Home » Yandamuri veerendranath » మంచు పర్వతం

   

      "మీరు అనూరాధ బంధువులా?" అడిగిందో స్త్రీని.
   
    "అత్తగార్ని" అందావిడ.
   
    "పిల్లల్ని తీసుకెళ్ళి పక్కగదిలో కూర్చోండి. తరువాత పిలుస్తాను" అంటూ ఆవిణ్ణి పంపేసింది. సర్కిల్ దగ్గరకొచ్చాడు.
   
    "హత్యాయుధం దొరికిందా?" అని అడిగింది.
   
    "లేదు మాడమ్! అంతా వెతికాం. బహుశా తీసుకెళ్ళి ఎక్కడైనా పారేసి వుండాలి. త్వరలో తెలుసుకుంటాను".
   
    "ఇంట్లో ఎవరూ లేరా?"
   
    "ఆమే, పిల్లలూ మాత్రం ఉంటారట. భర్తనించి విడిగా వచ్చేసిందట. అతడు ఈ ఊళ్ళోనే ఉంటాడు. అప్పుడప్పుడు వచ్చి వేధించి డబ్బు పట్టుకు పోతాడట. ఈ రోజు ఉదయం కూడా రావడం పక్కవాళ్ళు చూశారు. ఉదయం పిల్లల్ని మామూలుగానే స్కూల్ కి పంపింది. ప్రతి రోజు ఆఫీసుకి వెళ్ళేటప్పుడు తాళాలు పక్కవాళ్ళింట్లో ఇచ్చి వెళుతుందట. ఈ రోజు ఎంతకీ రాకపోతే ఆఫీసుకి వెళ్ళలేదేమో కనుక్కుంధామని వచ్చిందావిడ. అప్పటికే ఆ ఘోరం జరిగిపోయింది. వెంటనే పోలీసులకి ఫోన్ చేశారు"
   
    "ఉత్తరం ఏదీ?" అడిగింది వైజయంతి. అతడు జేబులోంచి బరువైన కవరు తీసి అందించాడు. అక్కడ చదవడం ఇష్టంలేనట్టు తీసి జేబులో పెట్టుకుంది. "ఈమె భర్త ఎక్కడ వున్నాడు?"

    "మేము వెళ్ళేసరికి వాళ్ళింట్లో వున్నాడు. అప్పటికే డోసుమీదుండి నాకేం తెలియదని బుకాయిస్తున్నాడు. ప్రస్తుతం స్టేషనులో వున్నాడు".
   
    "శవాన్ని పోస్టుమార్టానికి పంపాక అక్కడికే రండి నేను అతడితో మాట్లాడాలి".
   
    "యస్ మాడమ్!" అతడు హడావుడిగా బయటకు వెళ్ళాడు.
   
    పిల్లలిద్దరూ పోలీసాఫీసర్ని చూసి కొద్దిగా జంకారు.
   
    మరో సమయంలో అయితే సివిల్ డ్రస్ లో వాళ్ళను ఆప్యాయంగా దగ్గరకు తీసుకునేది. వాళ్ళనిలాంటి స్థితిలో చూడాల్సి వస్తుందని ఆమె కలలో కూడా ఊహించలేదు. అనూరాధని కలవడానికి తనెప్పుడూ ప్రయత్నం చెయ్యకపోవడం పెద్ద పొరపాటేమో!
   
    "నేను మీ ఆంటీని ఇక్కడున్నారని నాకు తెలియదు. తెలిస్తే ముందుగానే వచ్చేదాన్ని" అంటూ చిన్నదాన్ని దగ్గరకు తీసుకుంది.
   
    "మీరేనా వైజయంతి ఆంటీ! అమ్మ ఎప్పుడూ చెపుతుండేది" అంది మల్లిక.
   
                                              *    *    *
   
    వైజయంతి స్టేషన్ లో కూర్చుని ముందుగా ఉత్తరం విప్పింది. చాలా పెద్ద ఉత్తరమే అది. అనూరాధ భార్గావికి వ్రాసిన ఉత్తరం. 'అయితే వాళ్ళిద్దరి మధ్యా ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగేవన్నమాట' అనుకుంది వైజయంతి.
   
    ఉత్తరం చదవటం ప్రారంభించింది.
   
    "భార్గవీ-"
   
    కెలీడోస్కోప్ చదువుతున్నంత సేపూ ఆకృతులు మారుతుంటాయి. తరచి చూసినకొద్దీ స్త్రీల జీవిత గతులూ అంతేనేమో! మనిషిని దేవుడు మరబొమ్మలా ఆడిస్తాడు-స్త్రీని పురుషుడు మట్టిబొమ్మలా ఆడిస్తాడు' అన్నమాట ఎంత వాస్తవం!
   
    చిన్నప్పుడు థామస్ హార్టీ 'టెస్' గురించి ఎంత జాలిపడేవాళ్ళమో మిచెల్ 'స్మార్లెట్ ఓహోరా' గురించి జాలితో పాటు ఆరాధనా భావం కూడా వుండేది. ప్రవాహంతో పాటు కొట్టుకుపోవడం సుఖం, ఆనందదాయకం కూడా (?) కాని చదువు నేర్పిన సంస్కారం, ధైర్యం ఏటికి ఎదురీదేలా చేస్తాయొకసారి. అందులో కష్టముందని తెలిసినా ఈధక తప్పదు.
   
    భార్గవీ!
   
    నీకంతకుముందో ఉత్తరం వ్రాశాను. ఆ తరువాత నా జీవితం చాలా మలుపులు తిరిగింది. భర్తను వదలి విడిగా వచ్చేశాను.
   
    మనందరం కలుసుకునే రోజు దగ్గర కొస్తోందంటే మీరంతా చాలా ఉత్సాహంగా వుంటారు. కాని నాలోనే సందిగ్ధం! మనసు విప్పి అక్కడ మాట్లాడలేనేమోనని భయం. కనీసం నీకయినా నా గురించి తెలిస్తే ఆ సమయంలో నన్నాదుకుంటావని ఆశ.
   
    నిజంగా ఈనాటి పరిస్థితి తెలిస్తే బాధపడడం మానేసి బహుశా అందరిలా అసహ్యించుకుంటావేమో! ఇంత ఉపోద్ఘాతం ఎందుకో వివరిస్తాను. నిజం నీకు విప్పి చెప్పానన్న తృప్తి నాకుంటుంది.
   
    ప్రేమించి పెళ్ళి చేసుకున్న భర్త ఆదరణా, ఆప్యాయతా రుచి చూడకుండానే అణగిపోయినప్పుడు ఎంతగా కుమిలిపోయానో నీకు ముందుగానే వ్రాశాను. ఒక ప్రక్క ఏదో సాధించాలన్న తపనా, మరోపక్క ఏదీచేయలేని అసహాయతా. నా జీవితం రసదాయకం అయ్యే మార్గం వేరే లేదని తెలిశాక నన్ను నేను అభివృద్ధి పరచుకోవడానికి కంకణం కట్టుకున్నాను. వ్రాసిన ప్రతి పరీక్షా పాసయ్యాను. ఆశ నిరాశలమధ్య కొట్టుమిట్టాడుతున్నప్పుడే నాకు సుభాష్ పరిచయమయ్యాడు. సుభాష్ అంటే ఓ చైతన్య స్రవంతి. గలగలపారే సెలయేరు. అతడి జీవితం సుఖమయం చేయడానికి అతడు సిద్దపడ్డాడు. నా పిల్లలకు తండ్రిగా నిలబడతానని ప్రామిస్ చేశాడు. అన్నమాట నిలబెట్టుకుంటాడనే ధైర్యంవున్నా, ఉజ్జ్వల భవిష్యత్తున్న అతడి చైతన్యాన్ని మంచుగడ్డలా మార్చేస్తానేమోనన్న భయంతో దూరం చూసుకున్నాను.
   
    ఇంట్లో బరువులూ, బాధ్యతలూ ఒక్కదాన్నే మొయ్యలేక ధైర్యంగా బయటకు వచ్చేశాను. ప్రతిరోజూ, ప్రతిక్షణం అనుభవించే సాధింపు తగ్గింది. (అప్పుడప్పుడూ ఉధృతంగా వచ్చి పడుతుందనుకో) ఈ ఇంటికి వచ్చాకే నాకు పరిచయమయ్యాడు విశ్వం. మర్చిపోయిన మధురవాణినీ, ఊర్వశినీ మరోసారి గుర్తుచేశాడు. భావావేశ సంభాషణలతో, చర్చలతో రోజులు సార్ధకం చెసుకుంటున్నానన్న భావం కలిగించాడు.
   
    అయితే ఇప్పుడు మరోరకం సమస్య వచ్చిపడింది. విశ్వం నేనంటే తలమునకలయ్యే ప్రేమలో పడిపోయాడు. అతడికి పెళ్ళయింది. పిల్లలున్నారు. కాని రసహీనమయిన తన జీవితంలో ప్రేమ వాహినిలా నేను ప్రవేశించానంటాడు.
   
    కొద్దిరోజులకే అతడిలోనే మార్పు వస్తుందనుకున్నాను. కాని రోజురోజుకీ ఆ పిచ్చి పెరుగుతోందే తప్ప తరగడంలేదు. అతడితో శారీరక సంబంధం కూడా పెట్టుకున్నాను. ఆ కోరిక కూడా తీరిపోతే నా మీద ప్రేమ కొంతయినా తగ్గుతుందని ఆశపడ్డాను. కాని ఏళ్ళు గడిచినా అతనిలో ఆరాధనా, అవ్యాజ్యమైన ప్రేమ తరగడంలేదు. ఈ ఉన్మాదవస్థనించి బయటపడలేకపోతున్నాడు. అదే నా బాధ. నా కతడంటే ఇష్టమే. ఓ ప్రాణ స్నేహితుడిగా అభిమనమేగాని సుభాష్ లా అతడు నా మనసుని ఆక్రమించలేకపోతున్నాడు. నా స్వార్ధమే అనుకో - విశ్వం ఆసరా లేకపోతే నేనేమయిపోతానో అని భయంగా వుంది. ఆ అవసరమే అతడిని దూరం చేసుకోనివ్వడంలేదు.
   
    నా స్నేహితురాలివి కాబట్టి 'నువ్వే తప్పుచేయడం లేదు. నీ పరిస్థితులలాంటివి' అని సమర్ధిస్తావు. కాని భార్గవీ, విశ్వం ఎవరో తెలిస్తే అలా అనగలవా? అన్నీ చెప్పి ఈ నిజాన్ని దాచడం నా వల్లకాదు. విశ్వం విశాల భర్త. మన విశాల భర్త. ఏం ఇప్పుడు నన్ను అసహ్యించుకుంటున్నావు కదూ! అన్నింటికీ ఒక్కటే జవాబని ముందుగానే చెప్పాను గదా. 'అనుభవం ఆత్మ సదృశ్యం మాత్రమే'.
   
    రేపు నలుగురం కలుసుకున్న వేళలో ఈ జీవిత సత్యాలన్నీ బయటపెట్టడం నావల్ల అవుతుందా? విశాల దగ్గర నేను సిగ్గుపడతాననీ, భయపడతాననీ నువ్వనుకుంటే అది పొరపాటు. ఆమెతో వాదించి ఆ తప్పు నాది కాదని నిరూపించుకోగలననే ధైర్యం నాకుంది. కానీ "ఇవన్నీ నలుగురిలో చెప్పుకోవాలా? నన్ను అవమానపర్చాలా?" అని విశాల నిలదీస్తే మాత్రం జవాబు చెప్పలేను.
   
    నా భర్త ప్రవర్తన రోజురోజుకీ దిగజారిపోతోంది. నీకు 'పిక్చర్ ఆఫ్ డోరియన్ గ్రే' గుర్తుందా? చూడ్డానికి బాగానే వుంటాడు మోహన్ కూడా. అతడి ఆత్మే రోజురోజుకీ రాక్షసిలా మారుతోంది.

    మన సమావేశానికి నేను రాలేకపోతే ఈ ఉత్తరం చూపించు. నా జీవితం నుంచి మీరంతా ఏం నేర్చుకుంటారో నాకు తెలియదు. మీ మీ అనుభవాల్లోంచి చూస్తే నా జీవితం ఒక్కో కోణంలో కనిపించవచ్చు.
   
                                                                                                                                                                    నీ అనూరాధ".
   
    ఉత్తరం చదవడం పూర్తి చేసి దానిమీద తేదీ చూసింది వైజయంతి. నెలరోజుల క్రితం నాటిదది. పోస్టుచేసే ఉద్దేశ్యం మార్చుకుందేమో అనూరాధ. కవరు తీసి చూసింది. అంటించి మళ్ళీ విప్పినట్లుంది. ఈ ఉత్తరం చదివి ఆవేశంలో హత్య చేశాడా మోహన్? అదే జరిగుండాలి. అందుకే ఉత్తరం టేబుల్ మీద కనిపించింది. పోస్టవలేదు.
   
    వైజయంతి లాకప్ లోపల కెళ్ళింది. మోహన్ నిర్లిప్తంగా కూర్చున్నాడు. మనిషి అందంగానే వున్నాడు. తాగుడు అలవాటు బాగా వుందని చూడగానే తెలుస్తోంది. యవ్వనంలో చాలా ఆకర్షణీయంగా వుండేవాడేమో అందుకే రాధ అంత గుడ్డిగా ప్రేమించింది.
   
    "నీ భార్య విడిగా ఎందుకు వెళ్ళిపోయింది?" అడిగింది వైజయంతి.
   
    "మా వాళ్ళతో సరిపడక".
   
    "మీ వాళ్ళతోనేనా! నీతో కూడానా!"
   
    అతడు మాట్లాడలేదు. "సమాధానం చెప్పు" అరిచాడు సర్కిల్.
   
    "ఆమెకు చాలా గర్వం - డబ్బు సంపాదిస్తున్నానని".
   
    "నీకు ఉద్యోగం లేదా?"

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra