Home » Kommanapalli ganapathi rao » అసురవేదం

 

      కిరిటీ వాక్యం ఇంకా పూర్తీ కానేలేదు. ఇఇపుడు శివరావు మధలోకి వచ్చాడు. "అంత వెర్రివెంగళాయులుంటారనుకున్నారా?"

    "ఎప్పుడో చనిపోయిన మెర్లిన్ మన్రో 'బ్రా' ఇదీ అంటూ మార్కెట లో వేలం పెడితే లక్షల డాలర్లకి కొనుక్కున్న మగాళె ఎక్కువున్న పాశ్చాత్య దేశాల్లో ఇలాంటి టెక్నిక్స్  తప్పకుండా విజవంతం అవుతాయని చెప్పడానికి పెద్ద ఏనాల్సిన్ అక్కర్లేదునుకుంటాను.

    ఈ జవాబు విన్న ఎలిజిబెత్ ఓసారి తన బ్లౌజ్ అంచు తడుముకుంది అసంకల్పితంగా. ఒక బ్రా, అంత ఖరీదుకి అమ్ముడుపోవడమన్న ఆమెకే అబ్బురంగా అనిపించింది.

    హనిత వింత నిక్కచ్చిగా మాట్లాడుతున్న కిరితీని మనసులో అభినందిస్తున్నా అతని పరాజయాన్ని కాంక్షిస్తూ విరుచుకుపడుతూసభ్యుల్నీ ఓ కంట గమనిస్తూనే వుంది.

    "వెల్" ఓ అరనిముశం నిశ్శబ్దం తరువాత ఇప్పుడు సుదర్శనరావు కిరీటితో అన్నారు . " నా మొదటి ప్రశ్నకి మీరు జవాబు చెప్పలేదు"

    "విత్ డ్యూ ఎపాలజీస్ సర్." క్షణంపాటు ప్రశ్నని మరోమారు మననం చేసుకుని చెప్పడం ప్రారంభించాడు. "ఒక ఇంటర్వ్యూకి అటెండయ్యె ఏ వ్యక్తయినా ముందు కొన్ని తప్పనిసరి విషయాల్ని లోతు ఆలోచించాలన్నది నా వ్యక్తిగతమయిన  అభిప్రాయం మాత్రమే కాదు 'మేరియోలోబో' వంటి పర్సనల్ మేనేజ్మెంట్ ఎక్స్ పర్ట్స్  వ్యక్తంచేసిన వాస్తవాలు కూడా. మొదటిది సేల్స్ ఎవేర్నేస్ అండ్ కెరీర్ గోల్స్ ఎనలైటికల్ గా వివరించాడు.

    తనకు ఏం కావాలి, తను లక్ష్యం నిబ్బరంగా సాగిపోగలరు అన్న మీమాంస .... ఇక్కడ తన శక్తిని మాత్రమెగాక బలహీనతల్నీ ఆలోచించాలి. ఆ విధంగా తనెన్నుకున్న మార్గం సరయినదో, కాదో ఆలోచిస్తే తప్ప కొన్నాళ్ళకి అది ఉద్యోగపరమైన అసంతృప్తికి కారణమవుతుంది. అంటే తన జీవితనానికి అన్వయించుకోవలసిన ప్రాణాళికలో ఓడినవాడు ఏ సంస్టనీ ఉద్దరించలేడు.

    "ఇక రెండవది తను చేయాల్సిన ఉద్యోగానికి సంబందించిన బాధ్యతల్నిముందే గ్రహించడం. ఇన్ ఫర్మేషన్ అబౌట్ ది జాబ్. ఏ పొటెన్షియల్ ఎంప్లాయర్ అయినా కోరుకునేది ఉద్యోగాన్ని కోరే వ్యక్తికి తను నిర్వర్తించిబోయే విధికి సబంధింఛీ సరయిన అవగాహాన, నేర్పు, ఓర్పు, అవసరాన్ని బట్టి ట్యూస్ కాగలిగే  శక్తి.

    మూడవది ఒక పరిశ్రమకి సంబంధించిన జ్ఞానం. ప్యాక్టరీస్ లో సహాజంగా వచ్చే సమస్యల గురించి లోతుగా తెలుసుకుని ఉండటం, జాప్యం లేకుండా సరయిన నిర్ణయాలు తీసుకోగలిగే మేధ, తను చేయాలనుకుంటున్న కంపెనీ ఉత్పత్తికి సంబంధించిన కాంపిటేటర్స్ గురించి తెల్కుసుకుని వుండటం, ప్యాక్టరీ వనరలు, ప్రస్తుతం ఎదుర్కో౦టున్న సమస్యలు, ముఖ్యంగా ఆ సంస్థ కల్చర్ లమతి రిలవెంట్ డేటా......."

    కిరిటీ తన అసాధరణమైన వాగ్దాటీతో అక్కడ అందర్నీ శ్రోతలుగా మార్చేయగలిగాడూ అన్నదానికి సాక్ష్యం సుదర్శనరావుగారి కళ్ళలో మెచ్చుకోలుగా వ్యక్తమవుతున్న పరిశీలనాత్మకమైన చూపులే.

    "వెల్! ఒకవేళ ఉద్యోగం మీకే వస్తే సంస్థపరమైన సెట్ బాక్స్ నీ, సమస్యల్నీ ఎలా డీల్ చేయగలరు?"

    "నా నమ్మకాల్ని అతిశయోక్తులుగా మీరు భావించకబోతే ఒక్క విషయాన్ని స్పష్టం చేయదలుచుకున్నాను. తన గురించి తనకు పూర్తిగా అవగాహానలేని వాడు అవరోధాల్ని 'సమస్యలు, సెట్ బాక్స్, క్రైసిస్'  లాంటి పదాలుగా భావిస్తాడు. తనేమిటో , తన శక్తేమిటో తెలుకున్నవాడు వాటిని చాలెంజ్ గా స్వీకరిస్తాడు."

    హనిత విస్పారిత నేత్రాలతో చూస్తూ వుండిపోయింది. కిరిటీది వాక్చాతుర్యంలా అనిపించడంలేదు. అసాధారణమయిన విశ్వాసం ధ్వనింస్తూ౦ది అతని గొంతులో.

    "ఇకపోతే నా అనుభవం గురించి మీరు అనారు నిజమే. ఇంత వరకూ ప్రాక్టికల్ గా ఏ సంస్థలోనూ నేను పనిచేయలేదు." ఓ క్షణం పాటు నిశ్చలంగా చూశాడు అందరివేపూ. "ఇప్పటి వటవృక్షమైనా మొదట అంకురంగానే తన దశను ప్రారంభిస్తున్నది. విస్పోటనంలో అపారమైన శక్తిని అందించే న్యూక్లీయర్ సైన్సుకి మూలం ఓ అనువే బాలారిష్టాలు ఏనాడో దాటి ఈ స్థితికి చేరుకున్న సంస్థ. పైగా ఒక జనరల్ మేనేజర్ రిజైన్ చేశాక ఇన్ని నెలలూ స్తంభాలైన మీరుండగా నా అనుభవరాహిత్యం కొన్ని నెలలపాటు మీకు ఇబ్బందిని కలిగిస్తుందని నేననుకోవడం లేదు మీ అందరి సహకారంతో అతిస్వల్ప వ్యవధిలో మీరూహించని స్థాయికి  నేనూ ఎదగగలనన్న నమ్మకం నాకుంది."

    ఇంటర్వ్యూ కార్యక్రమం ముగిసిపోయింది .

    మరో అయిదు నిముషాల్లో అభ్యర్ధుల్ని వారికోసం కేటాయించిన హొటల్ డాల్ఫిన్స్ కి పంపించేశారు.

    సుమారు అరగంటసేపు తర్జనభర్జనల తరువాత ముందు హనిత కిరీటినే సూటబుల్ కేండిడేట్ గా ప్రోపోజ్ చేసింది.

    ముందు అయిష్టతని వ్యక్తం చేసింది ప్రభంజన్రావు. " ఏ మాత్రం ఎక్స్ సీరియల్స్ లేనివాణ్ణి తీసుకుంటే అంతకు మించిన రిస్క్ మరోటు౦డదు."

    "ప్రతి అంకే మొదలయ్యేడి ఒకటితోనే అంకుల్." హనిత నచ్చచెప్పబోయింది.

    "కాని ఈ ఒకటి అంకే ఈమాత్రం పొరపాటు చేసినా నష్టం లక్షల్లో ఉంటుంది." ప్రభంజనరావు అన్నాడు మళ్ళీ.

    'అప్పుడు రణధీర్ చేసిన నిర్వాకం గురించి జవాబేం చెబుతారు?" టక్కున ఖండించి౦ది హనిత. "ఒక సంస్థలో పోల్యూట్ అయిన వ్యక్తిని తీసుకునేకన్నా ఇంకా కాలుష్యం అంటని నిజాయితీ గల వ్యక్తినీ తీసుకోవడం నయం కదూ!"
   
    "కేవలం ఇంటర్వ్యూలో ఒక వ్యక్తి నిజాయితీని ఎలా నిర్ణయించగలం?"

    "ఇంతకు మించి కొలబద్ద మరేదన్నా వుంటే దానితోనే కేండిడేట్స్ శక్తి సామర్ధ్యల్ని నిర్ణయించోచ్చుగా . "మరి ఈ హడావుడి దేనికన్నట్టు? హనిత అన్న ఈ మాటలకి ప్రభంజనరావు వెంటనే జవాబు చెప్పలేకపోయాడు.

    "అలాంటప్పుడు మరో సంస్థలో పోల్యూట్ అయిన వ్యక్తి అని నువ్వేలా ఎడ్రస్ చేయగలిగావు?" ప్రభంజనరావు అడిగాడు తర్కానికి దిగుతూ.

    "ఎడ్రస్ చేసింది ఎవరి గురించని?"

    ఉలిక్కిపడ్డాడు ప్రభంజనరావు.

    "ఎందుకు అంకుల్ అలా త్రోటుపడతావు? శశిధర్ ఎవరి ప్రోద్భలంతో ఈ ఇంటర్వ్యూకి వచ్చిందీ నాకు ముందే తెలుసు. స్పష్టంగా వివరించమంటారా?ఇదీ ప్రభంజనరావు ఊహించని విషయమే. తన పరిధిలోకి తనకు తెలియకుండా మరో అడుగు వేసింది. అక్కడ ఎం.డి. లేకపోతె గట్టిగా అరిచి ఆర్గ్యూమెంట్ కి దిగేవాడే  కాని సుదర్శనరావు గారితో చనువు మాత్రమే కాదు, ఆయనంటే రవ్వంత భయం కూడా ఉండటంతో తన ప్రయత్నాన్ని విరమించుకుంటూ "మీ ఇష్టం " అన్నాడు అసహనంగా.

    "వెల్!" తార్కికంగా తన నిర్ణయాన్ని తెలియజేసింది హనిత "ఒక సంస్థకి ఎగ్జిక్యూటివ్ కాదగ్గ వ్యక్తికీ కావలసింది సెల్ఫ్ ఎనాల్సిన్ అయితే ముగ్గురు అభ్యర్ధులలో అది పుష్కలంగా ఉన్నది కేవలం మిస్టర్ కిరిటీకి మాత్రమే. విషయాన్ని లోతుగా ఆలోచించడం, అలోచించినదాన్ని సరళంగా ఎక్స్ ప్రెస్ చేయగలగడం అతనికున్న ముఖ్యమైన అర్హతయితే సంస్థ ముఖ్యంకాదు, సంస్థకి తమ ఉనికి ముక్యం అన్నభావం తక్కిన ఇద్దరిలోని పెద్ద అనర్హత."

    "ఇంత భారీ పరిశ్రమకి పెద్ద ఎగ్జిక్యూటివ్ గా రేపు సమస్యల్ని ఎలా ఫేస్ చేయగలదు?" శివరావు అడిగాడు.

    "సమస్యల్ని చాలెంజ్స్ గా తీసుకునేవాడు నిజమైన ఎగ్జిక్యూటివ్ , అంతకుమించి తన శక్తితో బలహీనతల్నీ తెలిసినవాడు గా ఎలామతి పరిస్థితునైనా హేండిల్ చేయగలనన్న నమ్మకం నాకుంది."

    "తనను ఇంటర్వ్యూ చేస్తున్నది బోర్డు డైరెక్టర్స్ అన్న గౌరవం కూడా లేనివాడు రేపు లేబర్ ప్రోబ్లం ఎలా ఫేస్ చేస్తాడు.?" ఇందాక తన బ్లేడ్ పజిల్ ని దానికీ కిరిటీ వివరణాన్ని గుర్తు చేసుకుంటూ అన్నాడు ప్రభంజనరావు.

    దట్స్ సెన్సాఫ్ హ్యూమర్ అంకుల్. మరో మనిషిని యుక్తిగా గెలవగలిగే  పోజోతివ్ అప్రోచది."

    "ఇంత స్వల్ప వ్యవధిలో చాలా స్టడీ చేసినట్టున్నావు హనితా." మృదువుగా నవ్వుతూ అన్నాడు సత్యానంద్ _ తన ఉక్రోషం కనిపించకుండా.

    "ఎస్ అంకుల్" గొంతులో కొద్దిపాటి వ్యంగ్యాన్నీ దాచుకోలేక పోయింది. "ఏమాత్రం అటాచ్ కాకుండా విషయాన్నీ పరిశీలించినప్పుడే చాలా వరకూ సత్యాలుగా మనకి దర్శనమిచ్చేవి . లక్ష్యాన్ని ప్రేమించేవాడు, జీవితాన్ని గౌరవించాడు ప్రపంచాన్ని ఇష్టపడతాడు. ఆ ప్రపంచంలో ఎదురయ్యే అవంతరాలనీ ప్రేమగా స్వీకరించి బుజ్జగించి తన గమ్యాన్ని చేరగాలుగుత్దు. ఇది ఒక వ్యక్తి ఆలోచనా సరళి అయినప్పుడు ఆ వ్యక్తి ఓ సంస్థకి చాలా వుపయోగపడతారు. ఇన్ని అర్హతలూ వున్న వ్యక్తి మిస్టర్ కిరీటి.

    అంతసేపూ నిశ్సబ్దంగా ఉండిపోయిన సుదర్శరావు అప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్టు రిక్రూట్ మెంట్ ప్రపోజల్సు ఇంటర్వ్యూ రేటింగ్ పేపర్సు అందుకుని కిరీటి పేరు తిక చేస్తూ సంతకం చేశారు. బోర్డు మేమ్బర్సు తో చాలా క్లుప్తంగానే మాట్లాడే సుదర్శనరావు గారు ఇక్కడ చైర్మెన్ గా తన వీటో పవర్ ని ఉపయోగించుకున్నట్టు తన అభీష్టాన్నీ అలా వ్యక్తం చేసి బయటకి నడిచారు.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra