"ఛా , అలా అనకూడదు." అంది సీత.
రామచంద్రం ఓసారి తల ఎత్తి రూపాని చూసి తల దించుకున్నాడు.
"ఏం ఎందుకనకూడదు. నేను చదువుకోకుండా ఇల్లిల్లు తిరుగుతానని ఎప్పుడు తిడుతుంటాడే, తను సినిమాలకి ఫ్రెండ్స్ తో షికార్లకి తిరగోచ్చెం? చదువుకోకుండా అలా తిరిగాడు కాబట్టే పరిక్ష పోయింది"
"నోరు ముయ్యవేరుపా" కోప్పడింది సీత,
"అన్నయ్య నన్నెప్పుడు చదువురాని మొద్దు అంటూ తిట్టేవాడుగా ఇప్పుడు వూరుకుటానేమిటి?"
ఊరుకోవద్దుగాని, "ముందిక్కడ నుంచి వెళ్ళు" రూప మాటలకి తండ్రి మరింతగా బాధ పడతాడని గట్టిగ కోప్పడింది సీత.
"నీక్కూడా కోపమెక్కువయింది." గొణుక్కుంటూ వెళ్ళింది రూప.
"దీని నోటికి హద్దూ అపూ లేకుండా పోతున్నది." అన్నాడు రామచంద్రం.
"అదింకా చిన్న పిల్ల దానికేం తెలుసు నాన్నా?' అంది సీత.
"నువ్వు పెద్దదానివా తల్లీ! మీ అమ్మే వుంటే నువ్వెంత పసిదానివో తెలిసేది తల్లిని పోగొట్టుకున్న దురదృష్టం నిన్ను పెద్దదాన్ని చేసింది సీత!" అనుకున్నాడు రామచంద్రం.
తండ్రి మౌనం చూసి మళ్ళి మాట్లాడించలేదు సీత.
5
అద్దం ముందు కుర్చుని తల దువ్వుకుంటూ "బలె బలె మగాడివోయ్ బంగారు నా సామివోయ్' అంటూ కూని రాగం తీస్తున్నది రూప.
గంట నుంచి నువ్వే దువ్వుకున్తున్నావు. అద్దం యివ్వవు దువ్వెన యివ్వవు నేను జడ వేసుకోవాలి' అంది విజయ.
"నే జదేసుకోవటం పుర్తికావోద్దేమిటి?" దీర్ఘం తీసింది రూప.
ఇంతసేపు ఎవరు జడ వేసుకోరు"
"నీకు మహా తెలిసినట్లు చెప్పకు."
"మహా నీకే తెలుసు"
"ఆ...."
"ఆ కాదు ఎంతసేపు దువ్వినా వక్కపాయే. ఎంతసేపు పాడినా ఆ ఒక్కముక్కే బలేబాలే మగాడివోయ్ అంటూ హి హ్హి హ్హి...."
రూప ఈడ్చి వక్కటేసింది జయవీపు మీద.
"అక్కా...! చిన్నక్క చూడు దువ్వెన అడిగితే చావ గొట్టింది." అంటూ గట్టిగా అరిచింది జయ.
అద్దం దువ్వెన కోసం గంట నుంచి చెల్లెల్లిద్దరూ వాదులాడుకోవటం సీత వింటూనే వుంది. తొందరగా కానియవే రూప వినదు. కాస్త అగవే అంటే జయ వినదు. వినేవాళ్ళయితే సర్ది చెప్పొచ్చు. విన్నా వినకపోయినా సీత కలగ చేసుకోక తప్పలేదు. సీత చేస్తున్న పని ఆపుచేసి వచ్చింది.
చిన్నపిల్ల దాన్నేందు కేడిపిస్తావే రూపా?" అంది సీత.
"చిన్నపిల్ల కాదు చిన్న రాక్షసి పిల్ల. పంతం కాకపోతే నే దువ్వుకునేటప్పుడే రావాలా అది.....?" అంది రూప.
"నేనేం రాక్షసి పిల్లను కాదు. నువ్వే రాక్షసి, దెయ్యం భూతం...." జయ వెక్కిరిస్తూ అంది.
"మీరిలా పోట్లాడుకుంటునే వుంటారా, నా మాట వినేదేమయినా వుందా?" అడిగింది సీత.
ఇందాక నుంచి పక్కగదిలో వుండి దండేలు తీస్తున్న రాజు అ పని పూర్తి చేసి వీళ్ళ దగ్గిరికొచ్చాడు.
"నా మాట వింటారా లేదా అని మెల్లిగా అడిగా వనుకో అక్కా! చచ్చినా వీళ్ళు నీ మాట వినరు ఇందాక రుపక్కేమంది జయని రాక్షసి పిల్ల అంది అంటే అది రాక్షసికి పుట్టిన పిల్లనేగా అర్ధం, అసలు నన్నడిగితే...."
రాజు మాట పూర్తికాకముందే రూప అందుకుంది.
"కోడిగుడ్డు మీద ఈకలు పికటానికి చూస్తాడు. వెధవ తెలివి తేటలు"
"చిన్నక్క పప్పులో కాలేసింది. కోడిగుడ్డు మీద ఈకలుండవొచ్..."
"భలే భలే తిక్కకుదిరింది." రాజుకి తాళం వేసింది జయ.
"వెధవ తెలివి కోడిగుడ్డు ముద ఈకలుండవని నాకూ తెలుసు, పప్పులో కలేశావని ఎక్కిరిస్తుంటివే? పప్పులో ఎవరైనా కాలేస్తారేమిటి?"
"ఆ...వేస్తారు నీలాంటి వాళ్ళు."
రుపకి పూర్తిగా కోపమొచ్చింది. అద్దం దువ్వెన పుచ్చుకుని చర్రున పక్కగదిలోకి వెళ్ళి ఫడేల్ మని తలుపేసుకుంది.
"మరో గంటదాకా తలుపు తియ్యదు. పంతానికి అలా తలదువ్వుకుంటునే వుంటుంది" అన్నాడు రాజు.
"తప్పు! పెద్దవాళ్ళని ఏమి అనకూడదు " సీత మందలించింది.
"ఏం అంటే?" అంది జయ.
"దీనికేం చెప్పాలి!" ఆలోచిస్తున్నది సీత.
రాజుకి సహజంగా చురుకు పాలేక్కువ . ఒక ఎడుకన్నా మరో ఏడు పెద్దవాడవుతున్న కొద్ది వయసుకి మించిన ఆలోచనలు తెలివి తేటలు ఎక్కువవుతున్నాయి. అన్ని కళలు నేర్చు కోవాలనే కుతూహలంతో ప్రతి దానిలో అడుగు పెట్టటమే దేనిలోనూ పరిపూర్ణత లేదు. బస్కీలు, దండేలు, మిమిక్రి చేయటం పాత లాంతర్ల మరమత్తు నుంచి పనికి మాలిన వస్తువులతో పని కొచ్చే ప్రయోగాలు అన్ని కల్పించుకుని స్వయంగా చేయటమే.