Home » Kommuri venugopala rao » ఆత్మజ్యోతి

   

      ఆమె ఏడుస్తూ కూర్చుంది. తనపట్ల యింత సాహసం యిదివరకెవరూ చేయలేదు. ఆమె కోపం అతనిమీద కాదు. తనమీదే కోపం వస్తోంది. తాను యిప్పుడు ఎక్కడ వుంది? ఏ నడిసంద్రంలో కొట్టుకుపోతోంది? అతనితో ఓ అసహ్యకరమైన మాట అంది. ఆ మాట అతని గుండెల్లో గునపంలా గ్రుచ్చుకుని ఉంటుంది. అతను మళ్ళీ తన ముఖం చూడడు. పోనియ్యి! కాదు. ఈ ఆలోచన ఆమెకు ఊరట కలిగించడంలేదు. తనకేదో కావాలి. అదింకా అస్పష్టరూపంలో ఉంది. తను యిప్పుడు రెక్కలు విరిగిన పక్షి మునుపటిలా ఎగురలేదు. తనచుట్టూ యిప్పుడు సమస్యలు అలుముకున్నాయి.
   
    ఎట్లా వచ్చింది ఈ అవస్థ? ఒక్క చంద్రం కౌగిలేనా? ఛీ ఛీ కాదు. తనలో నిద్రాణమైవున్న కొన్ని శక్తుల్ని అతనువాచ్చి మేల్కొలిపాడు. తనతత్వం తనకు తెలియజేశాడు. అతను తన దగ్గరకు రాడన్న ఆలోచన బాధ కలిగిస్తోంది. అతను కావాలా తనకు? ఏం చేసుకుంటుంది? తను బొమ్మలాంటిధీ కాదు ఇప్పుడు ఈ భూమ్మీద ఆ నిముషాలు గతించిపోయాయి. ఆ సుజాత వేరు. వేరంటే ఆమె నటి. జీవితంలోకూడా నటించింది. ఈమె? చతురురాలు కాదు. నిజజీవితంలో నటించలేదు. 'వసేవ్ సుజా! నువ్వెక్కడికి పోతున్నావు? పాప పంకిలంలోకా? కాదు కాదు అమర ప్రేమలోకి. అసలు జీవితంలో ప్రేమ ఉందా? జీవితమంటేనే ప్రేమ. ప్రేమలేని జీవితం ప్రకాశించటానికి అవకాశం లేదా? ప్రేమలేనిదే జీవితమే లేదే. ప్రకాశించటందాకా ఎక్కడ? మరి యిదివరకు గడిపిందో? అది జీవితంలో ఒక అధ్యాయం ఒక దశ. అలాంటివి అనేక రకాలుగా వస్తాయి. ఒకరు చచ్చిపోయేలోగా."
   
    ఆమె అద్దం ముందుకు పోయి నిల్చుంది. తను అందంగా వుంది. అవును చాలా ఈ అందమంతా ఎవరికోసం ప్రోవుచేసింది? ఇదంతా వృధా అయితే ఏమవుతుంది? తను నిజంగా దిగజారిపోతుందా? ఒకవేళ యిప్పుడే అసలు పైకి పోతున్నదా? ఒకవేళ స్వార్ధానికి ఇవన్నీ మారుపేరేమో, పోనీ మునుపటిది త్యాగమనుకుంటే దానివల్ల లాభం ఎవరికి? జానకిరాంకి. జానకిరాంకి అంతేనా? ఒక్క అతనికే?
   
    తను అలాగే జీవిస్తే....నలభై ఏళ్ళు వస్తాయనుకో. అంటే ముసలిరూపు పడిపోతుందనుకో అప్పుడు...తనకు లోపించిన జీవితంకోసం, దక్కని దేనికోసమో మనసు పడే తహతహను, అప్పుడు పడే ఉక్రోషాన్ని భరించగలదా? నరకమంటే అప్పుడు అసలు బ్రతుక్కెందుకిన్ని నిబంధనలు? కట్టుబాట్లు? కొన్ని వుండాలి. కొన్ని ఉండకూడదు. ఆ గిరి ఎక్కడ? అది వ్యక్తిగతమైన నిర్ణయం.
   
    ఆమె అలానే అద్దంలోకి చూస్తూ నిల్చుంది. రాను రానూ ఆమె రూపం ఆమెకే మోహం కలిగించసాగింది. ఆమె హృదయంలో కోయిల కూసింది. ఆమె పులకితురాలైంది. ఈ సౌందర్యం, యీ బంగారం...."పో."
   
    ఆమె చేతుల్లో ముఖాన్ని దాచుకుని ముసిముసిగా నవ్వుకుంది. ఆమెకు కర్తవ్యం బోధపడింది.

    అయిదయేసరికి సుజాత స్నానంచేసి, అలంకారం చేసుకుని భువ్గన మోహనంగా తయారయింది. మరోసారి అద్దంలో చూసుకుని తన రూపానికి తానే ముగ్ధురాలైంది. వేనిటీబాగ్ తీసుకుని వీధిలోకి కాలుపెడుతోంటే అనూరాధ ఎదురుగా వచ్చింది. "ఎక్కడికే?" అంది.
   
    "ప్రియుడి దగ్గరకు" అంది నవ్వుతూ.
   
    "ఎవరే ఆ భాగ్యశాలి! ఫర్వాలేదు. నాకు చెప్పవూ?"
   
    "ఇతరుల విషయంలో నీకింత కుతూహలం దేనికి?"
   
    "అమ్మ దొంగా అయితే నిజంగానే ఏదో ఉంది. రాత్రికిరా నీ పని పడతాను" అని సున్నితంగా ఆమె చెంపమీద కొట్టి లోపలకు వెళ్లిపోయింది అనూరాధ.
   
    చంద్రం ఏ హోటల్లో బస చేస్తాడో సుజాతకు తెలుసు. ఆటో రిక్షా చేసుకుని రాయపేటలో వున్న అజంతా హోటలుకు వెళ్ళింది. హోటల్లో కూర్చుని వున్నా వాళ్ళంతా ఈ అపురూప లావణ్యవతివైపు తదేకంగా చూడసాగారు. కౌంటర్ దగ్గర అతను వుంటూన్న రూమ్ నెంబరు కనుక్కుని మెట్లెక్కి పైకి పోతూంటే ఆమె గుండె గబగబ కొట్టుకోసాగింది. ఎం మాట్లాడుతుంది తను అతన్తో? "లెక్క చెయ్యను, లెక్క చెయ్యను" అనుకుంది.
   
    గది యివతల నిలబడి ఊపిరి బిగపెట్టి తలుపుకొట్టింది ఓ నిముషం నిశ్శబ్దం. చంద్రం తలుపు తెరిచాడు. "నువ్వా!" అన్నాడు ఆశ్చర్యంగా.
   
    "ఎందుకొచ్చావ్?" అంది అదే కంఠం.
   
    సుజాతకు ఏడుపొచ్చింది. ప్రయత్నంమీద ఆపుకుంటూ లోపలకు ఓ అడుగు వేసి తలుపులు మూసింది.
   
    "నన్నింకా క్షమించలేదా సుజాత?" అతని గొంతు ఏదో లోకంనుంచి వస్తున్నట్లుగా వినిపిస్తోంది.
   
    సుజాత హఠాత్తుగా అతని వక్షస్థలంపై వాలిపోయి "మీరు నాకు ఎందుకు కనిపించారు?" అంది వెక్కి వెక్కి ఏడుస్తూ.
   
                             *    *    *
   
    ఊరుదాటి కారు నునుపైన రోడ్డుమీద వాయువేగంతో సాగిపోతోంది. సుజాత గాలికి ఎగురుతోన్న ముంగురుల్ని ఒకచేత్తో వెనక్కి తీసుకుంటూ అతని ప్రక్కన కూర్చుంది.
   
    "నేనింత అదృష్టవంతుణ్ణి ఎలా అయ్యాను?" అన్నాడు చంద్రం.
   
    సుజాత మెరుస్తున్న కళ్ళతో అతని వైపోసారి చూసి "అదృష్టం నాది. కరుడు కట్టిన నా గుండెలో సుధారసం వొలికించారు. మీ ఋణం ఎట్లా తీర్చుకోను?" అంది.
   
    "మా నాన్నకి అప్పులవాడని పెద్ద పేరుంది. నన్నూ అలా తయారుచెయ్యకు. ఆ ఋణమేదో త్వరగా తీర్చుకుంటే పోలా?" అన్నాడు చంద్రం.
   
    సుజాత కిలకిలా నవ్వింది. "ప్రతి ఆడదానిముందు ప్రతి మొగవాడూ ఇలానే మాట్లాడుతాడు కదూ?"
   
    "ఏమో! నాకెట్లా తెలుస్తుంది? నాకు నువ్వే ప్రధమ పరిచయం."
   
    "మీ మాటలు మోసం కాదని నాకెట్లా నమ్మకం?"
   
    "నీ చెయ్యి ఇలా యివ్వు ఒట్టు వేస్తాను."
   
    సుజాత నవ్వుతూ తన కుడిచెయ్యి ముందుకు సాగింది. చంద్రం ఎడమచేత్తో స్టీరింగ్ పట్టుకుని, కుడిచేతిని ఆమె మృదుహస్తంలో వుంచి, సున్నితంగా ఆమె వ్రేళ్ళను పట్టుకున్నాడు.
   
    "ఒదలండి. లేకపోతె ఎకా ఎకి యిద్దరం స్వర్గానికి ప్రయాణం కడతాం."
   
    "సుజాతతో స్వర్గానికి, అంతకంటే కావలసిందేముందీ?"
   
    "అబ్బా! ఇలా చేస్తే నాకు కోపం వస్తుంది సుమండీ!"
   
    "అన్నట్లు మరిచాను. నువ్వు వేశ్యవు కాదుగా ..." అంటూ అతనామె చెయ్యి వదిలేశాడు.
   
    "ఛీ? ఎంత దుర్మార్గులు మీరు? ఆ మాటను జీవితాంతం మరిచిపోరా?" అని ఆమె కొంచం అటుప్రక్కకి జరిగి, ముఖం ప్రక్కకి త్రిప్పుకుని కూర్చుంది.
   
    "కోపం వచ్చిందా?"
   
    "ఊ."
   
    "ఊచి ఒక్క చెంపకాయ కొట్టు నన్ను. ఇంకెప్పుడూ తప్పుడు మాటలు మాట్లాడకుండా."

    ఆమె ఇటు తిరిగి సున్నితంగా అతని చెంపమీద కొట్టింది. "నాకంతే వచ్చు" అని సన్నగా నవ్వింది.
   
    ఓ గంట గడిచాక కనుచీకటి సమయంలో తిరిగి వస్తుండగా సుజాత వేదన ప్రస్ఫుటమౌతున్న కంఠంతో అంది "మనకిడ్డరికీ మధ్య ఓ పెద్ద అడ్డుగోడ ఉంది తెలుసా?"
   
    "తెలుసు."
   
    "ఏమిటది?"
   
    "జానకిరాం. అతన్ని ఎలా వదిలించుకోవాలో కూడా నాకు తెలుసు. అసలానాడే..."
   
    చంద్రాన్ని తను మొదట చూచిననాటిరాత్రి జరిగిన సంఘటన ఆమెకు దుఖం కలిగించింది "మీరేమీ దుడుకుతనం చేయకండి సుమీ. అతను నా మాట కాదనడు. అతన్ని నేను ఒప్పించగలను" అంది సుజాత.
   
    "కానీ అతన్తో తల ఎత్తి మాట్లాడగలిగే ధైర్యం నీకు ఉందా?"
   
    "ఎందుకు లేదు?" నేను మునుపటి సుజాతను కాను.
   
    "గుడ్."
   
                               *    *    *
   
    "అక్కా! నేను మారిపోయాను" అంది సుజాత. ఆ రాత్రి యిద్దరూ మంచాలమీద పడుకున్నాక బెడ్ లైటు కాంతిలో యిద్దరూ ఒకరి ముఖంవంక ఒకరు చూసుకున్నారు.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra