డైరెక్టర్స్ లో ఓ వ్యక్తి ఉలిక్కిపడ్డాడు ఆమె అన్న చివరివాక్యంతో. పార్మసూటిక్స్ తయారుచేసే కంపెనీలో పేటెంట్ కోసం ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకున్న ఓ పార్ములా రహస్యంగా బయటకి వెళ్ళిపోయిందని సరిగ్గా ఇలాంటి సమావేశంలోనే ఎం.డి.ఓ. నెల క్రితం అన్నారు.
అంటే ఆ విషయంపైన కూడా హానిత దర్యాప్తు ప్రారంభించిందా?
"సో .... చివరగా నేను చెప్పేది ఒక్కటే .... డబ్బుతో ఓ వ్యక్తిని మనం కొనగలం కాని అతని విజ్ఞానాన్ని డబ్బుతో అంచనా వేయలేం. అలా ఖరీదు కట్టే ప్రయత్నం మని, లోపభూయిష్టమైన కొన్ని పద్దతులకు స్వస్తి చెప్పి, ఈ సంస్థ నాదే అన్న ఆలోచన ప్రతి కార్మికుడిలోనే కాదు, ముందు మనం మానసికంగా జీర్ణించుకుందాం." సమావేశాన్ని కంక్లూడ్ చేస్తూ ఓ ఫైలు వారి ముందుంచింది "వచ్చిన అప్లికేషన్స్ ఫిల్టర్ చేశాక పర్సనల్ డిపార్ట్ మెంట్ ఫైనలైజ్ చేసిన ముగ్గురు అభ్యర్ధుళ డిటైల్స్ ఇందులో వున్నాయి."
"వ్వాట్?" సత్యానంద్ అబ్బురంగా _ "మిగిలింది ముగ్గురా?"
"ఎస్ అంకుల్" హనిత ముక్తసరిగా అంది. "గట్టి వడపోత తరువాత మిగిలింది ముగ్గురే."
"డైరెక్టరుగా జనరల్ మేనేజర్ని రిక్రూట్ చేసుకోవచ్చుగా ?" ఎలిజిబెత్ ఇప్పటికి నోరు విప్పింది.
"ఆఫ్ కోర్స్ " హనిత యధాలాపంగా అంది. "కాని జే.జి ఎంగా రిక్రూట్ అయిన వ్యక్తిని జి.ఎం గా ప్రమోట్ చేయొచ్చు" మోటివేషన్ అన్న పదం గురించి ఆమె వివరించలేదు.
ఫైలుని తదేకంగా చూస్తున్న ప్రభంజనరావు లిస్టులో వున్న రెండో అభ్యర్ధి 'శశిధర్' అన్న పేరును చూడగానే చాలా సంతృప్తి చెందాడు. ఈ రిక్రూట్ మెంట్స్ చదరంగంలో 'షా' లా ప్రవేశపడుతున్న శశిధర్ అయన కేండిడేట్, "వెల్ ..... వెంటనే ఇంటర్వ్యూస్ ఏర్పాటు చేద్దాం."
ఇక్కడ తన ముఖ కవళికల్ని హనిత గుర్తించిందని అతను తెలుసుకోలేకపోవడానికి కారణం ఇంకా ఆమెపైన పూర్తిగా చెరిగిపోని తేలికభావమే.....
సరిగ్గా అప్పుడు ఇంటర్ కం బజర్ మోగింది.
"ఎస్'"
"మేడం" హనితతో అంది పియ్యే . "ఓ అమ్మాయి మీతో అర్జెంటుగా మాట్లాడాలని కనీసం పదిసార్లన్నా ఫోన్ చేసి వుంటుంది అప్పటికీ చెప్పాను అర్జెంటు మీటింగ్ లో వున్నారని ... పేరు సాకేత."
"సా... కే... త...." హనిత మనం చేసుకుంటన్నట్టు బయటికే అనేసింది. "కనెక్ట్ చెయ్యి."
షాక్ తిన్నట్టు ఎలార్తయిన ప్రభంజనరావు ఇప్పుడు హనిత ముఖకవళికల్ని పరిశేలనగా చూస్తున్నాడు.
గుడ్ .... సాకేత రంగంలోకి దిగింది. హనితపైన మానసికమైనా ఒత్తిడి ప్రారంభిస్తుంది. చాలా సరైన సమయంలో __
"ఎస్ ...." హనిత మామూలుగా అంది.
"............"
"వ్వాట్?" హనిత మొహంలో రంగులు మారుతున్నాయి..... అయినా తన అలజడి బయటికి కనిపించకుండా జాగ్రత్త పడుతూంది. "నాన్సెన్స్ .... రణధీర్ హత్య చేయించాల్సిన ....." అర్ధైక్తితో ఆగి పోయింది.
"..........."
"మిస్ సాకేతా! అయాం బిజీ నౌ ..... నీకు అభ్యంతరం లేకపోతె మనం విడిగా మాట్లాడుకుందాం. ఓ.కే చెప్పు ... ఎక్కడ?"
కణతలు నొక్కుకుంటూ కొన్ని క్షణాలు విన్న హనిత నెమ్మదిగా ఫోన్ క్రేడిల్ చేసింది.
ఆ హాల్లో చీమ చిటుక్కుమంటే వినిపించేటంత నిశ్శబ్దం పేరుకుపోయింది.
"వెల్" ఉద్వేగాన్ని నిభాయించుకుంటూ అందరివేపూ చూసిన హనిత పైకి లేచింది. "మరో మూడు రోజుల్లో ఇంటర్వ్యూస్ ఏర్పాటు చేసి ఆ రిక్రూట్ మెంట్ వ్యవహారాలు పూర్తీ చేద్దాం."
ఏ విషయాన్నైనా క్లారిటితో చెప్పగల హనిత ఇక్కడ వాక్యాలు కూడగట్టుకుంటున్నట్టుగా మాట్లాడ్డంతో ప్రభంజనరావుకి బోధపడిపోయింది. ఆమె అప్పుడే మానసికంగా సంఘర్షణను లోనవుతూందని.
అయితే అక్కడ ఉన్న ఓ బోర్డు మెంబరు తన వూహాప్రకారరణధీర్ హత్య విషయంలో హనిత అనుమానితురాళవుతుందన్న తన నమ్మకం నిజమైనందుకు సంతృప్తిపడుతూనే ఆశ్చర్యపోయాడు __ ఆ విషయాన్ని అడిగిన అమ్మాయి 'సాకేత' ఎఫరా అని ....
నిజానికి విస్మయంగా చూస్తుండగానే హనిత వెళ్ళిపోయింది.
ప్రభంజనరావు హనిత తత్తరపాటు చూడగానే గ్రహించాడు ఇప్పుడు ఆమె సరాసరి వేళుతున్నది సాకేతని కలియడానికేనని.
* * * *
ఉదయం పదిగంటలు కావస్తూంది.
వాల్తేరు ఆఫ్ లాండ్స్ లోని జైంట్ ఆర్గనైజేషన్ సాకేత అండ్ కంపెనీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ చాలా హడావుడిగా వుంది. సుమారు పది ప్యాక్టరీల బిజినెస్ వ్యవహరాలకి, వేలమంది కార్మికుల ఉపాధి సంరక్షణ కేంద్రమయిన ఆ బిల్డింగ్ లో హడావుడికి కారణం ఆ రోజు కంపెనీ టాఫ్ ఎగ్జిక్యూటివ్ జాయింట్ జనరల్ మేనేజర్ రిక్రూట్ మెంటు జరగబోతూంది.
సామాన్యంగా అత్యవసర పరిస్థితుల్లో తప్ప బోర్డు మీటింగ్స్ సైతం అటెండ్ కాని ఎం.డి సుదర్శరావుగారు ఆ రోజు తన ఛాంబర్ లో తక్కిన మెంబర్స్ తోపాటు కూర్చుని వున్నారు.
ఇప్పుడు జరగబోయే ఇంటర్వ్యూలో నిలదొక్కుకునే వ్యక్తి దేశంలోని ఓ పెద్ద పారిశ్రామిక సంస్థకి అధిపతిగా అపారమైన బాధ్యతల్ని నిర్వర్తించవలసినవాడు మాత్రమె కాదు. కోట్ల టర్నోవర్ ఉన్న వ్యాపారాలనీ, క్షణక్షణం హక్కులకోసం పోరాడే బలమైన కార్మిక సంఘాలనీ ఎదుర్కొనే శక్తివంతమైన వ్యక్తికూడా కాదగ్గవాడు.
గదిలో ఎయిర్ కండిషనర్ చప్పుడును మించి ప్రభంజనరావు గుండె అదిరిపడుతూంది.
అనారోగ్యంతో బాధపడుతున్న సుదర్శనరావుగారు ఇంటర్వ్యూ లలో జోక్యం చేసుకోరని నిన్నటిదాకా చాలా ధీమాగా వున్నాడు.
హఠాత్తుగా ఈరోజు ఇంటర్వ్యూ బోర్డు చేయిర్మేన్ గా సీటులో కూర్చున్నారు.
శశిధర్ అనుభవంలోనూ, అర్హతల్లోనూ అరుదయిన వ్యక్తి అయినా, తక్కిన ఇద్దరు కేండిడేట్స్నీ అతను తక్కువగా అంచనా వేయడంలేదు.
రేపటి తన పథకాల అమలుకి శశిధర్ అవసరం చ్గాలా వుంది. కాబట్టే 'మైకా' లో పని చేస్తున్నా శశిధర్ ముందే మాట్లాడి అప్లయ్ చేయించాడు.
సరిగ్గా పదిన్నర ప్రాంతంలో హనిత టేబుల్ పైన ఉన్న ఇంటర్ కం బజర్ నొక్కి పియ్యేకి తెలియపరిచింది "ముగ్గురు కేండిడేట్స్ నీ లోపలి పంపించు, విడిగా కాదు .... ఒకేసారి."
సుదర్శనరావు గారిలో చలనంలేదు. కాని తక్కిన నలుగురు బోర్డు మెంబర్స్ విస్మయంగా చూశారు.
అడుగడుగునా తన ఆలోచనలతో, నిర్ణయాలతో వాళ్ళని మానసికంగా అందోళనపరచడమే ఆమె ధ్యేయమైతే ఇక్కడా ఆమె విజయం సాధించింది.
"మే ఐ కమిన్?"
ముగ్గురు అభ్యర్ధుల కంఠాలూ వినిపించాయి ఒక్కసారిగా .
"ప్లీజ్ బీ సీ టేడ్" అనబావుయిన హనిత ఠక్కున ఆగిపోయింది అవాక్కయి నట్టు.
లోనకొచ్చిన ముగ్గురు వ్యక్తుల్లో ఒక వ్యక్తి ఆమెని చాలా ఆశ్చర్యపరిచాడు.
అతనెవరో కాదు _ ఆ రోజు సముద్రం ఒడ్డున ఓ బామ్మగారి కొడుకుగా పరిచయమై తన పేరు తెలుసుకోవాలని ప్రయత్నించి తత్తర పడిన 'మారాజు' కిరిటీ.
కిరిటీ కూడా అప్రతిభుడై చూస్తున్నాడు హనితని.
* * * *
పావలా ఇస్తే పొట్లం బఠానీలు కొనుక్కుని తనకివ్వకుండా కిరిటీ తల్లి అన్న మాటలే గుర్తుకొచ్చాయో, లేక ఇంత పెద్ద ఎగ్జిక్యూటివ్ పోజిషనకి ఆఖరి వికతలా ఇతనిలా నిలబడగలిగాడూ అన్న ఆశ్చర్యమే కలిగిందో పెదవుల అంచున పారాడే విడీవడని చిరునవ్వుని దాచుకుంటూనే కూచోమన్నట్టుగా సంజ్ఞ చేసింది.
బుద్ధిమంతుడయిన బాలుడిలా తక్కిన ఇద్దరు అభ్యర్ధులతోపాటుఎదురుగా కూర్చున్నాడు కిరిటీ.
మిగతా ఇద్దరు కేండిడేట్స్ శశిధర్, సందీఫ్ చాలా అనుభవమున్న వ్యక్తులు! ఆ విషయం బయటే తెలుసుకున్న కిరిటీ అక్కడే చాలావరకు జావగారి పోవడంతో అంతదాకా ఎలాంటి అనుభవం లేని ఒక్క అభ్యర్ధిగా కంపించిపోతూ ఆ ప్రకంపనలని కాళ్ళకి మాత్రమే పరిమితం చేసుకున్నాడు.
ఇప్పుడు టేబుల్ కి దిగువగా ఉన్న కిరిటీ పదాలు శబ్దం వినిపించకుండా నర్తిస్తున్నాయి కంగారుతో ....
వైట్ పోలిస్టర్ షర్టు టక్ చేసుకున్న కిరిటీ హనిత మరోమారు అతనివేపు చూసేసరికి చాలా అందోళనపడ్డాడు. ఆటోలో ఆయిల్ మారక లేమన్నా చొక్కా కంటుకున్నాయేమో .... అని ... పక్కనున్న యిద్దరు కేండిడేట్స్ సిఇత్స్ లో వుంటే, తనుమాత్రమే మామూలుగా పుల్ హేండ్స్ షర్టు గేబర్టన్ సెంటు తో టక్ చేసుకొచ్చాడు. అది కూడా ఇంటర్వ్యూళ కోసం ప్రత్యేకించి కుట్టించుకున్నవి.
హనిత మరోమారు అభ్యర్ధుల అర్హతలను సంబంధించిన వివరాల్ని చూసింది ఫైలు అందుకుని.
శశిధర్ ప్రస్తుతం 'మైకా' లో సీనితర్ మేనేజరు గా జాబ్ చేస్తుంటే, సందీఫ్ రాంచీ హెవీ ఇంజనీరింగ్ కార్పోరేషన్ లో అసిస్టెంట్ జనరల్ మేనేజరుగా వుంటున్నాడు.