పలుకుబడి సంపాదించలేక _ ఆరోగ్యమో, అత్యవసర కారణమోవంక పేట్టి ఆ పని మానివేయాలి. ఆ తర్వాత పలుకుబడి నిలబెట్టు కునెందుకు మార్గాలనేకమున్నాయి. మరో విషయం . మనకు సంబంధించిన విషయాన్ని ప్రేమిస్తున్నట్టు నలుగురికీ తెలిసేలా ప్రవర్తించాలి. అన్ని దేశాలనూ మించి మన దేశాన్ని ప్రేమించాలి . దేశం కంటె ఎక్కువగా మన రాష్ట్రాన్నీ ,  భాషనూ ప్రేమించాలి. రాష్ట్రం కంటె ఎక్కువగా   గ్రామాన్నీ ప్రేమించాలి . స్వాభిమానానికీ మొదటి మెట్టు గ్రామం. గ్రామంతో ప్రారంభిస్తే _ అదృష్టం బాగుంటే దేశ నాయుకులం కూడా కావచ్చు . ఇప్పుడు రాజారావు మనూరివాడు కాదు. ఆ విధంగా మనకతడు శత్రువుకూడాను......"

    ఆ యువకలకు రమాకాంతంతో అవసరముంది. అందువల్లనేమో రమాకాంతం ఉపన్యాసం వారిపై పనిచేసింది. అంతా అంగీకారసూచకంగా తలలూపారు.

    "రాజారావోక్కడు. మీరాయిదుగురు. మీ కార్యక్రమానికి అనుకూలమయినది. నరహరి యిల్లు. ఏమంటారు. ?

    "మరి ఆడవాళ్ళకు చదువెవరు చెబుతారు?" అనడిగాడు నరహరి.

    రమాకాంతం స్వరం తగ్గించి _ " అందుకో ఉపాయమాలోచించే ఉంచాను. ఆడది చదువుకోవడంవల్ల ఎంతోప్రమాదమో _ ఆడాళ్ళు కూడా  ఆగిపోతారు __"

    "ఇంతకీ మన ఉద్దేశ్యం రాజారావుగారి౦టికి ఎవర్నీ వెళ్ళకుండా చెయ్యడానికా లేక ఊళ్ళోవాళ్ళకు చదువుచెప్పాలనా?" అంటూ ఉండబట్టలేక తన చిరాకును వ్యక్తపరిచాడు. చంద్రమోహన్ అనబడే ఓ యువకుడు .

    "ఈ సంగతిప్పటి కర్ధమయిందా?" అన్నాడు రమాకాంతం తనూ చిరాకుపడుతూ.

                                                                     7

    రాజు తలచుకుంటే దెబ్బలకు కొదువలేదు. రమాకాంతం ఆ ఊరికి మకుటంలేని మహారాజు.

    నరహరి బృందంతో మాటలు ముగిసిన కొద్ది క్షణాల్లోనే అయన ఊళ్ళో చాటింపు వేయించాడు. ఊళ్ళో చదువు కావాలనుకున్న పెద్దలందరికీ రమాకాంతం చేసిన ఏర్పాటు ప్రకారం నరహరి యింట్లో చదువు చేబుతారనీ, మొదటి రోజున అందరకూ ఉచితంగా పెంసిళ్ళూ,    నోటు బుక్సూ పంచి పెట్టబడతాయనీ ఆ చాటింపు సారాంశం.
   
    ఆ చాటింపు ఊళ్ళో చెప్పుకోదగ్గ సంచాలనాన్నీ లేసింది .

    రాజారావుకి పోటీగా రమాకాంత౦ దీన్ని లేవదీశాడని అందరికీ అర్ధమయిపోయింది. అయితే ఆయనకు రాజారావుతో పోటీ ఎందుకో చాలామందికి అర్ధంకాలేదు.

    ఇన్నేళ్ళుగా ఊళ్ళోవాళ్ళ చదువుసంధ్యల గురించి పట్టించుకోని ప్రెసిడెంటు గారికి హఠాత్తుగా ఊరోళ్ళ బాగుకావాలాసోచ్చిందే అని కొందరు వెటకారమాడుకున్నారు. కానీ పెన్సిలూ, నోటుబుక్కూ అనగానే కనీసం కుర్రగాళ్ళ కయినా పనికొస్తాయి. గదా అని చాలమందికి మనసు పీకింది అదేకాక చదువు చెప్పేది అయిదుగురు కుర్రాళ్ళ కాబట్టి ఎక్కువమంది నేర్చుకు౦దుకునే అవకాశముంటుంది.

    అ రాత్రి నరహరి౦టి సావడిలో సుమారు నూటయాభైమంది పొగడ్డారు. అక్కడ అయిదుగురు యువకులతో పాటు రమాకాంతం కూడా ఉన్నాడు. అయన అందరికీ తనే స్వయంగా పెన్సిళ్ళూ, నోటుబుక్సూ పంచిపేట్టి __ "మన గ్రామంలో విద్యాభిలాష లింతమందున్నారంటే నాకు చాలా సంతోషంగా వుంది. అఏ గ్రామంలో ప్రజలకు చదువంటే ఆపేక్ష వుంటుందో __ ఆ గ్రామం ముందుకు పోతుంది. ఇన్నేళ్ళుగా నేను ప్రెసిడెంటుగా ఉండటంవల్ల మీలో యింతగొప్ప మార్పు వచ్చింది. ఆ మార్పు కూడా నాకు తెలియకుండా జరిగిపోయింది. లేకుంటే ఇలాంటి ఏర్పాటుప్పుడో చేయించి ఉండేవాడ్ని . అయినా మీ బాగోగులు చూడమని కదా మీరు నన్నేన్నుకున్నారు. నాకు తెలిసినంత వరకూ నేను చూస్తూనే ఉన్నాను. కానీ నేనేమయినా చూడకపొతే అడగాల్సిన బాధ్యత కూడా మీ మీదుంది. మీ బాధ్యత మీరు సక్రమంగా నిర్వర్తించలేదు. అందుకే ఎవరో పొరుగూరి వాడోచ్చేదాకా __ మీకు చదువుకోవాలనందున్న విషయం నాకు తెలియలేదు . ఆత్డికి ఆశయం మంచిదే. కానీ ఒక్కడూ ఏం చేయగలడు? మొదట్లోనే అతడీ విషయంలో నా సహాయ మడిగాడు. మీరు నా ప్రజలు . మీకు చదువుకోవాలనుకుంటే ముందు నాకు చెబుతారు. ఇలాగనుకుని నేనతడి మాటలకు ప్రాముఖ్యాన్నివ్వలేదు. ఇప్పుడు మీ శ్రద్ధ తెలిసింది కాబట్టి. మీ కోసం అయిదుగురు మేస్టర్లను పెట్టాను. వీళ్ళు పొరుగూరివాళ్ళు కాదు. మనూరివాళ్ళు. మీ వాళ్ళు అసలు నాకే యింకా చదువుకోవలనుంది. కానీ మీరు నా నేత్తిమీద పడేసిన గురుతర బాధ్యతుంది చూశారూ __ అది నన్ను చదువుకొనివ్వడంలేదు. ఏమయితే నేం __ మీరైనా హాయిగా చదువుకోండి మరొక్క విషయం. మీరు మీ మీ ఆడవాళ్ళను చదువుకుందుకు పంపిస్తున్నారని తెలిసింది. చదువు మగాడికెంత మేలు చేస్తుందో. ఆడదానికంత కీడు చేస్తుంది. ఎందుకంటే చదువుకున్నాక వాళ్ళు పత్రికలూ. నవలలూ చదవడం మొదలెడతారు. వాటిల్లో అన్నీ నీటికి దూరంగా వుండేవె! కొంత మంచి ఉన్నప్పటికీ, చెడు ఎక్కినంత సులభంగా మనసుకి మంచి ఎక్కాడు కదా! అందువల్ల ఆడవాళ్ళు చెడిపోతారు. కాబట్టి ఈ విషయం మరోసారి ఆలోచించండి. మరి నేను ఉంటాను. అవతల చూసుకోవలనిన పనులు చాలా ఉన్నాయి. ప్రెసిడెంటుగా నా కాలపరిమితి అయిపోవస్తుందేమో _ చాలా సమస్యలు పరిష్కరించాలి. సెలవు __" అని ఓ ఉపన్యాసం దంచిపారేసివెళ్ళిపోయాడు.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra