Home » Suryadevara rammohan rao » సంకల్పం

  

      కొంచెం తటపటాయించి చెప్పాడు వికాస్.
   
    "మీ కారు గురించి అన్ని విషయాలూ నాకు తెలుసు.....అది మార్కెట్లో సక్సెస్ అవుతుందని కూడా నాకు తెలుసు.... అంచేత ఓ భారీ ప్రపోజల్ తో నేనొచ్చాను...." చెప్పాడు జగన్నాధమిశ్రా.
   
    "ఆ కార్లన్నిట్నీ అవుట్రేట్ గా నేనే కొనేస్తాను..... నేనే మార్కెట్ చేసుకుంటాను... ఆలోచించండి.... మీ కంగీకారమైతే ఎడ్వాన్స్ ఇస్తాను.....మొత్తం ఎమౌంట్ ఇచ్చేయమన్నా ఇచ్చేస్తా..." చెప్పాడు మిశ్రా.
   
    ఒక్కక్షణం ఆలోచనలో పడ్డాడు వికాస్.
   
    "మీ ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్ళండి.... సాయంత్రం లోపల నేనే మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను..." చెప్పాడు.
   
    వెళ్ళిపోయాడు జగన్నాధమిశ్రా.
   
    అతను వెళ్ళిపోగానే వికాస్, శివమూర్తి కోసం చూశాడు. ఆయనింకా రాలేదు. రాత్రి ఆయన దాదాపు మూడుగంటల ప్రాంతంలో ఇంటికెళ్ళాడు. తనకయితే నిద్రేలేదు.
   
    వారం రోజుల్నుంచి రాత్రివేళల్లో ఒక పావుగంటయినా నిద్రపోవడానికి సమయం దొరకడం లేదు వికాస్ కి.
   
    స్ట్రీట్ రైడర్ మోడల్ కారుని బిల్డ్ చేసి, బ్యాట్రీతో రాత్రి వేళల్లో తనే డ్రైవరయి గంటల తరబడి కారుని నడిపి చూస్తున్నాడు. అదెవరికీ తెలీదు. ఎలాంటి శబ్దం, పొగ లేకుండా అద్భుతంగా నడుస్తోంది. అది శాశ్వతమేనా? లేక కొన్నాళ్ళకి ట్రబులిస్తుందా? మొదటి బ్యాచ్ కార్లను కొన్న కస్టమర్స్ టాకే తన వ్యాపారానికి ఆయువుపట్టు.... ఆ యంత్రాల మధ్య తనూ ఓ యంత్రమయి పోయాడు.
   
    శివమూర్తి ఇంటికి ఫోన్ చేశాడు.
   
    "ఎంతసేపట్లో వస్తున్నారు."
   
    "ఇప్పుడే బయల్దేరుతున్నాను."
   
    "ఆఫర్ బాగానే వుంది. సేల్స్ పరిస్థితిని అంచనా వేస్తూ మన ప్రొడక్షన్ మరింత పెంచుకోడానికి ఇదే మంచి అవకాశం.... ఫస్టు బ్యాచ్ నే తీసుకుంటాడా.... తర్వాత కూడా తీసుకుంటాడా...." ప్రశ్నించాడు శివమూర్తి.
   
    "అడగలేదు."
   
    "అడుగు..."
   
    ఆ తర్వాత వికాస్, జగన్నాధమిశ్రాకు ఫోన్ చేశాడు.
   
    "కారు మార్కెట్లో ఎలా పోతుందో చూశాక గానీ నేనే విషయం చెప్పలేను మొదట విడత విషయం అంటారా.... నేను తీసుకున్న కార్లు మార్కెట్ లో బాగా పోకపోయినా ఆ నష్టమంతా నేనే భరిస్తాను. మీకొక్క పైసా నష్టం వుండదు..... ఆలోచించండి."
   
    మళ్ళీ సంప్రదించాడు శివమూర్తిని వికాస్.
   
    "నీ ఇష్టం..."
   
    ఆ రోజు సాయంత్రం జగన్నాధమిశ్రాతో ఎగ్రిమెంట్ కుదుర్చుకున్నాడు వికాస్.
   
    ఎడ్వాన్స్ గా సగం ఎమౌంట్ 'పే' చేశాడు మిశ్రా.
   
    ఆ సమయంలో తనో  పెద్ద ఊబిలోకి దిగుతున్నానని తెలీదు వికాస్ కి.
   
    తన పని పూర్తిచేసిన జగన్నాధమిశ్రా...
   
    హోటల్ రూంలోకి రాగానే....
   
    భానోజీరావుకి ఫోన్ చేశాడు.
   
    "మళ్ళీ ఒరిస్సా అడవుల్లోకి పంపించెయ్యమంటారా...?"
   
    "అంతా అనుకున్నట్టుగా జరిగిపోయిందా?" భానోజీరావు కంఠం గంభీరంగా వుంది.
   
    "నేనేం చేస్తానో చూస్తుండండి..." హామీ ఇచ్చాడు జగన్నాధమిశ్రా.
   
                                       *    *    *    *    *
   
    21 ST CENTURY VISION.
   
    అదొక ఎడ్వర్టయిజ్ మెంట్ ఏజన్సీ!
   
    ఎడ్వర్టేజ్ మెంట్స్ ని తయారుచెయ్యడంలో అద్భుతమైన పేరు సాధించింది.
   
    వికాస్ 'ట్వంటీ ఫస్ట్ సెంచరీ విజన్' ద్వారా తన 'కారు యాడ్'కి రూప కల్పన చెయ్యాలని నిర్ణయించుకున్నాడు వికాస్.
   
    ఒకటికి పదిసార్లు చెప్పడం, వినియోగదారున్ని ఆకర్షించడం.... ఒకప్పటి ప్రకటనల ప్రపంచమైతే....
   
    దృశ్యం ప్రధానంగా, రంగుల మనోహర స్వప్నాల వేపు తీసికెళ్ళడం.....ఇప్పటి మీడియా స్థితి.
   
    యాడ్ కంపెనీ హైదరాబాద్ యూనిట్ మానేజర్, ఆయన పక్కన చీఫ్ విజువలైజర్ రమాతీర్ధ కూర్చున్నారు.
   
    ఎదురుగా వికాస్-
   
    శివానీ కంపెనీ మార్కెట్లో ఇంట్రడ్యూస్ చేస్తున్న కారు గురించి. దాని టార్గెట్ గురించి చెప్పాడు.
   
    టెక్నికల్ క్వాలిటీ, బడ్జెట్.... తదితర విషయాలన్నీ చర్చించాక-
   
    "ఈ యాడ్ ఫిలిమ్ ని వైజాగ్ లోనే షూట్ చేస్తే బాగుంటుంది. కాలేజీ స్టూడెంట్సే.... మన మోడల్స్....మీ స్టాఫ్ మోడల్స్ వద్దు. కొత్త ఫేసులు కావాలి. యాడ్ ని కొత్త పద్దతిలో 'విజులైజ్' చేసి 'సెన్సేషన్' క్రియేట్ చెయ్యాలి.
   
    "YOU MEET THE NICEST PEOPLE ON A HONDA" యాడ్ విడుదల చేసిన హోండా కంపెనీ మోటార్ సైకిల్ సేల్స్ ఎంత పెంచుకుందో... మీకు తెలిసే వుంటుంది.
   
    "లేటెస్ట్ గా సీరియల్ వాషింగ్ పౌడర్ యాడ్ చూడండి మనం తయారుచేసిన ప్రొడక్టు ఎవరికోసం, ఎందుకోసం, అనే వివారాల్ని పరోక్షంగా, అందంగా చెప్పగలగాలి. అత్తా కోడలు, తల్లి కూతురు ద్వారా మధ్యతరగతి గృహిణిని ఆకర్షించే విధంగా, ప్రస్తుతం 'ఏరియల్' యాడ్ వుంది. ఆ యాడ్ వల్ల దాని సేల్స్ అద్భుతంగా ఉన్నాయట" ఆగాడు వికాస్.
   
    "అయితే ఎలా తీద్దామంటారు...." పుష్పానంద్ అడిగాడు.
   
    "నా దృష్టిలో 'స్ట్రీట్ రైడర్' యాడ్ ఇలా ఉంటే బావుంటుందనుకుంటాను..." అని టేబిల్ మీదున్న పేపర్స్ లో ఓ రెండు పేపర్స్ తీసి చూస్తూ.
   
    "నీలి సముద్రం బ్యాక్ డ్రాప్.... ఉవ్వెత్తుగా ఎగురుతున్న కెరటాలు, ఆ ప్రక్కన విశాలమైన సముద్రపు తిన్నెలు.... ఆ తిన్నెల మీద మన 'స్ట్రీట్ రైడర్' కారు. ఆ కారు క్లోజప్.... అంతెత్తు ఎగురుతున్న కెరటాలు మన కారు బోనెట్ మీద పడి తుళ్ళి బిందువులుగా మారి బోనెట్ మీంచి మంచి ముత్యాల్లా జారుతుంటాయి కట్.
   
    దూరంగా ఇంద్రధనస్సు బ్యాక్ డ్రాప్. అమ్మాయిలూ, అబ్బాయిలూ స్లోమోషన్ లో పరుగెడుతుంటారు. ఒక్కొక్కరూ వెనకవుతుంటారు. ఓ అమ్మాయి, ఓ అబ్బాయి ముందులో పరుగెట్టి, పరుగెట్టి వచ్చి మన కారుని ముట్టుకుంటారు. కట్....
   
    అబ్బాయి అమ్మాయి చేతుల్లో కొన్ని ముత్యాలు పోసి, మన కారు 'కీ' బర్త్ డే గిఫ్ట్ గా ఇస్తాడు."
   
    చెప్పడం ఆపాడు వికాస్ ఒకింతసేపు.
   
    ఆ గదిలో నిశ్శబ్దం అలుముకొంది.
   
    "1902లో అమెరికాలో ప్రవేశపెట్టబడిన ప్యాకార్డ్ కారు స్లోగన్ ASK THE MAN WHO OWNS ONE.
   
    At 60 miles an hour the loudiest noise in this New Rolls-Royee cames from the electric clock. ఇది రోల్స్ రాయిస్ 1958లో ఇచ్చిన స్లోగన్.
   
    మనం Grace.... Space.... Pace...
    No Petrol- No Diesel.....
    No empty pockets....
    Your money will be saved by just charging...
   
    అని ఇస్తే బావుంటుంది.
   
    స్పేషియస్.... కన్వీనియంట్... స్మూత్.... వెర్సటైల్.... ఫంక్షనల్.....రిలయబుల్...
   
    మిడిల్ క్లాస్ కి మా కారు ఒక కల కాదు. నిజం....
   
    కొన్నాక భారం కాదు. బరువు కాదు- ఖర్చు లేదు.
   
    FAT CAR DIE YOUNG....
    THINK SMALL....
    LITTLE BUDGET...
   
    ఇకపై మనదేశం ఆయిల్ కోసం అప్పులు కానక్కర్లేదు.....స్లోగన్స్.....
   
    ఇలా ఉంటే క్యేచీగా ఉంటుంది.
   
    మనదేశంలో కార్ల వినియోగదారులు భయపడేది కార్ల ఖరీదుని చూసి..... ఆ పైన ఇంధనం ఖర్చు తలుచుకొని.... అదే విదేశాల్లో భద్రత కోసం చూస్తారు. దే వాంట్ సేఫ్టీ కార్ ఓన్లీ....నా మనస్సులో ఉన్నది మీకర్ధమయి ఉంటుందనుకుంటాను...." వికాస్ చెప్పటం ఆపాడు.
   
    "ఇట్స్ మార్వ్ లెస్.... వండ్రఫుల్" విజువలైజర్ రామతీర్ధ అన్నాడు.
   
    "మాకు శ్రమ తగ్గించారు.... చాలా బాగా వస్తుంది.... కొత్తగా ఇంటర్ డ్యూస్ చేస్తున్న ఒక కారు యాడ్ ఫిలిమ్ లో నటించడానికి అమ్మాయిలు, అబ్బాయిలు కావాలని డైరీలో ఒక 'యాడ్' ఇస్తాం" చెప్పాడు పుష్పానంద్.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra