అప్రతిభురాలై చూస్తుంది అతన్నే. ఒక మనిషి శక్తిని అతనేం చేయగలడు అన్న సూత్రం పై నిర్ధారణ చేసే ఆధునికమయిన మీన్స్ ని మాత్రమె తెలిసిన హానిత, యిక్కడ అప్పటికే అతను ఏం చేశాడో తెలిశాక తొలిసారి అతన్ని బలపరిచి తప్పు చేయలేదని తెలుసుకో గలిగింది.అయినా ఆ భావాన్ని మొహంలో కనిపించనివ్వలేదు.
"వెల్ .... కరేక్టు గా అంచనా వేశారు కిరిటీ. నిజమే! ప్రక్షాళన కార్యక్రమం మొదలుపెట్టాను. యింకా లోతుగా వెళ్ళనేలేదు. బోధపడి పోయింది. ఆ విధంగా నేను చాలామందికి శత్రువు నవుతున్నానని, అయినా మిశ్రమించదలుచుకోలేదు కిరిటీ. అలా మధ్యమతరంగా ఆగే మనస్తత్వమే అయితే అసలు మొదలు పెట్టేదాన్ని కాదేమో, ఇది ఇలాగే కొనసాగాలి. లక్షల ఖర్చుచేసి రేసేర్చితో సాధించిన ఎన్నో ఫార్ములాలు పోటీ మందుల కంపెనీలకి ముందే ఎలా చేరుతున్నాయో, కష్టమర్స్ అవసరాల్ని బట్టి మన మెషిన్ టూర్ ఫ్యాక్టరీ లో తయారయ్యే డిజైన్స్ డాక్యు మెంట్స్ రైవల్ యిండస్ట్రీల గుప్పిట్లలోకి ఎలా చిక్కుతున్నాయో, యంత్ర పరికరాల కొటేషన్ రేట్స్ ప్రత్యర్ధులకి ముందే ఎలా తెలసిపోతున్నాయో, ఒక్కటి కాదు కిరిటీ __ చాలా లొసుగుల్ని తెలుసుకోవాల్సిన అగత్యముంది. ఓ నిజం చెప్పనా?" తననే తదేకంగా చూస్తున్న కిరీటి చూపుల వాడిని తట్టుకోలేనట్టు క్షణం పాటు రెప్పల్ని వాల్చుకుంది.
"సుఖపడటానికి డబ్బే అవసరమనుకుంటే నా కలాంటి సమస్య లేదు కిరీటి! ఈ సంస్థలన్నీ మూతపడినా తరగనంత ఆస్తి నాకుంది. అది కాదు నేనిప్పుడు ఆలోచిస్తున్నది. ఏ ఉద్దేశ్యంతో ప్రారంభం కానీ నాన్న గారి అకుంఠిత దీక్ష ఫలితంగా ఈ సంస్థ వేలాదిమంది కార్మికులకి ఉపాధిని అందివ్వగలుగుతూంది. దీనికి ఎలాంటి అనర్ధం వాటిల్లిలా వేల కుంటుంబాలు అన్యాయమై పోతాయి. నేనేదో సామాజికమైన స్పృహతో మాట్లాడటం లేదు. ఎ బిట్ ఆఫ్ సెంటి మెంట్!"
"నిజమే! లాభాల నాశించి ఒక వ్యాపారాన్ని మొదలు పెట్టిన ఏ పారిశ్రామిక వేత్తయినా అది అసాధారణంగా విస్తరించి వేలమంది ఉపాధికి కారణమైనప్పుడు వ్యక్తి వాదపు ఎల్లల నుంచి సంఘమంతంగా ఎదిగి సామాజిక స్పృహతో ఆలోచిస్తాడు.
"మిస్ హనితా .... నిన్నటి తరానికి చెందిన మీ డాడీ సుదర్శనరావు గారు ఇలాంటి పెసులుబాటుకి కారణమయ్యంటారని నేను అభిప్రాయపడితే నన్ను అపార్ధం చేసుకోకండి. పరిశ్రమల్లో మోడరనైజేషన్ అంటే సోఫిష్టికేటేడ్ టెక్నాలజీ ని దిగుమతి చేసుకోవడమే అన్నది యిప్పటి పారిశ్రామిక వేత్తలలో బలంగా నాటుకుపోయిన విషయమయింది విప్లవమూ ఒక పరిశ్రమ పురోభివృద్ధుకి చాలా అవసరమయినవి ఎందరికి తెలుసు ....? వ్యక్తి సంస్కారమే పారిశ్రామిక పరిణతికి కారణమన్న సిద్దాంతాన్ని మరచిపోవడం నిజంగా దారుణంకదూ?"
ఆమె ఊహకందని మరో విశ్లేషణ వింటూ రెప్పలార్పకుండా కిరీటి నే చూస్తూ వుండిపోయింది.
ఉదాహరణకి నిన్న మాట్లాడిన పరిస్థితినే తీసుకుందాం . మన దేశ విభజన తర్వాత మతపరమైన పార్టీలని నిషేధించాలనే ఓ ఆలోచన గాంధీ హత్యలో పూర్తిగా రూపు దిద్దుకుంది. నెహ్రూ ప్రోద్భలంతో ఏకగ్రీవంగా ఆలోచించారు కూడా. చిత్రమేమిటంటే అది అవేశంతోనే తీసుకున్న నిర్ణయం గానే మిగిలిపోయింది. దానిక్కారణం నెహ్రూలోని నెమ్మది తనం .... ఎందరి సంఘీభావంతోనో సాధించుకున్న స్వాతంత్ర్యం ఆదిలోనే అవాంతరాలతో విచ్ఛిన్నమై దేశాన్ని రాజకీయంగా దెబ్బతీస్తుందేమోనన్న సందిగ్ధం అదే సరిగ్గా ఆ కోద్ధిపాటి అలసత్వమే ఈ దేశ రాజకీయ చరిత్రని మార్చి ఇప్పటి పంజాబ్ సమస్య వరకూ దారితీసింది ఇది వినడానికి అతిశయోక్తిగా అనిపించవచ్చు కాని పచ్చినిజం. అపార్ధాలకి జంకుతూ నిర్ణయాలని ఇలా నెట్టుకుంటూ వచ్చిన నేహ్రుని అయన కూతురు ఇందిరా ప్రియదర్శిని పాఠంగా మార్చుకుంది. తప్పని పరిస్థితిలో యిప్పుడు మీలాగే" ఓ క్షణం ఆగి "ప్రక్షాళన కార్యక్రమం మొదలుపేట్టి తిరుగులేని స్థాయికి ఈ దేశపు ఔన్నత్వాన్ని సడలించగలిగింది. కొందరికి శత్రువైతేనేం మరి కొందరు నియంత అని టూలనాడితేనేం, తనకంటూ చరిత్రని మిగుల్చుకోగలిగింది" అన్నాడు.
నిన్న మొన్నటి ఆలోచనల గ్రహణానికి ఓ అందమైన నిర్వచన మిచ్చిన కిరీటి యిప్పుడు ఆమె ఊహలకి మించి ఎదిగిపోయిందిక్కడే! తమ అవసరానికి మించి మాట్లాడుతూన్నానేమో అన్న మీమాంస అణుమాత్రమయినా వుంటే అది పూర్తిగా చెరిగిపోవడంతో హానిత అనుకుంది అగ్ని జూలు విదుల్చుకుంటూ చీకటి కోహారంలోకి ఇక పూర్తిగా చొచ్చుకు పోవచ్చుని.
చాలా స్వల్పకాలంలో తన మాన్సులో అసాధారణమైన స్థానాన్ని సంపాదించుకున్న అతడ్ని చూడడంలేదిప్పుడు! తల వంచుకుని అలోచిస్తూంది అతని గురించే.
"మిస్ హనితా!" సముద్రపుహొరు నేపథ్యంలో యిప్పుడతని గొంతు కృతజ్ఞతతో ఆర్ద్రంగా పలికింది. "ఇక్కడ మీరు మనసు విప్పి మాట్లాడి ఒక తుఫాను భీభత్సాన్ని అతి సుందరంగా తెలియజెప్పారు. యిప్పటిదాకా ఓ మామూలు మనిషినే అయిన నేను మీరు కలిగించిన ఈ సదవకాశంలో మీ ఊహల మేరకి ఎదగటానికి ప్రయత్నిస్తాను. నిద్రా హారాలుమాని మీ అనుమతితో మీ యజ్ఞంలో అవసరమయితే నేనూ సమిధంగా మారి, నా బ్రతుక్కీ ఓ అర్ధాన్ని కల్పించుకుంటాను. ఎడారిలో ఓ సహా ప్రయాణికుడిలా గమ్యందాకా నడుస్తానని హామీ యిస్తున్నాను."
ఏ కళ్ళ వాకిళ్ళు సోగసుల్ని చిమ్ముతున్నాయి.
చీకటి నీడ లిప్పుడు బోసినవ్వులతో యిద్దర్నీ పరామర్శిస్తున్నాయి.
"మరి" ఆమె పెదవులు అందంగా విచ్చుకున్నాయి. "యిలాంటి గుడ్ న్యూస్ చెప్పాను ఏమిస్తారు?"
అరనిముషంపాటు ఎక్కడికో వెళ్ళిన కిరీటి ఓ పొట్లంతో తిరిగి వచ్చాడు.
అందులో బఠానీలున్నాయి....
ఆమె నవ్వలేదు.. కనీసం నవ్వలనీ అనిపించలేదు. తనకున్న సమస్యలు స్వల్పంగా మారినట్టు అనిపిస్తుంటే ఆ స్వరాన్ని అసల్పంగా అతనితో పంచుకుంటున్నట్టు చేతిని చాచింది.
సరిగ్గా యిదే సమయంలో .....
వీరిద్దర్ని దూరళనుంచే గమనిస్తున్న ఓ అకారం విస్మయంగా చీకటి లో రెండడుగులు ముందుకి నడిచింది.
ఇప్పుడు హనిత మాత్రమే మాత్రామే కాదు. కిరిటీ కూడా మృత్యువు కుంచెతో వెల్లవేయాల్సిన ఓ అడ్డుగోడలా కనిపిస్తున్నాడు.
* * * * *
చితులుంచిన చోట చిగురించిన చీకటి తోటలా నిశీధి నగరాన్ని కప్పుతూంది.
అర్దరాత్రి గడిచిన సూచనగా వూరంతా సద్దుమణిగింది.
హొటలు గదిలోని మూడో అంతస్తు బాల్కానీ దగ్గర నిలబడ్డ కిరీటి శీతలవాయువు స్పర్శకు చలించకుండా దూరంగా చూస్తున్నాడు నిశ్చలంగా నిర్మలంగా.
ఆకాశంలో ఆవరించిన నల్లని మబ్బులు అప్పటికే చంద్రుణ్ని కప్పి వెన్నెలని ఉరికంబమెక్కిస్తున్న ఆ క్షణంలో .....
నెమ్మదిగా ఓ ఆకారం గది తలుపు తెరుచుకుని లోపలికివచ్చింది.
ఆలోచనలనుంచి యింకా తేరుకుని కిరిటీ అది గమనించలేదు.
ఓ అరలిప్తపాటు యింకా తెరుకుఇ కిరిటీ అది గమనించలేదు.
ఓ అరలిప్తపాటు గదిలో నిలబడ్డ ఆగంతుకుడు బాల్కానీని అనుకుని ఉన్న కిరితీని చూడగానే మృత్యువులా మనసారా నవ్వుకున్నాడు.
అక్కడ స్థాణువులా వున్న కిరీటి మొన్న మరో హొటల్లో ఇలానే నిలబడి నెలకి జారిన రణధీర్ కాకా, యింకా మొదలుకాని ఏడాదికి చెందిన చిరిగిపోయే కేలండర్ లా అనిపిస్తున్నాడు.
ఆ గదిలో చీము చిటుక్కుమంటే వినిపించేటంత నిశ్శబ్దం.
అగంతకుడు అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకు కదిలాడు.
చేతిలో వున్న కత్తితో యిప్పుడు అవసరమనిపించక పేంటుజేబులో దాచుకున్నాడు.
ప్రపంచం హత్యగా కాక ఆత్మహత్యగా అంగీకరించే మరో సంఘటనకి అవకాశం దక్కినట్టు ఆగంతుకుడు అప్పటికే కిరితీని చేరుకున్నాడు.
పిట్టగోడపై చేతులానించి నిలబడ్డ కిరితీని అమాంతం ముందుకు నెట్టాడు.
"అంతే!
కిరిటీ బాలెన్స్ తప్పాడు.
* * * *
ఉలిక్కిపడి నిద్రలేచింది హనిత. ఉద్విగ్నతకి చిహ్నంగా ఆమె గుండెలు ఎగిసిపడుతున్నాయి.
భువనభవనంపైన నర్తించే నిశీదికి జలదరిస్తున్నట్టు సముద్ర ఘోష స్పష్టంగా వినిపిస్తూ౦ది.
అదేకల! ఇంచుమించు ప్రతిరాత్రీ ప్రమాద సూచకంగా ఆమెని కలవరపరిచే అదే స్వప్నం!
సముస్ర మధ్యలో తన ఓడ ప్రయాణం .... చుట్టూ కమ్ముకునే తరంగాల హొరు .... పెను ప్రభంజనపు కాసాయిపాదంతో తొక్కుతూ మృత్యుజిహ్వాను సాచి మీదపడే తుఫాను. కనిపించని ఒడ్డునో, కనుచూపు మెర్సలో కానరాని గమ్యానో వెతుక్కుంటు౦డగా ఓడ పగిలిన చప్పుడు. భూనభోమండలాన్ని కలిపే ఉప్పునీటి కరాష నృత్యం.
బడలికగా బెడ్ పైనుంచి లేచింది.