Previous Page Next Page 
టు హెల్ విత్ లవ్ పేజి 9


    "మీరు మాట్లాడేది నాకేం అర్ధం కావటం లేదు."
    "మీ అనుచరులు పట్టపగలే బాంకింగ్ అవర్స్ లోనే నా ఎకౌంట్ లూటీ చేశారు."
    మేనేజర్ కంగారు పడ్డాడు.
    "అంటే?"
    పాస్ బుక్ టేబుల్ మీదకు విసిరాడతను.
    "తొంభైవేలు కాష్ ఎవరో లూటీచేశారు."
    మేనేజర్ పాస్ బుక్ చూశాడు.
    "ఇది మీరు విత్ డ్రా చేయలేదా?"
    "లేదు....."
    మేనేజర్ చెక్ తెప్పించి సంతకాలు టాలీచేసి చూశాడు.
    "అదే సిగ్నేచర్! థెదాఎమే కనిపించటం లేదు. మీరే ఇంటికెళ్ళి ఈ సిగ్నేచర్ చేసినామెతో చెకప్ చేసుకోండి."
    "ఆ అమ్మాయిలో అసలు తేడా లేదు. అప్పరికీ యిప్పటికి మొదటి రోజులాగానే వుంది."
    "ఏమిటీమొదటి రోజూ?"
    "అదే! ఇది ప్రారంభించైనా మొదటి రోజున ఎలా వుందో ఇప్పుడు అదే ఇది! కాకపోతే కొంచెం లావయింది!"
    "ఏమిటీ! సంతకమా?"
    "కాదు, తులసి."
    "ఆమె సంగతి ఎందుకిప్పుడు? నేను సంతకం సంగతి మాట్లాడుతున్నాను!"
    "నేను మిగతా విషయాలు కూడా చెప్తున్నాను."
    "మిగతావి నాట్ నెసెసరీ."
    "అయితే నా డబ్బు నాకివ్వండి! కావాలంటే, అంతగా లూఠీ చేయాలనుకుంటే కోటీశ్వరుడి ఎకౌంటేదయినా చూసుకోండి!"
    "మిస్టర్! మీరుకావాలంటే పోలీస్ రిపోర్టిస్తాను. కానీ తర్వాత మీకే ప్రాబ్లమ్ అవుతుందేమో."
    "అంటే?"
    "మీ మిసెస్ ని అరెస్ట్ చేసే అవకాశం వుంది!"
    "అంటే మళ్ళీ ఆమెను వదిలేవరకు ఇంకెవరినయినా నాకిస్తారా?"
    జుట్టుపీక్కోబోయి ఆగాడతను.
    "మీరు బయటకూర్చోండి కాసేపు విసుగ్గా అన్నాడు "మేనేజర్ ఫోన్ అందుకుంటూ సురేష్ బయటకు నడుస్తుంటే భుజంమీదచేయి పడింది."
    "మేమేతీసుకున్నాం ఆ డబ్బు."
    ఉలిక్కిపడితలెత్తి చూశాడు.
    పక్కనే ప్రాణస్నేహితుడిలా భుజంమీద చేయివేసి నడుస్తున్నాడు విష్ణు.
    "ఎందుకు తీసుకున్నారు?" అతనిచేయి భుజాలమీదనుంచీ తోసి వేస్తూ అన్నాడు.
    "నీ జాబ్ మధ్యలోనే వదిలేశావ్ కదా.....! అందుకని."
    "అంటే తులసి సంతకం ఫోర్జరీ చేశారన్నమాట. ఇప్పుడు పోలీసుల చేతినుంచి ఎలా తప్పించుకుంటారో చూస్తాను."
    విష్ణు కొంచెం శ్రమపడాల్సి వచ్చింది......నవ్వాపుకోటానికి.
    "పోలీసులకెలా తెలుస్తుంది అడిగాడతను."
    "అది ఫోర్జరీ అని తులసి కంప్లెయింట్ ఇస్తుంది."
    "ఇవ్వటానికి ఆమెక్కడ ఉంటుందని? రోడ్ యాక్సిడెంట్ లో మరణిస్తుంది కదా!"
    "గుండె ఝల్లుమంది."
    "కట్ త్రోట్ ఫెలోస్....." కసిగా అన్నాడు.
    "ఈ విషయం చెప్దామనే వచ్చాను. డబ్బు తులసే విత్ డ్రా చేసుకుందనీ, నీకు ఈ విషయం తెలీక అలా గొడవపెట్టాననీ మేనేజర్ తో చెప్పు! ఎవరికీ ఏ సమస్యా ఉండదు."
    సురేష్ కి చిరాకుగా వుంది.
    "ఉన్నా తప్పదు సురేష్! మన లింక్స్ అంత తేలికగా త్వరగా తెగిపోతాయనుకోకు! మేడమ్ నిన్నెప్పుడూ తల్చుకుంటూనే వుంటుంది"
    సురేష్ పిడికిళ్ళు బిగుసుకుంటున్నాయ్.
    "టేకిట్ ఈజి ఫ్రెండ్!"
    భుజం మీద తట్టి వెళ్ళిపోయాడు విష్ణు.
    బయట అతనెక్కుతున్న కారు లోపల గన్స్ తళుక్కున మెరిసి మాయమయినయ్.
    కారు వెళ్ళిపోయింది.
    సురేష్ మేనేజర్ గదిలోకి నడిచాడు.
    "కొంచెం వెయిట్ చేయాలి మిస్టర్! కంట్రోల్ రూమ్ ఫోన్ అవుటాఫ్ ఆర్డర్...." అబద్దం చెప్తున్నాడని తెలిసిపోయింది.
    "ఆయ్ సీ! అయ్ నో!" చిరునవ్వుతో అన్నాడు సురేష్. "మీ హెడ్డాఫీస్ ఫోన్ మాత్రం ఇన్ ఆర్డర్ కదూ?"
    కర్చీఫ్ తో ముఖం తుడుచుకున్నాడు మేనేజర్.
    "ప్లీజ్ వెయిట్ అవుట్ సైడ్....."
    "నాట్ నెసెసరీ! కంప్లెయింట్ విత్ డ్రా చేసుకుంటున్నాను."
    అతని మొఖంలో ఆశ్చర్యం.
    "ఎందుకు?"
    "నేనూ, మీ లేడీ క్లర్కు కాంప్రమైజ్ అయిపోయాము."
    "అంటే?"
    "పోతే పోనీండి తొంబై వేలేకదా! కంప్లెయింట్ చేస్తే మీ లేడీ క్లర్క్ ట్రబుల్లో పడుతుందిట."
    బయటకునడిచాడు సురేష్.
    మేనేజర్ నోరు తెరుచుకుని చూస్తుండిపోయాడు.
    తులసి అతనికోసమే ఎదురుచూస్తోంది.
    "నో కాష్! మళ్ళీ మొదటికొచ్చేశాం మనం"
    ఆమె ఆశ్చర్యపోయింది.
    "అదేమిటి?"
    "బాడ్ లక్! అంతే ఇంకేమీ క్వశ్చన్ చేయకు."
    ఆమె ఏమీ మాట్లాడలేదు.
    "ఆ గాంగ్ వాళ్ళేనా?" కొద్దిసేపటి తర్వాత అడిగింది.
    "అవును"
    "నాకు అనుమానంగానే వుంది."

 Previous Page Next Page