Previous Page Next Page 
అసురవేదం పేజి 15

   

    సాయంత్రం నాలుగు గంటలు కావస్తూంది.

    అంతసేపూ జడివానలో తడిసిన పక్షిలా అణువంత ఉద్వేగంగా లోనయిన హానిత మనసుని ఇప్పుడు అదుపులోకి తీసుకురాగలిగింది.

    ఫోమ్ బెడ్ పైన ఓ వారగా ఒత్తిగిలి అరచేతుల్ని చెంపల కిందుగా వుంచుకుని గోడపై వున్న అందమయిన పోర్టేయిట్ ని చూస్తున్న ఆమెకి అ ఆక్షణంలో హఠాత్తుగా కిరీటి గుర్తుకురావడం యాద్ర్శ్హకమే.

    తెలసి తెలసి మహారణ్యపు చిక్కుదారుల్లో నడవాలని కోరుకున్న ఆమె ఎద గోడల నడుమ ముందు నీడలో, తరువాత పొగ చూరిన జాడలా అతని రూపం అంకురించి క్రమంగా విస్తరించి ఓడిస్తుంటే ఇదేమిటి అనుకుంది.

    దేనికీ రాజీపడని మనస్తత్వం ఆమెది. చాలా నిర్ణయాలని ఉద్వేగంగా తీసుకునే అలవాటున్న యువతి ఆమె. ఈ రోజు కిరీటిని సమర్ధిచడంలోనూ అలాంటి తొందరపాటునే ప్రదర్శించింది.

    తను ఉన్న స్థాయిలో నిలబడి ఆలోచిస్తే కిరిటీ చాలా సామాన్యుడు అయినా అతనితో  మాట్లాడాలనిపించింది. ఇక్కడ తను తొందరపడింది

    పోన్ రిసీవర్ని అందుకుని దయాల్ చేస్తుంటే కొద్దిగా చేతులు వణికాయి. అరనిముషంలో అవతలివేపు నుంచి జవాబు వినిపించింది.

    "ప్లీజ్ కనెక్టుమి టు రూమ్ నెంబర్ ట్రీ జీరో త్రీ"

    "హలో" మరో క్షణంలో కిరిటీ గొంతు వినిపించింది "కిరిటీ హియర్"

    అప్పుడు త్రోటుపడింది హానిత. "నేను .... హనితని"

    "వ్వా .... వ్వాట్?" ఆమె కంఠం వినగానే అతనెంత కంగారుపడిందీ స్పష్టంగా తెలిసిపోతూనే వుంది. "గు .... గుడ్ద నైట్! సారీ గుడాష్టర్ నూ .... నూన్ "

    "ఏం చేస్తున్నారు?" హానిత పెదవులు బిగుసుకున్నాయి. అతని స్థితి అర్ధమైనట్టు .

    "మాట్లాడరేం?"

    "లు .... లుంగీ ... సారీ ... నిద్ర .... ఇప్పుడే "

    ఓ అరక్షణం గడుపు తీసుకుంది అతను తేరుకునే అవకాశమిస్తున్నట్టు.

    "ఆర్ యు ఓ.కే?"

    "ఎ ... ఎస్ ... మేడం"

    "ఈ రోజే వెళ్ళిపోతున్నారా?"

    ఇంటర్వ్యూకి రప్పించిన అభ్యర్ధులు కోసం కేటాయించబడినరూం ఆ రాత్రికే ఖాళీ చేయాలని ఆమెకీ తెలుసు.

    "మరేం"

    "మీరు వెళ్ళడంలేదు"

    "అదేం?" ఇంకా హడావుడిగానే వినిపిస్తూంది అతని కంఠం.

    "మీతో మాట్లాడాలి"

    "రా ...... రానా?"

    "ఎక్కడికి ?"

    జవాబు లేదు.

    "రండి"

    "ఎక్కడికి?" ఈసారి కిరీటి అడిగాడు.

    "అక్కడికే ...." ఓ క్షణం ఆగింది . " ఆ రోజు తొలిసారి మనం కలసుకున్నామ్ .... సముద్రం ఒడ్డున ... అదే మీరు బఠానీలు ....."

    కిరిటీ ఒళ్ళంతా అప్పటికే చెమటతో తడిసిపోయిన విషయంగానీ, అతను జారిపోయిన లుంగీని సైతం మరచి నిలబడి వున్నడనిగాని ఆమె ఊహించి ఉండదు.

    "సరిగ్గా రాత్రి ఎనిమిది గంటలకి కోసం వెయిట్ చేస్తుంటాను" హానిత ఫోన్ క్రేడిల్ చేసింది.

    అప్పుడు చూసుకుంది....... ఆమె ఫాలగామో స్వేదంతో పోయింది.

                                                                    *    *    *    *   

    సరిగ్గా మరో అరగంటకి .....

    ప్రభంజనరావు ఇంటిలో ఫోన్ రింగయింది.

    "ఎస్ .... ప్రభంజనరావు హియర్"

    "నేను సాకేతని మాట్లాడుతున్నాను"

    వెంటనే అలర్ట్ అయిపోయాడు "చెప్పు"

    "నేనో ఆపదలో చిక్కుకున్నాను" ఆమె గొంతు అందోళనాగా వినిపిస్తూంది.

    "వ్వాట్?" ప్రభంజనరావు భ్రుకుటి ముడిపడింది. "ఎవరి మూలముగా?"

    "దట్ డెవిల్ ...... హానిత!"

    ఓ అరక్షణంపాటు సాలోచనగా చూస్తూ ఉండిపోయిన ప్రభంజరావు మెదడు వేగంగా పనిచేయడం మొదలుపెట్టింది. "సో ..... నా సహాయం కావాలంటావ్."

    "అవును .... వెంటనే నేను మిమ్మల్ని కలుసుకోవాలి"

    "ఆ అవకాశామే అతను కోరింది కూడా. చాలా ప్రశ్నలకు జవాబు కాని, హానిత లాంటి రూపమే ఉన్న అమ్మాయినంటూ చెప్పిన సాకేతం చూసి కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికిగాని ఇంతకంటే, మరో అవకాశరాదు. "ఎక్కడ ... ఇంటికి వస్తారా?"

    "లేదు. మీరే శాంతి దగ్గరికి రండి. నేను అతడికి బోధలేదు. వెంటనే బయలుదేరాడు.

    పది నిముషాల వ్యవధిలో సాకేత చెప్పిన సంకేత స్థలానికి చేరికున్న ప్రభంజనరావు ఎంతగా అప్రతిభుడ య్యాడూ అంటే ఇలాంటి సన్నివేశం అతను జీవితంలో ఊహించలేనిది.

    అభ్యంగన స్నానం చేసిన కురులు గాలికి నెమ్మదిగా నర్తిస్తూంటే నీలరంగు ఓణీతో , నుదుట సిందూరాన్ని సాకేత మమ్మూర్తులా హానితలా ఉండటమే కాదు _ ఎద జారిన వయ్యేదతో అంగ సౌష్టవము ఎలాంటి మగాడినైనా రెచ్చగోడుతున్నట్టుగా ఆహ్వానిస్తూంది.

                                                                 *    *    *    *

    సమీపంలో సముద్రపు హొరు.

    కనుచూపుమేర దాకా విస్తరించిన శాంతి ఆశ్రమానికి చేరువలో జనసంచారం లేదు.

    పశ్చిమానికి క్రమంగా వాలిపోతున్న సూర్యుడి లేత కిరణాలలో రణానికి సిద్దమైనట్టు నుదుట ముత్యాల్లా జారుతున్న స్వేదఝురితో నిలబడ్డ సాకేత సజీవ లావణ్య స్వప్నరేఖలా అనిపిస్తుంటే ఇంకా విస్మయం నుంచి తేరుకోలేకపోతున్నాడు ప్రభంజనరావు.

    మనిషిని పోలిన మనిషి గురించి అతనంతదాకా విన్నాడు తప్ప ఇలా అనుభవపూర్వకంగా ఏనాడూ చూడలేదు.

    అవే కళ్ళు .... అలాంటిదే నాసిక ......

    పొడవులో ఓ అంగుళం తక్కువ ఉంటుందేమో తప్ప హనిత అందానికి ఎ విధంగానూ తీసిపోని అమ్మాయి సాకేత.

    హనిత కన్నా వయసు ఎక్కువగా అనిపిస్తున్నా ఓణీ, పావడాలు ఉబికిన సాకేత ఓంపుల్ని ప్రస్తుటం చేస్తూ, పట్టుచీర ఒంటికి చుట్టుకుంటే ఆమె హనిత అని అంతా పొరపాటుపడేంత మనైగ్నంగా ఉంది.

    "సో " ఒక ద్రువపు దిగంతంలో నిలబడినట్టు సాకేత వక్షోజాల్ని చూస్తూ అన్నాడు ప్రభంజనరావు "యూ ఆర్ సాకేత!"

    నిశీధిలో నిశ్సబ్దంగా గాలి అలలా నెమ్మదిగా ఇసుకలో నడిచి ఓ రాతిపైన కూర్చుంది సాకేత.

    ఇప్పుడామె సౌందర్యం ఊర్ధ్వ్య అదోరేఖల్ని కలిపే హరివిల్లూ లా ఉంది.

    వయసుదిగిన ప్రభంజనరావు సైతం దృష్టి మరల్చుకోలేనంత లాలసత్వంతో ఉక్కిరిబిక్కిరౌతూ అన్నాడు . "అద్భుతంగా ఉంది."   
   
    "ఏమిటీ ?" అప్పుడు పెదవి విప్పింది సాకేత ఓరగా చూస్తూ.

    "నీ అందం"

    "నిన్ను పిలిచింది అది కొలవడానికి కాదు.

    ఆమె ఏకవచనంతో అడ్రస్ చేయడం అతనికి కోపం తెప్పించలేదు. ఆమె హనిత పెరిగినంత సంస్కారపు భవంతుల్లో ప్రమోదంగా భరిస్తున్నాడు.

    "ఎస్ మిస్టర్ ప్రభంజనరావ్! ఒక అకుమాటు పిందెలా ఎక్కడోమీ ఎవరి దృష్టి కీ రాకుండా ఇన్నాళ్ళూ ఎలాంటి అవసరాన్నీ కోరకుండా అయినా ఇదిగో, ఇప్పుడు తప్పనిసరైంది. వచ్చింది నీ సహాయాన్ని కోరి తప్ప నా ఓణీమాటున ఉన్న ఓంపుల్నీ నీకు చూపించాలని కాదు."

    తత్తరపడిన ప్రభంజనరావు. కిప్పుడు పూర్తిగా బోధపడింది. హనిత సాకేతకీ ఉన్న ముఖ్యమైన వ్యత్యాసమేమిటో.

    హనిత తెరచుకొని తాళపత్ర గ్రంధం .

    సాకేతఏ భావాన్నీ అంత సునాయాసంగా వ్యక్తం చేయదు.

    సాకేత ఏడీ మనసులో దాచుకొదు. అంతమాత్రమే కాదు __ హనిత గొంతులో లేని మార్దవం , మగాణ్ణి రెచ్చగొట్టగల మత్తూ _ సాకేత గొంతు స్పష్టంగా వినిపిస్తున్నాయి.

    "నువ్వు నాకు నచ్చావు" ఎక్సరే కళ్ళతో చూస్తూ అన్నాడు.

    "నీ మెచ్చుకోలు నాకు అక్కర్లేదు."

    "మరి?"

    "చెవ ఉంటే సహాయం చెయ్యి"

    "నన్ను తక్కువగా అంచనా వేయకు"

    ఫకలున నవ్వింది.

    "ఏం .... అసమర్ధుణ్ణనుకుంటున్నావా?"

    "మగాడి సమర్ధత ఆడది కొలిచేది శృంగారంలోకాదు. మగాడు అని నిరూపించుకోవాల్సిన వ్యవహారంలో."

 Previous Page Next Page