Home » Kommuri venugopala rao » ఆత్మజ్యోతి

 

       ఓరోజు తెల్లవారుఝామున మెలకువ వచ్చింది. బెడ్ లైట్ సన్నగా వెలుగుతుంది. అతనికి కడుపులో ఏదో త్రిప్పుతున్నట్లుగా, చాలా దుస్సహనంగా ఉంది. వమనం చేసుకుంటాడేమోనన్న భ్రాంతి కలిగింది. కాసేపు ఒరుస్తూ అలాగే పడుకున్నాడు. కానీ వికారం మరీ పెరిగిపోతోంది. ఎట్లా లేచి కూర్చున్నాడో అతనికి తెలీదు. గాలిలో తేలిపోతూ తూము దగ్గరకు పరిగెత్తుకుపోయి భళ్ళున డోక్కున్నాడు. గుండెల్లో ఏదో మంట బయల్దేరింది. కళ్ళనుండి నీళ్ళు కారుతున్నాయి. వణుకుతున్న కాళ్ళతో లేచి నిల్చున్నాడు. కళ్ళు గిరగిరా తిరిగాయి. ఓ పెద్ద కేకవేసి వుంటాడు.
   
    తెలివి వచ్చేసరికి మంచంమీద పడివున్నాడు. యజమానురాలూ, తాయారూ కలిసి ఏవో శైత్యోపచారాలు చేస్తున్నారు, 'లేచాడు బాబు' అందామె ఆనందంతో అతనికి సిగ్గూ, అవమానంతో కలిసిన ఓ భావం కలిగి కుచించుకుపోయాడు. ఓ వృద్దురాలూ, ఓ అమ్మాయీ కలిసి తనను లేవనెత్తుకు వచ్చారన్న ఆలోచన అతన్ని చిత్తుచేసింది.
   
    "ఏం బాబూ నువ్వు? ఈ గదిలో యిట్టా వొంటరిగా అవస్థలు పడేకంటే ఏ ముసలమ్మగార్నో వెంట తెచ్చుకుని వుంటే బాగా వుండిద్ది గదా! చూడియాల ఎంత పాటుపడ్తిరి? మీ కేకవిని పరుగెత్తుకొచ్చాం" అని ఆప్యాయంగా అతని జుత్తు సవరిస్తోంది.
   
    దయతో ఆదరిస్తోన్న ఆ వృద్దమాత ముఖంలోకి చూశాడు. ప్రక్కనే ఎర్రచీర కట్టుకుని తాయారు.
   
    "మీకు చాలా శ్రమ యిస్తున్నాను" అన్నాడు బాధతో.
       
    "శ్రమా?" అంటూ ఆమె జాలిగొలిపేటట్లు నవ్వింది. "అదేంలేదు, అదేంలేదు. అట్లాంటివనుకోబోక! ఇప్పుడెట్లా వుంది?"
   
    "చాలా బాగుంది. ఇప్పుడు నాకే బాధాలేదు."
   
    "నిజం చెప్పు పిల్లడా? నాదగ్గర దాపరికం వొద్దు కాఫీ ఏమయినా తెప్పించనా?" అందామె చనువుగా.
   
    ఎండా బాగా పైకివచ్చేసింది. కిటికీలోంచి లోపలకు పడుతోంది. ఆవిడ పనిమీద క్రిందకు వెళ్ళింది. తాయారు బల్లమీది పుస్తకాలు శుభ్రంగా సర్దుతోంది.
   
    "తాయారూ!"
   
    దగ్గరకొచ్చి "ఏమయ్యా?" అంది.
   
    "పనిలోకి యింకా నువ్వే వస్తున్నావేం? యాదమ్మ ఏమయింది?"
   
    "యాదమ్మింక రాదయ్యా."
   
    "అదేం?"
   
    "ఆళ్ళ కొడుకు అరుస్తువున్నాడంట - "ఇంటికాడనే వుండి వణ్ణం వండిపెట్టు. ఆళ్ళకీ, ఈళ్ళకీ చాకిరీ ఎందుకు చేస్తావ్?" అని, అయినా యాదమ్మకి ఒకరికాడ పనిచేసే అవసరం ఏముందయ్యా? ఆళ్ళ కొడుకు ఆడేదీ కాయితాహాలు అచ్చేస్తరూ, అల్లక్కడ్డ పనిచేస్తడు. పైసలు బాగానే తెస్తడు."
   
    "ఏమిస్తారు అతనికి?"
   
    "పో అయ్యా. నాకు తెల్దు" అంటూ పనిలో నిమగ్నురాలయింది. కొంచెం ఆగి శివనాథరావు యిటుప్రక్కకి తిరిగి పడుకుని "తాయారూ! నేనిక్కడ పడిపోయి ఉంటే జాలిపడి యిక్కడిదాకా తీసుకొచ్చావ్! నీ ఋణం తీర్చుకోలేను" అన్నాడు.
   
    ఆమె ఎగతాళిగా నవ్వింది. "అవునుబాబూ! ఓ రూపాయివ్వాలి నేను చేసిన పనికి" అంది.
   
    "ఇస్తాను, ఏం చేస్తావు?"
   
    ఆమె ఒక నిముషం చాలా తీవ్రంగానే ఆలోచించింది. 'ఆ! తెలిసింది. నా ముంతలో వేసి దాచుకుంటాను' అంది.
   
    "మంచి పని చేస్తావు - దాచుకున్న తర్వాత...అప్పుడో...?"
   
    "అప్పుడా" అని తాయారు మళ్ళీ ఆలోచించింది. "అలా బోల్డు డబ్బు కూడబెడతా" అంది మెరుస్తోన్న కళ్ళతో.
   
    "మరి ఆ తర్వాత?"
   
    "ఏమోనయ్యా! నాకు తెల్దు."
   
    "అలా బోలెడు డబ్బు కూడబెట్టి - మీ అయ్యకిస్తావ్ కట్నంగా ఏం?" తాయారు ముఖం సిగ్గుతో ఎర్రబడింది. "ఊ" అని పెదాలు కదిలించింది.
   
    అతనేం మాట్లాడలేదు. తాయారు వెళ్ళిపోయింది. అతను చిన్నగా నవ్వుకుని కళ్ళు మూసుకుని పడుకున్నాడు. కాసేపయాక యింటి యజమానురాలు పైకివచ్చి కూర్చుంది. దగ్గర కూర్చుని ఏవో కబుర్లు చెప్పసాగింది- సొంత చరిత్ర, తన చిన్నతనం, ఆ కష్టాలు, పెళ్ళి, మాయదారి మొగుడు, కొడుకు పుట్టడం, పద్దెనిమిదేళ్ళు బ్రతికి చచ్చిపోవటం.
   
                            16
   
    శివనాథరావు, రాధాకృష్ణ అక్కడ్నుంచి వెళ్ళిపోయాక అనామభర్త అంతటితో ఊరుకోలేదు. ఆమెను చచ్చేటట్లు బాది, చివరకు చేతులు నొప్పెట్టి రంకెలు పెడుతూ "రంకుముండా....నిన్నింకా ఏలుకుంటాననుకున్నావా? మొగాన్నే నేను. మీసంవున్నా మొగాడ్ని. పో, నీ మిండగాడిదగ్గరకు పో...వాడితోనే కులుకు" అంటూ ఆమె జుట్టు పట్టుకుని బరబర యీడ్చుకుంటూ బయటకు తీసుకుపోయాడు.
   
    "అయ్యో! విడిచిపెట్టండి. మీ పదాలకు మొక్కుతాను. ఇరుగూ పొరుగూ ముఖంమీద ఉమ్మేస్తారు" అంది అనామ ఏడుస్తూ.
   
    "ఉయ్యనియ్యి నీ మొహంమీద ఇదిగో దెయ్యం ఇవాళనుంచీ నీకూ నాకూ సంబంధం లేదు. ఇంక నీకు నేను మొగుడ్ని కాను. సానిదానికి మొగుడేమిటి? మళ్ళీ ఈ గడపలో కాలుపెట్టావంటే- ఈసారి ప్రాణాలుకూడా నిలవ్వు తెలిసిందా?" అంటూ ఆమె పాదాలమీద పడుతున్నా బలంగా అవతలకు త్రోసి తలుపులు మూసేశాడు.
   
    వీధిలో అంతా చీకటిగా వుంది. ఇరుగుపొరుగు యిళ్ళలో దీపాలు వెలిగాయి. గుమ్మాలలో నిలబడి మనుషులు చోద్యం చూడసాగారు.
   
    అనామ లేచినిలబడి "అయ్యో! తలుపుతియ్యండి. నా జీవితం నాశనం చెయ్యకండి. నేనేతప్పూ చేయలేదు" అంది ప్రార్ధిస్తూ.
   
    లోపలనుంచి భర్త "పతివ్రతవు దిగివచ్చావు ఆకాశంనుంచీ వసేవ్ చెంబేలీ అనవసరంగా బయటనుంచి రగడచెయ్యకు. పోయి క్రిష్ణలో దూకి చావు. శని విరగడైపోతుంది....ఇదిగో! తలుపుకొట్టి లాభంలేదు. ఇహ నీకూ నాకూ సంబంధం లేదు. పో పో యిక్కడ్నుంచి" అన్నాడు. అనామ హతాశురాలై, చివరిసారిగా ప్రయత్నిస్తూ 'నన్ను క్షమించండి. ఇంకెప్పుడూ ఇలాంటి పన్లు చెయ్యను' అంది.
   
    "నోరు మూసుకుని పోవే దెష్టా ఇక్కడ్నుంచి."
   
    ఆమె ఇహ ప్రయోజనం లేదని తెలుసుకున్నది. జీవచ్చవంలా అక్కడ్నుంచి బయల్దేరింది. నవ్వేవాళ్ళు నవ్వారు, జాలిపడేవాళ్ళు పడ్డారు. మొత్తానికి అంతా చూస్తూ ఊరుకున్నారు. అడుగులో అడుగులు వేసుకుంటూ పోతోంది అనామ. ఎక్కడికి పోవాలి తను? పుట్టింటికా? అమ్మ ముఖం చూడలేదు. ఈ ఊళ్ళో తనకు ఆశ్రయమిచ్చేవాళ్ళు ఎవరున్నారు?
   
    ఆమె పమిటచెంగుతో కళ్ళు తుడుచుకుంది. జరిగిందంతా కలలా వుంది. భర్త ఊరికి అప్పుడే రాడనుకుంది. లేకపోతే ధైర్యంచేసి వాళ్ళను పిల్చేది కాదు. ఒకరకంగా తను తొందరపడింది. కానీ దానికి యింత పెద్ద శిక్షా? ఆలోచించుకుంటూ, వంటరిగా చీకట్లో నడిచిపోతున్న ఆ స్త్రీ మూర్తిని కొంత మంది ఎగతాళిగా చూస్తున్నారు. ఒకడెవరో ఈల వేశాడు. తన స్థితి....! సాయంత్రం ఆయనతో మాట్లాడేటప్పుడు తన మనస్సు ఎంత ప్రకాశవంతంగా ఉంది? ఇంతలో ఎంత  మార్పు? ఈ పద్దెనిమిదేళ్ళ జీవితంలో భగవంతుడు ఇన్ని అనుభవాలు రాసిపెట్టాడు గావును.
   
    రాత్రి పదిదాటింది. అనామ చేతిలో చిల్లిగవ్వ లేదు. కట్టుకున్న బట్టతప్ప వేరొకటి లేదు. హఠాత్తుగా ఆమెకు భయంవేసింది. ముందు మార్గం ఏమిటి? చచ్చిపోవచ్చు. అలా చేస్తే ఏమీ బాదరబందీ వుండదు. కానీ చావాలని లేదు. భయంగా వుంది. అయోమయంగా వుంది. ఈ రాత్రి ఎక్కడ గడుపుతుంది తను? అనుకోకుండా ఆమె కాళ్ళు శివనాథరావు ఇంటివైపుకు లాక్కుపోయాయి. గేటు బయట ఓ ప్రక్కగా నిలబడి చూసింది. పైన ఓ గదిలోతప్ప ఇల్లంతా లైట్లు ఆర్పేసి వున్నాయి. ఆ గదిలో ఆయన యింకా మెలకువగానే వున్నాడు గావును. ఆమె గుండె వేగంగా కొట్టుకుంది. తను యిక్కడికి ఎందుకు వచ్చింది? ఛీ! మళ్ళీ యింకో సిగ్గుమాలిన పని. ఈ స్థితిలో తననాయన చూస్తే ఏమయినా న్యాయంగా వుంటుందా?

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra