"అడుగు జాడల్లో కాదు. ఆలింగనంలో..." అనిల్ తన బాహువువల్లో బంధిస్తూ చెప్పాడు.
"ఏమో బాబూ! నా కిలాంటివి తెలియవు." చిరుసిగ్గుతచో ముద్దుగ శలవిచ్చింది దీప.
"నేను నేర్పుతాను. నీవు ఊ అంటేనే సుమా!"
"ఊ..." అంది దీప.
అనిల్ మృదుమధురంగా దీపని ముద్దు పెట్టుకున్నాడు.
దీప తన్మయత్వం చెందుతూ "అనిల్!" అంది అరమోడ్పు కన్నులతో.
"ఊ..." అన్నాడు అనిల్.
దీప కిల కిల నవ్వింది.
-----------
Ending Cover Page
దీప కురుమద్దాలి విజయలక్ష్మి
మా అమ్మాయి పిరికిది. మా అమ్మాయికి పెళ్ళి ఎలా అవుతుందో, ఓ పక్క కట్నాలు, మరోపక్క వరకట్న చావులు. ఆడపిల్ల అనంగానే వెంటాడేవాళ్ళు, వేధించే వాళ్ళు, వీటన్నిటి మధ్య నలిగిపోతున్న సగటు ఆడపిల్లల జీవితాలకి "దీప" చదివి తెలుసుకోవాల్సింది వుంది.
పీటల మీద పెళ్ళి చెడిపోయింది. కన్నెపిల్లకి కడుపని ఊరు ఊరు గేళిచేశారు. అలాంటప్పుడే దీప ధైర్యంగా ఆనందంగా చెప్పింది.
"నాకు మూడోనెల నిండుతున్నది" అని... ఆ తెగువ ఏ ఆడపిల్లకు వుంది? అలా ధైర్యం వూపిరిగా సాహసం చేతలతో చూపించే దీపని చూసి ఈ కాలం అమ్మాయిలు చాలా నేర్చుకోవచ్చు. అది ఎంత సాధ్యమో దీపని చూసి తెలుసుకోండి.
ఈ కాలం కన్నెపిల్లల కోసం ప్రత్యేకంగా వ్రాసి మీ కోసం "దీప"ని అందిస్తున్నారు, వైవిధ్య నవలా రచయిత్రి, రమ్యకథా నేర్పరి, క్రైమ్ గడుసరి, హాస్య చతురి, సాహిత్య విప్లవ సాహసి, ప్రతి రచనా సాహితీ వనంలోని పూలబాల. ఈ దీప అరవిచ్చిన మందారం. ఇది శ్రీ శారదా పబ్లికేషన్స్ వారు మీ ముందుకు "దీప" జ్యోతిలా తెస్తున్న సరికొత్త కథా కధనం గల నవల.


