Home » Mainanpati bhaskar » Yama Dootha

 

    అంటే వాళ్ళేదో యుద్ధం చేసి శత్రువులని మట్టుబెడతారని ఆశతో కాదు.
    
    యుద్ద సమయంలో శత్రు సైన్యాలు ముందుకు చొచ్చుకు రాకుండా భూమిలో మందు పాతరలు-మైన్స్ అంటారు వాటిని-శత్రుసైన్యాలు వచ్చేదారిలో పెడతారు. ఈ మందు పాతరలు శత్రువులు వాటి పైన అడుగు పెట్టగానే పేలిపోతాయి.
    
    మైన్స్ పేలితే గాయాలు ఎంత తీవ్రంగా తగులుతాయో తెలుసు దినకర్ కి. అతను అనేక సందర్భాల్లో ప్రపంచమంతా తిరిగి వచ్చాడు. అలా ఒకానొక సందర్భంలో వెళ్ళినప్పుడు పెషావర్ లోని కువైట్ రోడ్డులో రెడ్ క్రిసెంట్ హాస్పిటల్ లో బెడ్ మీద అల్లల్లాడిపోతున్న రహమాన్ హుస్సేన్ ని చూశాడు దినకర్. రహమత్ కి పదేళ్ళుంటాయి. అతని నడుంకింద అంతా గాయాలు. ఆ గాయాలకి కట్లు కట్టి వున్నాయి. వాటిమీద మాసిన సన్నటి ఆకుపచ్చ బ్లాంకెట్ ఒకటి కప్పివుంది. మంచం పక్కనే కూర్చుని వున్నాడు రహమత్ అన్న. అతనిపేరు టోర్ ఖాన్. తమ్ముడి వంటిమీద ఉన్న మాసిన బ్లాంకెట్ ని తొలగించి తమ్ముడికి తగిలిన గాయాలని దినకర్ కి చూపించాడు టోర్ ఖాన్.    

 

    ఖోస్త్ ప్రాంతంలో అల్లీషీర్ అనే గ్రామం మీద దాడి జరుగుతున్నప్పుడు గాయపడ్డాడు రహమత్. అతనూ అతనితోబాటు మరికొందరు ముజాహెదిన్ లూ కలిసి ముందుకు పోతుండగా రహమత్ పక్కన వున్న ఒకతను ఒక మందుపాతర మీద అడుగు వేసాడు.
    
    తక్షణం అది పేలిపోయింది. ముక్కలు ముక్కలయిపోయింది ఆ సైనికుడి శరీరం.
    
    ఆ తర్వాత రహమత్ ని డాక్టర్లు ట్రీట్ చేస్తున్నప్పుడు అతని వంటి మీద వున్న గాయంలో చొచ్చుకుపోయి కనబడింది.
    
    ఆ చనిపోయిన పక్కమనిషి తాలూకు కాస్త మాంసం!
    
    నిప్పుమీద కూర్చుని లేచినట్లు ఎర్రగా కనబడుతోంది రహమత్ కి తగిలిన గాయం. నాలుగంగుళాల లోతున వుంది అది. తొడల దగ్గర నుంచి కడుపుదాకా చర్మం మొత్తం లేచిపోయి వుంది. ఆ గాయానికంతా గాజ్ గుడ్డతో బాండేజ్ చేసారు.
    
    రోజుకి రెండుసార్లు ఆ గాజ్ గుడ్డతో చేసిన డ్రెస్సింగ్ ని మార్చి కొత్త బాండేజెస్ వేస్తారు రహమత్ కి.
    
    బాండేజెస్ మారుస్తున్నప్పుడు కలిగే దుర్భరమయిన బాధని తట్టుకోలేడు పసివాడు రహమత్. మెలికలు తిరిగిపోతాడు.
    
    అందుకని బాండేజెస్ మార్చే ముందు రహమత్ చేతులని గాజ్ గుడ్డతో మంచానికి కట్టేస్తారు. బలాఢ్యుడైన ఒక మనిషి అతన్ని కదలకుండా గట్టిగా పట్టేసుకుంటాడు. బాండజెస్ మార్చాక మార్ఫియో మత్తు మందు ఇస్తారు అతనికి.
    
    ఈ లోకంలో బాధ తప్ప ఇంకేం మిగల్లేదు పసివాడు రహమత్ కి.
    
    లాండ్ మైన్స్ ఎంత ప్రమాదకరమయినవో తెలుసు కాబట్టే ఇరానియన్ సైనికులు తమకి మందు పాతరవల్ల దుర్ఘటనలేమీ  కలగకుండా ముందుగా నిరాయుధులైన పిల్లల్ని పంపుతారు.
    
    పాతర పేలితే పిల్లలు ఛస్తారు.
    
    పెద్దలు బాగానే వుంటారు.
    
    అదీ వ్యూహం.
    
    ఆఫ్గనిస్తాన్ లో మరో చోట.
    
    ఇద్దరు సైనికులు కాలాష్ ని కోవ్ రైఫిల్స్ ని ఎవరు ముందు విడిభాగాలుగా విడదీసి తర్వాత మళ్ళీ మార్చగలరు అని పందెం వేసుకోవడం చూసాడు దినకర్.
    
    తుపాకులే వాళ్ళ ఆస్తి! తుపాకులతోనే వాళ్ళ ఆటలు కూడా!
    
    అలాగే!
    
    ఐర్లాండ్ లో!
    
    ఒక ఆరేళ్ళ పిల్లాడు పాలసీసాలు, బీరుసీసాలు ఎత్తుకొచ్చేసి వాటితో పెట్రోలు బాంబులు చెయ్యడం చూసాడు దినకర్. అతని వయసే ఉన్న పిల్లలు చాలామంది కలిసి పోలీసులతో దాగుడు మూతలు ఆడి ఆ రాత్రికి ప్రళయం సృష్టించి ఎంతోమంది చావుకి కారణం కావడం చూసాడు.
    
    బర్మానుంచి విడిపోయాక స్వతంత్ర రాజ్యం స్థాపించాలని పోరాటం సాగిస్తున్న కారెన్ గెరిల్లాల్లో పదకొండేళ్ళ క్యాప్ లిన్ అనే కుర్రాడు ఉన్నాడని తెలుసు దినకర్ కి. క్యాప్ లిన్ లాంటి వాళ్ళు మరెంతమందో ఆ గెరిల్లా దళంలో ఉన్నారని కూడా తెలుసు అతనికి.
    
    ఆ పిల్లలకి యుద్దోత్సాహం కలిగించడానికి గానూ రెగ్యులర్ సైనికులు ప్రతిరోజూ సిల్విస్టర్ స్టాలిన్ రాంబో టైపు సినిమాలు చూపిస్తుంటారని కూడా తెలుసు. ఇలాంటి పిల్లలని జూనియర్ రాంబోస్ అని వ్యవహరించడం అలవాటయిపోయింది అందరికీ.
    
    "పిల్లలు బాగా యుద్ధం చేస్తారు" అని చెప్పాడు దినకర్ తో ఒక గెరిల్లా. "కానీ వాళ్ళకి ఉత్సాహం ఎక్కువ. ఆలోచన తక్కువ. బుల్లెట్లు దూసుకొస్తుంటే దేని చాటునన్నా దాక్కోవాలనికూడా తెలీదు వాళ్ళకి. తొందరగా ఎగ్జయిట్ అయిపోతారు. యుద్దరంగంలోనుంచి వాళ్ళని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చేసరికి మా ప్రాణం పోతుంది." అంటాడు అతను.
    
    అమెరికాలో లాస్ ఏంజెలెస్ గ్యాంగ్ వార్స్ అతి తరచుగా జరుగుతుంటాయి. నిజం యుద్దాల స్థాయిలో జరుగుతుంటాయి ఆ రౌడీమూకల మధ్య పోరాటాలు. ఆ రౌడీల్లో పిల్లలూ, పెద్దలు కూడా వుంటారు. ఆయుధాల్లో మాత్రమే వుంటుంది తేడా! అంతే!
    
    పిల్లలు 22 తుపాకులు, 25 తుపాకులూ ఉపయోగిస్తే పెద్దలు 28 తుపాకులుగానీ, యూజీలు గానీ వుపయోగిస్తారు.
    
    అదే తేడా!    
    
    హింసా ప్రవృత్తి మాత్రం అందరిలో ఒకే విధంగా వుంటుంది.
    
    ఒక గ్యాంగులోని ఒక కుర్రాడు శత్రు పక్షంలోని ఒక మనిషిని కాల్చి చంపేశాడు తన 22 కాలిబర్ పిస్టల్ తో తర్వాత కూల్ గా అన్నాడా పిల్లాడు. "వాడ్ని చంపినందుకు నాకేం బాధ కలగలేదు. ఒకవేళ ఎప్పుడయినా మనసు బాధపడినా తక్షణం తప్పతాగేసి బాధని మర్చిపోతాను" అన్నాడతను. అతని పేరు డక్.
    
    ఆ సంఘటన జరిగిన కొద్ది రోజుల్లోనే డక్ తన 22 కాలిబర్ పిస్టల్ ని పక్కన పడేసి ఒక స్నేహితుడితో కలిసి అత్యంత శక్తివంతమైన 357 మాగ్నమ్ ని తీసుకుని ప్రాక్టీసు మొదలెట్టి ఒక కుక్కని కాల్చాడు. 

   

    కుక్క తప్పించుకుని పారిపోయింది కానీ పేలుడు థాటికి డక్ అతని ఫ్రెండూ ఇద్దరూ కూడా వెనక్కి వచ్చి గోడమీద పడ్డారు.
    
    ఇప్పుడు మాగ్నమ్ ని వదిలేసి 38 ఉపయోగిస్తున్నాడు.
    
    ఇప్పుడతని వయస్సు పధ్నాలుగేళ్ళు.
    
    మెకానిక్ చెప్పకపోయినా అతని వ్యూహం ఏమిటో మెల్లమెల్లగా అర్ధం అవుతోంది దినకర్ కి.
    
    ఆ పద్మవ్యూహంలో ఒక పావు ఈ విక్కీ.
    
    విక్కీలాంటి జూనియర్ రాంబోస్ ఇంకా చాలామంది వున్నారా?
    
    దినకర్ రక్తం కళ్ళ చూడాలనే ఆరాటంలో వున్నట్లు కనబడుతున్నాడు విక్కీ.
    
    అతని చిన్న వేళ్ళు ఎమ్ 16 రైఫిల్ ట్రిగ్గర్ చుట్టూ బిగుసుకుని ఉంటాయి.
    
    అది కాస్త ఒత్తిడి తగిలితే చాలు!
    
    బుల్లెట్ రిలీజ్ అవుతుంది.
    
    సరిగ్గా అదే సమయంలో!
    
    మెకానిక్ కారు హైదరాబాద్ రోడ్లలో ప్రతిచోటా వుండే ఒక గుంటలో లేచి పడింది. దానితో విపరీతమయిన కుదుపు.
    
    సెకెండుకి కొన్నివేల రకాల పనులు చెయ్యగల సూపర్ కంప్యూటర్ లాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది దినకర్ బ్రెయిన్. అప్పటికే అతను తన చేతులకి వున్న సంకెళ్ళని ఒడుపుగా విడిపించుకున్నాడు. ఫ్రీగా వున్న ఎడం చేత్తో విక్కీ చేతిలోని రైఫిల్ ని కాస్త పక్కకి నెట్టాడు.
    
    గుంటలో పడ్డ కారు తాలూకు కుదుపుకి రైఫిల్ ట్రిగ్గర్ మీద విక్కీ వేలు బిగుసుకుంది.
    
    ఆ ఒత్తిడికి రైఫిల్ పేలి, బులెట్ కారు డోర్ కి తగిలింది.
    
    డోర్ విరిగి ఎగిరి అల్లంత దూరంలో పడింది.
    
    అంత వేగంలోనూ కార్లోనుంచి కిందికి దూకేశాడు దినకర్.
    
    అతని మీదకు రైఫిల్ గురిపెట్టాడు విక్కీ.
    
    రోడ్డుకి అవతలవైపు పెద్ద కాంపౌండ్ వాల్ ఒకటి వుంది. పది అడుగుల ఎత్తు వుంటుంది అది.
    
    చకచక దాని దగ్గరికి పరిగెత్తి వెళ్ళిన దినకర్ అదే స్పీడులో గోడమీదికి నడిచేశాడు నాలుగు అడుగులు!
    
    గోడమీదికి ఎగబాకలేదు దినకర్. రోడ్డుమీద నడుస్తున్నట్లే నాలుగడుగులు గోడమీదికి నడిచాడు! తర్వాత గోడ అంచుని అందుకున్నాడు! మరుక్షణంలో గోడకి అవతలవైపున ఉన్నాడు.    
    
    మార్షల్ ఆర్ట్స్ బాగా నేర్చుకుని, శరీరాన్ని ఎటుబడితే అటువంచి, అదుపులో వుంచుకోగలిగిన వాళ్ళే చేయగలరు అలాంటి ఫీట్!
    
    దినకర్ అలా గోడమీదికి ఊపుతో కొన్ని అడుగులు నడిచి ఎక్కి అవతలకి దూకెయ్యడం చూస్తూ ఆశ్చర్యంతో నోరు తెరుచుకుని వుండిపోయాడు విక్కీ!
    
    దాదాపు అదే స్థితిలో వున్నాడు మెకానిక్ కూడా! అతను తేరుకుని తనుకూడా కారుదిగి గోడవైపు పరిగెత్త బోయేసరికి ఆకాశంలో పెద్ద శబ్దం వినబడింది.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra