Home » Vasundhara » Vasundhara Kadhalu - 12

 

                                    2
    కారు హోటల్ భక్తీ ముందాగింది. భక్తీ హోటల్లో వెంకట్రావ్ మేనేజింగ్ పార్త్ర్నర్ అని సోమరాజుకు తెలుసును.
    "ఈ హోటల్ పేరు భక్తీ. క్షేత్రయ్య పాటల్లోని మధుర భక్తీ ఈ హోటల్లో అనునిత్యం కొనసాగుతుంటుంది. నాతొ పద...." అంటూ వెంకట్రావతన్ని రెండో ఫ్లోర్ లోకి తీసుకుపోయాడు. అక్కడ అతని కోసం ప్రత్యేకించబడిన గది ఉంది. తాళం తీసుకుని లోపలకి వెళ్ళాక తలుపులు వేశాడు వెంకట్రావు.
    "ఇది చాలా ముఖ్యమైనది. దీనికి రెండు బాత్రూములున్నాయి. ఒకటి కుడివైపున, మరొకటి ఎడమవైపున. ఆ బాత్రూముల నానుకుని పక్కగదులుంటాయి. ఆ గదులు రోజులో అన్ని సమయాల్లోనూ బుక్కయుంటాయి. ఎప్పుడైనా వినోదం కావాలనుకుంటే ....' అంటూ అతను కుడి వైపు బాత్రూం లోకి దారితీశాడు. సోమరాజతన్ని అనుసరించాడు.
    బాత్రూమ్ లోని అద్దాన్ని కాస్త పక్కగా తొలగించాడు వెంకట్రావు. గోడకు కొట్టి వున్న మేకును ముందుకు లాగగా ఒక చిన్న పలక ఊడివచ్చి, బొటనవేలు పట్టేంత కంత ఏర్పడింది. వెంకట్రావు కంతలోంచీ చూసి, చిరునవ్వు నవ్వి "నువ్వు చూడు ' అన్నాడు.
    సోమరాజు కుతూహలంగా తొంగి చూశాడు. బహుశా పక్కగది కాబోలు స్పష్టంగా పూర్తిగా కనిపిస్తోంది. గదిలో చక్కని పడక ఏర్పాట్లున్నాయి. గదిలో ఒక యువకుడు , యువతి ఉన్నారు. యువతి నగ్నంగా నీరసంగా మంచం మీద పడుకుని ఉంది. యువకుడు యువకుడు బట్టలు కట్టుకుంటున్నాడు.
    సోమరాజు చటుక్కున దృష్టి మరల్చుకోలేకపోయాడు. ఆడదాన్ని అంత స్పష్టంగా , నగ్నంగా అతడెన్నడూ చూడలేదు. ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది.
    వెంకట్రావు తన భుజం తట్టగానే సోమరాజు ఉలిక్కి పడి సిగ్గుపడి వెనక్కు వచ్చేశాడు.
    "ఎలా ఉంది దృశ్యం?" అన్నాడు వెంకట్రావు.
    'అది వాళ్ళ ప్రైవేటు వ్యవహారం. మనం చూడడం తప్పు కదూ?" అన్నాడు సోమరాజు.
    "తప్పు చేసేది వాళ్ళు. అందుకు మనం కేవలం అవకాశం మాత్రం ఇస్తున్నాం. అందుకు ప్రతిఫలంగా డబ్బు తీసుకుంటున్నాం. ఆ అవకాశం మన మివ్వకపొతే మరొకళ్ళిస్తారు. వాళ్ళు తప్పుచేయడం ఎలాగూ మానరు?" అన్నాడు వెంకట్రావు.
    "ప్రతి ఒక్కరూ ఇలాగనుకోవడం వల్లనే తప్పు ప్రోత్సహించబడుతోంది."
    "నిజమే , ప్రతి ఒక్కరూ ఇలాగే అనుకుంటున్నట్లు నీలాంటి వాడు గుర్తించాలి." వెంకట్రావు నవ్వి "వీళ్ళనిలా చూడ్డం కోసం ఈ బాత్ర్రూం లో ఈ ఏర్పాటు చేయలేదు. ఒకోసారి ఈ గదిలోకి చాలా గొప్పవాళ్ళు వస్తుంటారు. వాళ్ళెంత గొప్పవాళ్ళంటే వాళ్ళ చీకటి తప్పు ఏమాత్రమూ బయటకు రాదు. అటువంటప్పుడు ఫోటోలు తీసి వాళ్ళను బెదిరించి డబ్బు గుంజడం కోసమని ఈ ఏర్పాటు చేశాం. గదిలో ఉన్నవాళ్ళ కేమాత్రమూ అనుమానం రాదు...." అని "పద పక్క బాత్రూములోకి వెడదాం" అంటూ అక్కడ అన్నీ సరిచేశాడు.
    "చూపిన దృశ్యం చాలు ...." అన్నాడు సోమరాజు కూతుహలాన్నణచుకుంటూ.
    "అది వేరు, ఇది వేరు. " అంటూ వెంకట్రావు అతన్ని పక్క బాత్రూం లోకి తీసుకువెళ్ళాడు. ఇక్కడా సరిగ్గా అలాంటి ఏర్పాట్లే ఉన్నాయి. వెంకట్రావు చూసేక సోమరాజు కూడా ఆ గదిలో ఏముందో చూశాడు.
    భయంకరంగా ఉన్న ఒక మహాకాయుడు మంచం మీద వెల్లకిలా పడుకుని నిద్రపోతున్నాడు.
    "అతనెవరో తెలుసా?"
    "తెలియదు...."
    "మనిషి రూపం కంటే కూడా భయంకరమైన చేతలు చేసేవాడు. అతని పేరు రామన్న!" అన్నాడు వెంకట్రావు.
    ఉలిక్కిపడ్డాడు సోమరాజు. సరిగ్గా నాలుగు రోజుల క్రితం సినిమా దియేటర్లో ఒక దారుణ హత్య జరిగింది. వివరాలు పేపర్లో పడ్డాయి. ఆ హంతకుడి పేరు రామన్న అని పోలీసులు కనిపెట్టారు. కానీ అతని ఆచూకీ తెలియలేదు.
    "ఇక్కడి కేలా వచ్చాడు?"
    "స్మగ్లర్సుకీ, హంతకులకీ, పెద్ద మనుషులుగా చలామణి అవుతూ ప్రజలను దోచుకు తినేవరికీ ఇది కూడలిస్థలం. మినిష్టరు గారికి నేనిక్కడే ఫోటో తీశానరామన్న కిరాయి హంతకుడు. అతనికి ఊళ్ళో చాలామంది పెద్దల మద్దతు ఉంది. హత్య జరిగేక నేరుగా అతనిక్కడకు వచ్చి రక్షణ పొందేటందుకు ఏర్పాట్లు జరిగాయి ...."
    "ఇన్ని దారుణాలలో నీకు వాటా ఉందన్నమాట" అన్నాడు సోమరాజు ఆశ్చర్యంగా , బాధగా.
    "ఉంది కాని తప్పదు. ముందు మా నాన్న మంచి ఉద్దేశ్యంతోనే చిన్న హోటల్ పెట్టాడు. దానితో కొంతమంది పార్టనర్స్ కలిసి దీన్ని పెద్ద హోటల్ చేశారు. పెద్ద హోటల్ కావడం తోనే రకరకాల ఏర్పాట్లు కోసం ఒత్తిడి వచ్చింది. వ్యభిచారాన్ని హోటల్లో ప్రోత్సహిస్తే , దొంగలకు, హంతకులకు హోటల్లో ఆశ్రయమిస్తే అందువల్ల చాలా ప్రమాదాలున్నాయి. మావల్ల సాయం పొందినవారే మమ్మల్ని అపాయంలో ఇరికించవచ్చు. అందుకని వాళ్ళ జుత్తు మా చేతిలో ఉంచుకోవడం కోసం నాన్న ఈ ఏర్పాట్లు కూడా చేయించారు."
    'చూశావా ఒక తప్పు చేస్తే ఎన్ని బాధలో నాకిలాంటి  కష్టాలు లేవు" అన్నాడు సోమరాజు.
    "కష్టసుఖాలు బొమ్మా, బొరుసు లాంటివి. ఈ కష్టాలు పడ్డందుకు నాకు వేరే సుఖాలుండనే ఉన్నాయి. నేను పడేలాంటి కష్టాలు నీకు లేకపోవచ్చు. కానీ నీకు పూటగడవటమెలాగా అనే ఆలోచనే పెద్ద కష్టం. నేననుభవించేలాంటి సుఖాలు ఊహలో కూడా పొందలేవు నువ్వు " అన్నాడు వెంకట్రావు.
    నిజమేనని తలూపాడు సోమరాజు.
    "హోటల్ భక్తికి నేను మేనేజింగ్ పార్టనర్స్ ని. కానీ ఇలాంటి మరో రెండు హోటల్సు లో కూడా నాకు వాటా ఉంది. మేనేజిమేంట్ చూసే వాళ్ళు మాత్రం వేరే ఉన్నారు....." అన్నాడు వెంకట్రావు.
    "సరే, ఇదంతా నాకెందుకు చూపిస్తున్నట్లు ?" అన్నాడు సోమరాజు.
    "స్నేహధర్మం !" అని నవ్వాడు వెంకట్రావు. "ఇవి నా జీవితానికి సంబంధించిన ముఖ్యమైన రహస్యాలు. కానీ ఇవే నా అభ్యున్నతికి సోపానాలు. వీటిని నువ్వూ తెలుసుకుని నా స్థాయికి చేరుకుంటావని నా ఆశ. నా ప్రాణ స్నేహితుడు నాకు లాగే ఉండాలని నేననుకోవడం లో తప్పు లేదు గదా ....."
    సోమరాజు కళ్ళు చెమర్చాయి. "నామీద నీకున్న అభిమానానికి , నమ్మకానికీ చాలా థాంక్స్. అయితే నేనిప్పుడెం చేయాలో చెప్పు. నీ స్థితికి చేరుకోవడానికి నేనేమేం చేయాలి. అన్న విషయాలు కాస్త విపులంగా చెప్పు...."
    వెంకట్రావు కళ్ళు ఆనందంతో మెరిశాయి. "నీలో ఇంత త్వరగా మార్పు వస్తుందనుకోలేదు. నా దగ్గర ప్లానంతా సిద్దంగా ఉంది. ఈ ఊళ్ళో ఉన్న సదానంద స్వాములవారు నీకు తెలుసా ?"
    "తెలియకేం? అయన భగవద్గీత ను కాచి వడపోసేశారు. తరచుగా అమెరికా వెళ్ళి అక్కడి ప్రజలకు గీతాసారాన్ని వివరించి వస్తుంటారు....'
    వెంకట్రావు నవ్వి, " నీకు తెలిసినంతవరకూ తెలిసినదది. అయన విదేశాలకు మత్తు పదార్ధాలు చేరవేస్తుంటాడు. అందుకే ఆయనకెంత పలుకుబడి, ఆ పదార్ధాల నాయనకు సరఫరా చేసేవాళ్ళలో నేనొకడిని. ఈ వ్యాపారంలో పెట్టుబడికి పదిరెట్లు తక్కువ కాకుండా లాభం వస్తూంటుంది. నీ అభ్యున్నతి ఈ వ్యాపారంలో ప్రారంభమవుతుంది---" అన్నాడు.
    ఏం చేయాలో సోమరాజుకు వివరించి చెప్పాడు వెంకట్రావు. స్వాములవారు ప్రతిదినమూ సాయం సమయాల్లో గీతాసారాన్ని వేదాంత తత్వాజిజ్ఞానువులకు సులభశైలిలో వివరిస్తుంటారు. అటువంటప్పుడు శ్రోతలకు కలిగిన సందేహాల కాయన సమాధానాలు కూడా ఇస్తారు. కొంత మంది తమ సందేహాలను నలుగురిలో వివరించడాని కిష్టపడరు. అటువంటి వారికీ ఏకాంతంగా జ్ఞానం కలిగించడానికి ఆయనతో అభ్యంతర స్తలముంది. అక్కడ ఆయన నిరభ్యంతరంగా మత్తు పదార్ధాలను గ్రహిస్తారు.
    "సదానందస్వామి ఇటువంటి స్మగ్లింగ్ వ్యాపారం చేస్తున్నాడని చూచాయగా కూడా నాకూ, నాకు తెలిసిన వాళ్ళెవ్వరికీ తెలియదు . ఈ రహస్యాలన్నీ నాకు చెప్పేశావు. మనిషి మనిషిని ఇంతగా నమ్మకూడదు. ఇప్పుడు నేను నిన్ను బ్లాక్ మెయిలింగు చేయడం మొదలెట్టేననుకో. ఏం చేస్తావ్?" అన్నాడు సోమరాజు ఏదో ఆలోచిస్తూ.
    వెంకట్రావు ఆశ్చర్యంగా మిత్రుడి వంక చూసి - "చిన్న తనం నుంచీ నాకు నువ్వు తెలుసు. నాకోసం ప్రాణమైన ఇవ్వగల స్నేహితుడివి నువ్వు. ధన సంపాదనకు చట్ట విరుద్దమని అందరూ భావించే పనులు చేసినా నాకే ద్రోహం తలపెడతావని నువ్వు చెప్పినా నేను నమ్మను. నీకు లోకజ్ఞానం కలిగించి పైకి తీసుకురావాలను కోవడం నిజమైన స్నేహితుడి ధర్మం. అదే నేను చేస్తున్నాను. నీ చుట్టూ ఉన్న ప్రపంచం కల్మషంతో నిండి ఉంది. వాళ్ళు భక్తులైనా, తత్వబోధకులైనా , నాయకులైనా, కేవలం మోసం చేసి, బ్రతుకుతున్నారు. అది నువ్వు తెలుసుకోగలిగినపుడు నీ జీవిత విధానం అటో మేటిక్ గా మారిపోతుంది...'

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra