Home » Merlapaka murali » Nee Meeda Manasaayaraa


    
    మొత్తం భూమి చిన్న చిన్న ముక్కలుగా విడిపోతుంది. మనుషులంతా ఆ విస్ఫోటనానికి మరణిస్తారు. మనిషి ఇంతకాలంగా నిర్మించుకున్న నాగరికతంతా క్షణంలో బూడిదై పోతుంది. ఈ భవంతులు. ప్రాజెక్టులు, ఫ్యాక్టరీలు సర్వం నాశనమైపోతాయి. ముక్కలు ముక్కలుగా విడిపోయిన భూమి విశ్వంలోకి విసిరివేయబడుతుంది. అంటే మానవ చరిత్రకు, భూమి చరిత్రకు మరో వారంలో చరమగీతం పాడబోతోంది షూమేకర్- లెవీ-10
    
    మొత్తం వార్తంతా చదవగానే సూర్యాదేవికి చెమటపట్టింది. దిగులు, బాధా కలగాపులగంగా కలిసిపోయాయి. చిన్నగా శరీరం వణుకుతోంది. ఎంత కంట్రోలు చేసుకున్నా వీలు కావడంలేదు.
    
    ఆమెకు చప్పున వసంత్ గుర్తొచ్చాడు.
    
    కన్నతల్లిదండ్రులకన్నా, కట్టుకున్న భర్తకన్నా అతను గుర్తురావడం ఆశ్చర్యమనిపించింది. తను అతనిని అంతగా ప్రేమిస్తోందా? ప్రేమంటే ఇదేనా?
    
    అయినా భూమి ముక్కలై పోతున్నప్పుడు కూడా ఈ సందేహాలు తనను వదలవా?
    
    వసంత్ కూడా అదే రోజు గడువుపెట్టాడు.    

    శాస్త్రజ్ఞుల అంచనాల మేరకు శుక్రవారం సాయంకాలం అయిదు గంటలా పదిహేను నిముషాలకి షూమేకర్ భూమిని ఢీ కొంటుంది.
    
    ఆరోజు సాయంకాలం ఆరుగంటలకి తనను రమ్మన్నాడు వసంత్. అప్పటికే భూమి ముక్కలు ముక్కలు కింద విడిపోతుంది. అయిదున్నరకల్లా వసంత్ కొండచివర తనకోసం టెన్షన్ తో ఎదురుచూస్తుంటాడు. అయిదున్నరకి వచ్చి ఆరుగంటల వరకు తనకోసం చూస్తానన్నాడు.
    
    ఆరుగంటలకి తను వెళ్ళకపోతే కొండమీద నుంచి దూకి చచ్చిపోతా నన్నాడు. అక్కడికి వెళ్ళడమంటే ఈసారి తను అతని ప్రేయసిగా వెళ్ళాలి. ఇరవై నాలుగు గంటలు తనుయ్ అతని ప్రేయసిగా వుండాలి. అంటే శనివారం ఆరు గంటలదాకా.
    
    ఇప్పుడు ఈ ఉపద్రవం వచ్చి పడింది. ఈ వర్త వసంత్ చూసి వుంటాడా? చూసుంటే అతని రియాక్షన్ ఏమిటి? గడువు తగ్గించుకుంటాడా? ఈ వారం రోజుల్లో తనకో రోజు కేటాయించమంటాడా? లేక బతికేది ఈ వారం రోజులే గనుక ఈ వారం తనతో వుండమంటాడా? ఇదంతా కాదని జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ కాలం గడిపేస్తాడా? ఏం చేస్తాడు?
    
    అమ్మా వాళ్ళకి ఈ విషయం తెలుసా? శ్రీశైలానికి పేపర్లు వెళతాయి కదా అమ్మా వాళ్ళు అర్జంటుగా బయల్దేరి వచ్చేస్తారా? జగదీష్ మాటేమిటి? మధ్యప్రదేశ్ నుంచి బయల్దేరుతాడా? ఈ వార్తను కొట్టిపడేసి, కాంట్రాక్టును సాధించుకుని వస్తాడా?
    
    ఆమెకి ఏమీ పాలుపోవడం లేదు. తలంతా దిమ్ముగా తయారైంది. వారం మరో ఏడురోజులే వున్నాయి.
    
    ఇప్పటికే జనంలో సంచలనం వచ్చేసుంటుంది. అంతలో సరస్వతి పైకి పరుగెత్తికొచ్చింది.
    
    "ఇది విన్నారమ్మా! భూమి పగిలిపోతుందట" మెట్లు వేగంగా ఎక్కడంతో ఆమె ఆయాసంతో రొప్పుతోంది.
    
    "ఆఁ విన్నాను"
    
    "నేనొస్తానమ్మా! ఈ వారం ఇంటి దగ్గర మొగుడూ, పిల్లల్తో గడుపుతాను. ఈ పాడువార్త విన్నప్పట్నుంచీ కళ్ళల్లో వాళ్ళే మెదులుతున్నారు కొంత డబ్బు ఇప్పించండమ్మా"
    
    అప్పుడే ఈ వార్త రియాక్షన్ ప్రారంభం అయిందన్న మాట.
    
    అంటే సరస్వతి వెళ్ళి పోతుందన్న మాట. మరి వారంరోజులే ప్రపంచం వుంటుందంటే ఇంకా పనిచేయాల్సిన అవసరం ఏముంది?
    
    ఉన్న నాలుగు రోజులూ నలుగురితో కాలక్షేపం చేయాలనిపిస్తుంది కదా. లోపలికెళ్ళి బీరువాలోంచి వేయిరూపాయలు తీసుకొచ్చి ఇచ్చింది.    

    సరస్వతి వాటిని లెక్క పెట్టుకుని-
    
    "దండాలమ్మా ఈ డబ్బుతో వారంరోజులకి సరిపడా సరుకులు కొనుక్కుని చీకూ చింతా లేకుండా గడిపేస్తాం. వస్తానమ్మా"
    
    సరస్వతి మరోక్షణం కూడా ఆగలేదు. ప్రతి క్షణమూ విలువైనదే మరి. ఆమె అటు వెళ్ళిందో లేదో కుక్ వెంకట్రావు సూర్యాదేవి దగ్గరికి వచ్చాడు అతనూ వెళ్ళిపోతున్నాడన్న మాట. ఆ మాటే అంది ఆమె-
    
    "వెళ్ళిపోతున్నావా?"
    
    "అవునమ్మా తిరుత్తణిలో వుంది సంసారం అక్కడికి వెళ్ళాలి"

    "డబ్బులు ఇస్తానుండు"
    
    "వద్దమ్మా ఎందుకు డబ్బు? బ్యాంక్ లో నాలుగువేలదాకా వున్నాయి. ఈ వారం రోజులకే కదా డబ్బు కావాల్సింది. వారం రోజులకి ఆ డబ్బే ఎక్కువ. మరింకెందుకు? వస్తానమ్మా, ఇన్నాళ్ళూ నన్ను బాగా చూసుకున్నారు. అయ్యగారికి వెళ్ళిపోయానని చెప్పండమ్మా"
    
    అతను వెళ్ళిపోయాడు.    

    సూర్యాదేవి ఆశ్చర్యపోయింది. డబ్బు కూడా వద్దన్నాడు. నిజమే! ఇక డబ్బు ఎందుకు? వారం రోజులకి సరిపడా ఫుడ్ వుంటే చాలదూ.
    
    ఇంకా ఒంటరిధైపోయిందామె. ఏం చేయాలి? అందరూ తన వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నారు. మధ్యప్రదేశ్ లో వున్నా జగదీష్ కూడా బయల్దేరాడేమో!
    
    ఫోన్ మోగుతుండడంతో ఒక్క గంతులో అక్కడికి వెళ్ళి రిసీవర్ అందుకుంది.
    
    "ప్రపంచశాంతి"
    
    ఆ స్వరం విన్న సూర్యాదేవికి ఒక్కసారిగా సంతోషం తన్నుకొచ్చింది. ఆనంద ఉద్వేగాల మధ్య ఆమె గొంతు పెగలడం లేదు.
    
    "ఇంకా ఏం ప్రపంచశాంతి? మొత్తం ప్రపంచమే పగిలిపోతుంటే"
    
    "ఇప్పుడే నేనూ పేపర్లో చూశాను. టీవీలో ఏ ఛానల్ తిప్పినా అదే గోల మా ఇంటి ఓనర్ ఇంట్లో దూరి చూశాను. వెంటనే మీకు ఫోన్ చేయాలనిపించి చేశాను. ఈ పబ్లిక్ బూత్ లో కూడా ఎవరూ లేరు. ఓనర్ దీన్ని వదిలిపెట్టి తన కుటుంబంతో గడపడానికి వెళ్ళిపోయాడు"
    
    "మా ఇంట్లో పనివాళ్ళు కూడా వెళ్ళిపోయారు. చాలా రోజుల తరువాత వంట చేయబోతున్నాను"
    
    "నేనూ అదే చేయాలనుకుంటున్నాను. హోటళ్ళు కూడా వుండవను కుంటాను. అయినా వారం రోజులు బతకాలిగా అందుకు ఏదో ఒకటి తినాలి" అన్నాడు వసంత్.
    
    "ఈ వారం రోజులు ఏం చేయబోతున్నావ్?"
    
    "ఏం చేయాలి అన్న ప్రశ్నే నాకు రాదు మిమ్మల్ని తలుచుకుంటూ ప్రేమిస్తూ వుండడమే నా పని గడువు వరకు మీకోసం నిరీక్షించడమే"
    
    "ఇంకెక్కడి గడువు? నువ్వు ఆరుగంటలకు అన్నావ్. ఈ ప్రమదం మన భారత కాలమానం ప్రకారం అయిదూ పదిహేను నిముషాలకే వచ్చేస్తుంది"
    
    "మీరింతగా ఆలోచిస్తున్నారుగానీ నాకు ఆ గడువు తప్ప మరేదీ పట్టడం లేదు. అంతకు ముందే ప్రపంచం బద్దలైపోతుందా? పోనివ్వండి మీకోసం నిరీక్షిస్తూ మరణించడం యెంత బావుంటుందో కదా మీరు రాకుంటే చచ్చిపోతానన్నాను కదా అలానే చచ్చిపోతాను. అంతకుముందు వచ్చే ప్రమాదంలో నేను పోతానా లేదా అన్న ఆలోచనే రావడం లేదు.
    
    ఈ ప్రమాదం వస్తుందని గడువును మార్చి, మిమ్మల్ని ఇబ్బందిపెట్టే ప్రశ్నే లేదు. అయిదూ పదిహేను తరువాత ఈ ప్రపంచం వుంటుందా వుండదా అన్న సందేహం నాకు లేదు. ఉంటే మీరొస్తారా లేదా అన్నదే నాక్కావాల్సింది"
    
    "అంటే ఈ ప్రమాదం ఎఫెక్టు ఏమీలేదా?"
    
    "పూర్తిగా లేదు. నేను మిమ్మల్ని ప్రేమించాక వీటికి అతీతమైపోయాను. మీరు నన్ను ఇరవై నాలుగు గంటలు ప్రియుడిగా లాలిస్తారా లేదా అన్నది తప్ప మిగిలినదేదీ నన్ను కదిలించదు"

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra