"రాఘవా!"
"ఊ!"
"నీ బాధ్యతలు- బరువులు"
"ఆ శరీరాన్ని వదిలేశాను. ఇది పునర్జన్మ, తపస్సు ఫలించిన జన్మ."
"రఘూ! నేనంటే ఎందుకీ ఆరాధన?'
"వెన్నెల అంటే ఎందుకింత యిష్టం?"
"ఏమిటి ఈ భక్తీ భావం?"
"సంగీతం అంటే ఎందుకిలా గుండె స్పందిస్తుంది."
"ఎంత ప్రేమ!"
"రా! నా గుండెలో వలపు కువకువ లాడింది"
"మినీ- నీ గుండెలో, నీ చూపులో చూపునై, వలపునై, మాలలో భావమై, బ్రతుకులో బ్రతుకునై, గుండె నిలిచిపోతాను, బ్రతుకెల్లా కలసిపోతాను."
"నీవూ నేనూ మిగిలామా ఇంకా? మనం ఒకటయ్యాం రాఘవా హక్కు అర్ధంలా కలిసిపోయాం."
అతని చేయిని ఆప్యాయంగా స్పృశింస్తోందామె. ఆ స్పర్శ వెంట వేయి జన్మల నుండి వెన్నంటి వచ్చే వేడి వెన్నెల వంటి వలపు ప్రవహిస్తోంది.
అనంతపురం స్టేషన్ వచ్చింది.
ప్రేమ ఆమె భర్త వచ్చారు. " అమ్మా! అంటూ వాళ్ల పిలుపు ప్రశాంత రాత్రిలో ప్రళయగర్జనాలా అనిపించింది.
ముఖం చిట్లించింది రుక్మిణి.
"వెళ్ళిపోతున్నావా అమ్మా?" జవాబివలేదు
"ఏమిటిది? లోకమేమనుకుంటుంది, ఈ వయసులో ఏమిటిది?"
"ఏమిటి అలా అంటున్నావ్? నన్ను హేళనగా అనుకుంటారా ఇంకా? ఉహూ అనుకోని- నాకు ఫర్లేదు. నేను లెక్కచేయను. ఇది నా జీవితం- నా యిష్టం."
"కానీ మేమున్నాము."
"నాకెవరు లేరు?" ఆయనొక్కరే వున్నారు.
'మమ్మల్ని అంతా ఉస్తారు- మేం ఎలా బ్రతకాలి. ఈ అవమానం భరించలేం. చచ్చిపోతాం.'
"అది మీ యిష్టం మీ నిర్ణయం."
"నీకు బాధగా లేదామ్మా?' నిష్టూరంగా అంది.
"బాధ! ఇన్నేళ్ళు నా బాధ ఎవరు చూశారు? ఎవరు గుర్తించారు. అందరూ యధాశక్తి హింసించారు. ఇప్పుడేమో వగలు ఏడ్పులు. " ట్రయిన్ కదిలుతోంది.
"వెనక్కిరావా?"
"ప్రేమా నీకు తెలిదు. నేనేం పోగొట్టుకున్నానో--- ఇన్నాళ్ళుగా పొందలేనిది ఈనాడు పొంది ఎంత సంతోషంగా వున్నానో తెలిదు. వెళ్లు.'
ట్రయిన్ కదిలింది. ఆమె రాఘవ చేయి అందుకుంది. అతని స్పర్శ ఆమెకి ఓదార్పు అయింది.
హిందూపురం స్టేషన్ లో ట్రయిన్ ఆగింది.
'అమ్మా'
మధురసం గీతాలాపనలో అపశ్రుతిలా వినిపించింది. 'ఇంకా తననెందుకు వెన్నంటి వస్తున్నారు?' అనుకుంది పలకలేదు.
'వెళ్ళిపోతున్నావా? అమ్మా'
' ఈ తేది పది సంవత్సరాలనాడే నిర్ణయమైంది.'
'కానీ అవమానం--నిందలు'
'అవన్నీ మీకు సంబంధించినవి.'
"నీకు-"
'నా లోకం వేరు నేను నా సామి - నా బ్రతుకు - పల్లవించిన రస జీవితం నాకు కావాలి."
"నీకులోకవిమర్శ అక్కర్లేదా?
'ఉహూ"
'నువువెళ్ళే చోటున విమర్శిస్తే'
'విమర్శించరు-'
'మీ సంబంధం తెలిసి ఇలా నువు మమ్మల్ని- అయన వాళ్ళని వడిలివస్తున్నారని తెలిసి మీ రాక నిషేదిస్తే'
'అలాజరగదు'
'జరిగితే'
"బాబూ- ఎందుకింకా యీ క్షోభ నాకు? మీరెవరో నేనెవరో ఏదో బంధం కలిసి నందుకు సేవ చేశాను. బాధ్యతలు తిర్చుకున్నాను. వెళుతున్నాం."
"మేము అక్కర్లేదా?'
'ఉహూ"
"అయితేనేనూ, నీ కోడలు, నాన్నగారు, చెల్లాయి, బావ పిల్లలు, అంతా ట్రెయిన్ క్రింద పడి చస్తాం.
ఆమె గుండె కలుక్కుమంది. అయినా ఒక్క క్షణం "మీ యిష్టం మీ నిర్ణయంతో నాకేమిటి పని? అంది నిర్లిప్తంగా.
"అదే నీ ఆఖరి నిర్ణయమైతే -"అంటూ 'నాన్నా' అని పిలిచాడు అతను.
ఆ పిలుపు విని పక్క పెట్టెలోని పరమశివం, ప్రేమా, ఆమె భర్త, పిల్లలు వచ్చారు.
"మీరంతా వెన్నంటే వస్తున్నారా?"
"ఆ"