Home » Kommuri venugopala rao » ఆత్మజ్యోతి

 

         నా ధోరణి మాధవికి నచ్చలా. తానిక్కడికి అన్నీ విడచివచ్చింది. ఎలానూ కాలు జారింది. తన స్థానం ఎలానూ దిగజారింది. ఈ సగం సగం జీవితం గడిపి అస్పష్టమైన అశాంతిలో కాపురముండటం ఆమెకు యిష్టంలేదు.

    "మీరిలా ఎందుకు చేస్తున్నారు?" అనడిగింది ఒకసారి.

    "ఎలాగో చెప్పు?" అన్నాను.
   
    "అదే - ఈ ఎడం ఎడంగా వుండటం"

    "నీ కర్ధంకాదు" అని ముఖం ప్రక్కకి తిప్పుకున్నాను.
   
    "నాకర్ధమవుతుంది. మీరు నానుంచి ఏమీ ఆశించకుండా, కేవలం జాలితోనే యిక్కడికి తీసుకొచ్చారంటే యీ దయాభిక్ష నాకొద్దు. నేనేం పతివ్రతను కాను. ఆ సగం సగం పాతివ్రత్యం మీద నాకు వ్యామోహమూ లేదు. ఏ క్షణంలో అయితే మీ  సహాయం అర్ధించి మీ పంచను చేరానో అప్పుడే అంతా నిర్ధారణ చేసుకున్నాను. ఆనాడే మీకు నేను అంకితమై పోయాను. మీ దాన్ని - సందేహమెందుకు?"
   
    ఎలాంటి సమయంలోనైనా చిరునవ్వు  నవ్వగల మనస్థయిర్యం గలవాడ్ని ఆ నిముషంలో నిరుత్తరుడినైపోయాను. మాధవి అక్కడ్నుంచి పెరట్లోకి వెళ్ళి ఆ నీలాకాశంకేసి చూస్తూ నిల్చుంది. నేను వెళ్ళి వెనగ్గా నిల్చుని ఆమె భుజం మీద నా తల ఆనించాను. మాధవి ఏడుస్తోంది.
   
    "నిన్ను కష్టపెట్టటం నా ఉద్దేశం కాదు మాధవీ! నా హృదయానికి యిదివరకు స్త్రీ స్పర్శ గిలిగింతలే కలిగించేది. ఇప్పుడు ఉదాత్తతను కూడా యిస్తోంది" అన్నాను.
   
    ఆమె నా చేతిని పట్టుకుని తన హృదయంమీదకు లాక్కుంటూ 'మీరింత గొప్పవారని తెలీదు' అంది వెక్కి వెక్కి ఏడ్చివేస్తూ 'నన్ను క్షమించండి. మీ జీవితం నాశనం చేశాను. నాశనం చేశాను' అంటూ నావైపు తిరిగి నా హృదయంలో తల దాచుకుంది. ఆమె కన్నీటితో నా చొక్కా తడిసిపోయింది.
   
    "మాధవీ!" అన్నాను ఆమె ముఖం పైకెత్తి.
   
    ఆమె నా కళ్ళల్లోకి చూస్తూ "నేను మీ దాన్ని, మీ దాన్ని" అని గొణిగింది.
   
    "నేనామె పెదాలు నా పెదాలతో తాకి నువ్వు నాదానివే మాధవీ" అన్నాను. ఆ అస్తమిస్తోన్న సూర్యుడి సాక్షిగా ఆమె ఆ సంజవేళ నాకాత్మార్పణ చేసుకుంది.
   
    కానీ దేని విలువైనా జీవిత పర్యంతం వుంటుందా? ఇది నా అనుమానం. నా మంచితనం భరించలేక మాధవి నన్ను ఆరాధిస్తోంది. లొంగిపోయింది. కానీ ఇది మాలిన తుషాలనం కాదనీ, స్ఫటికంలాంటి ప్రశాంతత అనీ ఆమె మనస్సు నిరంతరం విశ్వసిస్తుందా? తన చర్యమీద తనకు ఏవగింపు కలగకుండా ఆమె జీవితాంతం నిలుస్తుందా? ఆమె అలా నిలవాలంటే నేను చాలా గొప్పవాడ్ని అయివుండాలి. కాని నాలో అంత గొప్పతనం లేదు.
   
    మొత్తానికి రోజులు తియ్యగా, ముద్దుగా గడుస్తున్నాయి. ఇది నా కొత్తరకం విజయం. ఇవి నేను మరచిపోలేని మధుర మనోహర సత్యాలు.
   
    చేతిలోని డబ్బు అయిపోయింది. ఉద్యోగంకోసం వెదుకుతున్నాను. బహుశా దొరకవచ్చు. నిన్ను, మీ అందర్నీ ఎప్పటికి కలుసుకుంటానో తెలీదు. ఇవి మన యదార్ధ జీవితాలు. మధుర యాతనలు, నిరంతరం తపనలు. మొత్తానికి నా తల్లిదండ్రులకు నేను కష్టం కలిగిస్తున్నాను. అది తప్పే ఏం చెయ్యను. శివా నేను? నీ అంత సున్నితహృదయం కాదు నాది. నీకు పరీక్షల రోజులు. బాగా చదువు. నువ్వు డాక్టరువి అవుతుండటం ఓ గొప్ప అదృష్టం. నువ్వు మా అందరకూ ఓ వెలుగురేఖ కాగలవు. అబ్బ! ప్రేమ ఎంత క్లిష్టం రా? ఉంటా.

                                                                                                                                                                                          నీ
                                                                           కృష్ణ.
   
    లేఖ పూర్తయింది. విధి రేపిన సుడిగాలికి కృష్ణా, అనామా ఎలా కొట్టుకు పోయారు? శివనాథరావు నేత్రాలు తడి అయ్యాయి. ఎంతటి విపరీతాలు ఎంతలో? వీళ్ళతోబాటు అతని స్మృతిపధంలో సరోజిని మెదిలింది.
   
    "ఎందుకేడుస్తున్నారయ్యా?"
   
    ఉలిక్కిపడి తల ఎత్తి చూశాడు. తాయారు!
   
    "లేదు, ఏడవట్లేదు" అంటూనే కళ్ళు తుడుచుకున్నాడు.
   
    "ఎవరన్నా గుర్తుకువస్తిరా అయ్యా" తాయారు అక్కడే నిలబడి జాలిగా అడిగింది.
   
    "అవును" అన్నాడు.
   
    "ఎవరయ్యా?"
   
    "నన్ను ప్రేమించేవాళ్ళు."
   
    తాయారు కొంచెం తటపటాయించి, సిగ్గుతో "మీకు పెళ్ళయిందయ్యా?" అనడిగింది.
   
    అతను లజ్జితుడై "లేదు" అన్నాడు.
   
    తాయారు తలవంచుకుని పని చేసుకుంటూ మధ్య మధ్య అతన్ని కనిపెడుతూ వుంది.
   
                           19
   
    "నేను బయటకు వెళ్తున్నాను తలుపులేసుకో" అంది అనూరాధ చెప్పులు తొడుక్కుంటూ.
   
    సుజాత సోఫాలో పడుకుని పుస్తకం చదువుకుంటోంది. పుస్తకంలోంచి ముఖం ఎత్తి 'ఎక్కడికి?' అనడిగింది.
   
    "ప్రియుడి దగ్గరకు" అంది నవ్వుతూ అనూరాధ.
   
    "నీ ప్రియుడ్ని నాకు చూడాలని వుంది. చూపించవూ?" అంది సుజాత ఉత్సాహంగా.
   
    "నీ ప్రియుడ్ని నువ్వు చూపించావు గనుకనా?"
   
    "ఛత్! అలాంటివారెవరూ లేరు నాకు. నేను నిప్పులాంటిదాన్ని తెలుసా?" అని సుజాత నవ్వు వచ్చి నవ్వింది. అనూరాధ నవ్వుకుంటూ బయటకు వెళ్ళిపోయింది.
   
    తరువాత సుజాతకు పేజీలిమ్క ముందుకు సాగలేదు. అలా పుస్తకం హృదయంమీద పెట్టుకుని ఏ దానివంకో చూస్తూనో, ఏదో ఆలోచిస్తూనో నిద్రలో పడిపోయింది.
   
    మధ్యాహ్నం మూడు దాటుతోందప్పుడు ఫిబ్రవరి ప్రవేశించడం వల్ల ఎండ బాగానే కాస్తోంది బయట. తలుపు గడియకూడా వెయ్యలేదు సుజాత. గాఢంగా నిద్రపోతోంది.
   
    ఓ పావుగంట గడిచాక బయట కారాగింది. అందులోంచి సూటూ బూటూలో చంద్రం దిగి తలుపు తోసుకుని లోపలకు వచ్చాడు. సుజాతకు మెలకువ రాలేదు. అతనామె పరుండివున్న సోఫాదగ్గరకు చప్పుడు చెయ్యకుండా వెళ్ళి నిలిచాడు. ఆమె ముఖాన స్వేదబిందువులు తేలిగ్గా అలుముకుని మెల్లగా ప్రక్కలకు జారుతున్నాయి. చంద్రం సుజాతని చూసి చాలా రోజులయింది. అసలు పనిలేకపోయినా తండ్రితో ఏదో వంక చెప్పి, ఒక్కడే కారు ఏసుకుని వచ్చాడు బెజవాడనుంచి. లాలనగా 'సుజాతా!' అన్నాడు. ఆమెకు మెలకువ రాలేదు. ముందుకు ఆమె ముఖంమీదకు వంగి 'ఫూ' అని ఊదాడు. ఆమెకు ఎవరో చక్కిలిగింత పెట్టినట్లయి, నిద్రలో పెదాలు విప్పారాయి. తరువాత కళ్ళు తెరిచింది. ఎదురుగా ఈ సుందర యువకుడు కలవరపాటుతో పమిట సర్దుకుంటూ లేచి నిల్చునేటంతలో, అతను పులకితుడై ఆమెను హఠాత్తుగా కౌగలించుకుని, హృదయానికి హత్తుకున్నాడు.
   
    సుజాత నివ్వెరపోయి ముఖంఎత్తి అతని కళ్ళలోకి సూటిగా చూసింది. ఆ చూపుకు చకితుడై అతడామెను వదిలివేసేటంతలో ఆమె కఠినస్వరం యిలా వినిపించింది. 'నేను వేశ్య....ననుకున్నారా?'
   
    చంద్రం బెదిరి దూరంగా జరిగి తలవంచుకు నిలబడ్డాడు. అతని ముఖం నల్లబడిపోయింది. తిరిగి తల ఎత్తేసరికి అతని పెదవులు వణుకుతున్నాయి. 'నన్నుక్షమించు' అన్నాడు కంపితస్వరంతో చకచక బయటకు వెళ్లిపోయాడు. కారు స్టార్టయిన శబ్దం, వాయువేగంతో వెళ్లిపోయిన చప్పుడూ వినిపించాయి.
   
    సుజాత నిలబడిపోయింది విహ్వల దృష్టితో.
   
                               *    *    *
   
    సుజాత క్రిందకు పడిపోయింది. ఆ పడిపోవటం సబబా కాదా అని నన్నడక్కండి. అది మానవనైజం. ఆమె ఏమీ అగాధంలోకి పడిపోలేదని చెప్పగలను. ఈ మధ్యాహ్నం పనిమాలా వచ్చి నిర్లక్ష్యపరుడైన ఈ యువకుడు ఆమె గుండెల్లో దావాగ్ని రేపి పోయాడు.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra