Previous Page Next Page 
విరాజి పేజి 15

 

    పత్రికల సర్క్యులేషన్స్  పదివేల కాఫీలు పెంచగలిగితే మహారచయిత అంటున్నాం

    డబ్బు సంపాదించడం, పేజీలను పైసలతో కొలవడంతప్ప రుచీ, అభిరుచులనీ పభ్లీషర్ ఆకాశానికెత్తితే ఆ అందలాన్ని ఎంజాయ్ చేస్తూ ఛాతి విరుచుకుంటున్నాం.

    టాల్ స్టాయ్ అనాకేరినీనా! వార్ ఎండ్ పీస్.
   
    గోర్కి అమ్మ

    టర్కీవీన్ రచనలు

    ఇంకా చార్లెస్. డికెన్స్ , థామస్ హార్డీ హక్సలీ లారెన్స్, ఆఖరికి మోపాసా.....

    జీవితాల్లోకి ఎలా చొచ్చుకుని చొచ్చుకుని వెళ్ళిపోయారు? ఎక్కడా రాజీపడకుండా అణువణువూ మధించి పారేశారు.

    నాటకాలు చూసుకున్నా షేక్ స్పియర్ , షా, ఇబ్బవ్ ....

    ఇన్ని ఆధునిక అవకాశాలతో రచయిత నాగరికంగా ఎదగాల్సింది పోయి ఆ నాగరికంగా ఎందుకు దిగజారిపోతున్నాడు. ఎక్కడుంది లోపం!

    ఈ అల్ప సంతోషానికి ఎందుకు బానిస అయిపోతున్నాడు?

    రాయాలన్న తపన.

    రాయాలంటే భయం.

    ఏమీ తెలుసుకోకుండా కేవలం ఇద్రేకంలో  ఆవేశంలో, రాయటం లేదు. తెలుసుకుని _ కనీసం కొంత __ బాధ్యతతో రాయటం వేరు.

    కలం పట్టుకుంటే చెయ్యి వణుకుతోంది.

    తనకంత శక్తిలేదు. రాయలేదననుకున్నాడు.

    రాయడమంటే ఆషామాషి కాదు. అదో ఉద్యమం. అదో తపస్సు. అదో మనవజీవిత అత్తగల పొరల నిరాశా!

                                                             *    *    *   

    ఆస్కార్ వైలది డోరుయన్ గ్రే చదివాడు. వొళ్ళు జలదరించింది ఎంత గొప్ప పరిశీలనా శక్తి ! అధారిటీ! అలాంటీ నవల ఒక్క రాయగలిగితే .....!

    పడుకుంటే నిద్రపట్టదు. రాయబోతే అన్నీ ప్రశ్నర్ధకాలే ఎదురవుతున్నాయి! ఓ రాత్రి పదిగంటలవేళ గదిలో ఉండలేక బయటకు వొచ్చాడు.

    బంగారయ్య తాగివొచ్చి పెళ్ళాన్ని బూతులు తిడుతున్నాడు కూతురు ఆత్మహత్య చేసుకున్నాక, అతనికి త్రాగుడుతో బాటు మతిభ్రమణం కూడా ఎక్కువయింది.

    "ఇంత బతుకూబతికి నువ్వు స్వయాన కొడుకుతో ......"

    గౌతమ్ ఉలిక్కిపడ్డాడు. ఇలాంటి నీచమైన మాటలు ఒక మనిషి నోట్లోంచి వస్తాయని అతను ఊహించలేదు.

    తల్లికీ _ కొడుక్కి .....

    "ఛీ! ఊరుకోండి మీకేమైనా మతిపోయిందా?"

    "ఇదివరకు పోలేదే _ యిప్పుడుపోతుంది, నేను కళ్ళారా చూశాను. వాడు నీమీద పడి .....

    "అయ్యో ఏమీ మాటలండీ . ఎవరన్నా వింటారు లోపలకురండి"

     వింటే వినవయ్యవవే. నాకే మన్నా భయమా? నువ్వు చేస్తే లేదు గాని _ నేనంటే వచ్చిందా? అయినా యీ వయసులో     నీకిదేం పాడు బుద్డెం?" వాడు నిన్ను .....

    "ఛీ నోరుముయ్యండి."

    "నువ్వు తప్పు చేసి నన్ను నోరుముయ్యమంటావుటే! జుట్టుపట్టుకుని క్రింద పడేసి కొడుతున్నాడు. కాళ్ళతో తంతున్నాడు. గౌతమ్ కు ముందుకు ఉరికి బంగారయ్యను యివతలకీడ్చి పారేసి నాలుగు తగల్నిద్దామా అన్నంత ఉద్రేకమొచ్చింది. కష్టంమీద ఉద్రేకాన్నణచుకుని , అతన్లో ని మానవత్వం అతన్ని దహించి వేస్తుండగా అక్కడ్నుంచి కదిలాడు.

    బంగారయ్య భార్య ఎంత ఉత్తమురాలో అతనికి తెలుసు. అటువంటి స్రీని పట్టుకుని అతను అంత జుగుప్సాకరంగా ......

    మనుషులు ఎంత వికృతంగా ఆలోచిస్తారు?

    ఆ ప్రయత్నంగా అతని కాళ్ళు వరదరాజు టీ కొట్టువైపు తీసుకుపోయాయి.

    టీ షాపు ముందు అయిదారుగురు దాకా నిలబడి వున్నారు.

    "ఏమిటి బాబుగారూ కనపట్టం లేదు" అన్నాడు వరదరాజు పలకరిస్తూ.

    నేను అంతగా బయటకు రావటం లేదు" అన్నాడు.

    "ఏం బాబుగారూ? కొత్తదేదయినా రాస్తున్నారా?"

    "రాయటం లేదు."

    "మరి?"

    "రాయలేక పోతున్నాను."

    వరదరాజు నవ్వి టీకలిపి కప్పులోపోసి అతని కందిస్తూ "మీరు జీవితాలను పరిశీలించడం కన్న వాటిని గురించి ఎక్కువగా ఆలోచిస్తూన్నారు, అందుకే రాయలేక పోతున్నారు" అన్నాడు.

    ఒక అద్భుతమైన సత్యం విన్నట్టు అతని వంక ఆశ్చర్యంగా చూశాడు గౌతం.

    "పడుపు వృత్తిమీద ఓ నవల రాస్తానన్నారు. రాశారా బాబుగారూ?"

    "లేదు"

    "ఎందుకని బాబుగారూ?"

    "మెటీరియల్ సేకరించటానికి నాకు శక్తిచాలలేదు."

    వరదరాజు మళ్ళీ నవ్వాడు. " ఆ సబ్జక్టును ఎప్పటికైనా సరే! వొదలకండి, సాహిత్యానికి మూలవస్తువు ఆడదే బాబుగారూ! ఆ ఆడది పడుపుకత్తే  కావచ్చు. ఇంట్లో పెళ్ళాం కావచ్చు. స్నేహితుడి పెళ్ళాం కావచ్చు. ప్రేమించిన ప్రియురాలు కావచ్చు. ఎన్ని రకాలుగా నైనా ఆ స్రీ మూత్రిని దర్శనం చేసుకోవచ్చు. మీరు ఎంత తరచి చూడగలిగితే అంత గొప్ప సాహిత్యాన్ని సృష్టించగలరు. ప్రపంచములో యీ సూత్రాన్ని అర్ధం చేసుకున్న వాళ్ళే మహారచయితలయ్యారు.

    గౌతమ్ అతనివంక యింకా ఆశ్చర్యంగా చూశాడు. వరదరాజూ!" నువ్వెంతవరకూ చదువుకున్నావు?" అనడిగాడు.

    "నేనేక్కవ చదువుకోలేదు బాబుగారూ."

    అయితేనేం? జీవితాన్ని  ఔపోసనపట్టిన అనుభవం, లోటు అతని మొహంలో కనిపిస్తున్నాయి.

    "మీరు దిగులుగా ఉండకండి బాబుగారూ. అది అసమర్ధులు చేసేపని. దిగులును గుండెల్లో తొక్కిపట్టి  బలంతో మనం పైకి ఎదగాలి బాబుగారూ."

    గౌతమ్ టీ కప్పు కౌంటర్ ప్రక్కన పెడుతూ అతనివంక కృతజ్ఞతగా చూశాడు.

    జేబులోంచి అర్ధరూపాయి తీసి అతనిముందు ఉండి అక్కడ్నుంచి కదిలాడు.

    గదికి పోబుద్ధికాలేదు. బంగారయ్య రూపయూ, అతనిమాటలే గుర్తువస్తున్నాయి.

    గమ్యంలేనట్టు నడుస్తున్నాడు. ఎంతసేపయిందో తెలీదు.

    "అయ్యగారూ."

    ఉలికిపడి ఆగాడు. దూరంగావున్న స్ట్రీట్ లైటు వెలుగులో ఓ స్రీ మూర్తి.

    చేతిలో ఓ శిశివు .

    ఆ శిశివువంకచూసి తృళ్ళిపడ్డాడు. రెండుకళ్ళూ లేవనట్టు .... తెలుస్తోంది.  కాళ్ళు వంకర్లు తిరిగి, చేతులు వెనక్కీ తిరిగి.....

    ఆ దృశ్యంచూడలేక తలపైకెత్తి ఆమె ముఖంలోకి చూశాడు.

    బాధగా, దిగులుగా, అందంగా ఉంది.

    రెండోచేతిని జాచి "ఆకలి" అన్నట్టు అతనికేసి చూసింది.

    జేబు తడుముకున్నాడు ఓ అర్ధరూపాయినాణెం తగిలింది. తీసి అమేచేతిలో పేట్టి గబగబా ముందుకుసాగి చీకట్లో కలసిపోయాడు.

                          *    *    *    *   

    ఆలోచనలు అటూ ఇటూ తిరిగి, ఓ రూపంధరించి కథా వస్తువుగా మారింది.

    మరునాడంతా కూర్చొని చాలా దీక్షగా రాశాడు.

    ఆమె తప్పు చేసింది. ఆమె తప్పు లేకుండా తప్పుచేసింది. ఫలితంగా నేలతప్పింది.

    గర్భస్రావం చేసేందుకు ప్రయివేట్ హాస్పిటల్ కు వెళ్ళే ఆర్ధిక స్తోమతలేదు. గవర్నమెంట్ హాస్పటల్ వెడితే రేపు, రేపురా అని త్రిప్పి చివరకు "యిప్పుడు ఏడోనేల వచ్చింది. యిన్నలలు ఏం చేస్తున్నావు?" అంటూ కసిరి పంపించారు.

    గత్యంతరం లేక వృద్దురాలి సాయంతో ఓ పూరిపాకలో ప్రసవించింది.

     కాని పాపను పెంచడానికి వీలులేదు. శక్తి చాలదు.

    పాప చాలా అందంగా, బొద్దుగా ముద్దుగావుంది.

    ఓ నిర్ణయానికివచ్చి ఓ రోజు తెల్లవారుఝామున సంపన్నులున్న లోకాలిటీకి వెళ్ళి నలుగురి దృష్టిలో పడేటట్లు అనువయిన ప్రదేశంచూసి పడుకో బెట్టింది.

    తెల్లవారి సూర్యకిరణాలు భూమిని తాకాయి.

    ఒక్కొక్కరు ఆదార్న నడవడం మొదలుపెట్టారు. కొంతమంది పట్టించుకోలేదు. కొంతమంది చూసి జాలిపడి వాళ్ళలో వాళ్ళు వాఖ్యానించుకుని వెళ్ళిపోయారు.

 Previous Page Next Page