లేదు... ప్రమాదమేమీలేదు... మీరు రెస్టు తీసుకోండి..." మెల్లగా చెప్పింది డాక్టర్ మధురిమ.
"దాహంగా వండి డాక్టర్."
"వెయిట్ మినిట్" డోర్ తెరవబోయేటంతలోనే లోనికొచ్చింది మేరీ.
"మేరీ వేడినీళ్ళు తాగించు" అంది మధురిమ తడబాటుని దాచుకుంటూ. డాక్టర్ చెప్పినట్లుగానే చేసింది మేరీ.
రెండు నిమిషాల తర్వాత నెమ్మదిగా కళ్ళు మూసుకున్నాడతను.
"మేరీ... అతనేదో కన్ ప్యూజన్ స్టేటస్ లో వున్నాడు_ అతనడిగే ప్రశ్నలకు తీరుబడిగా జవాబు చెప్ప... అతనేమీ వర్రీ కాకుండా చూడు" అంది మధురిమ_ తనకు తెలీయకుండానే అతని ఆరోగ్యం గురించి అమిత శ్రద్ధ తీసుకుంటూ.
"ఏస్... డాక్టర్..." అంది హెడ్ నర్స్ మేరీ ఒకింత ఆశ్చర్యానికి లోనవుతూ.
మధురిమ చకచకా నడుచుకుంటూ ఆ రూమ్ లోంచి బయటకు వెళ్ళిపోయింది.
* * * *
రెండు గంటల తర్వాత_
డాక్టర్ మధురిమ చాంబర్ లో కొచ్చింది నర్స్ మేరీ.
"అతను స్పృహాలోకొచ్చాడు... ఇందాక చాలా నార్మల్ గా వున్నాడు. తన ప్రాణాలను కాపాడినందుకు మీపట్ల ఎంతో కృతజ్ఞతా వ్యక్తం చేశాడు." అంది మేరీ డాక్టర్ మధురిమ కేసి పరిశీలనగా చూస్తూ.
"అతన్ని దగ్గరుండి చూసుకున్నది నువ్వు... అతను వెంటనే రికవర్ కావడానికి నీ నర్సిమే ముఖ్యం... అతని కృతఙ్ఞతలు నీకే చెందాలి."
"నేనిక్కదాన్నే కాదు డాక్టర్... మేట్రన్. నర్స్ లక్ష్మి, నేనూ, అందరం అతను బాగావ్యాలనేశ్రమించాం" అన్నది మేరీ.
"అతని పేరేంటో కనుక్కున్నావా...?" నేమ్మదిగా అడిగింది డాక్టర్ మధురిమ.
"అడిగాను"
` "ఏం పేరు ...?" ఆతృతను అణుచుకుంటూ అడిగింది మధురిమ.
"అతను తన పేరు చెప్పలేకపోతున్నాడు మేడమ్....ఎందుకో తెలీదుగానీ__ తన పేరును గుర్తుకు తెచ్చుకోవడానికి ప్రయత్నంచేస్తున్నా వాడిలా చాలాసేపు మధనపడటం నేను గమనించాను" హెడ్ నర్స్ మేరీ అంది.
"అతని మెంటల్ కండిషన్ ప్రస్తుతం బాగానే వుంది కదా?" అని నర్స్ మేరీని అడిగింది డాక్టర్ మధురిమ.
"ఏస్... డాక్టర్! ఏం లోపం లేదు. కానీ పేరుచెప్పటానికి భయపడుతున్నాదో, సంకోచిస్తున్నాడో. లేక షాక్ వల్ల నిజంగానే తన పేరుతో పటు తన గతాన్ని మర్చిపోయాడో అర్ధంకాకుండా వుంది."
"ఒక్కసారి అతని రిపోర్ట్స్ తీసుకురా..." మధురిమ నోటినుంచి ఆ మాట రాగానే, బయటకు పరుకేట్టి, మూడు నిమిషాల్లో అవసరమైన రిపోర్ట్స్ తో తిరిగి లోపలికొచ్చింది. నర్స్ మేరీ.
ఆ రిపోర్ట్స్ ని అందుకని పరిశీలించటం మొదలు పెట్టింది. డాక్టర్ మధురిమ. కొద్ది నిమిషాలకు ఆ రిపోర్ట్స్ ని పక్కన పెడుతూ_
"ఎవ్విరిథింక్ ఓ.కే... డాడీ ఈజ్ ఇన్ నార్మల్ కండిషన్__ ఎక్కడా ఏ లోపం లేదే? మరెందుకిలా బిహేవ్ చేస్తున్నాడు?" అంది డాక్టర్ మధురిమ.
"అతని కోసం ఎవరైనా వస్తే తప్ప... అతని పేరు, ఊరు మనకు తేలియవు. ఇదేదో హిచ్ కాక్ సినిమా సస్నేన్స్ లా వుంది కదా డాక్టర్?" ఆ రిపోర్ట్స్ ని పట్టుకుని వెళ్ళిపోతూ అంది నర్స్ మేరీ.
హిచ్ కాక్ సినిమా సంసేన్స్...?
ఒక డాక్టర్ గా చాలా సీరియస్ గా, త్రూ ప్రొఫెషనల్ గా వుంటుంది తను. అలాంటిది ఆ పేషెంట్ గురించి ఎక్కువసేపు ఆలోచించడం ప్రత్యెక శ్రద్ధ తీసుకోవడం, తీసుకోమని స్టాఫ్ చెప్పడం.... అంతా కాకతాళీయంగా జరుగుతోందా?
లేక ఎక్కడో, ఏదో తెలియనిశక్తి పనుల్ని చేయించటానికి తనని ప్రేరేపిస్తుందా?
తన ఆలోచనలే తనకు చిత్రంగా వున్నాయి.
అతనిపట్ల తనకు ప్రత్యెక శ్రద్ధ ఏర్పడటానికి, ప్రత్యెక కారణం ఏమిటి? తెలీదు. మధురిమకు అకస్మాత్తుగా లాయర్ నీలకంఠన్.... అతను మళ్ళీ ఎప్పుడు ఫోన్ చేస్తాడు?
ఊరూ, పేరూ తెలీకుండా తాము ట్రీట్ మెంట్ ఇవ్వటానికి మానవతా దృక్పథం కారణం కావచ్చు_ కానీ ఇదే ఊరూ, పేరు తేలీని పేషెంట్ గురించి లాయర్ నీలకంఠన్ కి ఎలా తెలుసు...?
ఏదైనా ప్రమాదకరమైన స్కూఫ్ ఈ సంఘటన వెనక దాగుందా? ఏమీ అర్ధంకాలేదామేకి.
* * * *
ఒక్కసారిగా వీచిన గాలికి చెట్లమీద పూలన్నీ ఉలిక్కిపడ్డాయి_పూలలిని సుగంధాలు, అలలు అలలుగా పరిభ్రభిస్తూ, మధుర వాసనల్ని ప్రపంచం మీదకు వెదజల్లుతున్నాయి. ఎక్కడో ఒక కంటి కిరణం, సూర్యకాంతం పువ్వూలా విచ్చుకుంది.
హాస్పిటల్ లోని ఆ రూమ్ లో అంతవరకూ మగతగా నిద్రపోయిన ఆ అందమైన పేషెంట్ ఉలికిపాటుగా తెప్పరిల్లాడు.
రూమ్ లో చల్లదనంతో కల్సిపోయిన నిశ్చబ్దం ఆవరించుకుని వుంది. వేనీషియన్ బ్లయిండ్స్ సందులోంచి సూర్యరశ్మి లోపల పడుతోంది....
లేత నీలం రంగుల్లోని గది గోడలు కళ్ళకు హాయిగా కన్పిస్తున్నాయి. బెడ్ పక్కన ఇంటర్ కం... ఎదురుగా పోర్టబుల్ టి. వీ... పరిసరాల్ని ఒకసారి గమనించాక, బెడ్ నుంచి లేవాబోయాడతను. కానీర్ వీలు కాకపోవడం వల్ల వెనక్కీ నీరసంగా వాలిపోయాడు. తన ఎడమ భిజానికి కట్టుకట్టి వుండటం గమనించాడతను.
అసలేం జరిగింది? తను హాస్పిటల్ లో వుండటానికి కారణం ఏమిటి? గుంపులు, గుంపులుగా పోగామంచు... భయంకరమైన శబ్దం... అరుపులు...అన్నీ ప్లాష్ లా ఒక సెకండ్ కాలం మాత్రమె జ్ఞప్తికి వచ్చాయి.... అంతలోనే కళ్ళెదుట చీకటి... కటిక చీకటి...