Home » Kommanapalli ganapathi rao » అసురవేదం

 

     ఎక్స్ పీరియన్స్ లేంది కిరిటీ ఒక్కడే! ఏడాది క్రితమే ఇంజనీరింగ్ పోస్టు గ్రాడ్యుయేషన్ తరువాత బిజినెస్ ఎడ్మినిస్ట్రేషన్ లో మాస్టర్ డిగ్రీ తీసుకున్నది కూడా ... ఎక్ డబుక్ అతనికున్న విద్యార్ధులు హనితని చాలా ఆకట్టుకున్నాయి. కాని అమ్మ చాటు బిడ్డలా అనపిమ్చిన యీ అబ్బాయి ఇంటర్వ్యూలో ఎంతవరకూ నిలబడగలడూ అన్నదే ఆమె సందేహం.

    "వెల్ ...." ఎం.డి . సుదర్శనరావు పేరు పేరునా తక్కిన బోర్డుమెంబర్స్ నీ పరిచయం చేస్తూ అన్నాడు __ "సామాన్యంగా ఒక్కో అభ్యర్దినీ ఇంటర్వ్యూ చేయడం సంప్రదాయం . కాని ప్రస్తుతం ఓ గ్రూఫ్ డిస్కషన్ లా ఇంటర్వ్యూని కొనసాగించాలని మా బోర్డు నిర్ణయించడంతో ముగ్గురు అభ్యర్ధుల్నీ ఒకేసారి పిలవడం జరిగింది. ఇక్కడ ఇంటర్వ్యూలో నెట్టుకురాగలిగిన వ్యక్తి ఎలాంటి అత్యున్నత స్థానంలో కూర్చునేది, ఎన్ని పక్తరీస్ కి బాస్ గా లీడ్ చేయాలని వుండేదీ మీకు వివరించాల్సిన అగత్యం లేదనుకుంటాను. వెల్ మిస్టర్ శంకర్!" సాలోహ్చ్నగా చూశాడు శశిధర్ వేపు .... "ఓ పెద్ద సంస్థలో బాధ్యాతాయుతమైన ఉద్యోగంలో వున్న మీరు చెప్పండి _ అసలు ఇంటర్వ్యూకి మీరెలా ప్రిపేరయ్యారు? ఏ అర్హతలతో యీ జాబ్ మీకు చెందాలనుకుంటున్నారు?"

    సంబాషణ గొంతు సవరించుకున్నాడు. "ఇందులో ప్రిపెరేషన్ అంటూ పెద్దగా వుంటుందని నేననుకోను. ఓ పెద్ద ఫాక్టరీలో సీనియర్ మేనేజరుగా డిపార్ట్ మెంట్ గా హెడ్ గా ఎటువంటి లేబర్ ప్రాబ్లమ్ నైనా సునాయాసంగా డీల్ చేయడం చేతనయిన నాకు యిప్పుడు ఈ పొజిషన్ లో ఫాక్టరీస్ ని, వాటి సమస్యల్ని హాండిల్ చేయడం పెద్ద పని కాదు, నాకున్న అనుభవంతో ఎలాంటి విస్త్రతమయిన బాధ్యతనయినా స్వీకరించగలను. మీ సంస్థ పురోభివృద్ధుకి మీ సంతృప్తి మేరకు కృషి చేయగలను."

    ప్రభంజనరావు ప్రశ౦సాపూర్వకంగా చూశాడు తన కేండిడేట్ అయిన శశిధర్ మాటల్లో జ్యోతకమవుతున్న ఆత్మవిశ్వాసానికి.

    "మీరేమంటారు?" సందీప్ వేపు చూశారు సుదర్శనరావుగారు.

    ఓక్షణం నెక్ టైని సవరించుకుంటున్న సందీఫ్ _ "ఏ సంస్థ పోరోగమ నానికయినా ముందు కావాల్సింది ఉత్పదిక శక్తి గురిమ్హిన సరైన అవగాహన  ప్రోడేక్షన్ గురించే కాక ప్రోడేక్ట్నీటీ  గురించి ఆలోచించే నేను జే.సి. ఎం. గా బాధ్యతని స్వీకరించిన ఏడాదిలోగా కంపెనీ ఉత్పత్తిని , ఉత్పాదక శక్తిని పెంచి నేనేమిటో నిరూపించుకుంటాను. మీరు అవకాశమిస్తే నాకున్న సైంటిఫిక్ ఎప్రోచ్ తో ఏయే మార్పులు తీసుకొచ్చేదీ వివరిస్తాను" అన్నాడు తనకున్న థియరిటికల్ నాలెడ్జిని చెప్పటానికి ఉద్యుక్తుడవుతూ.

    "అంత నేర్పున్న మీరు ఏ యేడాది కా యేడాది నష్టాల్లో కూరుకుపోతున్న హెవీ ఇంజనీరింగ్ కార్పోరేషన్ లో మార్పు నెందుకు సాధించక లేకపోయారు?" టక్కున అడిగాడు ప్రభంజనరావు.
   
    సందీఫ్ ఓ క్షణం త్రోటుపడినా సర్దుకున్నాడు .... "ఆ మార్పుని సాదించగలిగితే వాడ్నే. కాని కార్మికులలో క్రమశిక్షణ లోపించింది. ఎలాంటి చర్య సరి దిద్దడం కష్టమయింది. అయినా ....."

    హనిత మధ్యలోనే ఖండించింది __ ఈ సమస్య ప్రతి పక్తరికీ వుండేదే! తమ హక్కులు పరీక్షించుకోవడమే ధ్యేయంగా ఆలోచించే ట్రేడ్ యూనియన్స్ లో అనాదిగా పేరుకుపోయిన భావం యాజమాన్యం. తమని హ్యూమిలియేట్ చేస్తూ విపరీతమయిన లాభాన్ని అర్జిస్తుందనీ, తమ కనీస అవసరాల్ని పట్టించుకోవడం లేడనీను ... ఈ మాత్రం ఎక్సిసిబిలితీ చాలు రాజకీయ నాయుకులు ట్రేడ్ యూనియన్స్ లో అడుగు పెట్టడానికి గానీ, కార్మికుల్ని ఎక్స్ ప్లాయిట్ చేయడానికిగానీ, ఈ స్థితి తప్పనిసరి అని ఆలోచించి చెప్పండి. ఈ సమస్యని ఎలా ఎదుర్కోవాలి?"

    "హక్కులే కాదు. వాళ్ళకి సంస్థపరమయిన బాధ్యతలూ ఉన్నాయని నచ్చచెప్పాలి."

    ఇలా అన్నది సందీఫ్ కాదు _ శశిధర్ "బాధ్యతలు విస్మరిస్తే వచ్చే యిబ్బందుల గురించి తెలియజెప్పాలి. అప్పటికి ఒకటి అరా క్రమశిక్షణ లోపించిన కార్మికుల్ని దండించి కార్మిక సంఘాలపైన తీసుకురావాలి."

    "అప్పుడు పారిశ్రామికమయిన అశాంతిని మరింతగా పెంచినవాళ్ళ మవుతాం" సందీఫ్ ఖండించాడు. "అలాంటి సమయంలో ఉత్పదిక శక్త్యి మాట అటుంచి క్రమంగా ఉత్పత్తి తగ్గిపోయే అవకాశముంది." ప్రొడక్టివితీ గురించి తనకున్న పరిజ్ఞానంలో అతి ముఖ్యమయిన అంశాన్ని తెలియజేశాడు.

    "ఇండస్ట్రీయల్ అన్ రెస్ట్ అంటూ తోక జాడించే కార్మికుల్ని క్షమించి వదిలిపెడితే క్రమంగా సంస్థ తిరోగమనానికి అదే ముఖ్య కారణ మవుతుంది" శశిధర్ ఆవేశంగా జవాబు చెప్పాడు. "ఈ రోజు దేశంలో పారిశ్రామికమయిన ప్రగతి కుటుంపదటానికి ఈ వెసులుబాటే అవకాశమిస్తూందన్నది నా ప్రగాఢ నమ్మకం.

    "మీరేమంటారు....?" టక్కున అడిగింది హనిత నిశ్సబ్దంగా కూర్చున్న కిరితీని చూస్తూ.

    ఓ అరక్షణం పాటు ఆమెనే తదేకంగా చూసిన కిరిటీ తరువాత ఎం.డి. వేపు తల తిప్పాడు_ " క్షమించండి! యిప్పుడు యిక్కడ చర్చలో ఒక సంస్థ ఆరోగ్యం గురించి కాకుండా అనారోగ్యానికి వాడాల్సిన మందుల గురిం,చి మాట్లాడుకుంటున్నట్టుగా వుంది. అంతకు మించి అడిగిన ప్రశ్న లకి చాలా దూరంగా డివీయేట్ అయ్యామానుకుంటాను!"

    కిరిటీ స్టేట్ మెంట్ తో హఠాత్తుగా అక్కడ నిశ్శబ్దం చోటుచేసుకుంది. బోర్డు మేబర్సులో హనిత తప్ప అంతా నివ్వెరపోయారు కిరిటీ నిర్బీతిగా చెప్పిన ఆ జవాబుకి.

    ముందుగా తేరుకున్న సుదర్శనరావుగారు ఓ అర నిముషానికిగాని అయన గుర్తించలేదు. కిరిటీ వాక్యాలలోని వాస్తవాన్ని. నిజమే .... చర్చస్పష్టత లోపించి గాడి తప్ప చాలా దూరం సాగిపోయింది. ఒక ఎగ్జిక్యూటివ్ కి క్కావలసింది ఆలోచనల్లో 'నిబద్దత' అన్న అంశమే నిజమయితే యిక్కడ కిరిటీ మిగతా బోర్డు మేమ్బర్సు మాట వున్నా సుదర్శన రావుగారు, హనితల ఆలోచలలో అణువంత ప్రాముఖ్యాన్ని సంపాదించుకున్నాడు.

    "ఎస్. ఆఫ్ కోర్స్ " సుదర్శనరావు గారు తల పంకిస్తూ అన్నాడు "నిజంగానే డీవియేటయ్యం!" సో ... మీరు చెప్పండి! ఇంత బాధ్యతాయుతమయిన పోజిషన్ని అందుకోవాల్సిన వ్యక్తి ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ కావాలంటారు?" ప్రశ్నని మరింత జటిలంగా మార్చుతూ ...." సెలక్షన్ లో కేండిడేట్కి అదృష్టమన్నది ఎంతవరకూ సహకరిస్తుందటారు?" అన్నారాయన.

    "అదృష్టమన్న పదాన్ని అన్వయించుకోవాల్సింది పూర్తిగా మన అధీనంలో వుండని గేభ్లీంగ్ లో తప్ప, ఫలితానికి కృషి మాత్రమె అవసరమయ్యే యిలాంటి చోట కాదన్నది నా గట్టి నమ్మకం."

    "అంటే?" సుదర్శనరావుగారు వెంటనే జైక్యం చేసుకున్నారు ..... "మీరు అదృష్టం మీద కన్నా మీ కృషి మీదనే విశ్వాసం గల వ్యక్తినంటారు."

    "ఎస్సర్!" ఇప్పుడు కిరిటీ చూపుల్లో నిశ్చలతే తప్ప ఇందాక కంగారులేదు. "ఆశావాది ఇలాంటి అవకాశాన్ని అదృష్టాలముగా మార్చుకుంటాడు.  నిరాశావాది అదృష్టం గురించి ఆలోచిస్తూ అవకాశాన్ని చేజార్చుకుంటాడు. మనిషిని శక్తివంతుడుని చేసేది జ్ఞానమే తప్ప అదృష్టకాదన్నా ఫ్రాన్సిస్ బేకన్ సూక్త్యి నిజమని నమ్మేవాడ్ని నేను."                           
    తన అభిప్రాయాల్ని వ్యక్తం చేయడంలో ఖచ్చితమైన పదజాలాన్ని ఉపయోగిస్తున్న కిరితీని విస్మయంగా చూస్తున్న హనితకిప్పుడు సముద్రం ఒడ్డున అమ్మచాటు బిడ్డగా బఠానీలు తింటూ వచ్చిన 'మారాజు' గుర్తుకి రావడంలేదు చాలా చిత్రంగా మరో ఊహకందని వ్యక్తి కనిపిస్తున్నాడు. "సో" హనిత తదేకంగా అతడినే చూస్తూ అంది. "ఇప్పుడు మీ అవకాశాన్ని మార్కెట చేసుకోబోతున్నారన్నమాట!"

    "ఆఫ్ కోర్స్!" కిరిటీ పెదవులు కొద్దిగా విచ్చుకున్నాయి. "జీవితంమనే వ్యాపారంలో చలామణీ కావాలనుకునే వాళ్ళకీ ప్రతి క్రాస్ సెక్షన్ లోనూ ఈ మార్కెటింగ్ టెక్నిక్స్ తప్పవు."

    తన కేండిడేట్ శశిధర్ మొహంలో పేరుకుంటున్న నీడల్ని గమనించిన ప్రభంజనరావు ఇక తాను విజ్రుభించి కిరితీని మట్టి కరిపించాలి అనుకున్నాడేమో వెంటనే తన వంతుగా రంగంలోకి దిగాడు. "ఇదేమిటో మీకు తెలుసుకదూ?" అన్నాడు సాలోచనగా చూస్తూ .

    "ఎస్సర్!" విస్మయంగా తల పకించాడు విదేశాలలో విరివిగా మార్కెట్ చేయాలనుకుని మిమ్మల్ని  ఓ దేశానికి మార్కెట్ సర్వ్ కోసం పంపాం. అక్కడ మగాళ్ళందరూ గడ్డాలతో కనిపించారు . చూడగానే మీకు బోధపడింది. అక్కడివాళ్ళకీ దగ్గం గీసుకొనే అలవాటు లేదని. అప్పుడు మీరెలా రియాక్టవుతారు.?"

    ఓ క్షణంపాటు సాలోచనగా చూసిన కిరీటి మృదువుగా నవ్వేస్తూ అన్నాడు. " ఈ ప్రశ్నకి జవాబు చెప్పడానికి పెద్ద మేధ అవసరం లేదను కుంటాను. ఇలాంటి పజిల్స్ తో నిండిపోయిన ప్రస్తుత తెలుగు నవలలు చదివే ఏ సగటు పాఠకుడయినా చెప్పాగలడు."

    "వ్వాట్?" ప్రభంజనరావు మోహం కందిపోయింది.

    పెదవిదాటి రాబోతున్న నవ్వు కనిపించకుండా హానిత నోటికి అడ్డంగా పిడికిలి ఉంచుకోవడం అక్కడెవరూ గమనించలేనిది.

    "ఎస్సర్" ఒక సన్నని నితూర్పు తదువాత చెప్పాడు కిరీటి. "బహుశా అక్కడి మగవాళ్ళ గడ్డాలను చూసి సర్వేకి వెళ్ళి ఎగ్జిక్యూటివ్ నిరాశావాదిఅయితే ఇక్కడిక బ్లేడ్స్ అమ్మే అవకాశంలేదని నిర్ణయించుకుంటాడేమో ..... కాని అశావాదే అయ్యుంటే గడ్డం గీసుకోవడానికి ప్రతిమగాడికి అవసరముంది కాబట్టి అక్కడే ఎక్కువ సేల్సుకి ఛాన్సు౦దను కుంటాడు."

    "అసలు గడ్డం గీసుకునే అలవాటే లేనప్పుడు అలా అనుకుని ఏంసాదించగలడు?" ఇప్పుడు మరో బోర్డుమెంబర్ సత్యానంద్ అడ్డం పడ్డాడు.

    "ఆ అలవాటు మొదలయ్యేట్టు చేయగలడమే మార్కెటింగ్ టేక్నిక్. మగాడి గడ్డం మేధవి స్పష్టం చేయగలదేమో కాని కోరిన మగువ చెంపలకు అది రాపిడిగా మారి, అపురూపమయిన అమ్మాయిల అరాధం అదే అడ్డం కావడం అందంగా ఉండదన్న విషయానికి ఎస్స్ ద్వారా ప్రాముఖ్యాన్నిచ్చి అక్కడి మగాళ్ళ స్వాతిశయాన్ని అతిశయంతో జయించగలిగితే మార్కెటింగ్."

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra