కార్దియాలిజిలో స్పెషాలిజేషన్ చేసిన డాక్టర్ మధురిమ డైరీలో క్రానిక్ కార్డియలజీ కేసులే ఎక్కువుగా కనిపిస్తాయి.
తన వృత్తికి సంబంధించిన ఒక్కపాయింట్ కూడా ఆ డైరీలో ఇంతవరకూ చోటుచేసుకోకపోవడంపట్ల అప్పుడప్పుడూ ఆమెకు కూడా ఆశ్చర్యం కలుగుతుంది.
ఈ జీవితపు డైరీలో వ్యక్తిగత జీవితానికి ఒక పేజీకూడా వుండదా?
తన ఇష్టాఇష్టాలు... ప్రేమాభిమానాలు... స్నేహితులు... బంధువులు... తన క్లాస్మేట్స్ దగ్గరనుంచి కూడా తనకెందుకు ఉత్తరాలు రావు?
తను కార్డియలిజిస్ట్ అంటే హృద్రోగ నిపుణురాలు... ప్రేమకు. గుండెకు సంబంధం లేదని తనకు తెలుసు సైంటిఫిక్ గా చెప్పాలంటే మెదడు కణాలలో పుట్టే ప్రతిస్పందన_ దాని పేరే ప్రేమ. అది ప్రేమా? ఆకర్షణా? మోహమో? మరింకైడైనా... పరిపేరి విధాలుగా ఆలోచిస్తోంది మధురిమ మనసు.
దానికి కారణం...
ఇప్పటికీ స్పష్టంగా తెలియదామేకు....
ఒక డాక్టరుగా వైద్యపరంగా ఆలోచించటం తప్పించి మిగత తన ఏమోషనల్స్ ని ఎలా నియత్రించుకోవాలో ఆమెకు బాగా తెలుసు_ అయినా...రాత్రి తను హాస్పిటల్ లో జాయిన చేసుకున్న పేషెంట్ ని బెడ్ మీద మొట్ట మొదటిసారి చూడగానే అచ్చర్యపోయింది... ఎందుకు?
ఎర్రటి ముఖం, విశాలమైన నుదురు, సూదిలాంటి ముక్కు... తీరైన ఆకృతిలో పెదవులు, ఆపినా సన్నటి మెసకట్టు... గాయపడి, నిద్రపోతున్నవాడిలా లేడతను_ దేనికోసమో అలకతో నిద్ర నటిస్తున్న వాడిలా వున్నాడు.
అతన్ని చూడగానే, ఎందుకో తన మనస్సు ఉలిక్కిపడింది. ఎవరో చిరపరిచితమైన వ్యక్తిలా అన్పించాడేందుకు? ఆ సమయంలో తన మనస్సులో కలిగిన భావసంచాయానికి కారణం ఏమిటి?
తనలో తను ఎందుకు సిగ్గిపడింది? తన సిగ్గును, తను భావాలను ముఖకవళికల్నీ, నర్స్ మేరీ చూడకుండా ఎందుకు జాగ్రత్తపడింది.
అతడ్ని చూసిన దగ్గర్నుంచి ఈ కార్డియాలిజిస్ట్ హృదయమే_ కవిభాషలో లయ తప్పింది. ఆ లయని అర్ధం చేసుకోలేకపోతోందామె. ఆ అందమైన యువకుడ్ని తన పేషెంట్ గా చూడలేకపోతుందా? దానికి కారణం....?
తనలోని స్రీత్వమేనా? ఇన్నాళ్ళకు తనలోని స్రీత్వం నిద్రలేచిందా? ఆకర్షణని, ఇష్టాన్ని చూడగలుగుతుందా? మిరాక్యూలర్ ట్రాన్స్ ఫర్మేషన్...
ఒక కార్పోరేట్ హాస్పిటల్ కు చైర్మెన్ అయిన డాక్టర్ మధురిమ వైద్యవృత్తిని పెళ్ళి చేసుకుందని తోటి డాక్టర్లు జోక్స్ వేస్తుంటారు_ ఆ మాటలు విని నవ్వి వూరుకుంటుంది ఆమె.
డాక్టర్ కి వుండాల్సిన ప్రధమ లక్షణం సహనం_అదెప్పుడూ గుర్తుంచుకుంటుంది కాబట్టే, చిన్న వయస్సులోనే అంతటి స్థాయికి ఎదిగింది మధురిమ.
మధురిమకు అసలు ప్రేమంటే తెలియదా? మెడిసిన్ చదివే రోజుల్లోనే చాలామంది అబ్బాయిలు లైన్ వేశారు. ఉత్తరాలు రాశారు. బ్లాక్ రాజ్ అని ఒక నెక్ నేం కూడా పెట్టారు.
ఆ నిక్ నేం పెట్టిన కుర్రాడ్ని ఒకసారి దగ్గరకు రమణి పిలిచింది. అతను క సమయంలో ఎంత భయపడిపోయాడో అతని మొహాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఇప్పుడు చచ్చేంత నవ్వోస్తుంది.
దగ్గరకొచ్చిన ఆ అబ్బాయి "అయామ్ సారీ మిస్ మధురిమా..." అన్నాడు.
"సారీ ఎందుకు... ఆ నిక్ నేమ్ చాలా బాగుంది... అది చెప్పడానికే పిలిచాను..." అని చెప్పేసరికి ఆ కుర్రాడి ముఖం వేల వేల బోయింది.
కొన్ని ఫీలింగ్స్ వెనక వెతకడానికి కారణాలు దొరకవు.... అలోచిస్తూనే సీట్లోంచి లేచి అసకల్పితంగానే ఆ పెషింట్ రూమ్ లోకి నడిచింది మధురిమ.
తనకు ఫో చేసిన లాయర్ని, అడగలనుకుని మర్చిపోయిన విషయం సడన్ గా అప్పుడు గుర్తుందామెకు. ఇంతకీ ఇతని పేరు? ఇతనికి, లాయర్ కి మధ్య వున్న సంబంధం ఏమిటి?
ఇతను తన హాస్పిటల్ లోనే ట్రీట్ మెంట్ పొందుతున్నట్టు ఆ లాయర్ కేలా తెలుసు? అమెకదంతా అయోమయంగా అనిపించిందో క్షణం...
అప్పుడు ఆ రూమ్ లో ఎవరూ లేరు_ ఏ.సి. మెషిన్ శబ్దం తప్పురూమంతా నిశ్చబ్దంగా వుంది.
మంచులో తడిసిన నండి వర్ధనలా, మంచు స్నానమాడిన రాజపువ్వులా, ప్రశాంతంగా, ఎంతో నిబ్బరంతో హాయిగా నిద్రపోతున్నాడతను... అతనెంతో ప్రెష్ గా వున్నాడు... ముందుకడుగేసి, అతని మూసినా కళ్ళవైపు సూటిగా చూసిందామె.
అకస్మాత్తుగా అతనికి మేలకుల వస్తే..." అతని బలమైన దృడమైన చేతులు... వాటిమీద వెంట్రుకులు పురుషత్వానికి ప్రతికల్లా...ఎందుకిలా యితను తనను ఆకర్షిస్తున్నాడు? మధురిమ మెల్లగా తన కుడిచేతి అతని నుదుటిమీద వేసింది.
జీవితంలో మొట్ట మొదటిసారిగా నిజమైన పురుష స్పర్శ _ మధురిమ మనస్సులో వింతయిన అనుభూతి....
ఒక డాక్టర్ పేషెంట్ ను స్పర్శస్తున్నట్టుగా, ఆ స్పర్శ లేక పోవడం వింతగా వుంది ఆమెకు.
అంతలోనే వెంటనే చేయి తీసేసి, వెనదిరిగింది డాక్టర్ మధురిమ పిలుపు...? కంగారుగా తలతిప్పి చూసింది డాక్టర్ మధురిమ.
అందమైన పేషెంట్ కు మెలకువ వచ్చింది_ తదేకంగా తనవైపు చూస్తున్నాడు.
"ఏస్.." ఆ ఒక్కమాట పలకడానికి, తనని తాను కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నించటం చాల ఆశ్చర్యంగా వుంది మధురిమకు.
"డాక్టర్... నేనెలా హాస్పిటల్ కు వచ్చాను...? నన్నెవరు తీసుకొచ్చారు? నాకేం ప్రమాదం లేదుకదా?" వరుసుగా ప్రశ్నలు.