చదువుతున్న పుస్తకంలోంచి తలెత్తి ఫోనందుకుందామె.
    
    "హలో!" అందామె.
    
    ... ...
    
    "ఉంది! పిలుస్తాను ఒక్క నిమిషం" అని తానే స్వయంగా మనస్విని గదికి నడిచింది. అప్పుడు మనస్విని తన గదిలో కూర్చుని కిటికీలోంచి నీలాకాశాన్ని చూస్తోంది.
    
    "మనస్వినీ- నీకు ఫోనొచ్చింది... ఎవరో మాధవట" అందామె.
    
    "మాధవా? ఆ పేరున్నవాళ్ళెవరూ తనకే తెలియదే" అనుకుందామె.
    
    "త్వరగా రామ్మా" అనేసి వెళ్ళిపోయింది మేడం.
    
    తలుపు దగ్గరగా జరవేసి ఆమె వెనకే నడిచింది మనస్విని. మేడం గదికి చేరుకుని టేబిల్ మీద పెట్టి వున్న రిసీవర్ అందుకుని- "హలో! మనస్వినిని మాట్లాడుతున్నాను."
    
    "మనస్వినిగారా! నేను అపోలో హాస్పిటల్ నర్స్ ని. నా పేరు మాధవి. గాబరాపడకుండా వినండి. మహదేవ్ గారికి చిన్న ఏక్సిడెంటయితే ఇక్కడ ఎడ్మిటయ్యారు. మహదేవ్, అభిరాంగార్లు మీ మేడంకి తాము మీతో ఫోన్ లో మాట్లాడినట్లు తెలియడం యిష్టంలేక నాతో చేయించారు. మీరిప్పుడు రాగలరా!"
    
    "వస్తాను" కంగారుగా అందామె.
    
    "ఆందోళన అవసరం లేదు. మహదేవ్ గారికి ఏమీ కాలేదు"
    
    "అలాగే!" అట్నుంచి రిసీవర్ పెట్టేసిన చప్పుడు విని, తనూ క్రెడిల్ చేసింది రిసీవర్ని.
    
    "ఏమయింది మనస్వినీ?" అడిగింది ప్రమీలాదేవి.
    
    "మా ఫ్రెండ్ ఒకరు ఏక్సిడెంట్ కి గురై అపోలో ఆప్సత్రిలో వున్నారట...."
    
    "అయ్యయ్యో!"
    
    "నేను చూసి వస్తానండి"
    
    "తప్పకుండా! నీతోపాటు ఎవరినయినా తీసుకెళ్ళు అవసర మయితే."
    
    "ఫర్వాలేదు ఒక్కతినే వెళ్ళొస్తానండి."
    
    "అలాగే" తిరిగి పుస్తకపఠనంలో మునిగిపోయింది ప్రమీలాదేవి. మనస్విని గబగబా గదికెళ్ళి తాళం వేసి చీరయినా మరొకటి కట్టుకోకుండా సాదాగా వున్న ఆ చీరతోనే బయలుదేరింది.
    
    రోడ్డుమీదకి నడిచి కన్పించిన ఆటో ఎక్కి "అపోలో!" అంది మరుక్షణం ఆటో అపోలో హాస్పిటల్ వైపు దూసుకుపోసాగింది.
    
    'ఎలా జరిగింది ఏక్సిడెంట్? అసలెప్పుడు జరిగింది? అతను ఊరు వెళుతున్నప్పుడా? వెళ్ళి వస్తున్నప్పుడా' శతవిధాలా ఆలోచిస్తోంది.
    
    ఆమె ఆలోచనల వేగంతో సమానంగా పరిగెడుతూ అపోలో ముందాగింది ఆటో.
    
    "చాలీస్ రూపయా" ఆమె ఆదుర్ధానీ, అవసరాన్నీ గుర్తించి రెట్టింపు చెప్పాడతను.
    
    అప్పుడు గుర్తొచ్చిందామెకి కంగారులో తాను పర్సు తేకపోవటం ఏం చేయాలో తోచలేదు. ఇంతలో-
    
    "రామ్మా మనస్విని" అంటూ అభిరాం ఆమె దగ్గరికి వచ్చాడు.
    
    "చాలీస్ రూపయా..." మళ్ళీ  అన్నాడు ఆటోవాలా.
    
    మౌనంగా పర్సులోంచి నలభై రూపాయిలు తీసిచ్చి, అతన్ని పంపేశాడు అభిరాం.
    
    "అసలెలా జరిగింది? ఎప్పుడు... ఎక్కడ జరిగింది?" ఏడుపొక్కటే తక్కువ! వణుకుతున్న కంఠంతో అడిగిందామె.
    
    "అన్నీ మాట్లాడుకుందాం. పెద్ద ఏక్సిడెంటేమీ కాదు. బెంబేలు పడకు..... రా" తీసుకెళ్ళాడు.
    
    ఆందోళనగా అతన్ని అనుసరించిందామె.
    
    అభిరాం మహదేవ్ గది ముందుకెళ్ళి తలుపు తీశాడు. తలకి బాండేజ్, నీరసంగా శుష్కించిపోయిన మహదేవ్ కనిపించాడామెకి బెడ్ మీద.
    
    జలజలా ఆమె కళ్ళు కృష్ణా, గోదావరులై ప్రవహిస్తుండగా అతన్ని చేరుకుంది.
    
    "ఎలా జరిగింది? ఎప్పుడు జరిగింది?" దాదాపు ఏడుస్తూ అడిగింది. అభిరాం కానీ, అక్కడే కూర్చున్న వరప్రసాదం కానీ ఆ క్షణం గుర్తులేరామెకి.
    
    "పూర్ మనస్విని, ఎందుకా దుఃఖం? నాకేమీ కాలేదు" అనునయిస్తూ అన్నాడు మహదేవ్.
    
    "తలకింత పెద్ద బాండేజ్ చుట్టివుంటే ఏం కాలేదంటావేమిటి?" అని అన్నదామె.
    
    "చిన్న దెబ్బే! కాటన్ ఎక్కువ మిగిలిపోయిందని ఉన్నదంతా నా తలకే చుట్టేశారు" ఆమెని తేలికపరచటానికి నవ్వుతూ అన్నాడతను.

    వరప్రసాదం, అభిరాం అతని జోక్ కి నవ్వేశారు.
    
    "ఎప్పుడు జరిగింది?" కొంచం మనసు కుదుటపడినాక అడిగింది మనస్విని.
    
    "మా అమ్మకి మన విషయం చెబుదామని బయలుదేరి వెళుతున్న రోజే! ఆటోలో రైల్వేస్టేషన్ కి వెళుతుండగా."
    
    "నువ్వెక్కిన ఆటో దేనికయినా ఢీకొందా?"
    
    "అదే ఆశ్చర్యం... ఆటో దేన్నీ ఢీకొట్టలేదూ, ఆటోని మరే వాహనమూ ఢీకొట్ట లేదు! ఏం జరిగిందో తెలియకుండానే ఆటో గాలిలోకి లేచి పల్టీలు కొట్టి నేలమీద పడిపోయింది..."
    
    ఆ మాటలు డాక్టర్ చెప్పగా వినటమే అభిరాం, వరప్రసాదంలు. మళ్ళీ ఇప్పుడు మహదేవ్ చెబితే విన్నారు. వాళ్ళకై వాళ్ళు అడగలేదు. ఆ సంఘటన కదిపితే అతని తలలో అలజడి మొదలవుతుందేమో, దానివల్ల అతనికి జ్ఞాపకశక్తి పోతుందేమో అన్న భయం వాళ్ళిద్దరిలో వుంది.
    
    లారీడ్రైవరే గుద్దేసి, ఏమీ ఎరగనట్టు హాస్పిటల్ లో చేర్చుంటాడని భావిస్తున్న అభిరాం, అసలు నిజం తెలియటంతో డాక్టర్ నుంచి ఆ లారీ నెంబర్, ఆ డ్రైవర్ లైసెన్స్ నెంబర్ అడిగి తీసుకోవాలన్న ఆలోచనకి స్వస్తి పలికాడు.
    
    "ఆటోడ్రైవర్ పరిస్థితెలా వుంది?" అడిగిందామె.
    
    "బ్యాడ్ లక్ పోయాడు"

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra