Home » Vasundhara » Vasundhara Kadhalu - 12

 

    సరేనన్నాను. ఇద్దరం బయల్దేరాం. మేమిద్దరం మొట్టమొదట చేరుకున్న ఇల్లు నాకు బొత్తిగా అపరాచితమైనది కాదు. ఇంద్రభవనం అది. ఆ ఇంటి యజమాని వైభవం లో ఇంద్రుణ్ణి మించిన వాడు - అతను కోటీశ్వరుడని అందరకూ తెలుసు. అది ప్రసాదరావు గారి ఇల్లు.
    ఇంట్లో కి బయల్దేరబోయే ముందు రంగారావు నన్ను హెచ్చరించాడు. "మీరు చెవిటి వాడినన్న విషయం మరిచి పోవద్దు."
    అలాగేనని తలాడించాను. నాలో కుతూహలం పెరుగుతోంది.
    ఇంట్లో, రంగారావుకీ కావలసిన సరళ తప్ప మరెవ్వరూ లేరు.
    సరళ, ప్రసాదరావు గారి మూడో భార్య, ఎవరో తన కోసం వచ్చారని వినగానే ఆమె వచ్చింది. నౌకరుని పంపించేయాల్సిందన్నట్లుగా రంగారావు సంజ్ఞా చేశాడు. హల్లో ఇంక మేం ముగ్గురం మిగిలాం.    
    సరళ చాలా అందంగా ఉంది. నా ప్రియురాలూ మరదలూ అయిన వసంత కంటే కూడా అందంగా ఉందనిపించింది. నిండా పాతికేళ్ళు లేని సరళ యాభై యో వడిలో ఉన్న ప్రసాదరావు గారి భార్య రావడం నాకు  బాధనిపించింది.
    ఆమెను చూస్తూనే, "సరళా అంటూ ఆప్యాయంగా పిలిచాడు రంగారావు . ఆమె ఆశ్చర్యంగా అతని వంక చూడగా అతను నవ్వి "ఎందుకలా ఆశ్చర్యాన్ని నటిస్తున్నావు? ఇతన్నీ చూశా- ఇతను నా మిత్రుడు మనిషికి బ్రహ్మచెముడు. నీతో ఒక్కణ్ణి వచ్చి మాట్లాడితే నలుగురూ అనుమానిస్తారని, కూడా తీసుకొచ్చాను . మళ్ళీ మనం కలుసుకునేదెప్పుడు ?"
    సరళ ముఖం ఎర్రగా అయింది. "మీరెవరో నాకు తెలియదు?" అంది.
    రంగారావు ఓసారి చుట్టూ చూసి - "నీ భర్త అనుమానిస్తున్నాడని నాకు తెలుసును. అందుకని నీ జాగ్రత్తలో నీవుండడం మంచిదేననుకో -- కానీ ఒక్కసారి మన సంబంధం వీడిపోకూడదు . మళ్ళీ ఎప్పుడో...."    
    "మిస్టర్ ! అ=యూ ....గెటౌట్ ఫస్ట్ ...." అంది సరళ తీవ్రంగా.
    రంగారావు ముఖంలో ఉద్రేకం కనపడింది. ఆడదాన్ననిపించుకున్నావు . అవసరం తీరిపోయిందనుకుంటాను. మాట అంత జోరుగా వస్తోంది. అందుకే నేను నా జాగ్రత్తలో ఉన్నాను. మన సంగతి -- మీ ఆయనకు చెప్పేస్తాను-" అన్నాడు జోరుగా.
    సరళ వేళాకోళంగా   నవ్వి -- "నీవెవరో నాకు తెలియనప్పుడు నీతో నాకు సంబంధ మేమిటి?" ఇలాంటి పిచ్చి పిచ్చి కబుర్లు అయన నమ్మరు" అంది.
    "ఓహో --నీతో నాకు సంబంధం లేకపోయినచో -- నీకుడి మోకాలికి కొంచెం పైగా చిటికెన వేలంత ఎర్రటి మచ్చ ఉన్నట్లు నాకు మరో విధంగా తెలుసునేమోనని మీ అయన సరి పెట్టుకుంటాడెమో చూస్తాను --వస్తాను" అంటూ అతను వెనక్కు తిరిగాడు.
    సరళ మ్రాన్పడి పోయింది. నేను వెనుదిరిగాను.
    "వెడుతున్నాను-" అన్నాడు రంగారావు.
    "మిస్టర్ ....' అంటూ ఆగింది సరళ.
    "ఓహ్ ! నా పేరు రంగారావు - అన్న విషయం కూడా మరిచిపోయావన్నమాట.--"
    "నిజంగా నువ్వెవరివో నాకు తెలియదు . ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావో ఆమె కంఠంలో ఇప్పుడు గర్వం లేదు. భయం, త్రోట్రుపాటు ఉన్నాయి.
    "అలాంటి పోరాపాట్లు జరక్కుండా ఉండాలనే - నేను మచ్చలు గుర్తు పెట్టుకుంటాను --" అతనూ, అతనితో పాటు నేనూ - మళ్ళీ ఆమె వైపు తిరిగాము.
    "కానీ ....' అనీ ఏదో చెప్పబోయింది సరళ.
    "నువ్వేం చెప్పానఖర్లేదు సరళా -- నీభయం నాకు తెలుసు. క్షణిక సౌఖ్యం కోసం పండంటి కాపురంలో నిప్పులు పోయాలని ఇక్కడకు రాలేదు నేను. నన్నేరుగనట్లు నటిస్తే ఒళ్ళు మండి అలా గన్నాను కానీ, మీ ఆయనకు మన సంగతెందుకు చెబుతాను? ఇప్పుడిక్కడికి వచ్చింది -- నిన్ను బెదిరించడానిక్కాదు. నాకు కొద్దిగా డబ్బు అవసరం వచ్చింది. పెద్ద చిక్కులో పడ్డాను. ఏదైనా ధనసహాయం చేస్తావని వచ్చాను. కానీ నువ్వు నన్నేరుగనట్లు మాట్లాడుతున్నావు..."
    ఆమె ఒక్క క్షణం అలోచించి --"ఎంత కావాలి?" అంది.
    "నీకు తోచినంత ఇయ్యి -- కానీ తక్కువిస్తే -- మళ్ళీ నీ దగ్గరకు రావాల్సుంటుందేమో?---"
    "ఎంతిస్తే మళ్ళీ రావు --"
    'మూడు వెలిస్తే -- ఆరు నెలలదాకా రాను . ఆరు నెలల్లో మూడు వేలు కూడ బెట్టడం నీకు ఏమాత్రం అసాధ్యం కాదని నాకు తెలుసు...."
    ఆమె అసంతృప్తి గా కదిలి -- "మూడు వేలు ఇప్పుడిస్తాను , మరి రానని మాటిస్తే ...."
    'అలాగే---" అన్నాడతను.
    మరో అయిదు నిమిషాల్లో అతనికి మూడు వేలు ముట్టాయి. మరో రెండు నిముషాల్లో మేము రోడ్డు మీద ఉన్నాము.
    నేను మాట్లాడలేదు. నాకది కొత్తరకం అనుభవం . సరళ అంత సులభంగా రంగారావుకి ఎందుకు లొంగిపోయింది -- రెండే రెండు కారణాలు నాకు అనిపించాయి. ఒకటి - రంగారావిచ్చే వివారాలామే భర్తకు అనుమానం కలిగించడానికి చాలు రెండు -- మూడు వేలంటే ఆమె కంత లెక్క లేకపోవచ్చు. ఆడదానికి -- నలుగురి కంటాబడని ప్రదేశాల్లో మచ్చలు తెలిస్తే -- బెదిరించి లొంగదీసుకొనడం సులభమా?"
    అంత సులభంకాదనిపించింది. తర్వాత అనుభవంతో -
    "ఆ రాత్రి మనమిద్దరం గడిపిన మధురక్షనాలు- అప్పుడు నేను కుడిచేతి చూపుడు వేలితో -- నీగుండెల మీది పుట్టుమచ్చమీద రాస్తూ-- ఎడమ చేత్తో బొడ్డు క్రింద కుడి వైపుగా ఉన్న మచ్చకు గుండెల మీది మచ్చుకు మధ్య దూరాన్ని కొలుస్తున్నప్పుడు...."
    "మిస్టర్ ....." అంది శారద ఉద్రేకంగా.
    'ఈ విషయం నీ భర్త విన్నప్పుడు , అయన కెంత ఉద్రేకం కలుగుతుందో చూడాలని ఉంది -?"
    శారద ముఖంలో కలవరపాటు కనబడింది -- "నా కళ్ళలోకి చూసి చెప్పు -- నిజంగా నేనునీకిదివరకు తెలుసా?" అంది.
    "పేరు చెప్పాను, గుర్తులు చెప్పాను. దీన్ని బట్టి మనకిద్దరకూ పరిచయముందనిపిస్తుందో, లేదో నీ భర్త నడిగే తెలుసుకుంటాను--"
    'ఆయనకు నా మీద విపరీతమైన నమ్మకం - కేవలం ఈ మచ్చల వివరాలతో ఆయన్ను నమ్మించలేవు -- " అంది శారద.
    రంగారావు నవ్వేడు. "నీమీద ఆయనకు గల నమ్మకం పోగొట్టగలను. నేను చెప్పింది నిజమని ఆయన్ను నమ్మించగలను. అప్పటికప్పుడు కృత్రిమంగా పెట్టుకున్న మచ్చలను కూడా అరక్షణంలో ఏకాంతంలో గుర్తించగలను నేను---"
    'అయితే ---"
    "నీ భర్తకు చెబుతాను. నీ శరీరంలో ఎక్కడైనా ఒక చోట ఉన్న మచ్చ ఏర్పరచమంటాను. నాకు నీతో అర నిముషం ఏకాంతం కలిగించమంటాను. ఈ ఏర్పాట్లు నీకు తెలియకుండా జరిగుతాయి...."
    "ఓహో....ఆతర్వాత మచ్చ ఎక్కడున్నదీ చెప్పి నామీద పగతీర్చుకుంటావన్నమాట... చాలా గొప్ప శక్తివంతుడివే . నీ శక్తిని పరీక్షిస్తాను. ఇప్పుడే నేనొక కృత్రిమ మచ్చను ఏర్పరచుకువస్తాను. కని పెట్టు చూద్దాం -" అంది శారద హేళనగా.
    నేను బెల్లం కొట్టిన రాయిలా అవన్నీ వింటూ చూస్తున్నాను. శారద ఓసారి ఇంట్లోకి వెళ్ళి ఓ అయిదు నిముషాల్లో వచ్చింది. రంగారావు ఆమె వంకే పరిశీలనగా చూస్తూ -- "చూడు శారదా -- నాకు ఏకాంతం అవసరం అన్నాగదా . ఒక్కసారి నువ్వు మామిడి చెట్టు వెనక్కు రా. నేనూ వస్తాను. అక్కడ ఎంతో సేపు ఉండవద్దు. ఒక్క నిముషముంటే చాలు నన్ను పరీక్షించదలచుకుంటే ఆ మాత్రం ధైర్యం చేయగలగాలి అన్నాడు.
    శారద నిర్లక్ష్యంగా -- "నా తోటలో నన్నేం చేయగలవు -- పద!" అంది. రంగారావు  సంజ్ఞలు చేస్తూ నాకు విషయాన్ని చెప్పాడు. నేను అర్ధం అయినట్లు తలాదించాను. అక్కడే నిలబడిపోయాను. అనంతరం వాళ్ళిద్దరూ మాకు కొంచెం దూరంలో ఉన్న మామిడి చెట్టు వెనక్కు వెళ్ళారు. నేను ఊపిరి బిగించాను. చెవులు రిక్కించాను-- నన్ను సమీపించాక రంగారావు అన్నాడు - "నీ శరీరాన్ని నాకళ్ళ పడేలా చేయడానికి ఇందాకట్నుంచి నువ్వు పడుతున్న శ్రమకు గమనించే నీకీ అవకాశం కల్పించాను. థాంక్స్ శారదా -- నీకు, నాకూ కూడా కొంత తృప్తిగా ఉంది -"
    "పిచ్చిగా వాగకు -- మచ్చ ఎక్కడుందో చెప్పు -- "అంది శారద.
    రంగారావు చెప్పాడు. నేను చెవులు మూసుకోబోయి మానేశాను. నాకు  చెవుడు గదా మరి!"
    శారద మాన్ప్రడిపోయింది...." ఎవరు నువ్వు ?" అంది భయంగా.
    "ఇప్పుడే చెట్టు చాటు నాకు ప్రియురాలిగా మసిలావు. మళ్ళీఇంతలోనే మతిమరుపా !" రంగారావు వెటకారంగా నవ్వాడు.
    ఆ చెట్టు చాటున ఏం జరిగింది? బయటకు వచ్చేటప్పుడు శారద ముఖం చూస్తె - ఏమీ జరాగలేదనిపించింది మచ్చ ఎక్కడుందో చెప్పమన్నప్పుడు -- ఆమె కంఠంలో నిర్లక్ష్యమూ, వెటకారమూ ధ్వనించింది. అతను చెప్పగలిగినప్పుడు ఆమె నివ్వెరపోయింది. అయితే ఆ చెట్టు చాటున - మచ్చ అతని కంటపడే క్రియ ఆమెకు తెలిసినంతవరకూ జరుగలేదు. మరి రంగారావుకు వివరం ఎలా తెలిసింది ?
    శారద అతనికి రెండు చేతులు జోడించింది. "ప్లీజ్! నువ్వెవరో నాకు తెలియదు. కానీ నిన్ను చూస్తె నాకు భయమేస్తోంది , నీకేం కావాలి ?"
    'డబ్బు "

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra