Previous Page Next Page 
కలియుగంలో సీత పేజి 6

 

   "తప్పకుండాను" అని అనలేదు రామచంద్రం" ఈ విషయంలో రవంత ఆశ కూడా పెట్టుకోకు బాబాయ్! అని గట్టిగా చెప్పేశాడు.

 

    "ఇంత ముర్ఖుడెం వీడు?" అనుకున్నాడు శివరావు.

 

    రామచంద్రం శివరావుల సంబాషణ వింటున్న సీత "అమ్మయ్య నన్నెంత మంచివాడు." అనుకుంది తృప్తిగా.

 

    కాసేపు పొడి పొడిగా రామచంద్రంతో మాట్లాడి శివరావు వెళ్ళిపోయాడు.

 

    మానుతున్న గాయాన్ని కేలికినట్లు ఉంది రామచంద్రంకి.

 


                                                   4

 

    మ్యాట్ని ఇంగ్లిషు పిక్చరు కెళ్ళచ్చాడు బాబా.

 

గుమ్మం లోపల అడుగు సాంతం పెట్టక ముందే "రారా బాబా నీ కోసమే చూస్తున్నాను" అన్నాడు రామచంద్రం. చేతిలో న్యూస్ పేపరుంది. ముఖంలో సంతోషంకన్నా గంభిర్యమే ఎక్కువగా వుంది.

 

    "దేనికి నాన్నా!" తండ్రికి తన కోసం ఎదురు చూసే పనేం పడింది అర్ధంకాలేదు బాబాకి.

 

    "ఎక్కడికి వెళ్ళొస్తున్నావ్?"

 

    ఫ్రెండ్స్ పిక్చరుకి లాక్కెళ్ళరు. వాళ్ళ బలవంతం మీద...."

 

    "ఆహా...."

 

    "నా కోసం అన్నారు దేనికి నన్నా?"

 

    "ఫ్రెండ్స్ బలవంతం మీదే కాదు సినిమకెళ్ళింది.?"

 

    "అదేగా చెప్పను....."

 

    "చెప్పావు లేవోయ్ మరోసారి నీ నోటంట విందామని...."

 

    "అసలు విషయం చెప్పకుండా ఈ అనవసరం సంభాషణ దేనికో బాబాకి అర్ధం కాలేదు. తండ్రి మొహం ప్రసన్నంగా లేకపోవటం, ఎక్కడ తిరిగొచ్చినా ఇదేమని ఎప్పుడూ అడగనివాడు ఈ రోజు అడగడం వింత భయం కలిగించింది.

 

    "ఊ అయితే ఎవరైనా కాస్త బలవంతం చేస్తే విన్తవన్నమాట...."

 


    ఏం చెప్పాలో తెలియలేదు బాబాకి. అప్పుడే సీత లోపలినుంచి వచ్చింది బాబాకి ఎదురుగా తండ్రి వుండటంవల్ల సీత ఏ మడుగుదామన్నా కుదరలేదు.

 

    తెచ్చిన కాఫీ గ్లాసు తండ్రి కిచ్చి దండెం మీద బట్టలు సర్దుతూ అక్కడే నుంచుంది సీత.

 

    "మాట్లాడవేం రా!" అన్నాడు రామచంద్రం.


    "ఏం మాట్లాడను?"


    "బలవంతం చేస్తే వింటావా అని అడుగుతున్నాను"

 

    "ఏదో ఒకసారి పోనీ కదా అని విన్నాను ప్రతిసారి వినాలంటే వింటనేమిటి?"

 

    "ఆహా ఆ వక్కసారి నా మాటవింటే బాగుండేదిగా?"

 

    "నేను మీ మాట వింటూనే వున్నాగా నాన్నా?"

 

    "వింటే బాగానే వుండేది. ఇలా ఎందుకు జరుగుతుంది." రామచంద్రం ఏ విషయంలో అన్నాడో ఇంకా బాబాకి అర్ధం కాలేదు.

 

    "కస్టపడి చదువుకోమని ఒకసారా వందసార్లు బలవంతం చేశాను. గట్టిగా చెప్పను. విన్నావా? బలవంతం చేస్తే సినిమాకి వెళ్ళవు.

 

    "పిక్చరు కంటే ఒకసారి వెళతాం. రోజు చదువుకుంటూనే వున్నాను. రోజు వున్నదానికి.....

 

    బాబా సాంతం మాట్లాడక ముందే రామచంద్రం పేపరు తీశాడు. "ఇంటర్ పరీక్షాఫలితాలు పడ్డాయి" అన్నాడు నెమ్మదిగా.

 

    బాబా అడుగు ముందుకు వేసి చటుక్కున పేపరందుకున్నాడు.

 

    "దాంట్లో నీ నెంబరు లేదులే. నీ ఫ్రెండ్స్ ఎవరైనా పాస్ అయారేమో కావాలంటేచూడు."

 

    బాబా చేతిలోని పేపరు జారిపోయింది.

 

    "ఈవినింగ్ కొన్ని పేపర్లో నయినా రిజల్ట్స్ రావచ్చని అందరికి తెలిసింది. పరిక్ష రాసి ఫలితానికి ఎదురుచూసే నీకు మాత్రం ఈ సంగతి తెలిలేదా? తెలిసినా నిర్లక్ష్యమా?"

 

    పరిక్ష తప్పినందుకు విచారిస్తుంటే తండ్రి మాటలు ఓ పక్క శులాల్లా తగులుతున్నాయి బాబాకి. గొప్పగా రాయలేదు అయినా పాస్ కావటం  గ్యారంటి్ అనే ధిమాతో తిరుగుతున్నాడు బాబా.

 

    నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారా, బరువు భాద్యత తెలియకుండా అమ్మ ఉన్నప్పుడు లేనప్పుడు ఒకేలాగా తిరుగుతున్నావు. నీ పని హాయి. సీత చూడరా అటు చదువు ఇటు పని కష్టం సుఖం తెలిసి మెలుగుతున్నది బజారునుంచి వచ్చావు. దోవలో ఎవరు పేపరు రిజల్ట్ పడ్డాయని అనుకోవడం వినలేదంటే నీ వాసాలు మనుషుల ముఖాలు చూసి నడిచావా? సినిమాలో సీన్లు కళ్ళముందు కదలాడుతుంటే అలానే దోవ పొడుగుత చూస్తూ వచ్చావా?" అన్నాడు కాస్త గట్టిగానే రామచంద్రం.

 

    "బాబా తల వంచేసుకున్నాడు.

 

    ఊరుకో నన్నా' అంది సీత.


    
    "ఊరుకొక ఉరేసుకున్నానా అమ్మా!" అన్నాడు రామచంద్రం. పిల్లల భవిస్యత్తు గురించి ఎన్నో కళలు కని, మూసిన భార్య గుర్తుకొచ్చింది.

 

    ""వెళ్ళి కళ్ళు చేతులు కడుక్కురా, వంటింట్లో ఫ్లాస్క్ లో కాఫీ వుంది." అంది సీత.

 

    బాబా రెండంగల్లో లోపలికి వెళ్ళిపోయాడు.

 

    బాబా వెళ్ళాక "నాన్నా" అంది సీత తండ్రి దగ్గిర కొచ్చి.

 

    "ఏమిటమ్మా?"


    
    "బాబా ఈసారి గట్టిగా చదివి పాస్ అవుతాడులే నన్నా"

 

    "అలా అనుకుని తృప్తి పడల్సిందేనమ్మా.

 

    "విచారించకు నాన్నా"

 

    "విచారించను లేమ్మా!"

 

    బాబా తప్పినందుకు తండ్రి చాలా బాధపడుతున్నాడని సీతకి తెలుసు తోటి పిల్లవాడు ఆటలాడుతూ కిందపడి కలికి దెబ్బ తగిలి ఏడుస్తుంటే పక్కనున్న పిల్లవాడు ఏడవకు తాయిలం పెడతాగా అదే తగ్గిపోతుంది." అని ఒదర్చితే దెబ్బ తగిలిన పిల్లవాడు "సరేలే" అన్నట్టు , తండ్రి కూతురు పసివాళ్ళ తంతులా ఒకరినొకరు మాటలతో ఊరడించుకున్నారు.

 

    సీతకన్నా ఏణర్ధం పెద్దవాడు బాబా. అయినా సీత 'అన్నయ్యా" అని పిలవడు బాబాని. పేరు పెట్టి పిలవటం చిన్నప్పటినుంచే అలవాటయింది. బాబా, సీత, తర్వాత పుట్టినవాళ్ళు మాత్రం....వీళ్ళిద్దరిని అన్నయ్య అక్కయ్య, అనే పిలుస్తుంటారు. సీత తర్వాత పిల్ల రూప ఉత్త గడుగ్గాయి. బాబా తప్పిన వార్త బైట నుంచి వస్తూనే తెలుసుకుంది.

 

    "అన్నయ్య పరిక్ష పోయిందిగా, వాడికలా రోగం కుదరాల్సిందే మహా సంతోషపడిపోతూ అంది రూప.   

 Previous Page Next Page