Home » Yerramsetti sai » Bomma Borusu


    "ఏం ఫరవాలేదు! ఇక్కడ మధ్యాహ్నం వరకూ మనకే మాత్రం డిస్టర్బెన్స్ ఉండదు! కూర్చుందాం రండి!" అంటూమూలగా వున్న టేబుల్ దగ్గరకు నడిచాడతను.
    "మొన్న మీరిద్దరూ వచ్చి శుభలేఖఇచ్చినప్పటినుంచీ నాలో నేనే సతమతమయిపోతున్నానంటే నమ్మండి!" సంభాషణ ప్రారంభిస్తూ అన్నాడు శ్రీనివాసరావ్. చంద్రానికి వెంటనే అర్ధమయిపోయింది అతనేం చెప్పబోతున్నాడో!
    "ఏ విషయం గురించి?" సూటిగా అడిగాడతను.
    "అదే! మీరు నాగమణిని వివాహం చేసుకునే విషయం గురించి బహుశా మీకు తెలిసిఉండదు. నాగమణీ నేను ప్రేమించుకున్నాం. నేను హేమకు విడాకులిచ్చాక ఇద్దరం వివాహం చేసుకోవాలనికూడా అనుకున్నాము. అసలు ఆమె ఏనాడో శారీరకంగా నా భార్య అయిపోయింది.
    కానీ ఇప్పుడు ఎందుకో నన్నుకాదని మిమ్మల్ని వివాహం చేసుకునేందుకు సిద్దమవుతోంది. అఫ్కోర్స్ అందువల్ల నాకేమీ నష్టం లేదనుకోండి. కాని ఆమె ఈ విషయాలన్నీ మీ దగ్గర దాచి మిమ్మల్ని మోసగించడం నాకు నచ్చలేదు. అందుకే ఈ విషయం మీకు తెలియజేయడానికొచ్చాను....."
    "అలాగా!" ఆశ్చర్యం నటిస్తూ అన్నాడు చంద్రం.
    "ఇప్పుడే ఆ నాగమణిని పిలిపించి తేల్చుకుంటానుండండి" అంటూ దూరంగా నిలబడ్డ కాంటీన్ కుర్రాడిని పిలిచి "నాగమణిగారిని నేను అర్జంటుగా రమ్మంటున్నానని పిల్చుకురా!" అన్నాడతను. కుర్రాడు పరుగుతో వెళ్ళిపోయాడు. శ్రీనివాసరావ్ ఖంగారుగా లేచినుంచున్నాడు.
    "నేను వెళతాను!" అన్నాడు హడావుడిగా.
    చంద్రం ఛటుక్కున లేచి అతని రెండు భుజాలూపట్టుకుని "అహహ! మీరు వెళ్ళిపోతే ఎలా? మీరు ఉంటేగాని కథ రంజుగా ఉండదు!" అంటూ బలవంతంగా కూర్చోబెట్టాడు.
    "నేనుచెప్పేది వినండి! నాగమణికి ఈ విషయంనేనే చెప్పినట్లుతెలీడం బావుండదు. ఏదో మీరు అన్యాయానికి గురవుతున్నారని చెప్పబోయానుగానీ లేకపోతే....."
    అతనికేదో చెప్పబోతూండగా ఏ అక్కడికి నాగమణి వచ్చేసింది. ఆమెను చూడగానే మొఖందించేసుకున్నాడు శ్రీనివాసరావ్.
    "మీ బావ మీ గురించి చాలా విషయాలు చెప్పాడు నాగమణిగారూ! మీరు శీలవతికారట! మీ బావనువరించి వివాహంచేసుకుంటానని బాసలు చేశారట!".
    "స్టాపిట్! నేను వెళ్తున్నాను." అనేసి బయటకు నడవబోయాడు శ్రీనివాసరావ్! చంద్రం అతని చేయి పట్టుకుని వెనక్కు లాగి అతనికభిముఖంగా నిలబడ్డాడు.
    "శ్రీనివాసరావ్! నీ హృదయం ఇంత గొప్పదని నేననుకోలేదు. నాగమణిని బలవంతం చేసిందీ నువ్వే! ఇప్పుడు ఆమెను 'కులట' అని చాటుతోంది నువ్వే! నాకు తెలీకడుగుతాను! మనసులేని ఆడదాన్ని కట్టుకుని ఏం బావుకుందామని? నిన్ను వివాహం చేసుకోవడానికి నిరాకరించినందుకు ఆమె జీవితమే నాశనంచేసేందుకు సిద్దపడ్డావా? నాగమణి నీలాంటినీచురాలూ, రంగులుమార్చే ఊసరవెల్లికాదు. ఆమె అన్నీ నాకు చెప్పింది. అయినా నేనామెను అంగీకరిస్తున్నాను. నా భార్యగా స్వీకరిస్తున్నాను అర్ధమయిందా?"
    శ్రీనివాసరావుకి చెమటలు పట్టేసినయ్. దించిన తలఎత్తలేకపోతున్నాడతను.
    "నేను వెళ్తున్నాను. నాకు అతని మొఖం చూడడానికి కూడా అసహ్యంగా ఉంది!" అక్కడినుంచి వెళ్ళిపోయింది నాగమణి.
    "మిస్టర్ శ్రీనివాసరావ్! మరోసారి మా ఇద్దరికీ కనిపించకు! కనిపిస్తే నువ్వు జీవితాంతంమంచం దిగకుండా ఉండే ఏర్పాట్లు చేస్తాను! తెల్సిందా! గెటవుట్!" కోపంగా అరిచాడు చంద్రం.
    శ్రీనివాసరావ్ ఇంకొక్క క్షణంకూడా అక్కడ నిలబడకుండా బయటకునడిచాడు. రోడ్డుమీద కొచ్చిఖాళీగా పోతున్న ఆటోలో కూర్చున్నాడు. ఇల్లు చేరుకునేవరకూ అతని గుండెల్లో ఆందోళన తగ్గలేదు. రెండురోజులవరకూ ఇంట్లోనుంచి బయటకు రాలేకపోయాడతను. జీవితంలో మొదటిసారితనింతటి అవమానంపొందడం! ఆలోచించినకొద్దీ తనెంత అవివేకంగా ప్రవర్తించిందీ అర్ధమవసాగిందతనికి. కానీ తను మంచీ చెడూ ఆలోచించగల స్థితిలో ఎక్కడున్నాడనీ? నాగమణి తనకుదక్కకుండా పోతుందన్న ఆత్రుతేగాని తను ఆమెను ద్కకించుకునేందుకు అవలంభిస్తున్న పద్దతి ఎంతటినీచమయినదో తెలుసుకోలేకపోయాడు.
    నెలరోజులపాటు ఆఫీస్ కి శెలవుపెట్టేశాడతను. ఒకదాని మీద ఒకటిగా తగులుతున్న ఈ దెబ్బలను తట్టుకోవాలంటే తనకు మానసికంగా ప్రశాంతి కావాలి. అది లభించేచోటు తన వూరే! తన తల్లిదదండ్రులదగ్గరే తనకా ప్రశాంతత లభిస్తుంది. తనకింక మిగిలింది మాత్రం ఎవరని? అందరూ దూరమయిపోయారు. ఆఖరికి స్నేహితులుకూడా! హేమ తనూవిడాకులు తీసుకున్నరోజునుంచే వారిప్రవర్తనలో మార్పు గమనించాడతను. తనతోహేళనగా మాట్లాడటం, సూటీపోటీ మాటలనడంఅదివరకులా తనను పార్టీలకు పిలవకపోవడం.
    సూట్ కేసులో బట్టలు సర్దుకోసాగాడతను. ఇంట్లోని ప్రతి వస్తువూ హేమనే గుర్తుకితెస్తోంది తను ఊరునుంచి రాగానే ముందు ఈ ఇల్లు ఖాళీ చేసేయాలి. మరో ఇంట్లోకి మారితేగాని హేమ జ్ఞాపకాలనుపూర్తిగా తుడిచివేయడం సాధ్యం కాదు.
    "శ్రీనివాసరావ్!" బయటనుంచి ఎవరో పిలిచినట్లు వినిపించిందతనికి. సూట్ కేస్ అలాగే వదలి బయటికొచ్చాడతను.
    ఎదురుగ్గా సుధీర్ కనిపించాడు. అతన్ని చూస్తూనే ఆనందం, ఆశ్చర్యం రెండూ కలిగినాయ్.
    "ఏమిటిది? కలా, నిజమా?" అన్నాడు నవ్వుతూ.
    "ఎందుకా అనుమానం కలిగింది?" లోపలికొస్తూ అడిగాడు సుధీర్.
    "ఇంతకాలానికి కనిపించడం, అదీ మనబాంధవ్యం తెగిపోయాక....."
    "అది నీ వ్యక్తిగత విషయం! బాంధవ్యం మనకి స్నేహం ఏర్పరచలేదు. మరి హాని ఎందుకు చేయాలి?" అతని మాటలు శ్రీనివాసరావ్ కి ఎంతో ఆనందం కలిగించినయ్ సుధీర్ ఆ సమయంలో తన ప్రాణస్నేహితుడిగా కనిపించాడు. అతనిని మించిన ఆప్తులు తనకెవరూలేనట్లనిపించింది.
    "రా! ఇలా కూర్చో!" కుర్చీ చూపుతూ ఆహ్వానించాడతను. కుర్చీలో కూర్చుని "ఎక్కడికో ప్రయాణమవుతున్నట్లున్నావే!" అడిగాడు సుధీర్ తెరచి ఉన్న సూట్ కేస్ చూస్తూ.,
    "అవును! మా ఇంటి కెళదామని!"
    "ఎందుకు?"
    "ఊరికే! కొద్ది రోజులు అక్కడగడపాలనిపించింది. ఇంతకూ నువ్విక్కడికి ఎలా వచ్చావ్? ఆఫీస్ పనిమీదా?"
    "ఊహు! పర్సనల్ పని!"
    "ఓహో!"
    కొద్దిసేపు ఏవేవో ఆఫీస్ విషయాలు మాట్లాడారిద్దరూ.
    "పద! అలా హోటల్ కెళ్ళి కాఫీతాగివద్దాం!" అన్నాడు శ్రీనివాసరావ్ ఆప్యాయంగా ఇద్దరూ నడిచి దగ్గర్లో ఉన్న హోటల్ కి చేరుకున్నారు. ఖాళీగా ఉంది హోటల్!
    "జరిగినదానికి హేమ నన్నునిందిస్తోంది!" నవ్వుతూ చెప్పాడు సుధీర్.
    శ్రీనివాసరావ్ ఆశ్చర్యంగా అతనివేపు చూశాడు.
    "నాకు అర్ధంకాలేదు!"
    "అదే! నువ్వు నా ఫ్రెండ్ వి కదా! నువ్విలాంటిమనిషివని ముందేచెపితే ఆమె అసలు నిన్ను వివాహంచేసుకునేదే కాదట! అంచేత ఆమె జీవితమిలా అవడానికి పరోక్షంగా నేనేకారణమట!"
    శ్రీనివాసరావ్ గిల్టీగా ఫీలయ్యాడు.
    తప్పంతా నాదేనని నువ్వూనమ్ముతున్నావా?" అడిగాడు శ్రీనివాసరావ్.
    "వివాహానికి ముందు ఆ రోజు నువ్వు మాట్లాడిన మాటలుబట్టీ ఇప్పుడు జరిగిన దాన్ని బట్టీ ఆలోచిస్తే తప్పునీదేననిపిస్తోంది!"
    "ఎలా?" "హేమ గురించి నేను ముందే నిన్ను హెచ్చరించాను. మిగతా అందరిలాంటియువతి కాదనీ, పురుషుడితో సమాన హక్కులుకోసం పోరాడే యువతి అనీ అప్పుడు నువ్వేమన్నావో గుర్తుందా? వయసులో ఉన్న ఆడపిల్లలు మాటలు కాలక్షేపంబఠానీలనీ వాటిని మనం పట్టించుకోకూడదనీ-కొద్ది రోజులు సంసారంచేస్తే వారు అవన్నీ మర్చిపోతారనీ....."
    "ఇంక చెప్పవద్దులే! నాకు గుర్తుకొచ్చిందిప్పుడు!" అతని మాటలకు అడ్డుపడుతూ అన్నాడు శ్రీనివాసరావ్.
    "మరింకతప్పు నీది కాక మరెవ్వరిది?" సూటిగా అడిగాడు సుధీర్.
    శ్రీనివాసరావ్ మాట్లాడలేదు. సుధీర్ మాటలు అతని మనసుని అల్లకల్లోలపరిచినయ్. తననుతను ఎలా సమర్ధించుకోగలడిప్పుడు? ఆ రోజు సుధీర్ చెప్పినమాటలను తనుతేలికగా కొట్టిపారేశాడు. హేమలాంటి అందమయిన అమ్మాయి తన సొత్తయితేచాలనుకున్నాడు. తరువాత అన్ని విషయాలూ వాటంతటవే సర్దుకుంటాయని ఊహించాడు.
    "నిజమే సుధీర్! నీ మాటలు సీరియస్ గా తీసుకోకపోవడం తప్పే! ఒప్పుకున్నాడతను.
    "మరినువ్వు చేసినతప్పుకి హేమకు శిక్ష విధించడం ఏమయినా న్యాయంగా ఉందా?"
    "అంటే ఇందులో హేమదేమీ తప్పులేదంటావా?" పౌరుషంగా అడిగాడతను.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra