"ఆ హాస్పిటల్ పేరు?" అడిగిందామె.

 

    "పేరు కన్పించలేదు..... హాస్పిటల్ ను గుర్తుపట్టగలను" చెప్పాడు మైత్రేయ.

 

    "మనం  ఏ మాత్రం ఆలస్యం చెయ్యకూడదు..... కమాన్" ఆటో ఎక్కిన  మోహిత, ఎ.సి.పి. వేసిన ప్లాన్ ను  మనసుతోనే అభినందించింది.

 

    
                                           *    *    *

 

    ఛామరాజ్ వడయార్ హాస్పిటల్ లోని డాక్టర్ రెస్ట్ రూమ్ వి.ఐ.పి. వార్డులా వుంది. డాక్టర్లు, నర్సులూ, వార్డూబాయిస్..... ఎక్విప్ మెంట్ అంతా హడావిడిగా వుంది.

 

    పోలీస్ యూనిఫారంలో వున్న రవివర్మ, నేరుగా పేషెంట్ బెడ్ మీద కూర్చుని, సిగరెట్ కాల్చుకుంటున్న ఎ.సి.పి. రమేష్ దగ్గరకెళ్లి సెల్యూట్ చేశాడు.

 

    "ఎలా వున్నాడు రాజేంద్రకుమార్?" అడిగాడతను.

 

    "ఇంకా కోమాలోనే వున్నాడు. రాత్రి ఎనిమిది, తొమ్మిది గంటల మధ్య మెలుకువ రావచ్చని డాక్టర్ చెప్పాడు."

 

    "గుడ్" చేతివాచీ వేపు చూసుకుంటూ అన్నాడు.

 

    అప్పుడు సాయంత్రం ఆరుగంటలైంది.

 

    "నువ్వింకా పోలీస్ యూనిఫాంలో వున్నావేమిటి? నీ డ్రస్ నువ్వు వేసుకకుని ఎంక్వయిరీ దగ్గర వుండు" చెప్పాడాయన.

 

    "ఎస్ సర్" సెల్యూట్ చేసి వెనక్కి వచ్చేశాడు రవివర్మ.

 

    మరో అరగంట తర్వాత.....

 

    మప్టీలోకి మారిన రవివర్మ. ఎంక్వయిరీ కౌంటర్ దగ్గర విజిటర్స్ కుర్చీలో కూర్చున్నాడు.

 


                                                             *    *    *

 

    అర్చనా నర్సింగ్ హోమ్.....

 

    ఎదురుగా వున్న మున్సిపల్ పార్కులో రెండుగంటల నుంచి కూర్చుని, ఆ నర్సింగ్ హోమ్ నే అబ్జర్వ్ చేస్తోంది మోహిత.

 

    గేటుదగ్గర సెక్యూరిటీ గార్డ్...... డ్యూటీకోసం లోనికెళుతున్న డాక్టర్లు, నర్సులు, డ్యూటీ పూర్తయి వెళ్ళిపోతున్న సిబ్బంది.

 

    ఎక్కడా పోలీసులు కన్పించడంలేదు.

 

    "మఫ్టీలో వున్నారేమో?!" అన్నాడు మైత్రేయ.

 

    "ఇరవై నాలుగు గంటలనుంచీ నీ బ్రెయిన్ షార్ప్ గా పనిచేస్తోంది" అంటూ నవ్వింది.

 

    రాత్రి సరిగ్గా 8-30 నిమిషాలైంది.

 

    స్ట్రీట్ లైట్స్ వెలుగులో రోడ్ల మసక మసగ్గా మెరుస్తున్నాయి.

 

    "పద" పార్కులోని సిమెంట్ బెంచ్ మీద నుంచి లేస్తూ అంది.

 

    
                                           *    *    *

 

    విశాలమయిన రూమ్ లో బెడ్ మీద పడుకున్నాడు రాజేంద్రకుమార్.

 

    అతనికి ఎదురుగా ఒక డాక్టర్....... ఆ పక్కన కుర్చీలో కూర్చున్న నర్స్. చెప్పు" చెప్పి బయటకు వెళ్ళిపోయాడు డాక్టర్.

 

    నర్సు టైమ్ చూసుకుంది.

 


                                         *    *    *

 


    రీసెంట్ కన్ స్ట్రక్షన్ కావడంవల్ల, హాస్పిటల్ నీట గా మెరిసిపోతోంది.

 

    గేటుదాటి లోపలికి అడుగుపెట్టింది మోహిత.

 

    నిశితమయిన చూపులతో నాలుగువేపులా చూస్తున్నాడు మైత్రేయ.

 

    ఎడమవేపు రిసెప్షన్ కౌంటర్ ముందున్న యువతి ఎవరితోనో మాట్లాడుతూ తనవేపే చూస్తున్న మొహితను చూసి, చిరునవ్వు నవ్వింది.

 

    'రేణుకా సహానీలా అనవసరంగా నవ్వడం ఈవిడ హాబీలా వుంది' మనసులో అనుకుంది మోహిత.

 

    ఆ రిసెప్షన్ లో గోడవార వున్న ఫైబర్ ఛైర్స్ లో ఒక ఛైర్ లో కూర్చున్నాడు మైత్రేయ.

 

    "వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ మేడమ్?" మళ్ళీ నవ్వుతూ అడిగిందా యువతి.

 

    "గైనకాలజిస్ట్ ను కలవాలి" చెప్పింది మోహిత.

 

    "ఏమిటి ప్రాబ్లమ్?"

 

    "అది తెలిస్తే ఎందుకొస్తాను?" ప్రాబ్లమ్ తెల్సుకోడానికే" ఆ మాటకు నవ్వింది ఆ యువతి.

 

    "మీ డిటైల్స్ చెప్పండి" రైటింగ్ పాడ్ ను తీస్తూ అందామె.

 

    చెప్పింది మోహిత.

 

    లోపలికెళుతున్న నర్సుని పిలిచి ఆ స్లిప్ ని ఆమెకిచ్చి "ఈవిడ్ని డాక్టర్  శాంతమ్మగారి దగ్గరకు తీసుకెళ్ళు" చెప్పింది యువతి.

 

    వస్తూ, వెళుతున్న మనుషులవేపు చూస్తూ, ఆ నర్సు వెనక నడుస్తోంది మోహిత.

 

    మెట్లెక్కి రెండోరూమ్ దగ్గర ఆగి-

 

    "ఇదే ..... కూర్చోండి" అంటూ ఆ నర్స్ లోపలికి వెళ్లింది.

 

    వరసగా కూర్చీలో అయిదుగురు మహిళళు కూర్చున్నారు. ఇద్దరు నిండు గర్భవతులు.

 

    కాసేపు కూర్చుని కారిడార్లో అటూ యిటూ తిరుగుతూ, రూమ్స్ లో బెడ్స్ మీదున్న పేషెంట్స్ వేపు చూస్తోంది.

 

    ఎడమవేపున ఒక రూమ్ డోర్ దగ్గరగా వేసుంది.

 

    అటూ యిటూ చూస్తూ, ఆ రూమ్ వెళ్ళి డోర్  తెరిచి లోనకు  చూసింది.

 

    ఒక లేడీ పేషెంట్!

 

    వెంటనే వెనక్కొచ్చేసింది.

 

    మెట్లకు రెండోవేపున, బిల్డింగ బ్యాక్ దిద్ రోడ్ పాయింట్ లో వున్న కారిడార్లోకి చూసి, సెంటర్ కొచ్చి నుంచుంది.

 

    ఆ కారిడార్లో ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నారు.

 

    అటూ యిటూ తిరిగి-

 

    ఆ కారిడార్లోకి అడుగుపెట్టింది.

 

    సరిగ్గా అదే సమయంలో-

 

    ఒక రూమ్ లోంచి నర్స్ పరుగు పరుగున బయటికివచ్చి మాట్లాడుకుంటున్న ఇద్దరు వ్యక్తులో-

 

    "ఏయ్..... చూడండి! మీరేనా ఎస్.ఐ.గారు చెప్పిన మనుషులు. రాజేంద్రకుమార్ కి మెలకువ వచ్చింది. డాక్టర్ కి చెప్పాలి!" అంటూ గబగబా మెట్లు దిగసాగింది ఆ నర్స్.

 

    ఆమె మాటల్ని వినగానే గబగబా ముందుకు నడిచి, ఆ రూమ్ లోకి అడుగుపెట్టి లోపల్నించి డోర్ క్లోజ్ చేసేసింది మోహిత.

 

    

                                          *    *    *

 

    కుర్చీలోంచి లేచి రిసెప్షన్ కౌంటర్ దగ్గరకు నడిచి "వన్ అవుట్ సైడ్ కాల్ ప్లీజ్....."అంటూ ఆ యువతి ముఖంలోకి చూశాడు మైత్రేయ.

 

    "కాల్ టూ రూపీస్" చెబుతూ నవ్విందామె.

 

    అదే సమయంలో-

 

    మెట్లు దిగి ఆ ఇద్దరు వ్యక్తులు రిసెప్షన్ దగ్గరికొచ్చారు.

 

    పది నిమిషాల తర్వాత ఫోన్ ని ఎంగేజ్ లో వుంచమని మోహిత చెప్పిన మీదట, ఫోన్ రిసీవర్ అందుకుని, ఎప్పటికీ నెంబర్ దొరకని రైల్వేస్టేషన్ ఎంక్వయిరీ చేస్తున్నాడు మైత్రేయ.

 

    నిమిషాలు గడుస్తున్నాయి.

 

    ఆ ఇద్దరు వ్యక్తులు తీవ్ర అసహనంతో వున్నారు. అందులో ఒక వ్యక్తి-

 

    "అర్జంట్ ఫోన్...... నువ్వు మళ్ళీ చేసుకోవచ్చులే!" అని విసురుగా ఆ రిసీవర్ని అందుకుని-

 

    ఏదో నెంబర్ ప్రెస్ చేసి "ఎ.సి.పి. రాజాగారి సార్?" అని అడిగాడు.

 

    వెంటనే ఉలిక్కిపడి వాళ్ళిద్దరి ముఖాలవేపు చూసి, వాళ్ళని మఫ్టీలో వున్న పోలీసులుగా గుర్తించిన మైత్రేయ...... ఒక అంగలో బయటికొచ్చి అటూ యిటూ చూశాడు.

 

    గోడపక్కగా టెలీఫోన్ వైరు. ఆ వైరుని కట్ చేసేసి ఏమీ ఎరగనట్టుగా లోపలికొచ్చాడు.

 

    సడన్ గా ఫోన్ 'డెడ్' కావడంతో, రెండు మూడుసార్లు నెంబర్ ప్రెస్ చేసి, వాళ్ళిద్దరూ బయటికెళ్ళారు...... పబ్లిక్ టెలీఫోన్ బూత్ ని వెతుక్కుంటూ.

 

    
                                           *    *    *    

 

`    వంటినిండా గాయాలు..... ఆ గాయాలకు కట్టిన కట్లు.....

 

    మగతగా కళ్ళిప్పి, సీలింగ్ వేపు చూస్తున్న రాజేంద్రకుమార్ డోర్ వేపు చూసి- బెదిరిపోయి లేవబోయాడు.

 

    మరేమాత్రం ఆలస్యం చేయకుండా మోహిత బెడ్ దగ్గరకు నడిచింది.

 

    ఆమెను చూస్తూ అరవడడానికి ప్రయత్నిస్తున్నాడు.....

 

    బెడ్ మీద చేతులతో పెద్దగా చపుడు చేస్తున్నాడు.....

 

    లేవడానికి ప్రయత్నిస్తున్నాడు!

 

    తప్పించుకోడానికి, ఏ ప్రయత్నం చేయలేని నిస్సహాయస్థితిలో వుండిపోయి ఆమెవేపు చూస్తున్నాడు రాజేంద్రకుమార్ భయంగా.

 

    

                                         *    *    *

 

    వడయార్ హాస్పిటల్లో ఎంక్వయిరీ కౌంటర్ దగ్గిర అటూ ,యిటూ తిరుగుతున్న రవివర్మను చూడగానే, అప్పుడే అక్కడికొచ్చిన లేడీ అసిస్టెంట్ "ఇన్స్ పెక్టర్ గారూ.... ఆ రాజేంద్రకుమార్ గారి గురించి మధ్యాహ్నం ఎవరో ఇద్దరు మనుషులొచ్చారు. వివరాలడిగారు. అప్పటికి మీరు నాతో ఏ విషయమూ చెప్పలేదు. బహుశా....." ఏదో చెప్పబోతున్న ఆమె దగ్గరకు విసురుగా వెళ్ళి-

 

    "ఎవరా ఇద్దరు? ఒక ఆడా..... ఒకమగ.... అవునా....?" అడిగాడతను.

 

    "అవును...."

 

    "ఎన్ని గంటలకు?"

 

    "రెండు గంటల ప్రాంతంలో"

 

    "ఎవరొచ్చి అడిగినా, ఆ విషయం వెంటనే తెలియ జేయమని చెప్పాం.....గా....?

 

    "అప్పుడు మీరు కనిపించలేదు" ఆమె మాటలు విన్పించుకోకుండా గబగబా డాక్టర్స్ రెస్ట్ రూమ్ వేపు పరుగెత్తాడు.

 

    అప్పటికే అక్కడ ఎ.సి.పి రమేష్ ముఖంలో నెత్తురుచుక్క లేదు.

 

    "సమ్ థింగ్ రాంగ్..... సమ్ థింగ్ రాంగ్! కమాన్..... క్విక్!" పోలీస్  ఆఫీసర్స్ వేపు చూస్తూ, అరుస్తూ బయటికొచ్చి జీపెక్కాడు ఎ.సి.పి. రమేష్ బాబు.

 

    జీపు శరవేగంతో వడయార్ హాస్పిటల్ అవుట్ గేట్ దాటింది.

 

    
                                          *    *    *    

 

    సెలైన్ బాటిల్ వైర్లను తీసేసి, ఆ బాటిల్ ని గోడకేసి విసిరికొట్టింది మోహిత.

 

    "చంపకు..... చంపకు" బిగ్గరగా అరవలేకపోతున్నాడతను.

 

    హేండ్ బ్యాగ్  జిప్ ఓపెన్ చేసింది.

 

    నైల్ కట్టర్ తీసింది.

 

    రెండే రెండు క్షణాలు.....

 

    రాజేంద్రకుమార్ కంఠనాళాల్లోంచి రక్తం ఎగజిమ్మి, గోడలమీద పడింది.

 

    ఎ మాత్రం ఆలస్యం చేయకుండా, డోరు తెరుచుకుని కారిడార్లోంచి మెట్ల దగ్గరికొచ్చి అటూ యిటూ చూసి మెట్లు దిగి రిసెప్షన్ కౌంటర్ దగ్గరి కొచ్చింది.

 

    ఆమెను చూడగానే మైత్రేయ ఆమెకు దగ్గరగా వచ్చాడు.

 

    "కమాన్ పద!"

 

    వాళ్ళిద్దరూ బయటికి వస్తున్నప్పుడే, మప్టీలో వున్న పోలీసులు లోనికెళుతున్నారు. బయటికొచ్చిన వాళ్లిద్దరూ ఆటో ఎక్కారు!

 

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra