Home » D kameshwari » Aruna

   
    దానికితోడు వేణు ఈ పదిరోజులనించి ఒక్కసారికూడా రాకపోవడం ఆయనకికాస్త ఆశ్చర్యం కలిగించింది సాధారణంగా రెండుమూడు రోజులకి వేణు ఇంటికి వస్తూనే ఉంటాడు. లేకపోతే ఏ సాయంత్రమో ఆస్పత్రినించి ఇద్దరూ కలిసి వస్తారు. వచ్చి ఓ కప్పు కాఫీ తాగివెడుతుంటాడు వేణు. కనీసం ప్రతి ఆదివారమన్నా తప్పకుండా వస్తాడు. ఆదివారం ఇద్దరూ కలిసి సినిమాకో, బీచీకోవెడుతుంటారు, అలాంటిది రెండు ఆదివారాలు కూడా వేణు రాకపోవడం వింత అనిపించింది ఆయనకి. వేణు రాకపోవడానికి అరుణ ఉదాసీనతకి సంబంధం ఉందా అనిపించింది ఇద్దరూ ఏదన్నా మాటా మాటా అనుకున్నారా?    
    ఏమైనా సరే అరుణతో ఆ రోజు మాట్లాడాలి ఏదో ఒకటి తొందరగా నిశ్చయంచేసుకోవాలి అని నిర్ణయించుకున్నారు.    
    అరుణకి ఆ రోజు నైట్ డ్యూటీ లేదు. రాత్రి భోజనం చేసి, తన గదిలోపడుకుని ఏదో ఇంగ్లీషు నవలచదువుతోంది. రామారావుగారు నెమ్మదిగా కూతురుగదిలోకి వచ్చాడు. తండ్రిని చూసి మంచంమీదలేచి కూర్చుంది అరుణ.   
    "ఏమమ్మా, వేణు ఊళ్ళో లేడేమిటి, ఈ మధ్య రావడం లేదు,"సంభాషణకి ఉపక్రమిస్తూ మంచం మీద కూర్చున్నారు.    
    "ఊళ్ళోనే ఉన్నాడు" అరుణ ముభావంగా అంది.    

    "మరిరావడంలేదే? ఒంట్లో సరిగా ఉందా" ఆదుర్దాగా అడిగారు రామారావుగారు.      
    "బాగానే ఉన్నాడు."    
    కూతురి మొహం చూసి ఏదో జరిగిందని గ్రహించారాయన ఆ సంగతి ఎలా అడగాలో ఆయనకి తెలీలేదు. ఆ ప్రశ్న వెనక్కి నెట్టితనడగాలని వచ్చిన ప్రసక్తి ఎత్తారాయన.    
    "అమ్మా అరుణా ఇంకో మూడు నెలలో నీ హౌస్ సర్జెన్సీ అయిపోతుంది. ఇరవైమూడేళ్ళున్నాయి నీకు. ఇంక నీ వివాహం జరిపించడం మంచిదని నిశ్చయించాను. మీ అమ్మ చాలా రోజుల బట్టిపోరుతున్నా....... నీ చదువుపూర్తి అయ్యేవరకు ఆ మాటతలపెట్టలేదు నేను. ఇంక ఇప్పుడు ఏ ఆటంకంలేదు. ఇంకో రెండు నెలలకిమంచి ముహూర్తం ఉంది. ఆ ముహూర్తానికే పెళ్ళి జరిపించాలని అనుకుంటున్నాం" పదిరోజుల బట్టి అనాలని అనుకున్న మాటలు కంఠతా పట్టి అప్పగించినట్లు గుక్క తిప్పుకోకుండా అప్పచెప్పేశారాయన అరుణ మొహందించుకుంది.  
    "నీఇష్టం చెపితే, నేను వేణుతో వాళ్ళ అమ్మగారితో మాట్లాడి ముహూర్తం నిస్చయిస్తాను. ప్రత్యేకంగా నీ ఇష్టం అడగవలసిన అవసరంలేదనుకో ఇన్నాళ్ళబట్టి మీ ఇద్దరినీ చూసి ఆమాత్రం గ్రహించలేదనుకోను." వయసొచ్చిన కూతురితో ఆమె ప్రేమ వ్యవహారం ప్రసక్తి తీసుకురావాలంటే ఆయనకి కాస్త సిగ్గనిపించింది అయినా, అరుణ సుముఖత ఆమె ఇష్టం తెలుసుకోకుండా ముందడుగు ఎలా వేయడం, మరొకటి మరొకటీనా? పెళ్ళి విషయంలో చేసుకొనేదాని అభిప్రాయం తెలుసుకొనకపోతే ఎలా?    
    అరుణ ఆశ్చర్యంగా తండ్రి మొహంలోకి చూసింది, వేణూ తనూవివాహం చేసుకుంటారని తండ్రికి ఎలా తెలిసింది? ఎలా అనుకున్నారు? తనేమిచెప్పలేదే?   
    ఆమెముఖంలో భావం చదవినట్టు జవాబిచ్చారు ఆయన. "మొదటిరోజు వేణుని చూసినప్పుడే నాకీ ఆలోచన వచ్చిందమ్మా నా అభిప్రాయం సరి అయిందేనని మీ ఇద్దరి పరిచయం వృద్ది అవుతున్న కొద్దీ అనుకున్నాను. నీ చదువు పూర్తి అయ్యాక వివాహప్రసక్తి తేవచ్చని ఇన్నాళ్ళూ జాప్యం చేశాను. ఇంక ఆ అడ్డుతీరింది కనక, నీతోచెప్పి వేణు ఇంటికి బయలుదేరాలని అనుకున్నాను" ఆగారాయన.   
    అరుణ హఠాత్తుగా తెప్పరిల్లింది. "వద్దు నాన్నా మీరువేణు ఇంటికి వెళ్ళద్దు: "వారిస్తూ అంది. 
    రామారావుగారు తెల్లబోయారు. "అదేమిటమ్మా: అదేమిటి!?"    
    "అవును నాన్నా నా వివాహప్రసక్తి ప్రస్తుతానికి తేవద్దుమీరు" పుస్తకంలోకి మొహంవంచుకుంటూ అంది.    
    "ఏమిటమ్మా ఏమయింది? వేణూ నీవూ మాటా మాటా అనుకున్నారా? అందుకేనా వేణు రావడంలేదు? ఏం జరిగింది? చెప్పు తల్లీ నేను వెళ్ళి వేణుతో మాట్లాడుతానుగా:" ఆదుర్దాగా అడిగారాయన.    
    "ఏంలేదు నాన్నా ఏమి జరగలేదు పెళ్ళి విషయం ప్రస్తుతానికి వదిలేయండి వేణుని చేసుకోలేను స్థిరంగా అంది అరుణ.    
    రామారావుగారు హతాశులైనట్లు చూశారు. ఏం జరిగిందో తెలియక ఆందోళన పడ్డారు. హఠాత్తుగా అరుణ ఇలా వేణుని నిరాకరిస్తుందని ఆయన ఎదురు చూడలేదు. ఇంచుమించు అరుణకి పెళ్ళి అంత స్థిరపడిందన్నా నిబ్బరంతోనే ఆయన నిశ్చింతగా ఉన్నారు ఇన్నాళ్ళుగా: ఇప్పుడు అరుణ వేణుని కాదంటే ఏమి చెయ్యడం? ఇంకో సంబంధం వెతకడంఅంటే కాస్త చికాకే?    
    అరుణ చదువుకి తగినవాడుస్వజాతిలో, స్వకులంలోవాడు వెంటనే దొరకాలంటే మాటలా? అసలు ఇద్దరి మధ్య ఏమయిందో? ఇన్నాళ్ళూ ఇంత సన్నిహితంగా తిరిగి ఇప్పుడు వేణుని చేసుకోనంటే ఏం బాగుంటుంది : రామారావుగారికి దిగులు పుట్టింది.    
    "అదేమిటమ్మా? వేణూ నీవూ ఇన్నాళ్ళూ ఎంతో సన్నిహితంగా మెలిగారు.    
    మీఇద్దరి చనువుచూసి వివాహం చేసుకుంటారన్న ఉద్దేశంతోనే మేమెవరం అభ్యంతరం చెప్పలేదు. ఆ భరోసాతోటే ఇంకవేరే నీ పెళ్ళి ప్రయత్నాలు చేయలేదు. ఇప్పుడు నీవు ఇలా అంటే నలుగురూ ఏమనుకుంటారు? అందరూ అనుకోవడం అటుంచి అన్ని విధాల యోగ్యుడైన వేణుని నిరాకరించడానికి కారణం ఏమిటో నాకర్ధం కావడంలేదు నామాటవిను నీ మంచి కోరి......"   
    "లేదునాన్నా వేణుని నావి అభిప్రాయాలుకలవలేదుమా పెళ్ళి జరగదునా ఆశయాలని సమర్ధించలేని అతన్ని ఎలా వివాహంచేసుకోను?"   
    "ఆశయాలా?"   
    "అదే నేను ఏదన్నా గ్రామంలో ఉండి ప్రాక్టీసు పెడతానంటే వేణు దానికి ఇష్టపడటం లేదు. పెళ్ళి చేసుకున్నాక అతనోచోట నేనోచోట ఉండలేం గదా!"    
    రామారావుగారు నిర్ఘాంతపోయారు. "దీనికోసమా: దీనికోసమా వేణుని చేసుకోనంటున్నావు?"   
    "అవును మా యిద్దరి అభిప్రాయాలు కలవలేదునా ఆశయం కంటే నా పెళ్ళిముఖ్యమనిపించలేదునాకు:"   
    "అరుణా: ఎంత పొరపాటు చేశావు ఎంత తొందరపడ్డావు దీనికోసం వేణునేకాదన్నావా నీ ఆశయంకోసం వివాహమే చేసుకోవా? ఎలాంటి పని చేశావు? నీ సుఖం కంటే ఈ ఆశయం ముఖ్యమా? ఇంట్లో పెద్దవాడిని ఉన్నాను, నా చెవిని ఓ మాటఅయినా వేయనక్కర లేదనుకున్నావా?" ఆందోళనగా గోల పెట్టారాయన. "నీకిదేం పిచ్చిపట్టుకుంది:" 
    అరుణతల వంచుకుని మౌనంగా ఊరుకుంది.   
    "అమ్మ నీవు చేసింది సరిఅయిన పని కాదు చాలా తొందర పడ్డావు. ఇప్పటికయినా మించిపోలేదు. నేనువెళ్ళి వేణుతోమాట్లాడి అంత సరిచేస్తాను. నా మాట విను తల్లీ నీకు చిన్నతనమూ ఇంకా." "నాన్నా: నేను బాగా ఆలోచించే ఈ నిశ్చయానికి వచ్చాను. నాకు ఈ వివాహంకంటే నా ఆశయమే ముఖ్యం దానికోసం స్వసుఖలనివదులుకోగలను:"{నిశ్చయంగా అంది అరుణ. రామారావుగారికి కూతురి మూర్ఖత్వం చిరాకుతో పాటు కోపం కలిగించింది. బహుశా కూతురిమీద మనసులోనైనా కోపగించడం అదే మొదటిసారేమో: విరక్తి వచ్చిన కూతురికి ఇంకే విధంగా చెప్పాలో ఎలా నచ్చచెప్పాలో అంతుపట్టలేదు.   
    విరక్తిగా చూశారు అరుణ వంక. "అరుణా! ఈనాడు నీవు చేసుకున్న ఈ నిర్ణయం సమంజసంకాదని, ఇప్పుడు కాకపోయినా తరువాతైనా గుర్తిస్తావు: పశ్చాత్తాపపడతావనిమాత్రం చెప్పగలను. వేణుని నిరాకరించి ఎంతపొరపాటు చేశావో ఎప్పటికయినా తెలుసుకుంటావు" అంతకంటే ఏం అనలేకభారంగా అడుగులు వేస్తూ గదిలోంచి వెళ్ళిపోయారాయన.  
    అరుణవెళుతున్న తండ్రివంక చూస్తూ ఊరుకుంది. వేణుతో ఆ రాత్రి సంభాషణ తరవాత అరుణ నిశ్చయం మరింత పటిష్టమైంది. అంతవరకూ వేణుకితను అన్యాయం చేస్తున్నానేమోనన్న భావాన్ని వేణుప్రవర్తన పక్కకు నెట్టివేసింది. వేణు మాటలకి ఆమెకి అదోరకం విరక్తి కలిగింది. తనని తన ఆశయాన్ని ఒక డాక్టరయి ఉండికూడా అర్ధం చేసుకోకపోవడమేకాక, తనని దూరంగా ఉంచడం చూసినా తరవాత తను ఒక మంచిపనికోసం వేణుని నిరాకరించడంలో తప్పేం చేయలేదని అనిపించి మనసుకి నచ్చచెప్పుకుంది. తన ఆలోచనలు అన్నీ తను చేయబోయే పనిమీదే కేంద్రీకరించితన హౌస్ సర్జెన్సీ అయ్యే లోపలే ఎక్కడ ప్రాక్టీసు పెట్టాలో అన్నీ చూసి నిర్ణయించుకోవాలని నిశ్చయించుకుంది.
    "పెద్దవారు మిమ్మల్ని ఈ విధంగా నిరశపరచవలసివస్తున్నందుకు మన్నించండి. ఈ విషయంలో నేనేమి చెయ్యగలను మీరే చెప్పండి ఇందులోనా దోషం ఏముంది?" వేణుగోపాల్ నమ్రతగా అన్నాడు రామారావుగారితో.    
    అరుణతన నిశ్చయం ఖచ్చితంగా చెప్పినా కూడా ఇంకా ఏమూలోకాస్త ఆశ ఉంది రామారావుగారికి అందుకే రామారావుగారు అరుణ తెలియకుండా వేణుగోపాల్ ని కలుసుకుని వివాహప్రసక్తి చెప్పాడు. అతని నేరం ఏమి లేదని ఆయనకీ తెలిసినా మళ్ళీ ఒకసారి అరుణతో తను మాట్లాడిఆమె మనసు మార్చగలడేమోనన్న ఆశతో వచ్చారాయన వేణు చెప్పినదంతా విన్నాక, అతను చేయగలిగింది ఏమీ ఉండదని తెలిసిపోయింది. అరుణ పట్టుదలతనెరగందా?" ఏమిటో నాయన నిన్నేమి అనగలను కేవలం ఆశ చావక, నీవుమళ్ళీ చెపితేవింటుందేమోనన్న భ్రమతో వచ్చాను. ఇన్నాళ్ళుగా అరుణకివరుడు నీవేనన్న నిబ్బరంతో ఉన్నాను. ఇప్పుడు అంతా తలక్రిందులయింది. ఏం చెయ్యాలోతోచడంలేదు. అది దాని పట్టు విడవదు ఆడపిల్లని ఒక్కర్తినీ ఎలా పంపడము ఎలా ఉంటుంది? అసలింతవరకూ దాన్ని చదివించడం నా నేరం అనుకుంటా!"

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra